CPC
-
అవినీతికి దూరంగా ఉండండి: జిన్‌పింగ్
బీజింగ్: అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని అధికార కమ్యూనిస్టు పార్టీ అఫ్ చైనా నాయకులకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సూచించారు. కుటుంబ సభ్యులను, బంధువులను సైతం వాటికి దూరంగా ఉంచాలన్నారు. ఈ నెల 22న సీపీసీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుల భేటీలో జిన్‌పింగ్ ప్రసంగించారు. వ్యక్తిగతంగా క్రమశిక్షణ పాటించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. అవినీతిపై మనం పోరాటం చేస్తున్నారని, ఈ విషయంలో పార్టీ నేతలంతా సహకరించాలని కోరారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మీ కింద పని చేసేవారు అవినీతి దూరంగా ఉండేలా కఠినమైన నిబంధనలు విధించాలని జిన్‌పింగ్ సూచించారు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు నాయకుల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరులకు ప్రయోజనాలు కలి్పంచి, వారి నుంచి లంచాలు, బహుమతులు స్వీకరిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకత్వంగుర్తించింది. కొందరిపై విచారణ సైతం ప్రారంభించింది. -
‘మాకు నిజమైన మిత్రుడు’.. జిన్‌పింగ్ ఎన్నికపై పాకిస్థాన్ హర్షం
ఇస్లామాబాద్: చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్(69) రికార్డ్ స్థాయిలో మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మరోమారు అధ్యక్షుడిగా ఎన్నిక కావటంపై హర్షం వ్యక్తం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి హెహబాజ్ షరీఫ్. తమ దేశానికి ఆయన నిజమైన స్నేహితుడని అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని. జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘సీపీసీ జనరల్ సెక్రటరీగా మూడోసారి ఎన్నికైనందుకు యావత్ పాకిస్థాన్ తరఫున షీ జిన్‌పింగ్‌కు నా అభినందనలు. తెలివైన సారథ్యం, చైనా ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకున్న నిబద్ధతకు ఇది తార్కాణం’ అని ట్వీట్ చేశారు ప్రధాని షెహ్బాజ్. మరోవైపు.. జిన్‌పింగ్ ఎన్నికపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా స్పందించారు. ‘సీపీసీ జనరల్ సెక్రటరీగా మరోసారి ఎన్నికైన షీ జిన్‌పింగ్‌కు అభినందనలు. పాకిస్థాన్‌కు నిజమైన స్నేహితుడు, పాక్-చైనాల వ్యూహాత్మక బంధానికి బలమైన మద్దతుదారుడు’ అంటూ ట్వీట్ చేశారు. On behalf of the entire Pakistani nation, I congratulate President Xi Jinping on his reelection as CPC General Secretary for the 3rd term. It is a glowing tribute to his sagacious stewardship and unwavering devotion for serving the people of China. 🇵🇰 🇨🇳 — Shehbaz Sharif (@CMShehbaz) October 23, 2022 I extend heartiest congratulations to H.E. Xi Jinping on his reelection as CPC General Secretary, and my best wishes for his health and happiness. He is a true friend of Pakistan and champion for All-Weather Strategic Cooperative Partnership between Pakistan and China. 🇵🇰 🇨🇳 — The President of Pakistan (@PresOfPakistan) October 23, 2022 ఇదీ చదవండి: ‘ప్రపంచానికి చైనా అవసరం’.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ వ్యాఖ్యలు -
ఎదురులేని నేతగా జిన్‌పింగ్
బీజింగ్: డ్రాగన్ దేశంపై అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(68) మరింత పట్టు బిగించారు. చైనా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆయన వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమమైనట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) సాధించిన విజయాలను, జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా సాధించిన ఘనతలను, అభివృద్ధిని ప్రస్తుతిస్తూ అధికార సీపీసీ 19వ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీలో చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ చరిత్రలో ఇలాంటి తీర్మానం చేయడం ఇది మూడోసారి మాత్రమే కావడం గమనార్హం. రాజధాని బీజింగ్‌లో ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సీపీసీ ప్లీనరీ గురువారం ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో కీలకమైన అంశాలపై చర్చించారు. కమ్యూనిస్టు పార్టీ శుక్రవారం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనుంది. ప్లీనరీలో జిన్‌పింగ్ సీపీసీ కేంద్ర కమిటీ పొలిటికల్ బ్యూరో తరపున వర్క్ రిపోర్టు సమర్పించారు. తీర్మానం ముసాయిదాపై మాట్లాడారు. సీపీసీ 20వ జాతీయ సదస్సును(ఐదేళ్లకోసారి జరుగుతుంది) 2022లో జూలై తర్వాత నిర్వహించనున్నారు. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ఎంపికను ఆ సదస్సులో అధికారికంగా ఆమోదించనున్నారు. ఆయన ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, చైనా త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌గా(సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్), దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మూడు అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఏకకాలంలో కొనసాగుతున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆ వెంటనే మరోసారి అదే పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లే. చైనాలో మూడుసార్లు అధ్యక్ష పదవిని అధిష్టించే అవకాశం ఇప్పటిదాకా ఎవరికీ దక్కలేదు. 2018లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం జిన్‌పింగ్ జీవితకాలం అధ్యక్ష పదవిలో కొనసాగే వెసులుబాటు కూడా ఉంది. -
మళ్లీ రాచరికం వైపు అడుగులా!
బీజింగ్: అధ్యక్షుడు జిన్‌పింగ్ నిరవధికంగా అధికారంలో కొనసాగేలా అనుమతించే ప్రతిపాదనపై చైనాలో వ్యతిరేకత మొదలైంది. అధికార కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) నిర్ణయాన్ని శాసనకర్తలు తిరస్కరించాలని కోరుతూ సోమవారం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, పాత్రికేయులు లీ డతోంగ్, మహిళా వ్యాపారవేత్త వాంగ్ ఇంగ్ బహిరంగ లేఖలు రాశారు. వారి వ్యాఖ్యలు స్థానిక మెసేజింగ్ యాప్ వీచాట్‌లో విస్తృతంగా వ్యాపించాయి. చైనా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు రెండు సార్లే పదవి చేపట్టాలంటున్న ప్రస్తుత నిబంధనలను రద్దుచేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని అధికార పార్టీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇది అమల్లోకి వస్తే జిన్‌పింగ్ తన జీవిత కాలమంతా అధికారంలో కొనసాగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇలా అయితే, చైనా మళ్లీ రాచరిక పాలనలోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తిరోగమన పయనం.. ఈ పరిణామాలపై లీ డతోంగ్ స్పందిస్తూ... అధ్యక్షుడి పదవీ కాల పరిమితులను ఎత్తేస్తే దేశంలో అస్థిరత ఏర్పడుతుందని అన్నారు. దేశాధినేత పదవికి నిర్దిష్ట కాల పరిమితి లేనట్లయితే, తాము మళ్లీ రాచరిక యుగంలోకి వెళ్తున్నట్లేనన్నారు. ప్రభుత్వ సంస్కరణలకు గట్టి మద్దతుదారైన వాంగ్ ఇంగ్ తన లేఖలో.. ‘మా తరం అంతా మావో పాలనలోనే గడిచిపోయింది. అది గతం. మళ్లీ ఎలా అటు వైపు వెళ్తాం? అధికార పార్టీ ప్రతిపాదన పూర్తిగా వంచనాపూరితం. మెజారిటీ ప్రజల అభిప్రాయలకు విరుద్ధం’ అని పేర్కొన్నారు. చైనా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఐదేళ్ల చొప్పున రెండు పర్యాయాలకు మించి అధికారంలో కొనసాగకూడదు. ఆధునిక యుగంలో చైనా స్వాభావిక సామ్యవాద వ్యవస్థ పరిరక్షణకే ఈ ప్రతిపాదన చేసినట్లు విదేశాంగ మంత్రి లూ కాంగ్ పేర్కొన్నారు. -
కశ్మీర్ నుంచి కేసులు బదిలీ చేయొచ్చు
సుప్రీం కోర్టు సంచలన తీర్పు న్యూఢిల్లీ: వైవాహిక సంబంధ వివాదాలతోపాటు సివిల్, క్రిమినల్ కేసులను జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికిగానీ, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకుగానీ బదిలీ చేసే అధికారం తనకుందంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పౌర శిక్షాస్మృతి (సీపీసీ), నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) లాంటి కేంద్ర చట్టాలు ఆ రాష్ట్రానికి వర్తించనప్పటికీ న్యాయం పొందాలన్న కక్షిదారుల హక్కును పరిరక్షించడానికి కేసులను బదిలీ చేసే అసాధారణ అధికారం తమకుందని స్పష్టంచేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆయా కేసుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆదేశించే అధికారం ఈ కోర్టుకు ఉందని పేర్కొంది. ఆయా అంశాలపై సుప్రీంకోర్టుకు హక్కున్నట్లు స్థానిక చట్టాలైన జమ్మూకశ్మీర్ సీపీసీ, జమ్మూకశ్మీర్ సీఆర్పీసీల్లో లేదని ఆ రాష్ట్రం వాదించింది. జమ్మూకశ్మీర్‌లోని కోర్టులో తనకు న్యాయం జరగలేదని భావించి ఎవరైనా తమ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరినప్పుడు ఆ కోర్టు దాన్ని తిరస్కరిస్తే.. అప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం బదిలీకి ఆదేశించే అసాధారణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని పేర్కొంది. సందర్భానుసారంగా అధికరణాలు 32, 136, 142 ప్రకారం కేంద్ర సీపీసీ, సీఆర్పీసీలతో నిమిత్తం లేకుండా కేసుల బదిలీకి ఆదేశించే అధికారముంటుందని చెప్పింది. దీనికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం విచారించింది. కశ్మీర్ స్వాతంత్య్రానికి హఫీజ్ సయీద్ యాత్ర లాహోర్: ముంబై దాడుల సూత్ర ధారి జమాతె ఉద్ దవా స్థాపకుడు హఫీజ్ సయీద్ మంగళవారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు ‘కశ్మీర్ సద్భావన యాత్ర’ ప్రారంభించాడు. యాత్రను జమ్మూ కశ్మీర్‌కూ పొడిగిస్తామని ప్రతినబూనాడు. మంగళవారం సాయంత్ర ం ఇక్కడ ప్రారంభమైన యాత్ర బుధవారం సాయంత్రం ఇస్లామాబాద్ చేరుకుంటుంది.