CPM National Conference
-
అభిశంసన తీర్మానం తిరస్కరణ తగదు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ప్రతిపక్షపార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడం సబబు కాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. సీపీఎం జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి మంగళవారం మాట్లాడారు. అభిశంసన తీర్మానంపై చర్చ జరిగితే అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయని, నోటీసును ఏకపక్షంగా తిరస్కరించడం ద్వారా చర్చకు అవకాశం లేకుండా చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. రాజకీయ విధానం, పార్టీ నిర్మాణం, నాయకత్వ ఎన్నికపై మహాసభల్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసమే పోరాడతామని తమ్మినేని అన్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
విరబూసిన ఎర్రమందారాలు
-
భాగ్యనగరం అరుణ వర్ణం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం జాతీయ మహాసభల చివరిరోజున భాగ్యనగరం ఎరుపెక్కింది. ప్రధాన కూడళ్లు, డివైడర్లన్నీ ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలతో అరుణ వర్ణాన్ని సంతరించుకున్నా యి. ఐదురోజులపాటు జరిగిన మహాసభలు ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభతో ముగిశాయి. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతోపాటు త్రిపుర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. సభా ప్రాంగణం ఉదయం నుంచే జనంతో పోటెత్తింది. పెద్దసంఖ్యలో కార్యకర్తలు రోడ్డుపైనే నిలబడ్డారు. విజయవాడకు వెళ్లే రహదారి అంతా జనసంద్రమైంది. 5 వేల మందితో కవాతు కామ్రేడ్లు భారీ ర్యాలీగా సరూర్‌నగర్ స్టేడియం వద్దకు తరలివచ్చారు. ఎర్రరంగు టీషర్టులు ధరించిన దాదాపు 5 వేల మంది కార్యకర్తలు మలక్‌పేట్ టీవీ టవర్ నుంచి కవాతు చేపట్టారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఈ కవాతును జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ్నుంచి ర్యాలీ సభాప్రాంగణానికి చేరుకుంది. ఈ క్రమంలో విజయవాడ రహదారి ట్రాఫిక్‌తో స్తంభించింది. గంటన్నర పాటు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ సభ నేపథ్యంలో పోలీసు యంత్రాం గం పక్కాగా ఏర్పాట్లు చేసింది. విప్లవ గేయాలకు అనూహ్య స్పందన బహిరంగ సభ ప్రాంగణం వద్ద కళాకారులకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కళాకారుల ప్రదర్శనలు సాగాయి. విప్లవ గేయాలు ఆలపిస్తున్న సమయంలో సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వ్యక్తమైంది. -
కాంగ్రెస్‌తో దోస్తీకి సై
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే లక్ష్యంగా పని చేయాలని సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో తీర్మానించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి శక్తులను ఎదిరించే క్రమంలో వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించాలని, ఈ క్రమంలో అవసరమైతే కాంగ్రెస్‌తోనూ రాజకీయ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రవేశపెట్టిన ముసాయిదా రాజకీయ తీర్మానంపై దాదాపు 18 గంటల సుదీర్ఘ చర్చ, 37 సవరణల ఆమోదం అనంతరం ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. స్థానిక అవసరాల దృష్ట్యా బీజేపీయేతర ఏ పార్టీతోనైనా కలిసిపని చేయాలని నిర్ణయించారు. ఒక తీర్మానం.. రెండు బలమైన వాదనలు బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని, అదే సందర్భంలో కాంగ్రెస్‌తోనూ సమాన దూరం పాటించాలని ప్రకాశ్ కారత్ వాదిస్తూ వచ్చారు. దీనిపై కేంద్ర కమిటీలోనూ చర్చించి, ఆ మేరకు బుధవారం మహాసభల్లో ముసాయిదా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దన్న అంశంపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విభేదిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఉండాలని తాను కోరుకోవడం లేదని, కానీ బీజేపీని గద్దె దించే క్రమంలో వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల కలయిక అవసరమని, అలాంటప్పుడు అవసరమైతే కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు కొనసాగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తీర్మానంలో కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దనే వాక్యానికి సవరణలు చేయాలని పట్టుబట్టారు. కేంద్ర కమిటీలో చర్చ సందర్భంగా కూడా ఆయన ఈ విషయంపై గట్టిగా పట్టుబట్టారు. సభలో ఒకే తీర్మానంపై రెండు బలమైన అభిప్రాయాలు ముందుకు రావడం పార్టీలో రసవత్తర చర్చకు దారితీసింది. మద్దతు పలికినవారెవరు? మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానంతోపాటు ఏచూరి అభిప్రాయంపై గురు, శుక్రవారాల్లో వాడివేడి చర్చ జరిగింది. 12 రాష్ట్రాలకు చెందిన 47 మంది ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పారు. ముసాయిదా తీర్మానంపై మొత్తంగా 373 సవరణలను సూచించారు. మెజార్టీ సభ్యులు కారత్ ప్రతిపాదన వైపే మొగ్గు చూపినట్లు మొదట్లో కనిపించినా తర్వాత ఏచూరి అభిప్రాయానికి అనుకూలంగా పరిస్థితి మారినట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి వరకు ప్రతినిధులు రాజకీయ తీర్మానంపై తమ అభిప్రాయాలను తెలియజేసి సవరణలు సూచించారు. ఏచూరి అభిప్రాయానికి పశ్చిమ బెంగాల్ నేతలు గట్టి మద్దతు ఇచ్చారు. బీజేపీని ఓడించే ప్రయత్నంలోనే అవసరమైతే కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కొనసాగించాలని స్పష్టంచేశారు. వారికి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన నేతలు కూడా జత కలిశారు. ఒక దశలో తమ అభిప్రాయాన్ని అంగీకరించకపోతే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టినట్టు తెలిసింది. ఏపీ నేతల ఝలక్! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏచూరికి ఇక్కడి నేతలే ఝలక్ ఇచ్చారు. ఆయన అభిప్రాయంతో విభేదించి కారత్ తీర్మానాన్ని సమర్థించారు. కేరళ నేతలు కూడ కారత్ తీర్మానంతో ఏకీభవించారు. ఈ నేపథ్యంలో మహాసభ రెండు వర్గాలుగా చీలిపోయి వాడివేడి చర్చకు దారితీసింది. రెండు నెలల క్రితం రాజకీయ ముసాయిదా తీర్మానం రూపొందించినప్పుడు కూడా కేంద్ర కమిటీలో ఓటింగ్ జరిగింది. అప్పుడు ఏచూరి ప్రతిపాదన వీగిపోయింది. మహాసభల్లో ఓటింగ్ పెడితే కారత్ తీర్మానమే నెగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు కారత్ మధ్యాహ్నామే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరకుంటే, ఓటింగ్ నిర్వహించి తుది ముసాయిదా ప్రకటిస్తామని వెల్లడించారు. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ జరగవచ్చనే అభిప్రాయమే వ్యక్తం చేశారు. మరోవైపు రాజకీయ తీర్మానంపై ఓటింగ్‌లో తన ప్రతిపాదన వీగిపోతే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఏచూరి ఉన్నారని, పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా ఏచూరి అభిప్రాయానికి తగ్గట్టుగా ముసాయిదాలో సవరణ చేశారు. కారత్ ప్రతిపాదించిన పొలిటికల్ లైన్లో ‘‘కాంగ్రెస్‌తో అవగాహన, ఎన్నికల పొత్తులు లేకుండా’’అనే పదాలను తొలగిస్తూ ముసాయిదాను సవరించారు. ఈ సవరణతో భవిష్యత్ ప్రజా ఉద్యమాల్లో సీపీఏం పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే వెసులుబాటు ఏర్పడింది. -
నేటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
-
సమర భేరి
► నేడు ప్రతిష్టాత్మకంగా బహిరంగ సభ ► పూర్తయిన ఏర్పాట్లు కళా బృందాలతో భారీ ర్యాలీ ► వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రదేశాలు సాక్షి, విశాఖపట్నం : నగర వీధుల్లో రెపరెపలాడిన ఎర్రజెండా నేడు సాగరతీరంలో ఎగరనుంది. సీపీఎం జాతీయ మహాసభల ముగిం పు సందర్భంగా ఆదివారం సాయంత్రం సాగరతీరంలో కాళీమాత టెంపుల్ దగ్గర జరిగే ఈ సభ మరో అపురూప ఘట్టం కానుంది. పార్టీ అధినాయకత్వం సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీపీఎం 21వ అఖిల భారత మహాసభలు ఈ నెల 14న పోర్టు కళావాణి ఆడిటోరియంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవి 19వ తేదీతో ముగుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం వరకూ రాజకీయాలపై చర్చ కొనసాగిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 3గంటల నుంచి ప్రజాప్రదర్శన చేపట్టనున్నారు. కళారూపాలు, జానపద నృత్యాలు, డప్పు వాయిద్యాలు, తప్పెటగుళ్లు, ఎర్రదండు, పులి వేషాలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. మహాసభకు ముందు వెయ్యి మంది డప్పు కాళాకారులు వాయిద్యాలతో కవాతు నిర్వహించనున్నట్లు కులవివక్ష పోరాట కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఎమాల్యాద్రి తెలిపారు. సీపీఐ(ఎం)ముఖ్య నేతలు బహిరంగ సభలో ప్రసంగింనున్నారు. బహిరంగ సభకు హాజరయ్యే వారికి పార్టీ సూచనలు: ► మహా ప్రజా ప్రదర్శనలో పాల్గొనే వారు మధ్యాహ్నం 2గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ (ఆశీల్‌మెట్ట) ప్రాంతానికి చేరుకోవాలి. ► డప్పు కాళాకారులంతా ఆర్టీసీ కాంప్లెక్స్ ఔట్ గేటు వద్దకు రావాలి. ► రెడ్ షర్ట్, శారీ ధరించిన వారంతా ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్దకు చేరుకోవాలి. ► అందరూ బ్యాడ్జీలు ధరి ంచి, జెండా పట్టుకోవాలి. ► ప్రదర్శనకు వచ్చిన వా రంతా జిల్లాల వారీగా వరుస క్రమంలో నిలబడాలి.ఈ బాధ్యతను కార్యకర్తలు నిర్వర్తించాలి. ►మధ్యాహ్నం 4 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఆ సమయానికి ముందుగానే అ ందరూ సభా ప్రాంగణానికి చేరుకోవాలి. ►నిర్ధేశిత ప్రాంతాల్లోనే వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ►వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ తాడిచెట్లపాలెం (ఎన్‌హెచ్5) జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వైపు వచ్చి అక్కడ ఫ్లై ఓవర్‌కు చేరుకోవాలి. ఫ్లై ఓవర్ ప్రారంభంలో జనాన్ని దించి వాహనాలు ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లిపోవాలి. ►విశాఖ రూరల్, ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లి ఆంధ్రా యూనివర్శిటీ ఔట్‌గేటు వద్ద గల ఏయు జిమ్నాజియం గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి. ►విశాఖ నగర వాహనాలు ఫ్లైఓ వర్ మీదుగా వెళ్లి ఆలిండియా రేడియో దగ్గర్లోని పోర్టు గెస్ట్‌హౌస్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో పార్కింగ్ చేయాలి. -
సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం
సీపీఎం 21వ జాతీయ మహాసభలు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఈ మహాసభలను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ మంగళవారం ప్రారంభించారు. ఈ మహాసభలకు బృందా కరత్, సీతారాం ఏచూరి, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, 8 వామపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు.