craze in britain
-
మన టీ, సమోసాకు ఆ దేశంలో యమా క్రేజ్..! విజయసాయి రెడ్డి ట్వీట్
లండన్: సాయంత్రమయ్యేసరికి వేడి వేడి సమోసా తిని, పొగలు గక్కే టీ ఒక కప్పు లాగిస్తే ఎలాగుంటుంది. ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది కదా. మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ చాయ్, సమోసా కాంబినేషన్‌కి ఇప్పడు బ్రిటన్ యువతరంలో యమా క్రేజ్ పెరుగుతోంది. సాధారణంగా తెల్లవారు టీతో పాటు బిస్కెట్లు తింటారు. ఇప్పుడు వారి జిహ్వలు కొత్త రుచులు కోరుకుంటున్నాయని యునైటెడ్ కింగ్డమ్ టీ అండ్ ఇన్ఫ్యూజన్స్ అసోసియేషన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. వెయ్యి మందితో ఈ సర్వేని నిర్వహిస్తే సాయంత్రం స్నాక్‌గా గ్రానోలా బార్స్ (ఓట్స్‌తో చేసేది) చాలా బాగుంటుందని మొదటి స్థానం ఇచ్చారు. ఇక రెండోస్థానాన్ని మన సమోసా కొట్టేసింది. సర్వేలో పాల్గొన్న యువతరంలో 8 శాతం మంది సమోసాకి మొగ్గు చూపించారు. విజయసాయి రెడ్డి ట్వీట్ యూకే పేవరేట్ మెనూలో మన చాయ్, సమోసా చేరడంపై ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బ్రిటన్ యువత తమ స్నాక్స్ లో స్వీట్లకు బదులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. 16-24 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగానికిపైగా.. టీతో కలిపి స్వీట్ బిస్కెట్ రుచిని ఆస్వాదిస్తున్నారని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. It is happy to note that tea and samosa have become favourite menu in UK. The young there prefer them instead of sweets as snacks. 16 to 24-year-olds are half as likely to enjoy a sweet biscuit with their tea as those over 55. #indianculture #foodie #uk #india pic.twitter.com/bRTlbIZq1W — Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2023 -
హింగ్లిష్... వింగ్లిష్..!
హింగ్లిష్ భాషకు క్రేజ్ పెరుగుతోంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా బ్రిటన్ తదితర దేశాలకు విస్తరిస్తోంది. మనదేశంలోని ఏ నగరంలోనైనా బ్రిటన్ పౌరులు ఎదురుపడి, హిందీ, ఇంగ్లిష్ కలగలిపిన భాష హింగ్లిష్‌లో ఏదైనా అడ్రస్ లేదా సమాచారాన్ని కోరితే ఆశ్చర్యపోకండి. ఇంతకీ ఇదేదో కొత్త భాష అనుకుంటున్నారా... అదేం లేదు. ఇప్పటికే మన దేశంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చి రోజువారి కార్యకలాపాల్లో కూడా భాగమై పోయింది. భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాషలో ఇంగ్లిష్ పదాలు అలవోకగా అమరిపోయి వ్యవహారంలోకి వచ్చేశాయి. అంతేస్థాయిలో తెలుగు, బెంగాలీ, ఇతర ప్రాంతీయ భాషల్లో ఇంగ్లిష్ మిళితమై పోయింది. అన్నిస్థాయిల్లోని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ భాషలు రూపాంతరం చెందాయి. హైబ్రీడ్ భాషగా... ప్రస్తుత విశేషం ఏమంటే... హిందీ, ఇంగ్లిష్ కలగలిసి హైబ్రీడ్ భాషగా మారిన నేపథ్యంలో దీనిని ప్రత్యేకంగా బోధించేందుకు బ్రిటన్‌లోని ఒక కాలేజీ ఏకంగా ఓ కోర్సును కూడా ప్రవేశపెట్టేసింది. ఇంగ్లండ్‌లో పేరు ప్రఖ్యాతులున్న పోర్ట్స్మౌత్ కాలేజీ విలక్షణమైన ఈ భాషను బోధిస్తోంది. భారత్‌లో లేదా బ్రిటన్‌లోని భారత కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న ఇంగ్లిష్ విద్యార్థులకు ఈ కోర్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతుండడంతో భారత్‌లో మనుగడ సాధించేందుకు, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మలుచుకునేలా ఇతరదేశాల వారు ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో హింగ్లిష్ సంభాషణలు పెరగడం, లవ్ ఆజ్ కల్, జబ్ వీ మెట్ వంటి ఫిల్మ్ టైటిళ్లతో సినిమాలు రావడం వీక్షకుల్లో ఒకింత క్రేజ్‌ను పెంచాయి. దీనితో పాటు టెలివిజన్, వార్తాపత్రికలు, మొత్తంగా మీడియా సంబంధిత కార్యక్రమాల్లో రెండు విడిదీయరానంతగా కలిసిపోయాయి. ఇప్పటికే ‘యే దిల్ మాంగే మోర్’ వంటి టీవీ వాణిజ్య›ప్రకటనలు ప్రజాదరణ పొందాయి. మంచి స్పందన... హింగ్లిష్ కోర్సుకు వచ్చిన స్పందన కూడా కాలేజీ యాజమాన్యాన్ని ఆశ్యర్యానికి గురిచేసింది. ‘ఈ కోర్సు పట్ల ఎక్కువ సంఖ్యలోనే ఆసక్తిని కనబరిచారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా దీనిని మొదలుపెట్టినపుడు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఫీడ్‌బ్యాక్ బాగా ఉండడంతో వచ్చే సెప్టెంబర్ నుంచి దీర్ఘకాలిక కోర్సును ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ఉన్నాము’ అని కోర్సు బోదనాధిపతి జేమ్స్ వాటర్స్ వెల్లడించారు. హింగ్లిష్ వినియోగం గణనీయంగా పెరుగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్ మాట్లాడేవారి సంఖ్య కంటే హింగ్లీస్ సంభాషించే వారు పెరిగిన ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని భాషా శాస్త్రవేత్త డేవిడ్ క్రిస్టల్ అభిప్రాయపడ్డారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బ్రిటన్ కొత్త నోట్లకు యమ క్రేజ్
బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఐదు పౌండ్ల కొత్త ప్లాస్టిక్ నోట్లు సంచలనం సష్టించడంతోపాటు కలకలం రేపుతున్నాయి. క్రేజీ సీరిస్, క్రేజీ నెంబర్లు వచ్చిన వారు వాటిని 'ఈబే'లో విక్రయిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎక్కువ రేటు వచ్చిన వారు ఆనందిస్తుండగా, తక్కువరేటు వచ్చినవారు సిల్లీ రేటంటూ వాపోతున్నారు. ఎక్కువ బిడ్ పలికినా సొమ్ము చేతికి రానివారు లబోదిబోమని విలపిస్తున్నారు. గరేత్ రైట్ అనే కుర్రవాడు కూడా తన ఐదు పౌండ్ల నోటుకు ఏకంగా 80 వేల పౌండ్ల ధర పలకగా ఎగిరి గంతేశాడు. పండుగ చేసుకుందామని మార్కెట్‌కు వెళ్లి ఓ పెద్ద చేపను కొనుక్కొచ్చాడు కూడా. ఆ సందర్భంగా ఫొటో కూడా దిగాడు. చివరకు 80 వేల పౌండ్లకు బిడ్డింగ్ పాడిన ఆసామి కాస్తా డబ్బులు చెల్లించడానికి మొరాయిస్తుండడంతో బిక్కమొహం వేశాడు. తాను క్యాష్ మిషన్ నుంచి పది పౌండ్లు డ్రా చేయగా, రెండు కొత్త ప్లాస్టిక్ ఐదు పౌండ్ల నోట్లు వచ్చాయని, వాటిలో ఓ నోటుపై 'ఏకే 47 నెంబర్' సిరీస్ కనిపించడంతో దానికి క్రేజ్ ఉంటుందని ఊహించి ఈబేలో వేలం పెట్టానని గరేత్ చెప్పాడు. తన నోటుకు ఈసారి ఎవ్వరికీ లేనంతగా వంద బిడ్లు వచ్చాయని, వెయ్యి రూపాయలకు చేరిన బిడ్డింగ్ క్రమక్రమంగా రెండు, పది, ఇరవై, ముప్పై, యాభై, ఆరవై వేల చొప్పున పెరుగుతూ పోయిందని, మొదట ఉద్విగ్నానికి లోనైన తాను బిడ్డింగ్ భారీగా పెరగడంతో ఆందోళనకు గురయ్యానని, చివరకు ఆందోళనే మిగిలిందని గరేత్ తెలిపాడు. ఎక్కువ బిడ్డింగ్ పలికిన వ్యక్తిని సంప్రదించగా, తాను ఓ డ్రగ్ స్మగ్లర్‌నని, కొకైన్ కంటైనర్ కలిగిన ఓ నౌక రావాల్సి ఉందని, అది వచ్చాకే డబ్బులు ఇస్తానని చెబుతున్నాడని, ఈ విషయమై ఈబే నిర్వాహకులు సాయం కోరినా వారు తామేమీ చేయలేమంటూ చేతులు దులుపుకున్నారని గరేత్ వాపోయాడు. క్రేజీ సిరీస్, నెంబర్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో క్యాష్ మిషన్ల నుంచి వచ్చే ఐదు పౌండ్ల నోట్లపై ప్రజలు దష్టిపెట్టారు. ఎవరికి వారు తమకు ఏ నెంబర్ వచ్చిందని చూసుకుంటున్నారు. ఓ వ్యక్తికి తన ఫోన్ నెంబర్, తనకొచ్చిన నోటు నెంబర్ ఒకటే కావడంతో తెగ మురిసిపోతున్నాడు. ఇటీవల ఈ నోట్లను మార్కెట్లోకి విడుదల చేసిన బ్రిటన్ ప్రభుత్వం సిరీస్‌లో ఒకటో నెంబర్ నోటును ఆనవాయితీగా బ్రిటిష్ రాణికి అందజేశారు.