credits
-
ఈపీఎఫ్ఓ వడ్డీ జమ షురూ: మీరూ చెక్ చేసుకోండిలా..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఎఫ్ఓ) వడ్డీ డిపాజిట్ కోసం ఎదురుచూస్తున్న ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వడ్డీ జమలను ప్రారంభించినట్టు ఈపీఎఫ్‌వో ట్విటర్ ద్వారా సమాచారాన్ని అందించింది. ప్రక్రియ ప్రారంభమైంది త్వరలోనే మీ ఖాతాలోనే పూర్తిగా జమ అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేసింది. 2021-22 ఏడాదిగాను డిపాజిట్లపై వడ్డీరేటు నాలుగు దశాబ్దాల కనిష్టం వద్ద 8.1 శాతంగా ప్రభుత్వం జూన్‌లో ఆమోదించింది. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. The process of crediting interest is ongoing and it will get reflected into your account soon. Whenever the interest is credited, it will be paid in full. There will be no loss of interest. — EPFO (@socialepfo) October 31, 2022 పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? సాధారణంగా బ్యాలెన్స్‌ను ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా చూసుకోవచ్చు. సంస్థ పోర్టల్‌లో లాగిన్ కావడం ద్వారానూ తెలుసుకోవచ్చు. ఖాతాదారులు అధికారిక వెబ్సైట్ లో ‘మా సేవలు’ ట్యాబ్‌కు వెళ్లాలి. ట్యాబ్‌లో, 'ఉద్యోగుల కోసం' ఆప్షన్‌ను ఎంచుకోండి..కొత్త పేజీ ఓపెన్ అయ్యాక సబ్‌స్క్రైబర్ తప్పనిసరిగా 'సభ్యుని పాస్‌బుక్'పై క్లిక్ చేసి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN),పాస్వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. పాస్‌బుక్‌లో వడ్డీ క్రెడిట్ అయిందీ లేనిదీ చెక్ చెసుకోవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఉద్యోగం చేసిన వారు వేర్వేరు ఐడీ ఆధారంగా చెక్ చేయాలి. మిస్డ్ కాల్: ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవవచ్చు. 011-22901406 అనే నంబరుకు చందాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కాల్ చేయాలి. ఎస్ఎంఎస్: పీఎఫ్ చందాదారుడు తన రిజిస్టర్ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్సును తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం 7738299899 నంబరుకు ‘‘EPFOHO UAN ENG’’ అని ఎస్ఎంఎస్ పంపాలి. యూఏఎన్ అని ఉన్న చోట దాన్ని టైప్ చేయాలి. ఎస్ఎంఎస్ సెండ్ చేశాక పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో మరో మెసేజ్ వస్తుంది. -
షావోమికి షాక్, రియల్‌మి కూడా
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమికి షాకిచ్చేలా మరో చైనా మొబైల్ మేకర్ ఒప్పో రంగం సిద్ధం చేసింది. భారత వినియోగదారులకు చిన్న చిన్న అప్పులిచ్చేందుకు షావోమి తీసుకొచ్చిన ‘ఎంఐ క్రెడిట్’ మాదిరిగా ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంను రియల్‌మి తాజాగా లాంచ్ చేసింది. రియల్ మి పేసా పేరుతో భారత మార్కెట్లో రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఫిన్‌టెక్ స్టార్టప్ఫిన్‌షెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిద్వారా దేశంలోని వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్ఎంఇ) లావాదేవీలను సులభతరం చేయడంతోపాటు, తమ వృద్ధిని బలపేతం చేసుకోవాలనేది రియల్‌మి లక్ష్యం. కస్టమర్లకు ఆర్థిక సేవలను సులభతరం చేయడమే తమ లక్ష్యమని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ ప్రకటించారు. టైర్-1, టైర్- 2 పట్టణాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని క్రమంగా ఇతర పట్టణాలకు విస్తరిస్తామన్నారు. రియల్‌మి పేసా వ్యక్తులు, సంస్థలకు అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. చిన్న వ్యాపారాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమనే విషయాన్ని గుర్తించిన తాము తొలిసారిగా ఇలాంటి సదుపాయాన్ని తీసుకొచ్చిన మొబైల్ సంస్థతామేనని రియల్‌మి వెల్లడించింది. గూగుల్ ప్లే నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రియల్‌మి పేసా వెబ్సైట్ వివరాల ప్రకారం వినియోగదారులు రూ .50 వేల పర్సనల్ లోన్ పొందే అవకాశం కూడా ఉంది. పేసాలోని లెండింగ్‌కార్ట్ ద్వారా సంస్థలు రూ. 50 వేల నుంచి రూ. 20 లక్షల వరకు రుణం పొందవచ్చు. అంతేకాదు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి రియల్‌మి పేసా ప్లాట్‌ఫామ్ ద్వారా మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. సంవత్సరానికి రెండుసార్లు క్లెయిమ్ చేసుకోవచ్చట. కాగా ఇండియా మార్కెట్లో చిన్న అప్పులు ఇచ్చేందుకు చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి ఎంఐ క్రెడిట్ పేరుతో లెండింగ్ సొల్యూషన్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఎంఐ పే తర్వాత రెండో పేమెంట్ సొల్యూషన్‌గా దీన్ని తీసుకొచ్చింది. ఎంఐ క్రెడిట్‌ద్వారా రూ. లక్ష దాకా వ్యక్తిగత రుణసదుపాయాన్ని కల్పిస్తోంది. 2023 నాటికి ఇండియాలో ఆన్లైన్ క్రెడిట్ లెండింగ్ మార్కెట్ రూ. 70 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాల నేపథ్యంలో 2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎంఐ క్రెడిట్ ద్వారా భారతదేశంలో 19,000 పిన్ కోడ్లను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
‘అప్పు’డే వద్దు!
ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్ బలహీనంగా ఉందనడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనానికి బలమైన నిదర్శనంగా బ్యాంకింగ్ రుణ వృద్ధి ఘోరంగా పడిపోతోంది. సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి(15 రోజుల వ్యవధి) రుణ వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. వృద్ధి ఈ స్థాయికి పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి (అప్పటికి వార్షిక ప్రాతిపదికన చూస్తే) బ్యాంకింగ్ రుణాలు 97.71 లక్షల కోట్లు. ► 2018 ఇదే కాలానికి రుణాల పరిమాణం రూ.89.82 లక్షల కోట్లు. ► అంటే వృద్ధి రేటు 8.79 శాతమన్నమాట. ► వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ► 2019 సెప్టెంబర్ 13 ముగిసిన పక్షం రోజులకు చూస్తే, రుణాల పరిమాణం రూ.97.01 లక్షల కోట్లుగా ఉంది. 2018 ఇదే కాలంలో పోల్చితే వృద్ధి రేటు 10.26 శాతంగా ఉంది. డిపాజిట్లూ మందగమనమే... ఇక బ్యాంకుల్లో డిపాజిట్ల విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా వృద్ధిరేటు మందగమనంలోకి జారిపోయింది. 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షం రోజులకు డిపాజిట్లు రూ. 129.06 లక్షల కోట్లు. 2018 ఇదే కాలానికి ఈ మొత్తం రూ.118 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 9.38 శాతంగా ఉంది. 2019 సెప్టెంబర్ 13తో ముగిసిన పక్షం రోజులకు చూస్తే, వృద్ధి రేటు 10.02 శాతంగా ఉంది. -
అప్పుల్లేవ్.. తిప్పలే
ఏలూరు (మెట్రో) : కొత్త రుణాలు అందక.. పాత రుణాలు చెల్లించలేక డ్వాక్రా సంఘాల నిర్వహణ గాడి తప్పుతోంది. పకడ్బందీగా నడిచే వ్యవస్థ క్రమంగా బీటలువారుతోంది. సంఘాల పటిష్టత కోసం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన సిబ్బంది మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారు. మరోవైపు రుణాలు అందక మహిళలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 65 వేల మహిళా సంఘాలు ఉండగా.. దాదాపు సగం సంఘాలకు ఇప్పటికీ రుణాలు ఇవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని సంఘాలకు రూ.1,200 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. రూ.660 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. 2015–16 ఆర్థిక సంత్సరంలో రూ.వెయ్యి కోట్లను రుణాలివ్వాలని నిర్ణయించగా.. ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో మహిళా సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్యం మేరకు రుణాలిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రçస్తుత ఆర్థిక సంవత్సరం నెలన్నర రోజుల్లో ముగిసిపోనుంది. ఈలోగా రూ.540 కోట్లను రుణాలుగా ఇచ్చే అవకాశం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. మొండి బకాయిలను తగ్గించామని అధికారులు పేర్కొంటున్నా.. ఇంకా వసూలు కావా ల్సిన మొత్తం రూ.40 కోట్ల వరకు ఉంది. చర్యలు చేపడతాం జిల్లాలోని మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.660 కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు అందించాం. మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – కె.శ్రీనివాసులు, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ -
అప్పుల పాలై కౌలు రైతు ఆత్మహత్య
విజయపురిసౌత్ (గుంటూరు) : మాచర్ల మండలంలోని అనుపు చెంచుకాలనీకి చెందిన కౌలు రైతు వేసిన పంటపొలం పండకపోవడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నూన్సావత్ హనుమానాయక్(47) గత మూడేళ్లుగా 9 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పండిస్తున్నాడు. గత మూడేళ్లుగా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో పంట చేతికి రాక అప్పలపాలయ్యాడు. ఈ ఏడాది తొమ్మిది ఎకరాల కౌలు పొలంలో పత్తి, మిర్చి వేయగా, సొంత పొలం అయిన ఒకటిన్నర ఎకరంలో కంది పంట వేశాడు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో పంట ఎండిపోయిందనే బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్టు గ్రామస్తులు తెలిపారు. ఉదయం పొలంకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయలుదేరిన హనుమానాయక్ వెంట తెచ్చుకున్న పురుగుమందును తాగడంతో వాంతులు చేసుకున్నాడు. పక్క పొలంలో పొలం దున్నతున్న మోతీలాల్ అది గమనించి దగ్గరకు వెళ్లి చూడగా నోటి నుంచి నురుగులు వస్తుండడంతో హనుమానాయక్ సెల్‌ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో హనుమానాయక్ కుటుంబ సభ్యులు గ్రామానికి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న పొలానికి హుటాహుటిన చేరుకొని హనుమానాయక్‌ను గ్రామంలోకి తీసుకువస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య భారతి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
నిబద్ధతకు ప్రశంస
ఒంగోలు క్రైం: కృష్ణా పుష్కరాల సందర్భంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించిన 1,850 మంది పోలీసులకు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ ప్రశంస పత్రాలు అందించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి జరిగిన అభినందన సభకు ఐజీ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ పుష్కరాల్లో జిల్లా పోలీసులు కూడా నిబద్ధతతో విధులు నిర్వర్తించారని కొనియాడారు. హోంగార్డు మొదలుకొని ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పనిచేశారన్నారు. పోలీసులతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కూడా బాగా పనిచేశారని కీర్తించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనుకోవాలంటే ఆయా కాలేజీల నుంచి కోరితే అలాంటి వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున ప్రత్యేకంగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ జిల్లాలో పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటా ఆటంకాలు కలుగకుండా సిబ్బంది పనిచేశార న్నారు. ఎవరికి అప్పగించిన విధులు వారు నిర్వర్తించటంలో నిమగ్నమై సాధారణ ప్రయాణీకులతో పాటు పుష్కర భక్తులకు అసౌకర్యం లేకుండా చేశారని కొనియాడారు. ఓఎస్డి అడ్మిన్ ఏ.దేవదానం, మార్కాపురం ఓఎస్డి కె.లావణ్య లక్ష్మి, ఎన్ఎస్ఎస్ అధికారి సుబ్బారావు, ఎన్సీసీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ అబ్దుల్ రహీం, డీఎస్సీలు, సీఐ, ఎస్సై, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పోలీసులు పాల్గొన్నారు.