Crime -free society
-
నాడు హత్యలకు అడ్డా.. నేడు అత్యంత సురక్షిత ప్రాంతం!
ఎల్ సాల్వడార్.. మధ్య అమెరికాలోని అత్యంత చిన్నదైన, అత్యధిక జనాభా కలిగిన దేశం. ఒకప్పుడు నేరాలు, అవినీతి, హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ దేశం రూపురేఖలు ఇప్పుడు సమూలంగా మారిపోయాయి. అధ్యక్షుడు నయూబ్ బకెలే దేశ అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలో నేరాలు, హత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు ఇటీవల జరిగిన ఎల్ సాల్వడార్ ఎన్నికల్లో నయీబ్ బుకెలే ఘనవిజయం సాధించి, అధ్యక్షపీఠం అధిరోహించారు. దేశంలో అంతకంతకూ దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వీటిని నయూబ్ బుకెలే చక్కదిద్దుతారన్న నమ్మకంతో ఓటర్లు ఆయన పార్టీకి పట్టం కట్టారు. నయీబ్ బుకెలే దేశంలో పెరుగుతున్న హత్యల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలపై ఎల్ సాల్వడార్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కార్మికులైతే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. నయీబ్ బుకెలే ఇప్పుడు ప్రపంచవ్యాపంగా ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు పొందారు. గణనీయంగా తగ్గిన భద్రతా ముప్పు ఒక నివేదిక ప్రకారం నయీబ్ బుకెలే 2019లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్ సాల్వడార్లో శాంతిభద్రతల పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశంలో భద్రతా ముప్పు గణనీయంగా తగ్గింది. తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయనే గెలవడంతో అతని ‘న్యూ ఐడియాస్ పార్టీ’ కార్యకర్తలు విజయోత్సాహంతో ర్యాలీలు చేపట్టారు. లెక్కలేనంతమంది బుకెలే అభిమానులు సాల్వడార్‌లోని సెంట్రల్ స్క్వేర్‌లో సమావేశమై, ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీలి రంగు దుస్తులు ధరించి ఆనందంగా జెండాలు రెపరెపలాడించారు. ‘న్యూ ఐడియాస్ పార్టీ’ పాలన 42 ఏళ్ల అధ్యక్షుడు నయీబ్ బుకెలే తాను మరోమారు సాధించిన ఈ విజయాన్ని తన పరిపాలనకు ఇదొక ‘రిఫరెండం’గా అభివర్ణించారు. దేశ శాసనసభలో మొత్తం 60 స్థానాలను గెలుచుకున్న బుకెలేకి చెందిన ‘న్యూ ఐడియాస్ పార్టీ’ దేశాన్ని మరోమారు పాలించనుంది. ఈ ఎన్నికల తర్వాత దేశంలో బుకెలే ప్రభావం మరింతగా పెరిగింది. సాల్వడార్ చరిత్రలో బుకెలే అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా ఎదిగారని విశ్లేషకులు చెబుతుంటారు. అసురక్షితం నుంచి సురక్షితానికి.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపధ్యంలో నయీబ్ బుకెలే తన భార్యతో కలిసి నేషనల్ ప్యాలెస్ బాల్కనీ నుండి మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందరూ కలిసి ప్రతిపక్షాన్ని కూల్చివేశారు. ఎల్ సాల్వడార్ అత్యంత అసురక్షిత దేశం అనే పేరు నుంచి అత్యంత సురక్షితమైన దేశమనే దిశకు చేరుకుంది. రాబోయే ఐదేళ్లలో మనం చాలా చేయాల్సివుంది’ అని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. ఒకే వారంలో 80 మంది హత్య ఒక నివేదిక ప్రకారం బుకెలే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎల్ సాల్వడార్లో హత్యల రేటు గణనీయంగా తగ్గింది. ‘మారా సాల్వత్రుచా గ్యాంగ్’ (ఎంఎస్-13)సభ్యులు దేశంలో పెద్ద సంఖ్యలో హత్యలు సాగిస్తూ వచ్చారు. 2022 మార్చి లో ఒకే వారంలో వీరు 80 మందిని హత్య చేశారు. బుకెలే ప్రభుత్వం నేరస్తుల ముఠాతో సంబంధం ఉన్న 75 వేల మందిని అరెస్టు చేసింది. El Salvador's President Nayib Bukele, who has described himself as the 'World's coolest dictator,' is all but certain to be re-elected in a presidential bid for another five-year term https://t.co/t7X5vV5VLq pic.twitter.com/1LmIt9aaVV — Reuters (@Reuters) January 30, 2024 70 శాతం మేరకు తగ్గిన హత్యల రేటు పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగిన తర్వాత ఎల్ సాల్వడార్‌లోని క్రిమినల్ ముఠాల వెన్ను విరిగినట్లయ్యింది. ఈ చర్య ఫలితంగా 2022లో హత్యలు దాదాపు 60 శాతం మేరకు తగ్గాయి. అయితే 2023 నాటికి దేశంలో అత్యధిక ఖైదు రేటు నమోదు కావడంతో ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు దారితీసింది. భద్రతా దళాల చర్యల అనంతరం 2023లో ఎల్ సాల్వడార్లో హత్యల రేటు 70 శాతం మేరకు తగ్గి, అది ఒక లక్షకు 2.4 శాతానికి చేరింది. ఈ సంఖ్య లాటిన్ అమెరికాలోని చాలా దేశాల కంటే అతి స్వల్పం నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాటం 2019లో ఎల్ సాల్వడార్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న బుకెలే దేశంలో చోటుచేసుకున్న నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాడతానని వాగ్దానం చేశారు. తన మద్దతుదారులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి, విమర్శకులను ట్రోల్ చేయడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంగంగా ఉపయోగించుకున్నారు. బుకెల్ తరచూ బేస్ బాల్ క్యాప్, లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరిస్తారు. సెల్ఫీలు, మీమ్లను అమితంగా ఇష్టపడతారు. President Bukele takes a victory lap after El Salvador becomes the safest nation in the Western hemisphere He then tells foreign critics to go stuff it pic.twitter.com/iBNEPooXcP — Jack-of-all-trades (@Upliftingvision) February 13, 2024 -
శాంతిభద్రతలు భేష్
పోలీసు యంత్రాంగం అత్యుత్తమ పనితీరుతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిస్థాయిలో విజయవంతమవుతోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా దిశ వ్యవస్థతో మహిళల భద్రతను పటిష్టపరచడం దేశానికే ఆదర్శప్రాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ మొబైల్ యాప్, దిశ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో మహిళా పోలీసు వ్యవస్థతో మహిళల భద్రతకు పూర్తి భరోసా కల్పి స్తున్నామని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతి వినూత్న విధానాలతో నేరాల కట్టడి విజబుల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగం, వినూత్న విధానాలతో నేరాల కట్టడి సాధ్యమైంది. 2022 కంటే 2023లో రాష్ట్రంలో నేరాలు 8.13శాతం తగ్గాయి. 2022లో 1,75,612 కేసులు నమోదు కాగా 2023లో 1,61,334 కేసులకు తగ్గాయి. హత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, మహిళలపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. హత్యలు, హత్యాయత్నం కేసులు 10శాతం, దోపిడీలు 28.57శాతం, దొంగతనాలు 37.24 శాతం, పగటి దొంగతనాలు 13.41 శాతం, రాత్రి దొంగతనాలు 13.54 శాతం, రోడ్డు ప్రమాదాలు 7.83 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 15.20 శాతం, సైబర్ నేరాలు 25.52 శాతం తగ్గాయి. పోలీసు బీట్లు పునర్వ్యవస్థీకరించడం, నిరంతర పర్యవేక్షణ, అనుమానితుల వేలిముద్రల సేకరణ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం వంటి విధానాలను పటిష్టంగా అమలు చేశాం. మహిళా భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించి సత్ఫలితాలను సాధించాం. అసాంఘిక శక్తులపై నిఘా, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, మహిళా పోలీసుల సమర్థ వినియోగం, పీడీ యాక్ట్ ప్రయోగం, కన్విక్షన్ బేస్డ్ విధానాలతో నేరాలను గణనీయంగా తగ్గించగలిగాం. పోలీసు శాఖకు చెందిన 4,92,142 కేసులను లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించాం. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నాం. రాష్ట్రంలోని 4వేల మంది రౌడీల్లో వెయ్యి మంది జైళ్లలో ఉన్నారు. ఈ ఏడాది 900 మంది రౌడీలకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించగలిగాం. మరో 200 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. మహిళలకు పటిష్ట భద్రత 2023లో రాష్ట్రంలో మహిళలపై నేరాలతోపాటు అన్ని రకాల నేరాలను గణనీయంగా తగ్గించడంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతమైన పాత్ర పోషించింది. క్షేత్రస్థాయి వరకు పోలీసింగ్ వ్యవస్థను విస్తృత పరచడం, సమర్థ పర్యవేక్షణ, సున్నిత ప్రాంతాల జియో మ్యాపింగ్ వంటి విధానాలతో మహిళలకు పటిష్ట భద్రత. 2022లో కంటే 2023లో మహిళలపై అత్యాచార కేసులు 28.57శాతం, వరకట్న కేసులు 11.76శాతం, మహిళలపై ఇతర నేరాలు 14శాతం తగ్గడమే అందుకు నిదర్శనం. సమర్థ పోలీసింగ్ విధానాలతో రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు భారీగా తగ్గాయి. డ్రగ్స్, గంజాయి కట్టడి డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. నాటుసారాపై ఉక్కుపాదం మోపాం. మూడేళ్లలో 5 లక్షల కేజీల గంజాయిని జప్తు చేశాం. గిరిజనులకు 2.52 లక్షల ఎకరాల్లో ప్రత్యమ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నాం. విలేకరుల సమావేశంలో అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబ్రత బాగ్చి, డీఐజీ రాజశేఖర్‌బాబు కూడా పాల్గొన్నారు. -
సీసీటీవీ కెమెరాలతో మెరుగైన భద్రత
సాక్షి, అమరావతి : నేరాల నియంత్రణ, మెరుగైన భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యావశ్యకమని దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ఐదేళ్లుగా భారీగా పెరుగుతోందని ఫోర్బ్స్ సంస్థ ‘పోలీసింగ్ ఇన్ ఇండియా–2023’ నివేదిక వెల్లడించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతితో భద్రత, వ్యక్తిగత ప్రైవసీ అనే రెండింటిలో ఎటువైపు మొగ్గుచూపాలి అనే అంశంపై ఐదేళ్ల క్రితం వరకు దేశ ప్రజల్లో ఓ సందిగ్థత ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసు, మున్సిపల్ శాఖలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కాబట్టి తమ నివాస ప్రాంతాల్లో ఇవి వద్దనే భావన ఉండేది. కానీ, నగర, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆలోచనా దృక్పథం ఐదేళ్లలో మారిందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ నివాసాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారని తెలిపింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. దేశంలో నగరాలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నారు. నగరాల్లో 61 శాతం, ప్రధాన పట్టణాల్లో 46 శాతం ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా రెండు, మూడు స్థానాల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటకలో 68శాతం, హరియాణాలో 67శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వం అత్యధికంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేసిన వాటిలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 54 శాతం ప్రాంతాల్లో ప్రభుత్వమే వీటిని ఏర్పాటుచేసింది. అలాగే, అత్యధిక ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 73 శాతం, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రాంతాల్లో 63 శాతం, మధ్య తరగతి వర్గాలుండే చోట 45 శాతం, అంతకంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 28శాతం వరకు ఈ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలతో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. దాంతో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఆ శాఖకు ఇది ఉపయోగపడుతోంది. ఈ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటే ఉన్న ప్రాంతాల్లో నేరాలు 30 శాతం తగ్గినట్లు.. కేసుల ఛేదన 28 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
క్రైమ్ రిపోర్ట్ @ 14 అక్టోబర్ 2022
-
క్రైమ్ రిపోర్టు : ఆదిలాబాద్ జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం
-
క్రైం 'లాక్ డౌన్'
సిద్దిపేటకమాన్: జిల్లాలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించడంతో పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే రహదారులు బోసిపోయాయి. రోడ్లపై ఎప్పుడు ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. కానీ కరోనా లాక్డౌన్ ఫలితంగా రోడ్లపైకి వాహనాలు రాకపోవడంతో జిల్లాలో ప్రమాదాల సంఖ్య చాలా మేరకు తగ్గింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూని అమలు చేసింది. అదే విధంగా 23వ తేదీ నుంచి జిల్లాలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. 56 రోజులపాటు జరిగిన లాక్డౌన్లో మార్చి 22 నుంచి మే 15వరకు జిల్లాలో 15 దొంగతనాలు, 25 రోడ్డు ప్రమాదాలు మాత్రమే చోటు చేసుకున్నాయి. నిరంతర నిఘా.. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేయడానికి నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలో జిల్లా సరిహద్దులతో పాటు మండల కేంద్రాలు, సరిహద్దుల్లో పోలీసు పికెటింగ్, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నాలుగు బార్డర్ చెక్‌పోస్టులు, 24 పికెట్లను ఏర్పాటు చేసి 880 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు అమల్లో భాగంగా 24 గంటలు పోలీసుల నిఘా కొనసాగడం, వారు తీసుకుంటున్న చర్యల కారణంగా ఎక్కువ వాహనాలు రోడ్లపైకి రాలేదు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులతో బయటకు రావొద్దని చెప్పడం, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల వాహనాలను సీజ్ చేయడంతో రోడ్లపైకి ఎక్కువగా వాహనాలు తిరగలేదు. ఫలితంగా వాహనాల రాకపోకలు తగ్గిపోవడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. గతేడాది మార్చి, ఏప్రిల్, మేతో పోల్చితే ఈ సంవత్సరం మూడు నెలల్లో క్రైమ్ రేటు చాలా తగ్గిందని చెప్పవచ్చు. జిల్లాలో గత నెల 23న జరిగిన ఒక హత్య ఘటన మినహా ఇతర కేసులు నమోదు కాలేదు. లాక్డౌన్ ఫలితంగా జిల్లాలో గణనీయంగా క్రైమ్ రేటు తగ్గినట్లు అధికారులు తెలుపుతున్నారు. అందరూ సహకరించాలి లాక్డౌన్ కాలంలో జిల్లాలో క్రైమ్ రేటు చాలా తగ్గింది. ప్రజలంతా ఇంటి వద్దనే ఉంటున్న కారణంగా దొంగతనాలు తగ్గడంతో పాటు ఘర్షణ కేసులు సైతం నమోదు కాలేదు. ఈ మధ్య కాలంలో ఆరు నెలల నుంచి దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి. జైళ్ల నుంచి విడుదలైన దొంగలపైన క్రైం పార్టీ సిబ్బంది నిఘా ఉంచడం వల్ల దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి. రోడ్లపై వాహనాలు తిరగకపోవడంతో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. – జోయల్ డేవిస్,సిద్దిపేట పోలీస్ కమిషనర్ -
ఇక పోలీసుల నుంచి తప్పించుకోలేరు!
కేసు నమోదుతోనే పోలీసుల పని అయిపోదు. నేర పరిశోధన చేయాలి. అన్ని ఆధారాలూ సేకరించాలి. సాక్ష్యాలను కోర్టు లో ప్రవేశపెట్టాలి. నేరాన్ని రుజువు చేయాలి. నిందితుడికి శిక్ష పడేలా చూడాలి. అప్పుడే కేసుకు న్యాయం చేసినట్లు.. పోలీసులు విజయం సాధించినట్లు.. ఇటీవలి కాలంలో కామారెడ్డిలో పలు కేసులను పోలీసులు ఛేదించారు. నిందితులకు శిక్ష పడేలా చేశారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ కృషితో మూడు నెలల్లో ఐదు కేసుల్లో జీవిత ఖైదు పడడం గమనార్హం. సాక్షి, కామారెడ్డి: ఏ కేసులో అయినా పోలీసులు సరైన కోణంలో దర్యాప్తు చేసి న్యాయస్థానంలో సాక్ష్యాలను ప్రవేశపెడితే నిందితులు శిక్ష నుంచి తప్పిం చుకోలేరని ఇటీవల వెలువడిన తీర్పు లు స్పష్టం చేస్తున్నాయి. కామారెడ్డి జి ల్లా ఏర్పాటైన తరువాత ఎస్పీగా శ్వేత బాధ్యతలు స్వీకరించారు. ఆమె కేసుల నమోదు నుంచి నేర నిరూపణ వరకూ తమ సిబ్బందికి, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తూ పోలీసు యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఎస్పీ శ్వేతకు సాంకేతిక అంశాలపై మంచి పట్టు ఉంది. దీన్ని కేసుల ఛేదనకు ఉపయోగిస్తున్నారు. ఎక్కడ హత్య జరిగినా ఎస్పీ కూడా సంఘటన స్థలానికి వెళ్లడం, నేరస్తులను పట్టుకునేందుకు చేయాల్సిన పనులను అక్కడి అధికారులు, సిబ్బందికి సూచించడం ద్వారా చాలా కేసులను త్వరగా ఛేదించగలుగుతున్నారు. నిందితులకు శిక్షలూ పడుతున్నాయి. ఒక్క హత్య కేసులే కాకుండా దోపిడీ, దొంగతనాలు వంటి కేసుల్లోనూ జిల్లా పోలీసులు నిందితులను పట్టుకుని, శిక్ష పడే విషయంలో చురుకుగా పనిచేస్తున్నారు. ఆధారాల సేకరణ నేరస్థలంలో ఏ చిన్న ఆధారం దొరికినా నిందితుల వివరాలు సేకరించడం పెద్ద కష్టం కాదు. హతుడు గుర్తు తెలియని వ్యక్తి అయినపుడు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. హతుడు తెలిస్తేనే హంతకులు చిక్కుతారు. హతుడి వివరాలు తెలిస్తే హంతకులు ఎవరో తేలిపోతుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత వివరాల సేకరణ కొంత సులువైంది. ప్రధానంగా హతుడికి సం బంధించిన సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా హత్యకు ముందు ఎవరితో మాట్లాడాడు అన్నది తె లుస్తోంది. హత్య కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు కీలకం.. నేరం జరిగిన ప్రదేశంలో వేలిముద్రలు సేకరించడం ద్వారా నిందితులను గుర్తిస్తుంటారు. హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు కూడా ఒక్కోసారి కేసులో కీలకంగా మారతాయి. పోలీసులు కేసు దర్యాప్తు అనంతరం ఆయా వివరాలను కేస్‌డైరీ రూపంలో న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. కేసు నమోదు నుంచి నిందితుల గుర్తింపు వరకు సాక్ష్యాధారాలు ఇతరత్రా అన్నింటినీ కోర్టు ముందుంచుతారు. కోర్టులో నమోదు చేసిన వివరాల్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా నిందితుడి తరపున వాదించే డిఫెన్స్ లాయర్‌కు అవకాశం దొరుకుతుంది. కాబట్టి పోలీసులు సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయంతో పొరపాట్లకు తావులేకుండా కేసుడైరీ రూపొందిస్తున్నారు. భార్యపై అనుమానంతో హత్య.. 2009 ఫిబ్రవరి 2న సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన వహీదా (35) అనే మహిళ హత్యకు గురైంది. తన భార్యపై అనుమానంతో ఆమె భర్త అబ్దుల్ హకీం పథకం ప్రకారం ఇంట్లో ఎవరూ లేనిది చూసి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత సదాశివనగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అప్పటి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేయగా.. సీఐ రవికుమార్ దర్యాప్తు చేపట్టారు. కొద్దిరోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన హకీం విదేశాలకు పారిపోవడంతో కేసు విచారణకు అంతరాయం ఏర్పడింది. పదేళ్ల తరువాత నిందితుడు సొంత గ్రామానికి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు.. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తొమ్మిది మంది సాక్షులను ప్రాసిక్యూషన్ తరపున ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలు బలంగా ఉండడంతో గతనెల 26న కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి బి.సత్తయ్య తీర్పు వెల్లడించారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. కేసు పరిశోధనలో, సాక్షాధారాలను రుజువు చేయడంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమృత్‌రావు వైద్య, ఎస్సై లింబారెడ్డి, కోర్టు డ్యూటీ అధికారి రాజారాం సాయిలు చురుకుగా పనిచేశారు. కన్నతల్లిని చంపిన కొడుకు.. 2017 ఆగస్టు 10న దేవునిపల్లి గ్రామానికి చెందిన నోముల వెంకటలక్ష్మి (65) అనే వృద్ధురాలు తన ఇంట్లోనే దారుణహత్యకు గురైంది. అప్పటి రూరల్ సీఐ కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. విచారణ జరుపగా మృతురాలి కుమారుడు సత్యనారాయణే హత్య చేశాడని తేలింది. అతడు తరచుగా డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. స్థలాన్ని విక్రయించగా వచ్చిన డబ్బుల కోసం సంఘటన జరిగిన రోజు కూడా తల్లికొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. తన తల్లిని చంపితే కానీ డబ్బులు దక్కవని భావించిన సత్యనారాయణ.. 2017 ఆగస్టు 10న సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి ఇంట్లో ఒంటరిగా ఉండగా వెదురు నరికే కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో హతమార్చారని సమాచారం ఇచ్చాడు. పోలీసులు విచారణలో నేరం వెల్లడైంది. దీంతో ప్రాసిక్యూషన్ తరపున 11 మంది సాక్షులను, సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో తల్లిని హత్య చేసిన సత్యనారాణయణకు జీవిత ఖైదు, రూ.500 జరిమానా, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరో మూడేళ్లు, జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ గతనెల 26న న్యాయమూర్తి బి.సత్తయ్య తీర్పు వెల్లడించారు. ఈ కేసు పరిశోధనలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమృతరావు, సీఐ కోటేశ్వర్రావు, కోర్టు లైజన్ ఆఫీసర్ లింబారెడ్డి, కోర్టు కానిస్టేబుల్ రమేశ్ తదితరులు చురుకుగా పనిచేశారు. భార్యను చంపిన భర్త.. 2015 ఏప్రిల్ 27న గాంధారి మండలం వండ్రికల్కు చెందిన సుమలత అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురా లి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆ మె భర్త చిన్నప్ప ఉరివేసి చంపాడని ని ర్ధారించారు. సరైన సాక్షాధారాలను ప్రవేశపెట్టడంతో నిందితుడికి గత నెల 15న నిజామాబాద్ ఫ్యామిలీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్‌రెడ్డితో పాటు పోలీసులు చురుకుగా పనిచేశారు. ఇటీవలి కాలంలో మరో రెండు కేసుల్లోనూ ఇద్దరికి జీవిత ఖైదు పడింది. నేరస్తులకు శిక్ష పడాల్సిందే.. నేరాలను అరికట్టడం ఎంత ముఖ్యమో నేరం చేసిన వారికి శిక్ష పడేలా చూడడం కూడా అంతే ముఖ్యం. జిల్లాలో ఇటీవలి కాలంలో ఐదుగురు నేరస్తులకు జీవిత ఖైదు పడింది. ఆయా కేసుల పరిశోధనలో పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కృషి అభినందనీయం. నేరస్తులకు శిక్షలు పడినప్పుడు ఇతరులు నేరం చేయాలంటే కొంత వెనుకంజ వేస్తారు. అందుకే నేరం చేసిన వారికి శిక్షలు పడడం న్యాయం. – ఎన్.శ్వేత, ఎస్పీ, కామారెడ్డి శిక్ష భయంతో నేరాలు తగ్గుతాయి సాక్ష్యాలు తారుమారు కాకుండా పక్కాగా చర్యలు తీసుకోవడం మూలంగా శిక్షలు సాధ్యమవుతున్నాయి. ప్రాసిక్యూషన్ వ్యవస్థలో సమూలమైన మార్పులు జరుగుతున్నాయి. సాక్ష్యాలతో పాటు సాంకేతిక అంశాలను జోడించడంతో నేరస్తులు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కేసుల నిరంతర పర్యవేక్షణ మూలంగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. గతంలోలాగా కాకుండా నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఏర్పడడం వల్ల నేరాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. –వైద్య అమృత్‌రావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, కామారెడ్డి -
‘సత్య’మేవ జయతే!
సాక్షి, అనంతపురం సెంట్రల్: ‘రాష్ట్రంలో ఎక్కడా బెల్టుషాపులు కనిపించకూడదు. ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్టపడాలి. శాంతిభద్రతలు అదుపులో ఉండాలి.’ ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ప్రస్తుతం పోలీసు శాఖల పనితీరును చూస్తుంటే ముఖ్యమంత్రి ఆకాంక్ష నెరవేరేలా కనిపిస్తోంది. ప్రధానంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బూసారపు సత్య యేసుబాబు పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా నిర్వహణపై ఉక్కుపాదం మోపుతున్నారు. బెల్టుషాపులపై దాడులు, ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడకుండా ముందుకు సాగుతుండటంతో ఫ్యాక్షనిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రేపటితో ఎస్పీగా బూసారపు సత్య యేసుబాబు బాధ్యతలు స్వీకరించి నెలరోజులు గడుస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం... ఎస్పీగా సత్యయేసుబాబు బాధ్యతలు స్వీకరించి నెలరోజులు మాత్రమే అవుతున్నా పోలీసుశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్లబ్‌లపై దాడులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ నిర్ణయాలతో జిల్లాలో మట్కా, బెట్టింగ్, పేకాటరాయుళ్లకు భయం పట్టుకుంది. ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారోననే ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటి వరకూ మట్కాపై 27 కేసులు నమోదు చేసి రూ. 1.87 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పేకాటకు సంబందించి 553 కేసులు నమోదు చేసి రూ. 9.97 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. గుట్కా విక్రయిస్తున్న 27 మందిని అరెస్ట్ చేసి రూ. 3.96 లక్షలు విలువజేసే గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. అలాగే బెల్టు దుకాణాలపై మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 128 కేసులు నమోదు చేసి 3,714 మద్యం బాటిళ్లు, 149 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రీచ్ ప్రాంతాల్లో పోలీసు పికెట్ ఇసుక అక్రమ తరలింపు విషయంలో ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏకంగా ఇసుక అక్రమంగా తరలిస్తున్న ప్రాంతాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఎస్పీ తీసుకున్న నిర్ణయాలతో ఇసుక అక్రమ తరలింపు అడ్డుకట్ట పడుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 154 ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్లు, లారీలను పట్టుకున్నారు. మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 150 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. మొత్తం మీద ఎస్పీ నెలరోజుల పాలన పోలీసుశాఖలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి జిల్లాలో శాంతిభద్రతల విషయంలో ఎస్పీ రాజీపడడం లేదు. కొన్నేళ్లుగా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి హవా నడిచింది. అనేక ఘటనల్లో ఇతడి పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది. అయితే గతంలో ఎవరూ ఇతడి జోలికి పోలేదు. ఇటీవల తాడిపత్రిలో ఓ బ్యాంకు ఉద్యోగి హత్యాయత్నంలో ఎస్వీ రవీంద్రారెడ్డి పాత్ర ఉండడంతో ఎస్పీ తనదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. కేవలం ఈ ఘటనలోనే కాకుండా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా ఎస్పీనే పర్యటిస్తున్నారు. కొంతమందిని తన కార్యాలయానికి పిలిపించుకొని తనదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. -
మహిళల భద్రత కోసమే షీటీంలు
సాక్షి, కరీంనగర్ క్రైం: మహిళలు, విద్యార్థినుల భద్రత కోసమే షీటీంలు పని చేస్తున్నాయని మహిళ పోలీస్‌స్టేషన్ సీఐ సంతోష్‌కుమార్ అన్నారు. కరీంనగర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో షీటీంల పనితీరుపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో సీఐ మాట్లాడారు. వేధింపులు ఎదుర్కొనే మహిళలు వాట్సప్, ఫేస్బుక్ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. షీటీంనకు చెందిన పోలీసులు మఫ్టీలో సంచరిస్తూ పోకిరీలను ఆధారాలతో పట్టుకుంటున్నారని అన్నారు. స్మార్ట్‌ఫోన్ కలిగిన ప్రతీపౌరుడు హాక్ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ఈయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో సీఐతో మహిళ ఠాణా ఏఎస్సై విజయమణి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
నేరాలు తగ్గుముఖం
అనంతపురం సెంట్రల్: పోలీసు శాఖ తీసుకున్న విధానాలతో ఈ ఏడాది నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. 2018 క్రైం రౌండప్‌పై శుక్రవారం పోలీసు కార్యాలయ ఆవరణలో షాదీఖానా హాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది 8125 ఐపీసీ నేరాలు జరగగా, ఈ ఏడాది 5981 నేరాలు నమోదయ్యాయని వివరించారు. స్పెషల్ లోకల్ లాస్ కేసులు గతేడాది 499 కేసులు చోటు చేసుకోగా ఈ ఏడాది 437 కేసులు మాత్రమే జరిగాయన్నారు. బాడిలీ అఫెన్సెస్ సంబందించి గతేడాది 2173 జరగగా ఈ ఏడాది 1643కు తగ్గిందన్నారు. వీటిలో అత్యాచారాలు మినహా అన్ని తగ్గుముఖం పట్టాయన్నారు. హత్యలు ఒక శాతం, రైటింగ్స్ 62శాతం, కిడ్నాపులు 28శాతం, హత్యాయత్నం కేసులు 23 శాతం తగ్గాయని పేర్కొన్నారు. ♦ లబ్ధి కోసం హత్యలు 75శాతం, దోపిడీలు 40శాతం, రాబరీలు 91శాతం, బర్గరీస్ 35శాతం, సాధారణ దొంగతనాలు 19శాతం తగ్గినట్లు వివరించారు. గతేడాది 50శాతం రికవరీ జరగగా.. ఈ ఏడాది రికవరీ 80శాతం జరిగిందని తెలిపారు. ♦ సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి 37శాతం ప్రమాదాలు తగ్గాయన్నారు. గతేడాది 1448 జరగగా ఈ ఏడాది 912 జరిగాయన్నారు. గతేడాది 622 మంది మృతి చెందగా 2076 మంది గాయపడ్డారన్నారు. ఈ సంవత్సరం 515 మంది మాత్రమే మృతి చెందగా 1193 మంది గాయపడ్డారని వివరించారు. 17.20శాతం మరణాలు తగ్గాయన్నారు. ♦ జిల్లాలలో ఈ ఏడా3ది ఫ్యాక్షన్ పూర్తిగా అదుపులోఉందన్నారు. ఫ్యాక్షన్ కట్టడి కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పినట్లు తెలిపారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరులపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ♦ సామన్య, పేద బతుకుల్ని చిద్రం చేస్తున్న మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగులపై ప్రత్యేక నిఘా వేసి చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత ఏడాది 1508 మందిని అరెస్టు చేసి రూ.83 లక్షలు స్వాధీనం చేసుకోగా.. ఈ ఏడాది 895 మందిని అరెస్టు చేసి రూ.1.90 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 17 శాతం తగ్గిన ఎస్సీ, ఎస్టీలపై నేరాలు గతేడాది 191 ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 158 మాత్రమే జరిగాయన్నారు. ఈ నేరాలు 17శాతం తగ్గాయన్నారు. గ్రామాల సందర్శనకు వెల్లిన సందర్బాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో గ్రామ సభలు నిర్వహించి చట్టాల గురించి అవగాహన కల్పించినట్లు వివరించారు. టెక్నాలజీ వినియోగంలో అవార్డు జిల్లా పోలీసుశాఖ సాంతికతను భారీగా వినియోగిస్తోందన్నారు. జిల్లాలో సంచలనం సృష్టించిన జేఎన్‌టియూ ఎస్బీఐ బ్యాంకు దొంగతనం.. అంతకు మునుపు జరిగిన ఆవుల దొంగతనాల కేసుల ఛేదింపులో సాంకేతికత బాగా దోహదం చేసిందని గుర్తు చేశారు. జిల్లాలో అమలు చేసిన అఫెండర్ సర్వేలెన్స్‌కు ఫిక్కీ స్పెషల్ జూరీ స్మార్ట్ పోలీసింగ్ – 2018 అవార్డు, ఎక్స్‌ప్రెస్ ఇండియా టెక్నాలజీ సభ అవార్డు, స్కాచ్ అవార్డులు దక్కాయన్నారు. ♦ డయల్ 100, 9989819191 వాట్సాప్ నంబర్ల కాల్స్ ద్వారా సేవలు సద్వినియోగం చేసుకున్నవారికి సత్వర సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు నంబర్లకు మొత్తం ఈ ఏడాది 23,290 కాల్స్ వచ్చాయని, ఇందులో 873 కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ♦ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులు, రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకునే వెసులుబాటును ‘ప్రీపెయిడ్ ఆటో బూత్’ ద్వారా కల్పించామన్నారు. ఈ ఏడాది ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న ఆటో బూత్ ద్వారా 86,220 మంది, రైల్వేస్టేషన్లో ఉన్న ఆటో బూత్ ద్వారా 1,15,500 మంది ఆటో సేవలు వినియోగించుకున్నారు. ♦ విద్యార్థి దశ నుంచే వివిధ చట్టాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు ఎస్పీ వివరించారు. రోడ్డు భద్రత, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, పోక్సో యాక్టు తదితర చట్టాలపై విద్యాసంస్థలకెళ్లి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమానికి పెద్దపీట పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో తక్కువ ధరలకే ఆహారం అందించేందుకు పుడ్ కోర్టు, విధి నిర్వహణలో చనిపోయిన హోంగార్డు కుటుంబాల్లోని ఏడుగురికి హోంగార్డు ఉద్యోగాలు, సిద్ధరాంపురం సమీపంలో ఉన్న పోలీసుల ఇళ్ల స్థలాల ప్రాంతంలో రూ. 50 లక్షల వ్యయంతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. పెట్రోలు బంకు నిర్వహణ ద్వారా జిల్లా పోలీసు సంక్షేమ నిధికి ఆదాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. పోలీసు పిల్లల ఉన్నత చదువుల కోసం మెరిట్ స్కాలర్ షిప్పుల పంపిణీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగు కోసం ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు, దీర్ఘకాలిక వ్యాధిగస్తులను గుర్తించి మెరుగైన చికిత్సకు అవకాశం కల్పించడమే కాకుండా వారిని సుదూర ప్రాంతాల బందోబస్తుల నుంచి మినహాయింపునిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా జిల్లాలో సిబ్బంది సంక్షేమ చర్యలు అమలవుతున్నాయన్నారు. మహిళలరక్షణకు పెద్దపీట గతేడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 40శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. 2017లో 1149 చోటు చేసుకోగా ఈ ఏడాది 694 మాత్రమే జరిగాయన్నారు. ఇందులో వరకట్న హత్యలు 91శాతం, మరణాలు 27శాతం, ఆత్మహత్యలు 43శాతం, వేదింపులు 45శాతం, వరకట్నం కేసులు 40శాతం, కిడ్నాపులు 42శాతం తగ్గాయని వివరించారు. అత్యాచారాలు మాత్రం గతేడాది 44 జరగగా ఈ ఏడాది 46 చోటు చేసుకున్నాయన్నారు. మహిళా రక్షక్ బృందాలు, మహిళా పోలీసు వలంటీర్ల సేవల ద్వారా నేరాలు తగ్గాయన్నారు. నూతన సంవత్సరంలో మరింత సమర్థవంతంగా విధులు నూతన సంవత్సరంలో మరింత సమర్థంగా పని చేస్తామని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయని, ఆ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని వెల్లడించారు. మహిళల భద్రత, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రాధాన్యతనిస్తామన్నారు. మెరుగైన సేవలందించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకునేలా కృషి చేస్తామన్నారు. -
నేర రహిత సమాజమే ధ్యేయం
► నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి చాదర్‌ఘాట్: నేర రహిత సమాజ స్థాపనే పోలీసుల లక్ష్యమని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఈస్ట్ జోన్ పోలీ సుల ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్ ఇంపీరియల్ గార్డెన్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. నగర కమిషనర్ మహేందర్ రెడ్డి ఈ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఉద్యోగం దక్కించుకోవటం మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుం దని, దీనిని దృష్టిలో పెట్టుకొని యువత తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు యత్నించాలని కమిషనర్ సూచిం చారు. ప్రైవేట్ మార్కెట్లో వచ్చిన మార్పుల వల్ల జాబ్‌ల సంఖ్య బాగా పెరిగిందని, యువత మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో స్థిరపడాలని అన్నారు. సహనం, ఓర్పుతో అడుగులు వేస్తూ యువత లక్ష్యాలు చేరుకోవాలి తప్ప నేరమార్గంలో పయనించరాదన్నారు. యువతలో సాఫ్ట్ స్కిల్స్ పెంపొందితే దేశ సంపద వృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ రవీంద్ర మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగానే ఈజాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 500 వందల మంది యువతీయువకులు ఈ మేళాకు హాజరు కాగా.. వీరిలో రెండు వందల మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సుల్తాన్‌బజార్ ఏసీపీ జి.చక్రవర్తి, మలక్‌పేట ఏసీపీ సుధాకర్, ఈస్ట్ జోన్ పరిధిలోని తొమ్మిది మంది సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.