crime records bureau
-
హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్ రేట్.. మహిళలపై 12 శాతం పెరిగిన నేరాలు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేట్ గత ఏడాదితో పోలిస్తే 2 శాతం పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ ఇయర్ ఎండింగ్ మీడియా సమావేశం శుక్రవారం జరిగింది. యానివల్ క్రైం రౌండప్ బుక్‌ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ సమావేశంలో జాయింట్, అడిషనల్ సీపీలు , డీసీపీలు పాల్గొన్నారు. నగరంలో నేరాలకు సంబంధించిన వివరాలు.. హైదరాబాద్‌లో 24,821 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గత ఏడాది తో పోలిస్తే 2 శాతం పెరిగిన క్రైమ్ రేట్ 9% పెరిగిన దోపిడీలు , మహిళలపై 12 % పెరిగిన నేరాలు గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 19 % పెరిగిన రేప్ కేసులు గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12 % తగ్గిన నేరాలు వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లు , పొగొట్టుకున్న సొత్తులో 75 % రికవరీ హత్యలు 79 , రేప్ కేసులు 403 , కిడ్నాప్ లు 242, చీటింగ్ కేసులు 4,909 రోడ్డు ప్రమాదాలు 2,637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదు ఈ ఏడాది 63 % నేరస్తులకు శిక్షలు 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు ఈ ఏడాది 83 డ్రగ్ కేసుల్లో 241మంది అరెస్ట్ గత ఏడాది తో పోలిస్తే ఈఏడాది 11 % పెరిగిన సైబర్ నేరాలు ఈ ఏడాది ఇన్వెస్టమెంట్ స్కీమ్ ల ద్వారా 401 కోట్లు మోసాలు మల్టిలెవల్ మార్కెటింగ్ 152 కోట్లు మోసం ఆర్థిక నేరాలు 10 వేల కోట్లు కు పైగా మోసం ల్యాండ్ స్కామ్ లల్లో 245 మంది అరెస్ట్ సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన 650 మంది అరెస్ట్ పీడీ యాక్ట్ 18 మందిపై నమోదు ట్రాఫిక్ కేసులు ఇలా.. డ్రంక్ డ్రైవ్ లో 37 వేల కేసులు నమోదయ్యాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డ్రంక్ డ్రైవ్ ద్వారా రూ.91 లక్షలు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లఘించినవారి 556 డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదా ద్వారా మరణాలు 280 నమోదు కాగా.. అందులో పాదచారులు 121 మంది ఉన్నారు. మైనర్ డ్రైవింగ్స్ 1,745 కేసులు నమోదు అయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన రూ. 2.63 లక్షల మందికి ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ అనే మాట వినపడొద్దు.. ఈ ఏడాది మత్తు పదార్థాలు వాడిన 740 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు ఉన్నట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేస్తామని చెప్పారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందని తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకునేందుకు రెండు స్నిపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఇదీ చదవండి: ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం -
National Crime Records Bureau: అయినా భర్త మారలేదు
ఎన్ని కథలు రాసినా..ఎన్ని సినిమాలు తీసినా..ఎన్ని చట్టాలు చేసినా హింస వల్ల భార్యాభర్తల బంధానికి ఎంత గట్టి దెబ్బ తగులుతుందో వార్తల ద్వారా నిత్యం చదువుతున్నా భర్త మాత్రం మారడం లేదు. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) డిసెంబర్ 3న విడుదల చేసిన తాజా నివేదికలో భార్యల మీద భర్తల హింస 2021తో పోలిస్తే 2022లో ఇంకా పెరిగిందని తెలిపింది. ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడే రోజున వచ్చిన ఈ నివేదిక ఎన్ని ప్రభుత్వాలు మారినా మగాణ్ణి మార్చలేకపోతున్నాయన్న కఠోర సత్యాన్ని ముందుకు తెచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న డిసెంబర్ 3వ తేదీన ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) ఏటా దేశంలో జరిగే నేరాలపై ఇచ్చే వార్షిక నివేదికను 2022 సంవత్సరానికి విడుదల చేసింది. 2022లో జరిగిన అన్ని నేరాల్లో భార్యలపై భర్తలు నెరపిన హింసాత్మక చర్యల కేసులే ప్రథమ స్థానంలో నిలిచాయని ఈ నివేదిక చెప్పింది. అంటే పెద్ద చదువులు, భారీ జీతాల ఉద్యోగాలు, చట్టాలు, సంఘపరమైన మర్యాదలు... ఏవీ మగాణ్ణి మార్చలేకపోతున్నాయని అతడు రోజురోజుకూ మరింత తీసికట్టుగా తయారవుతున్నాడని ఈ నివేదిక వల్ల అర్థమవుతోంది. తానే సర్వాధికారి అన్నట్టుగా ఇంటి యజమాని స్థానంలో ఉంటూ భార్యతో హింసాత్మకంగానే వ్యవహరిస్తున్నాడు. ‘ఇది మగ సమాజం’ అని మగవాడు భావించడమే ఇందుకు కారణం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎంత మంది స్త్రీలకు సీట్లు దక్కాయో, ఎంతమంది స్త్రీలు గెలిచారో గమనిస్తే అవును.. ఇది మగసమాజం అనుకోకుండా ఉండగలరా ఎవరైనా? కాబట్టి ఎన్నికల ఫలితాల రోజే ఈ నివేదిక వెలువడటం యాదృచ్చికం కాదు. పిల్లలూ బాధితులే ఈ నివేదికలో మరో బాధాకరమైన వాస్తవం ఏమిటంటే దేశంలో 2022లో స్త్రీల తర్వాత అత్యధికమైన కేసులు నమోదైనవి బాలలకు జరిగిన హానిపై నమోదైనవే. 2022లో పిల్లలపై హింసకు సంబంధించి 1,62,449 కేసులు నమోదయ్యాయి. వీటిలో సగానికి సగం కిడ్నాపులు. మిగిలినవి పోక్సో కేసులు. వీటిలో పిల్లలపై జరిగిన లైంగిక అసభ్యతతో పాటు అత్యాచారాలు కూడా ఉన్నాయి. గమనించాల్సిన సంగతి ఏమిటంటే భార్యాభర్తల మధ్య హింస చోటు చేసుకుంటున్నప్పుడు పిల్లలపై శ్రద్ధ పెట్టే అవకాశం తక్కువ. లేదా తల్లిదండ్రుల తగాదాలను చూసి ఇల్లు వీడే పిల్లలు, ఇంట్లో ఉండలేక వేరే చోట ఆడుకోవడానికి వెళ్లి లైంగిక దాడులకు గురయ్యే పిల్లలు అధికంగా ఉంటారు. అంటే గృహహింస వల్ల కేవలం స్త్రీలే కాక పిల్లలు కూడా బాధితులవుతున్నారని తెలుసుకోవాలి. 2022లో స్త్రీలపై, పిల్లలపై జరిగిన నేరాల తర్వాత 60 ఏళ్లు దాటిన వృద్ధులపై ఎక్కువ నేరాలు జరిగాయి. అంటే మన దేశంలో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా హింసను ఎదుర్కొంటున్నారు. భర్తలూ మారాలి వివాహం అంటే స్త్రీ పురుషులు కలిసి నడవాల్సిన సమాన వేదిక అనే భావన ఇంకా పురుషుడికి ఏర్పడకపోవడమే స్త్రీలపై నేరాలకు ప్రధాన కారణం. పెళ్లి ద్వారా తనకు భార్య అనే బానిస లేదా సేవకురాలు లేదా తాను అదుపు చేయదగ్గ మనిషి అందుబాటులోకి రాబోతున్నదని పురుషుడు భావిస్తూనే ఉన్నాడు. పైగా ‘ఇదంతా మామూలే. తాతలు తండ్రులు చేసిందే నేనూ చేస్తున్నాను’ అని తాను నమ్మడమే కాక ‘మీ నాన్న మీ తాత చేస్తున్నదే నేనూ చేస్తున్నాను’ అని భార్యతో అంటున్నాడు. ఇందుకు భార్య అభ్యంతరం పెడితే, తన నిర్ణయాలను వ్యతిరేకిస్తే, మరొక అభిప్రాయం కలిగి ఉంటే ఆమెపై హింస జరుగుతున్నది. భర్త హింస చేయకపోతే అతని సంబంధీకులు ఇందుకు తెగబడుతున్నారు. గాయపరచడం నుంచి హత్య చేయడం వరకు ఈ దాడులు ఉంటున్నాయి. నమోదైనవి మాత్రమే ఎన్.సి.ఆర్.బి. ఈ నివేదికను నమోదైన కేసుల ఆధారంగానే ఇస్తుంది. మన దేశంలో ఎంతమంది భార్యలు కేసుల వరకూ వెళతారో ఊహించవచ్చు. పది శాతం స్టేషన్ దాకా వెళితే 90 శాతం ఇంట్లోనే ఉంటూ ఈ హింసను అనుభవిస్తుంటారు. పురుషులను మార్చడానికి సాహిత్యం, సినిమా, సామాజిక చైతన్యం ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. అయినా సరే పురుషుడు మారకపోతే ఎలా? కాఫీ చల్లారిందని, కూర బాగలేదని, కట్నం పేరుతోనో, ఉద్యోగం చేయవద్దనో, మగ పిల్లాణ్ణి కనలేదనో, పుట్టింటికి తరచూ వెళుతోందని, అత్తింటి వారిని అసలు పట్టించుకోవడం లేదనో ఏదో ఒక నెపం వెతికి హింసకు తెగబడితే ఎలా? భర్తలూ ఆలోచించండి. 4,45,256 కేసులు 2022లో స్త్రీలకు జరిగిన హానిపై దేశవ్యాప్తంగా 4,45,256 కేసులు నమోదయ్యాయి. 2021 కంటే 2022లో ఈ నేరాలు 4 శాతం పెరిగాయి. అయితే ఈ మొత్తం నాలుగున్నర లక్షల కేసుల్లో ప్రథమస్థానం వహించినవి భార్య మీద భర్త, అతని సంబంధీకులు చేసిన హింసకు సంబంధించినవే కావడం గమనార్హం. రెండవ స్థానం వహించిన కేసులు స్త్రీల కిడ్నాప్. మూడవ స్థానంలో నిలిచిన కేసులు స్త్రీ గౌరవానికి భంగం కలిగించే చర్యలు. నాల్గవ స్థానంలో నిలిచినవి అత్యాచారాలు. అంటే భర్త, కుటుంబ సభ్యుల సంస్కార స్థాయి మెరుగ్గా ఉండి స్త్రీని గౌరవించే విధంగా ఉంటే దాదాపు సగం కేసులు ఉండేవే కావు. -
41–ఏ అమలు చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల వరకు జైలు శిక్షపడే నేరాల్లో తప్పనిసరిగా 41–ఏ సీఆర్పీసీ నోటీస్ జారీచేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి సర్క్యులర్ జారీచేశారు. సీఆర్పీసీ 41, 41–ఏ,41–బి, 41–సీ,డీలపై శ్రద్ధచూపాలని ఆదేశించారు. అరెస్ట్ చేయకుండా సీఆర్పీసీ 41–ఏ కింద వ్యక్తిగత హాజరు నిమిత్తం నోటీస్ జారీచేసినప్పుడు బెయిల్ బాండ్లు, ష్యూరిటీలు అడగరాదని పేర్కొన్నారు. 41ఏ నోటీస్ జారీ గురించి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. అందుకు జిల్లా కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని, దీన్ని గుర్తించేలా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో ఆ రోజు అరెస్టయిన , అరెస్టు చేసిన వారి వివరాలు పొందుపరిచి పోలీస్‌కంట్రోల్ రూమ్, కమిషనరేట్ క్రైమ్ రికార్డు బ్యూరో, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరోకు అందజేయాలన్నారు. ఈ వ్యవçస్థకు స్టేట్‌క్రైమ్ రికార్డ్ బ్యూరో రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్‌గా వ్యవహరిస్తుందని, దీన్ని సీఐడీ అదనపు డీజీపీ సమన్వయం చేసుకుని, ప్రతీవారం సమీక్ష జరిపి ఐజీలకు తెలియజేయాలని డీజీపీ పేర్కొన్నారు. -
‘ఏపీలో 2,572 మంది రైతుల ఆత్మహత్య’
న్యూఢిల్లీ: గత ఏడాది 2012లో ఆంధ్రప్రదేశ్(ఏపీ)లో వివిధ కారణాల వల్ల 2572 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2011లో ఈ సంఖ్య 2206గా ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిక్ అన్వర్ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన నివేదిక సరైనదేనని మంత్రి తెలిపారు. ఏపీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లో గుర్తించిన 31 జిల్లాల్లో రైతుల అభివృద్ధి, పునరావాసం కోసం రూ.19,998 కోట్ల విలువైన ప్యాకేజీలను ప్రకటించినట్టు అన్వర్ వివరించారు.