Crop Debt waiver
-
మద్దతు మాటే మరిచారు
భూమి మనదే... కష్టం మనదే... దానిపై పండే పంటకు మద్దతుధర మాత్రం మనది కాదు. ఎక్కడో నాలుగు గోడల మధ్య అధికారులే నిర్ణయిస్తారు. అదైనా క్షేత్రస్థాయిలో అమలవుతుందా అంటే దానికీ లేనిపోని సాంకేతిక కారణాలు చూపి వర్తింపజేయట్లేదు. ఏటా సాగు వ్యయం పెరుగుతోంది. ఎరువులు... విత్తనాలు... పురుగుమందుల ధరలతోపాటు కూలిమొత్తాలూ పెరుగుతున్నాయి. కానీ పండించిన పంటకు ఆ స్థాయిలో ధర నిర్థారించకపోవడమే ఇక్కడున్న సమస్య. ఫలితం ఏటా రైతాంగం అప్పుల్లో కూరుకుపోతోంది. వారి కష్టం మట్టిపాలవుతోంది. గరుగుబిల్లి(కురుపాం): దేశానికి రైతే వెన్నెముక అంటారు. వారిని ఆదుకోవడమే తమ ప్రధాన కర్తవ్యం అంటారు. కానీ వారు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించరు. ప్రకృతి విపత్తులవల్లో... మరే కారణాలవల్లో పంట నష్టపోతే కనీసం పరిహారం న్యాయబద్ధంగా అందించరు. అలా రైతు వెన్ను విరిచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి... ఎన్నో సమస్యలకు ఎదురీది... ఎలాగోలా పండించిన పంటకు మద్దతు ధర పెంచాలని వేడుకుంటున్నా సర్కారు మా త్రం చేతులు విదల్చడం లేదు. ఈ ఏడాదైనా మద్దతుధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసే అన్నదాతకు తీవ్ర నిరాశే మిగిలింది. క్వింటాలుకు రూ.200లు మాత్రమే పెంచి చేతులు దులుపు కున్నారు. అమలు కాని ఎన్నికల హామీలు 2014 ఎన్నికల్లో రైతులు పండించే పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా చెల్లిస్తామని తెలు గుదేశం నాయకులు హామీలు గుప్పించారు. వరి పంట ఉత్పత్తి చేసేందుకు క్వింటాలుకు రూ.2వేల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం చెబుతున్న లెక్క. కానీ ప్రభుత్వమే కేవలం రూ.1,770లుగా మద్దతు ధర నిర్ణయించి విశేషం. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా రైతుకు క్వింటాలుకు రూ.300వరకు నష్టం వస్తోంది. ఉత్పత్తి వ్యయంకన్నా 50 శాతం పెంచడం అటుంచితే పెట్టిన వ్యయం కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. వరికి కనీస మద్దతుధర క్వింటాలుకు రూ.2,800లు ఉంచాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. ’రైతులను పట్టించుకోని ప్రభుత్వం ధాన్యం మద్దతు« ధరన పెంచాలని రైతులు, సంఘాలుచేసిన పోరాటాలు ప్రభుతాన్ని కదిలించలేకపోతున్నాయి. కంటితుడుపుగా మద్దతు ధరను ప్రకటించి ప్రభుత్వాలు మమ అనిపించాయి. ఎరువుల ధరలను పెంచిన ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచకపోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ధరలు రెట్టింపు అవడంతో పెట్టుబడులకోసం అధిక వడ్డీలకు అప్పుచేయాల్సి వస్తోంది. ఇంత జరిగినా ప్రకృతి సహకరించకపోతే ఆశించిన దిగుబడి కూడా రావడం లేదు. తీరా వచ్చిన పంటను సైతం గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతున్నారు. దళారీల దందా ప్రభుత్వం తరఫున సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆర్థిక అవసరాల నిమిత్తం రైతులు ముందుగా కళ్లాల్లో వాలిపోతున్న ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వారు ప్రభుత్వ ధరతో నిమిత్తం లేకుండా వారు తమ ఇష్టానుసారం రేటు నిర్ణయించి రైతాంగాన్ని దోచుకుంటున్నారు. పల్లెల్లో సాగుతున్న ఈ దందాను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక సాగు చేయడమంటేనే భయంగా మారి సాగుకు విరామం ప్రకటించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. రైతు వ్యతిరేక ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకులుగా ముద్రవేసుకున్నాయి. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. వరికి కనీసం రూ.2,500 మద్దతు ధరవుంటే రైతుకు నష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వాలు రైతులపై చిన్నచూపు వల్ల తీరని అన్యాయం చేస్తున్నాయి. – గొట్టాపు త్రినాథస్వామి, కొత్తపల్లి, గరుగుబిల్లి మండలం కార్పొరేట్లకే రాయితీలు ఏటా లాభనష్టాలను ఆలోచించకుం డా సాగుచేస్తున్న అన్నదాతలకు వివిధ రకాల సాకులు చూపి కనీస మద్దతు ధర కల్పించని కేంద్రం బ డా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు రకరకాల రాయితీలు కల్పిస్తోంది. కేవలం రైతుల విషయానికి వచ్చేసరికే ఆర్థిక సంక్లిష్టతలను చూపి గొంతు నొక్కేస్తోంది. ప్రభుత్వాలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. – కె.రవీంద్ర, సీపీఎం నాయకుడు, గరుగుబిల్లి -
రేపు టీ-కేబినెట్ తొలి భేటీ
-
రేపు టీ-కేబినెట్ తొలి భేటీ
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై దృష్టి గవర్నర్ ప్రసంగ పాఠానికి ఆమోదం రుణ మాఫీ, ఇతర హామీల అమలుపై చర్చించే అవకాశం 9 నుంచి 12 వరకు అసెంబ్లీ సమావేశాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి తొలి అధికారిక సమావేశం ఆదివారం రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ నెల 9 నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ తొలి సమావేశాల నిర్వహణపైనే కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగ పాఠానికి ఆమోద ముద్ర వేయనుంది. అలాగే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా రైతుల రుణ మాఫీ, తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసుల ఎత్తివేత వంటి అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో చర్చించిన మేరకు రుణ మాఫీని ఒక్క ఏడాదికి మాత్రమే పరిమితం చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించిన తర్వాత తలెత్తిన పరిస్థితులపై మంత్రి మండలిలో చర్చ జరిగే అవకాశముంది. ఇక ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు, ఎరువుల లభ్యతపైనా దృష్టి సారించనుంది. కాగా, సాధారణ ఎన్నికలకు సంబంధించిన అంశాలతోపాటు రాజ్యసభ, శాసన మండలి ఖాళీలు, సభ్యుల వివరాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఈ సందర్భంగా కేబినెట్‌కు అందించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల నిర్వహణకు వీలుగా ఈ నెల 9న ఉదయం 9.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 10వ తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 11న గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 12న గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాదాలు తెలిపాక సమావేశాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ చుట్టూ రెండు కిలోమీటర్ల దూరంలో ఎలాంటి ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఆంక్షలు 9న ఉదయం ఆరు గంటల నుంచి 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయి. -
ఒక మాఫీ.. వంద డౌట్లు
-
మాఫీ కేవలం నిరుటి రుణాలకేనా?
-
రుణమాఫీఫైల్ తొలి సంతకం చేసిన ఘనత వైఎస్‌దే
ఆత్మకూరు(ఎం)/భువనగిరి, న్యూస్‌లైన్ : రెండోసారి రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణస్వీకారం అనంతరం ఉచిత విద్యుత్, రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. గురువారం ఆయన ఆత్మకూర్(ఎం), భువనగిరిలలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ ఇంతవరకు ఆ ఫైల్ సంతకం చేయలేదన్నారు. రైతులు వ్యవసాయం కోసం బంగారం, ఆస్తులు తాకట్టుపెట్టుకుని అప్పులు చేశారన్నారు. ఇప్పుడు మాట మార్చి నిర్ణీత సమయంలో అప్పులు తీసుకున్న వారికే మాఫీ చేస్తాననడం రైతులను మోసం చేయడమేనన్నారు. సీనియర్ నేత కె.జానారెడ్డి సీఎల్పీ నాయకుడిగా ఎన్నిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజాసమస్యలపై స్పందిస్తూ ప్రజల మధ్యనే ఉంటానన్నారు. కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన జనగామ జిల్లాలో ఆలేరు నియోజకవర్గాన్ని కలపవద్దని కోరారు. ఆయన వెంట మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, ఎంపీటీసీ దిగోజు నర్సింహచారి,సుగుణాకర్, శివలింగం ఉన్నారు. -
ప్రభుత్వంపై పోరుకు విపక్షాలు సై
రుణ మాఫీ పరిమితులే తొలి అస్త్రం బేషరతుగా మాఫీ చేయాల్సిందే: సీఎల్పీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం: డీఎస్ డ్వాక్రా రుణాల మాఫీ: డీకే అరుణ అన్ని రుణాలనూ మాఫీ చేయాలి: చింతల ఆంక్షలు విధిస్తే యుద్ధమే: ఆర్.కృష్ణయ్య హామీల ఉల్లంఘనే: నారాయణ కేసీఆర్... మాట నిలుపుకో: తమ్మినేని సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలి ప్రభుత్వం కొలువుదీరి కొద్ది రోజులైనా కాకముందే ప్రతిపక్షాలకు అప్పుడే చేతి నిండా పని మొదలైంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి దోహదపడ్డ రైతు రుణ మాఫీ అంశాన్నే తొలి అస్త్రంగా చేసుకుని ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ రంగంలోకి దిగాయి. రైతులందరికీ రూ.లక్ష చొప్పున రుణాలను మాఫీ చేస్తానన్న ఎన్నికల హామీని టీఆర్ఎస్ తుంగలో తొక్కుతోందంటూ అవి తప్పుపడుతున్నాయి. గతేడాది తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు గురువారం విరుచుకుపడ్డాయి. ఇలా షరతులు విధించడం దారణమంటూ మండిపడ్డాయి. రైతులందరికీ బేషరతుగా రుణాలను మాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. లేదంటే ప్రజల పక్షాన పోరాటం తప్పదని హెచ్చరించాయి... 10 రోజుల్లోనే బండారం బట్టబయలు అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే టీఆర్ఎస్ బండారం బయటపడింది. రైతులందరికీ రూ.లక్ష రుణాలను మాఫీ చేస్తామంటూ రైతులను నమ్మించి ఇప్పుడు ఏడాదికే పరిమితమనడం సరికాదు. దీనిపై రైతుల్లో ఆందోళన మొదలైంది. అధికారంలోకొస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని 2012 నుంచే టీడీపీ, టీఆర్ఎస్ ప్రజలను నమ్మించాయి. ఎవరూ బకాయిలు కట్టొద్దని చెప్పాయి. దాంతో చాలామంది రైతులు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు మళ్లీ రుణాలివ్వలేదు. కాబట్టి 2013-14లో రైతులకు బ్యాంకులిచ్చిన రుణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మాత్రమే మాఫీ చేస్తామనడం దారుణం. మూడు నాలుగేళ్లుగా పంటలు పండక, పండిన పంట అకాల వర్షాలతో నష్టపోయి రైతులు రుణాలు చెల్లించలేదు. కాబట్టి రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయాల్సిందే. ఇందుకోసం అందరినీ కూడగట్టి ఆందోళనకు దిగుతాం. - సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్ని రుణాలు మాఫీ చేయాల్సిందే ఫలానా ఏడాది తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. కాబట్టి రైతులందరికీ అన్ని రుణాలనూ మాఫీ చేయాల్సిందే. అధికారంలోకి వచ్చాక షరతులు విధించడం ప్రజలను మోసగించడమే. - శాసనమండలిలో విపక్ష నేత డి.శ్రీనివాస్ ఆంక్షలంటే యుద్ధమే ఎన్నికల హామీ మేరకు ఎలాంటి షరతుల్లేకుండా రైతులందరికీ రుణాలను మాఫీ చేయాల్సిందే. లేకుంటే ప్రభుత్వంపైప్రజా యుద్ధం తప్పదు. బంగారం తనిఖీ రుణాలు, గోదాముల్లో ధాన్యం, ష్యూరిటీ రుణాలను మినహాయించడం వాగ్దాన భంగమే. 2013-14 రుణాలనే మాఫీ చేస్తామంటే ఎన్నికల లబ్ధి కోసం మొక్కుబడి హామీ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. బేషరతుగా రుణాలను మాఫీ చేయకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతాం. - టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య యూపీఏ మాదిరిగా మాఫీ చేయాల్సిందే యూపీఏ ప్రభుత్వం రైతులందరికీ బేషరతుగా రుణాలను మాఫీ చేసింది. సకాలంలో చెల్లించిన రైతులకూ ప్రోత్సాహకాలిచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే రైతులందరికీ రుణాలను మాఫీ చేయాల్సిందే. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి కానుకగా డ్వాక్రా రుణాలను కూడా రద్దు చేయాలి. - మాజీ మంత్రి డీకే అరుణ మెలిక అన్యాయం రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని పోటీలు పడి హామీలిచ్చిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మెలిక పెట్టడమంటే అన్నదాతకు అన్యాయం చేయడమే. అన్ని రుణాలనూ మాఫీ చేయాల్సిందే. - ఎంపీ వి.హన్మంతరావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి కేసీఆర్... మాట నిలుపుకోండి 2013-14 రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న మీ ప్రకటన రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. దానివల్ల ఒకే పంట రుణం కొందరికి రద్దవుతుంది, మరికొందరికి కాదు. కాబట్టి రూ.లక్ష లోపు రుణాలన్నింటినీ రద్దు చేయండి. - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ -
రుణ మాఫిపై షరతులు సరికాదు: బీజేపీ
హైదరాబాద్: ఎలాంటి షరతులు, పరిమితులు లేకుండా రైతుల రుణాలను మాఫీ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేఎల్పీ ఉప నేత చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధుల బృందం గురువారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో భేటీ అయింది. 2013-14 పంట రుణాలనే మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినట్టు వస్తున్న వార్తలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఇలా మాట మార్చడం భావ్యం కాదని, తెలంగాణ రైతుల ఆశలు ఆవిరయ్యేలా చేయొద్దని కోరారు. సహకార, వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రకాల రుణాలనూ మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో పుస్తకాన్ని మంత్రికి చూపుతూ, దానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని కోరారు. రైతులందరికీ రూ.లక్ష వరకు ఉన్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను మాఫీ చేయాలని, కౌలు రైతులు తీసుకున్న రుణాలకూ దీన్ని వర్తింపజేయాలని, కాలవ్యవధి, షరతులు పెట్టొదని వినతిపత్రం అందజేశారు. నిరుటి రుణాలకే మాఫీ అన్న వార్త నిజం కాదని పోచారం పేర్కొన్నట్టు భేటీ అనంతరం నేతలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, మల్లారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచారి, నేతలు మధుసూదన్‌రెడ్డి, పాపయ్యగౌడ్, నర్సింహారెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
ఒక మాఫీ.. వంద డౌట్లు
వ్యవసాయ రుణమాఫీపై అస్పష్టత రైతుల ఆందోళన మాఫీ కేవలం నిరుటి రుణాలకేనా? పాత బాకీలకు కూడా వర్తిస్తుందా? విపక్షాల విమర్శలు... టీఆర్ఎస్లోనూ గగ్గోలు పూర్తి సమాచారం వచ్చాకే స్పష్టత: ఈటెల రైతుల్ని రెచ్చగొడుతున్నారు అంటూ రుసరుస బంగారం, ఇతర రుణాల మాఫీకి నో! మొత్తం రుణాలు ఎన్ని అనే దానిపై మాకు పూర్తి అవగాహన లేదు. దీనిపై సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లను కోరాం. నాలుగు రోజుల్లో ఇస్తామన్నారు. సోమవారం స్పష్టత వస్తుంది. అప్పుడు అన్ని వివరాలూ వెల్లడిస్తాం - మంత్రి ఈటెల సాక్షి, హైదరాబాద్: ఆదిలోనే అస్పష్టత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తొలి హామీ అయిన వ్యవసాయ రుణాల మాఫీపై గందరగోళం నెలకొంది. రైతు రుణాల మాఫీ కేవలం నిరుడు తీసుకున్న రుణాలకే వర్తిస్తుందా, లేక పాత బకాయిలను కూడా మాఫీ చేస్తారా అన్న విషయుంలో స్పష్టత లోపించింది. పైగా బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు, ఇతర రుణాలను వూఫీ చేయుబోవునీ, కేవలం పంటరుణాలనుమాత్రమే వూఫీ చేస్తావుని చెబుతున్నారు. గతంలో రుణాలు తీసుకుని వాటిని నిరుడు రెన్యువల్ చేసుకోలేకపోరుున రైతుల పరిస్థితి ఇప్పుడు ఇరకాటంలో పడింది. వాటి వూఫీపై ప్రభుత్వ వర్గాలు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి. లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామనీ, అదీ 2013 జూన్ నుంచి తీసుకున్న రుణాలకే వర్తిస్తుందని బుధవారం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించడం తెలిసిందే. దాంతో రుణమాఫీ విషయమై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. అధికార పక్షమైన టీఆర్ఎస్పై దాడికి దీన్నో అస్త్రంగా వూర్చుకుంటున్నారుు. ఈ షరతులు, ఆంక్షలు, పరిమితులు ఏమిటంటూ మండిపడుతున్నాయి. మాఫీ కేవలం ఒక సంవత్సరం రుణాలకేననడం సరికాదని, తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉన్నందున రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అది కూడా అన్ని రకాల వ్యవసాయు రుణాల్నీ వూఫీ చేయూల్సిందేనంటున్నాయి. దీనిపై రైతులు కూడా గాభరా పడుతున్నారు. పలుచోట్ల వారు ఆందోళనలకు కూడా దిగుతున్నారు. రెచ్చగొడుతున్న విపక్షాలు: ఈటెల మరోవైపు టీఆర్ఎస్లోనూ రుణ మాఫీపై షరతుల అంశం గగ్గోలు పుట్టిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు, వివరణ ఇచ్చేందుకు ఈటెల గురువారం ప్రయత్నించారు. మొత్తం రుణాలు ఎన్ననే దానిపై తమకు పూర్తి అవగాహన లేదన్నారు. ‘‘దీనిపై సమాచారమివ్వాలని బ్యాంకర్లను కోరాం. నాలుగు రోజుల్లో వివరాలిస్తామన్నారు. సోమవారం స్పష్టత వస్తుంది. అప్పుడు అన్ని వివరాలూ వెల్లడిస్తాం’’ అని సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కేవలం నాలుగు రోజులే అయింది. మేము ప్రమాణ స్వీకారం చేశాక కార్యాలయానికి వెళ్తే గది తెరిచే వాళ్లు కూడా లేరు. ఇదేమని అధికారులనడిగితే, ‘మీరే ఉద్యోగులను, అధికారులను సమకూర్చుకోవా’లనడంతో అవాక్కయ్యాం. అయినా సరే, రైతులకిచ్చిన హామీని నెరవేర్చాలన్న ఉద్దేశంతో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు. అయితే, బంగారం తాకట్టు రుణాల మాఫీ ఉండబోదని ఈటెల ప్రకటించారు. రుణం రూ.లక్ష కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం లక్ష మాత్రమే మాఫీ చేస్తుందని, మిగతా మొత్తాన్ని రైతులు కట్టుకోవాలని చెప్పారు. రుణ మాఫీపై ప్రతిపక్షాలు అనవసరంగా రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రైతులు వారి ఉచ్చులో పడొద్దని, తాము చెప్పేది మాత్రమే వినాలనిఅన్నారు. తెలంగాణలో ప్రశాంతత లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతోందంటూ రుసరుసలాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోనూ ఆందోళన కేవలం పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని, అది కూడా గతేడాదికే పరిమితమని వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడిలా చేస్తే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. పంట రుణాలు, బంగారు తాకట్టు రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, పంట రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చిన రుణాల వంటివన్నీ కలిపితే రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు తెలంగాణలో రూ.26,020 కోట్లుంటారుు. కానీ ఈ రుణ మాఫీని రూ.10 వేల కోట్లకు పరిమితం చేయాలని సూచించినట్టు బుధవారం బ్యాంకర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం తరవాత విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ప్రభుత్వ సలహాదారు పేర్కొనడం గమనార్హం. -
రుణమాఫీపై కేసీఆర్ కసరత్తు
-
రుణమాఫీపై కేసీఆర్ కసరత్తు
తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీకి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత వివరాల సేకరణలో నిమగ్నమైన ప్రభుత్వ యంత్రాంగం లక్షలోపు పంట రుణాల మాఫీకి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు.. రాష్ర్ట స్థాయి బ్యాంకర్లతో నేడు సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం బ్యాంకర్లు ఇచ్చే వివరాల ఆధారంగా కేబినెట్‌కు ఫైలు మొత్తం వ్యవసాయ రుణాలు: 39,994 కోట్లు ఇందులో లక్షలోపు రుణాలు: 26,020 కోట్లు సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ మాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్షలోపు పంట రుణాల మాఫీపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో రైతాంగమంతా రుణ మాఫీ కోసమే ఆశగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. తెలంగాణలో రైతులకు ఇచ్చిన రుణాల మొత్తం, అందులో లక్ష రూపాయలలోపు రుణం తీసుకున్న వారి సంఖ్య, రుణ మాఫీతో ఆర్థికంగా ప్రభుత్వంపై పడే భారం, దీన్ని అధిగమించేందుకు పరిష్కార మార్గాలు తదితర అంశాలపై కసరత్తు మొదలైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ స్వయంగా రంగంలోకి దిగారు. రైతులకు రుణాలిచ్చిన బ్యాంకర్లతో బుధవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి కూడా హాజరుకావాలని మొదట భావించినా.. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. ముందు అధికారుల స్థాయిలో సమీక్షా సమావేశం జరిగిన తర్వాతే ఈ అంశంలో స్పష్టత వస్తుందని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ బాధ్యతను సీఎస్‌కు అప్పగించినట్లు సమాచారం. సాధారణ ఎన్నికల సమయంలో రైతుల రుణ మాఫీ హామీని కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయం సాధించి కొత్త రాష్ర్టంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా రుణ మాఫీని అమలు చేయడానికి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రైతులు బ్యాంకుల నుంచి వివిధ రకాలుగా రుణాలు పొందారు. నేరుగా పంట రుణాలు, వ్యవసాయం కోసం బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దీర్ఘకాలిక రుణాలుగా మార్చినవి(సీసీఏటీఎల్), పరోక్ష రుణాలు వంటివి ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 20 నుంచి 25 లక్షల రైతు కుటుంబాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు అంచనా. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ. 7 వేల కోట్లకుపైగా మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ.. భారీగా ఉన్న రైతు రుణాలను ఒక్కసారిగా మాఫీ చేయడం కత్తి మీద సాము వంటిదేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రుణ మాఫీ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. తెలంగాణలో రైతులకు ఇచ్చిన మొత్తం రుణాలు రూ. 39,994 కోట్లుగా అంచనా. ఇందులో లక్ష రూపాయలలోపు తీసుకున్న రుణాల మొత్తం రూ. 26,020 కోట్ల వరకు ఉంటుందని సర్కారు గుర్తించింది. చిన్న, సన్నకారు అనే తేడా లేకుండా లక్ష రూపాయలలోపు రుణం తీసుకున్న వారందరి అప్పులు మాఫీ అవుతాయన్న ఆశతో రైతులు ఉన్నారు. బుధవారం నాటి సమీక్షా సమావేశంలో బ్యాంకర్లు అందించే వివరాల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ఆ తర్వాతే పూర్తి వివరాలను తొలి కేబినేట్ భేటీలో కేసీఆర్ ముందుంచనున్నట్లు సమాచారం. ఈ అంశంపై రాష్ర్ట ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సచివాలయంలో మంగళవారం పొద్దుపోయే వరకు చర్చించినట్లు తెలిసింది. రైతుల రుణాలకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి...