వ్యవసాయ రుణమాఫీపై అస్పష్టత
రైతుల ఆందోళన
మాఫీ కేవలం నిరుటి రుణాలకేనా?
పాత బాకీలకు కూడా వర్తిస్తుందా?
విపక్షాల విమర్శలు... టీఆర్‌ఎస్‌లోనూ గగ్గోలు
పూర్తి సమాచారం వచ్చాకే స్పష్టత: ఈటెల
రైతుల్ని రెచ్చగొడుతున్నారు అంటూ రుసరుస
బంగారం, ఇతర రుణాల మాఫీకి నో!
మొత్తం రుణాలు ఎన్ని అనే దానిపై మాకు పూర్తి అవగాహన లేదు. దీనిపై సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లను కోరాం. నాలుగు రోజుల్లో ఇస్తామన్నారు. సోమవారం స్పష్టత వస్తుంది. అప్పుడు అన్ని వివరాలూ వెల్లడిస్తాం - మంత్రి ఈటెల
సాక్షి, హైదరాబాద్: ఆదిలోనే అస్పష్టత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తొలి హామీ అయిన వ్యవసాయ రుణాల మాఫీపై గందరగోళం నెలకొంది. రైతు రుణాల మాఫీ కేవలం నిరుడు తీసుకున్న రుణాలకే వర్తిస్తుందా, లేక పాత బకాయిలను కూడా మాఫీ చేస్తారా అన్న విషయుంలో స్పష్టత లోపించింది. పైగా బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు, ఇతర రుణాలను వూఫీ చేయుబోవునీ, కేవలం పంటరుణాలనుమాత్రమే వూఫీ చేస్తావుని చెబుతున్నారు. గతంలో రుణాలు తీసుకుని వాటిని నిరుడు రెన్యువల్ చేసుకోలేకపోరుున రైతుల పరిస్థితి ఇప్పుడు ఇరకాటంలో పడింది. వాటి వూఫీపై ప్రభుత్వ వర్గాలు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి. లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామనీ, అదీ 2013 జూన్ నుంచి తీసుకున్న రుణాలకే వర్తిస్తుందని బుధవారం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించడం తెలిసిందే. దాంతో రుణమాఫీ విషయమై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌పై దాడికి దీన్నో అస్త్రంగా వూర్చుకుంటున్నారుు. ఈ షరతులు, ఆంక్షలు, పరిమితులు ఏమిటంటూ మండిపడుతున్నాయి. మాఫీ కేవలం ఒక సంవత్సరం రుణాలకేననడం సరికాదని, తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉన్నందున రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అది కూడా అన్ని రకాల వ్యవసాయు రుణాల్నీ వూఫీ చేయూల్సిందేనంటున్నాయి. దీనిపై రైతులు కూడా గాభరా పడుతున్నారు. పలుచోట్ల వారు ఆందోళనలకు కూడా దిగుతున్నారు.
రెచ్చగొడుతున్న విపక్షాలు: ఈటెల
మరోవైపు టీఆర్‌ఎస్‌లోనూ రుణ మాఫీపై షరతుల అంశం గగ్గోలు పుట్టిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు, వివరణ ఇచ్చేందుకు ఈటెల గురువారం ప్రయత్నించారు. మొత్తం రుణాలు ఎన్ననే దానిపై తమకు పూర్తి అవగాహన లేదన్నారు. ‘‘దీనిపై సమాచారమివ్వాలని బ్యాంకర్లను కోరాం. నాలుగు రోజుల్లో వివరాలిస్తామన్నారు. సోమవారం స్పష్టత వస్తుంది. అప్పుడు అన్ని వివరాలూ వెల్లడిస్తాం’’ అని సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కేవలం నాలుగు రోజులే అయింది. మేము ప్రమాణ స్వీకారం చేశాక కార్యాలయానికి వెళ్తే గది తెరిచే వాళ్లు కూడా లేరు. ఇదేమని అధికారులనడిగితే, ‘మీరే ఉద్యోగులను, అధికారులను సమకూర్చుకోవా’లనడంతో అవాక్కయ్యాం. అయినా సరే, రైతులకిచ్చిన హామీని నెరవేర్చాలన్న ఉద్దేశంతో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు. అయితే, బంగారం తాకట్టు రుణాల మాఫీ ఉండబోదని ఈటెల ప్రకటించారు. రుణం రూ.లక్ష కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం లక్ష మాత్రమే మాఫీ చేస్తుందని, మిగతా మొత్తాన్ని రైతులు కట్టుకోవాలని చెప్పారు. రుణ మాఫీపై ప్రతిపక్షాలు అనవసరంగా రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రైతులు వారి ఉచ్చులో పడొద్దని, తాము చెప్పేది మాత్రమే వినాలనిఅన్నారు. తెలంగాణలో ప్రశాంతత లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతోందంటూ రుసరుసలాడారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లోనూ ఆందోళన
కేవలం పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని, అది కూడా గతేడాదికే పరిమితమని వస్తున్న వార్తలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడిలా చేస్తే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. పంట రుణాలు, బంగారు తాకట్టు రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, పంట రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చిన రుణాల వంటివన్నీ కలిపితే రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు తెలంగాణలో రూ.26,020 కోట్లుంటారుు. కానీ ఈ రుణ మాఫీని రూ.10 వేల కోట్లకు పరిమితం చేయాలని సూచించినట్టు బుధవారం బ్యాంకర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం తరవాత విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ప్రభుత్వ సలహాదారు పేర్కొనడం గమనార్హం.