Crores for Vote Case
-
ఓటుకు కోట్లు కేసు: మరోసారి వాయిదా కోరొద్దు: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో విచారణను వాయిదా వేయాలని మరోసారి కోరొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని.. విచారణను సీబీఐకు అప్పగించాలంటూ మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను గురువారం న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తొలిసారి కేసు విచారణకు హాజరవుతున్నానని.. మరికొన్ని వివరాలు అందజేయాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి న్యాయస్థానానికి నివేదించారు. ఈ నేపథ్యంలో విచారణను మరో రెండు వారాలు వాయిదా వేయాలని కోరారు. దీనికి పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు ఆర్.బసంత్, రమేశ్ అల్లంకి అభ్యంతరం తెలిపారు. చిన్న చిన్న అంశాలు సాకుగా చూపి ఇప్పటికే పలుసార్లు వాయిదా కోరారన్నారు. ఇదే ధర్మాసనం ముందు కూడా వాయిదా పొందారని గుర్తుచేశారు. పిటిషనర్ వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టులో ప్రతివాదులకు అనుకూలంగానే వచ్చిందని, ఇంకా అదనంగా వివరాలు అందజేయడానికి ఏముంటుందని ప్రశ్నించారు. ప్రతిసారి వాయిదా కోరడం సరికాదన్నారు. అనంతరం రెండు వారాలు వాయిదా వేస్తామని ధర్మాసనం చెప్పగా స్పష్టమైన తేదీని ప్రకటించాలని రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. ఈ సమయంలో చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకొని వేసవి సెలవుల అనంతరం కేసును విచారించాలని అభ్యర్థించారు. జూలైకు వాయిదా వేయడం అసలు సరికాదని మరోసారి ఆళ్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వాదనలు ఇప్పుడే వినాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను జూలై 24న చేపడతామని ధర్మాసనం వాయిదా వేసింది. చంద్రబాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విచారణను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతోందన్నారు. ఓటుకు కోట్లు కేసు విచారణ అనంతరం గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నాడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి రూ.5 కోట్లకు బేరం కుదుర్చుకొని రూ.50 లక్షలు బయానాగా ఇచ్చిన విషయాన్ని దేశ ప్రజలందరూ స్పష్టంగా చూశారన్నారు. సెక్షన్ 39 సీఆర్పీసీ ప్రకారం అనుకోని ఘటన, ప్రమాదం జరిగినప్పుడు ఏ పౌరుడైనా పోలీసుస్టేషన్, మేజిస్ట్రేట్ దగ్గరకు వెళ్లొచ్చని.. దీని ఆధారంగానే తాను కోర్టును ఆశ్రయించానని తెలిపారు. 2017లో సుప్రీంకోర్టును ఆశ్రయించానని, తనకు అనుగుణంగా ఆదేశాలు వచ్చినా ఇప్పటివరకు అనేక సాకులతో చంద్రబాబు న్యాయవాదులు కేసును సాగదీస్తూ వచ్చారని ఆరోపించారు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాయిదా కోరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ న్యాయవాదులకు బాబు న్యాయవాదులు వత్తాసు పలకడం చూస్తుంటే చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కుమ్మక్కైనట్టు తెలుస్తోందన్నారు. జూలై 24 నుంచి వాదనలు ప్రారంభమవుతాయని, వారిద్దరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు. -
అంటే మళ్లీ ‘నోటుకు కోట్లు’ లాంటివి రీపీట్ కావాలని కాదు!
అంటే మళ్లీ ‘నోటుకు కోట్లు’ లాంటివి రీపీట్ కావాలని కాదు! -
ఏపీలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీలో టెన్షన్
సాక్షి, విజయవాడ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్లు కేసు విచారణను అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటి వరకు రేవంత్, అతని అనుచరుల ఇళ్లపై దాడి చేసిన ఆదాయపు పన్నుశాఖ అధికారులు తాజాగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు, మంత్రుల ఇళ్లను టార్గెట్ చేసినట్లు సమాచారం. పోలీసుల బందోబస్తుతో గుంటూరు, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానూరులోని నారాయణ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి ఐటీ అధికారులు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఐటీ దాడుల వార్తలను మంత్రి నారాయణ ఖండించారు. తమ విద్యాసంస్థలపై ఇప్పటి వరకు ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని తెలిపారు. గతంలోనే ఆదాయపుపన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు నారాయణ సంస్థలకు నోటీసులిచ్చారు. ట్రస్ట్ ద్వారా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నట్లు నారాయణ యాజమాన్యం వివరణ కూడా ఇచ్చింది. (చదవండి: టీడీపీ నేత ‘బీద’ సంస్థలపై ఐటీ దాడులు) అలాగే సదరన్ డెవలపర్స్, వీఎస్ లాజిస్టిక్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వీఎస్ లాజిస్టిక్స్ గుంటూరులో రైల్వేకోచ్‌ల మరమ్మతులు, రైల్వే నిర్మాణ పనులకు సబంధించిన కాంట్రాక్టులు చేస్తోంది. విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరులో ఈ రెండు సంస్థల కార్యాలయాలు, సంస్థ ప్రతినిధుల ఇళ్ళలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అమరావతి, పోలవరం కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రాక్టు పనులను సదరన్ డెవలపర్స్ నిర్వహించినట్లు సమాచారం. విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న ఐటీ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి మొత్తం పది బృందాలుగా అధికారులు తనిఖీలకు వెళ్లారు. విశాఖపట్నం సీతమ్మధారలోని ఎన్ఎస్ఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, గురుద్వారా జంక్షన్లో ఉన్న శుభగృహ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఐటీ సిబ్బంది సోదాలు చేపట్టారు. భూముల క్రయ విక్రయాలకు, రిజిస్ట్రేషన్ చెల్లింపులకు భారీ వ్యత్యాసం ఉండటంతో పాటు, జిఎస్టీను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఫిర్యాదులు అందటంతో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పోలీస్ బందోబస్తు మధ్య రికార్డులు, డాక్యుమెంట్ లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ సొమ్ము ఏపీదే! రేవంత్ రెడ్డి ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ నగదును ఏపీ నేతలే అందించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టిసీమ అవినీతి సొమ్ముతోనే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇరిగేషన్ కాంట్రాక్టుల్లో భారీగా ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మంత్రి ద్వారానే డబ్బును తెలంగాణకు పంపినట్లు ప్రచారం కూడా జరిగింది. అంతేకాకుండా కర్ణాటక, తాజాగా తెలంగాణ ఎన్నికలకు కూడా ఏపీ నుంచే వందల కోట్లు పంపారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఐటీ అధికారులు గత రాత్రి పోలీసుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి 10 బృందాలుగా ఐటీ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. నెల్లూరులో బీద మస్తాన్‌రావు ఆస్తులపై జరిగిన దాడుల నేపథ్యంలో టీడీపీ నేతలు హడలిపోతున్నారు. రాజధానిలో వందలాది ఎకరాలను కొనగోలు చేసిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. కాగా, బీద మస్తాన్‌రావు నివాసాలు, కార్యాలయాల్లో వరుసగా రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. బీద మస్తాన్‌రావుతో పాటు ఆయన సోదరుడైన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
ఆ డబ్బు ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆయ్కార్ భవన్లో విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.50 లక్షల నగదును ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశాలపైనే ప్రధానంగా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంత మొత్తాన్ని ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు, ఆ డబ్బును సంబంధిత వ్యక్తి ఆదాయపు పన్ను కింద చూపించారా లేదా అన్న అంశాల్లో క్లారిటీ ఇవ్వాలని రేవంత్‌ను అడిగినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు రాసిన లేఖపైనే తాము విచారణ జరుపుతున్నామని, రూ.50 లక్షలతో పాటు మిగతా రూ.4.5 కోట్ల సంగతి కూడా చెప్పాలని పదే పదే ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే డొల్ల కంపెనీలకు సంబంధించిన అంశాలపై రేవంత్ వివరణ ఇచ్చినట్లు ఐటీ వర్గాల ద్వారా తెలిసింది. తనకెలాంటి కంపెనీలు లేవని, తాను దాఖలు చేసిన అఫిడవిట్‌తో పాటు ఐటీ రిటర్నులపై ఆడిటర్‌తో కలసి ఐటీ అధికారులకు రేవంత్ వివరించారని సమాచారం. మీ ఖాతాలోవేనా..? స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.50 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చిందని రేవంత్‌తో పాటు ఉదయ్‌సింహాను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏసీబీ నుంచి ఒక డీఎస్పీ, మరో ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బు మీ ఖాతా నుంచి డబ్బు డ్రా చేస్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని కోరినట్లు తెలిసింది. ఒకవేళ ఉదయ్‌సింహా ద్వారానే వస్తే ఆ డబ్బు ఎవరిచ్చారో చెప్పాలని అతన్ని ప్రశ్నించినట్లు ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని రేవంత్, ఉదయ్‌సింహా కోరినట్లు తెలిసింది. దీంతో ఓటుకు కోట్లు విచారణ ఆపి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు భోజన విరామం ఇచ్చారు. 2.15 గంటల తర్వాత తన పాత ఇంట్లో ఉన్న కంపెనీలకు రేవంత్‌కు సంబంధం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తన పేరిట ఎలాంటి కంపెనీలు లేవని, అవసరమైతే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని రేవంత్ దీటుగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సాయంత్రం 4.50 గంటల వరకు రేవంత్, ఉదయ్‌సింహాను విచారించిన అధికారులు మళ్లీ ఈ నెల 23న విచారణకు హాజరవ్వాలని చెప్పడంతో 5.00 గంటల సమయంలో వారు ఆయకార్ భవన్ నుంచి బయటకు వచ్చారు. అధికారుల ముసుగులో కేసీఆర్ సైన్యం: రేవంత్‌రెడ్డి విచారణ అనంతరం బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను విచారిస్తున్న అధికారులతో పాటు అధికారుల ముసుగులో కేసీఆర్ ప్రైవేట్ సైన్యం కూడా ఉందని ఆరోపించారు. ఐటీ అధికారుల పేరు చెప్పి డీఐజీ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు తమ ఇంట్లో అర్ధరాత్రి దాడులు చేసి భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. తనను వేధించేందుకు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు విభాగాలను ఉపయోగించుకుంటున్నారని, తాను ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తేలేదని.. న్యాయబద్ధంగా, రాజకీయంగా వీటన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇంట్లో సోదాలు చేసిన సమయంలో, ఇప్పుడు విచారణలో అధికారులకు అన్ని వివరాలు డాక్యుమెంట్లతో సహా సమాధానమిచ్చానన్నారు. తమతో పరిచయం లేని రణధీర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులమని చెప్పి అర్ధరాత్రి దాడులు చేసి వేధించిన విషయంపై ఆదాయపు పన్ను కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై నగర కమిషనర్‌తో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తానని, ఇలాంటి వేధింపులకు భయపడే ప్రసక్తేలేదన్నారు. ఐటీ అధికారులు లేవనెత్తిన మరిన్ని అంశాలపై వివరణ ఇచ్చేందుకు 23న రావాలన్నారని, తాను విచారణకు హాజరవుతానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రతీక్షణం ఏపీ ఇంటెలిజెన్స్ అప్డేట్... ఐటీ అధికారులు రేవంత్‌రెడ్డిని విచారిస్తున్న ఆయ్కార్ భవన్ వద్ద ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు తచ్చాడారు. 8 మందితో కూడిన అధికార బృందం రేవంత్ విచారణ అంశాలను ఎప్పటికప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులకు అప్డేట్ చేశారు. విచారణలో వెల్లడిస్తున్న అంశాలపై కూడా ఆరా తీసి సాయంత్రానికల్లా పూర్తి నివేదిక ఏపీ సీఎం చంద్రబాబుకు పంపించేలా బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఐటీ సోదాల దెబ్బతో ఏపీలోని పలువురు నేతలు, మంత్రులు వణికిపోతున్న సంగతి తెలిసిందే. -
ఓటుకు ‘కోట్లు’ ఎక్కడివి?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాల్లో భాగంగా పలువురికి నోటీసులిచ్చిన అధికారులు విచారణను వేగవంతం చేశారు. రేవంత్‌రెడ్డి మామ పద్మనాభరెడ్డితోపాటు ఓటుకు కోట్లు కేసులో నిందితులు సెబాస్టియన్, ఉదయ్‌సింహా సోమవారం బషీర్‌బాగ్‌లోని ఆయ్కర్ భవన్లో ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ప్రధానంగా ఓటుకు కోట్లు కేసులో రూ.50 లక్షల వ్యవహారంపైనే ప్రశ్నించినట్టు తెలిసింది. ఇన్నాళ్లు తెరమీదకు రాని పద్మనాభరెడ్డినీ ఐటీ అధికారులు ప్రశ్నించడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఉదయ్‌సింహాతో మొదలుపెట్టి... ఐటీ కార్యాలయానికి ఉదయం 10.30 సమయంలో వచ్చిన ఉదయ్సింహాని దాదాపు 2 గంటలపాటు ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడివి? ఎవరి నుంచి తీసుకువచ్చారు? ఐటీ రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయంలోనే రూ.50 లక్షలున్నాయా? అన్న కోణంలో విచారించినట్టు తెలిసింది. అన్ని వివరాలపై మళ్లీ బుధవారం వస్తానని ఉదయ్‌సింహా చెప్పడంతో అత డిని పంపించివేశారు. ఐటీ అధికారులమంటూ కొందరు చైతన్యపురికి చెందిన తన బంధువు డాక్టర్ రణధీర్‌రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లారని ఉదయ్‌సింహా ఆరోపించారు. బంగారం, నగదు, సెల్ఫోన్లు సైతం తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఐటీ అధికారులకు చెప్పగా తాము సోదాలు చేయలేదని, తమకు సంబంధంలేదని చెప్పారని ఉదయ్‌సింహా మీడియా కు తెలిపారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అతడిని తీసుకెళ్లినట్టు ఐటీ ఇన్స్పెక్టర్ చెప్పారన్నారు. రణధీర్‌రెడ్డితో తనకు ఏ లావాదేవీలు లేవని, కుట్రపూరితంగా ఆయన్ను కిడ్నాప్ చేశారని ఆరోపించా రు. అయితే, ఈ వ్యవహారంపై రణధీర్‌రెడ్డి కుటుంబీకులు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐదు గంటలపాటు కొండల్‌రెడ్డి... రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఐటీ రిటర్నుల్లో చూపించిన పలు ఆదాయ వ్యవహారాలపై ఆయనను ప్రశ్నించినట్టు తెలిసింది. ఓటుకు కోట్లు కేసులో రూ.50 లక్షలు కొండల్‌రెడ్డి ఏమైనా అందించాడా అన్న కోణంలో విచారించినట్టు తెలిసింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొండల్‌రెడ్డి విచారణ ముగించుకొని వెళ్లిపోయారు. ఓటుకు కోట్లులోనే విచారణ: సెబాస్టియన్ ఓటుకు కోట్లు కేసులోనే తనపై ఐటీ దాడులు జరిగాయని, సీబీఐ, ఈడీ సూచన మేరకే సోదాలు చేస్తున్నారని సెబాస్టియన్ ఆరోపించారు. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఐటీ కార్యాలయానికి వచ్చిన సెబాస్టియన్ మీడియాతో మాట్లాడారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తెచ్చిన రూ.50 లక్షలపై విచారణ కొనసాగుతోందన్నారు. మిగిలిన రూ.4.50 కోట్ల రూపాయల్ని ఎక్కడి నుంచి సమకూర్చాలనుకున్నారు? ఆ డబ్బుతో తనకున్న సంబంధాలేంటన్న దానిపై ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఆ డబ్బుతో తనకెలాంటి సంబంధంలేదని చెప్పానని, దీనిపైనే పదే పదే ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం, బీజేపీ, టీఆర్ఎస్లు తనను కావాలనే కేసుల పేరుతో రాజకీయాలకు వాడుకొంటున్నాయన్నారు. 4 గంటలు సెబాస్టియన్‌ను ప్రశ్నించిన ఐటీ అధికారులు రాత్రి 8 గంటలకు పంపించివేశారు. మళ్లీ పిలిస్తే వచ్చేందుకు అందుబాటులో ఉండాలని చెప్పినట్టు సెబాస్టియన్ తెలిపారు. పెళ్లికి ముందునుంచే ఐటీ కడుతోంది ఓటుకు కోట్లు కేసులో డబ్బు గురించే తనను ప్రశ్నిం చారంటూ రేవంత్‌రెడ్డి మామ పద్మనాభరెడ్డి ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరైన సందర్భంగా వెల్లడించారు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధంలేదని అన్నారు. తన ఇంట్లో గతంలోనే ఐటీ సోదాలు జరిగాయని, అధికారులిచ్చిన నోటీసుల మేరకే తాను కార్యాలయానికి వచ్చానని తెలిపారు. రేవంత్‌రెడ్డితో వివాహం కాకముందు నుంచే తన కూతురు గీత, తాను ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రస్తుతమున్న నివాసం తన కూతురిదే నని చెప్పారు. రేవంత్‌రెడ్డి మామగా కాకుండా తనకు వ్యక్తిగతంగా చాలా గుర్తింపు ఉందని, తాను 35 ఏళ్లుగా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నానని చెప్పా రు. తనకు సంబంధించిన వ్యాపారాలు, ఆదాయ మార్గాలపై అధికారులకు వివరించానని వెల్లడించారు. ఉప్పల్ పోలీసుల అదుపులో రణధీర్‌రెడ్డి ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహ సన్నిహితుడు, కిడ్నాప్‌నకు గురయ్యాడని భావిస్తున్న రణధీర్‌రెడ్డిని ఉప్పల్ పోలీసులు సోమవారంరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు రణధీర్ అనుమానాస్పదస్థితిలో ఓ బ్యాగుతో కన్పించాడు. ఆపి తనిఖీ చేయగా ఆ బ్యాగ్‌లో కొంత నగదు, బంగారం, డాక్యుమెంట్లతోపాటుకంప్యూటర్హార్డ్డిస్క్, అనుమానాస్పద లాకర్ ‘కీ’లు కన్పించాయి. వీటికి సంబంధించి ఆయన్ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఠాణాకు తరలించారు. అవన్నీ ఏమిటీ? ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణంలో విచారిస్తున్నారు. లెక్కలు చెప్పని నగదు, బంగారంతోపాటు అనుమానాస్పద వస్తువులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై రణదీర్పై కేసు నమోదు చేశారు. ఐటీ దాడుల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహ తమకు సంబంధించిన వాటినే బ్యాగులో పెట్టి రణదీర్‌కు అప్పగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వస్తువులతోపాటు నిందితుడిని మంగళవారం ఐటీ అధికారులకు అప్పగించే అవకాశం ఉంది. -
ఓటుకు కోట్లు కేసు.. ఏపీ ప్రముఖులకు టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు కొలిక్కి వస్తుందా? నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎవరు సమకూర్చారన్న వివరాలు బయటకు వస్తాయా? హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కార్పొరేషన్ బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసినట్లు చెబుతున్న ఆ సొమ్మును నగరానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఏ రాజ్యసభ సభ్యుడికి(ఏపీ) అప్పగించారు? ఎమ్మెల్యే బ్యాంకు నుంచి తెచ్చిన ఆ ఖాతా ఎవరిది? ఆ అజ్ఞాత వ్యక్తి వివరాలు బయటకు వస్తాయా? గత రెండు రోజులుగా ఈడీ అధికారులు సాగిస్తున్న విచారణ చూసిన తరువాత ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు ఇవి. ఓటుకు కోట్లు కేసులో నిందితులైన రేవంత్, సెబాస్టియన్, ఉదయ్‌సింహలను ఈడీ అధికారులు గురు, శుక్రవారాల్లో విచారించారు. ఉదయ్‌సింహను రేవంత్‌రెడ్డి ఇంటికి పిలిచి ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా ప్రశ్నలు సంధించినట్లు సమా చారం. తాను కేవలం రేవంత్ రమ్మంటే స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లానే తప్ప ఆ డబ్బు ఎక్కడిదన్న వివరాలు తనకు తెలియదని ఉదయ్‌సింహ ఈడీ అధికారులకు చెప్పారు. అంతకుముందు సెబాస్టియన్‌ను విచారించినప్పుడు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ద్వారా ఫోన్ చేయించడం తప్ప తనకు ఇతర ఏ వివరాలు తెలియవని ఈడీ అధికారులకు చెప్పారు. స్టీఫెన్సన్ కోసం రూ. 5 కోట్లు! నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతోపాటు ఆయనకు చెల్లించాల్సిన మిగిలిన మొత్తం (ఒప్పందం ప్రకారం) రూ. 4.50 కోట్లు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి ఇంటికి చేరవేసినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఏ బ్యాంకు ఖాతా నుంచి వాటిని విత్‌డ్రా చేశారు? ఎవరు ఆ రాజ్యసభ సభ్యుడికి ముట్టజెప్పారు వంటి వివరాలు ఇంకా బయటకు రావాల్సిఉంది. అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఒకరు ఆ డబ్బును హైదరాబాద్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా రాజ్యసభ సభ్యుడి నివాసానికి చేరవేశారు. అక్కడి నుంచి రేవంత్‌రెడ్డి వాహనంలోకి రూ. 50 లక్షలు చేరింది. ఇంతవరకూ సమాచారాన్ని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తన విచారణలో తెలుసుకోగలిగింది. డబ్బును సమకూర్చిన ప్రస్తుత ఏపీ మంత్రి డ్రైవర్‌ను కూడా ఏసీబీ అప్పట్లో విచారించింది. అయితే బ్యాంకు ఖాతాల పరిశీలన, మనీలాండరింగ్ వంటి అంశాలు తమ పరిధిలో లేకపోవడంతో తదుపరి విచారణకు అవసరమైన వివరాలు అందజేయాలని ఈడీకి లేఖ రాసింది. రెండేళ్ల క్రితమే లేఖ రాసినా ఈడీలో ఉన్న ఒక అధికారి ఈ లేఖను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టినట్లు ఇటీవల తేటతెల్లమైంది. అప్పట్లో లేఖ రాసినా ఆ కేసుకు సంబంధించి తమకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదంటూ తాజాగా మరో లేఖ రాయడంతో ఈడీ ఖంగుతిన్నది. వెంటనే విచారణ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే రేవంత్, సెబాస్టియన్, ఉదయ్‌సింహ నివాసాలపై దాడులు. ఓటుకు కోట్లు కేసు విచారణ చేస్తున్న సమయంలో ఈ ముగ్గురికీ సంబంధించి డొల్ల కంపెనీలు, నోట్ల రద్దు సమయంలో పెద్ద ఎత్తున నగదు మార్పిడి చేయడం వంటి వివరాలు బయటకు వచ్చాయి. దీంతో గడచిన 15 రోజులుగా వారి ఖాతాలు, ఇతరత్రా ఆస్తులు, కంపెనీల వివరాలు సేకరించిన ఈడీ... ఆదాయపన్ను అధికారులతో కలసి దాడులు నిర్వహించింది. వరుసగా రెండోరోజు రాత్రి వరకు కూడా రేవంత్ నివాసంలో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారికి టెన్షన్.. టెన్షన్.. ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరమీదకు రావడంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఏపీ ప్రముఖులు ఆందోళనకు లోనవుతున్నారు. స్టీఫెన్సన్కు నిధులు సమకూర్చిన ఏపీ మంత్రి నిందితుల్లో ఒకరైన ఉదయ్‌సింహతో మాట్లా డేందుకు శుక్రవారం ప్రయత్నించినట్లు తెలిసిం ది. రేవంత్ ఇంటి దగ్గర ఉన్న సమయంలోనూ ఆ మంత్రి ఉదయ్‌సింహకు వాట్సాప్ కాల్ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. -
'నీతిగా ఉంటే విచారణను ఎదుర్కో బాబు'
శ్రీకాకుళం: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నీతిగా వ్యవహరించి ఉంటే విచారణను ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆముదాల వలసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ప్రతి రోజూ తాను నిప్పు నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందని అన్నారు. వైఎస్జగన్ మోహన్ రెడ్డిలా విచారణను ఎదుర్కొని తన నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. -
దోషిగా తేలుతానన్న భయంతోనే క్వాష్ పిటిషన్
ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఇప్పటికే ఆదేశించిందని, అందువల్ల కోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణ జరగాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. తనపై కేసు కొట్టేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. సీఆర్పీసీ 156 (3) కింద విచారణ జరిగితే చంద్రబాబు దోషా.. నిర్దోషా అన్న విషయం తేలిపోతుందని ఆయన చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రను తేల్చేందుకు, ఆయనను దోషిగా చేర్చాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆర్కేనే. ''విచారణ అర్హత ఉందని ఏసీబీ కోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. నిజంగా చట్టాల మీద, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటే, అప్పీలుకు వెళ్లొద్దని స్పష్టంగా అడిగాను. విచారణ ఎదుర్కోడానికి మీకు ఎందుకు భయం.. దోషి అన్న విషయం మీకే తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారా? ఈ రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా గడుపుతూనే ఉన్న మీరు.. ఈరోజు ఎందుకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాల్సిందే. ఈ రెండు రోజుల్లో భయం లేనట్లు నటిస్తూనే గవర్నర్ వద్దకు ఎవరెవర్ని పంపారో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. చట్టంలో ఉన్న చుట్టాలు కూడా ఎవరూ రక్షించలేరని తెలియడం వల్లే క్వాష్ పిటిషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది'' అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దర్యాప్తు జరిగితే తాను దోషిగా తేలుతానన్న విషయం చంద్రబాబుకు తెలుసని, తన గొంతును ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు ధ్రువీకరించినందు వల్లే బాబు భయపడుతున్నారని ఆర్కే అన్నారు. ఈ కేసులో తన పాత్ర బయట పడుతుందన్న భయంతోనే బాబు క్వాష్ పిటిషన్ వేశారన్నారు. గతంలో చాలామంది మహామహులు సీఆర్పీసీ 156 (3) కింద విచారణను ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. జయలలిత, జస్వంత్ సింగ్, కేంద్రమంత్రులు అందరూ ఇదే సెక్షన్, క్లాజు కింద విచారణ ఎదుర్కొన్నారన్నారు. అసలు విచారణ ఎదుర్కోకుండానే కేసు నుంచి తప్పించుకోవాలని ఆయన కోరడమేంటని ప్రశ్నించారు. దాన్ని బట్టే మీరు ఎంత తప్పు చేశారో తెలిసిపోతోందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన చెప్పారు. -
దోషిగా తేలుతానన్న భయంతోనే క్వాష్ పిటిషన్
-
చంద్రబాబు నిప్పు కాదు.. ఒళ్లంతా తుప్పే
-
చంద్రబాబు నిప్పు కాదు.. ఒళ్లంతా తుప్పే: వాసిరెడ్డి పద్మ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పు కాదని.. ఆయన ఒళ్లంతా తుప్పేనని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తనపై విచారణ నిలిపివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం తగదన్నారు. ఆయనకు దమ్ముంటే విచారణను ఎదుర్కోవాలి తప్ప ఇలా దొడ్డిదోవన తప్పించుకోవడం సరికాదని చెప్పారు. ఆడియో టేపుల్లో 'మావాళ్లు.. దే బ్రీఫ్డ్ మీ' అన్న గొంతు చంద్రబాబుదేనన్న విషయం ఫోరెన్సిక్ పరీక్షలలో తేలిపోయిందని, ఆ టేపుల్లో ఉన్న గొంతు తనది కాదని కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదని ఆమె తెలిపారు. చట్టం ముందు దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని అన్నారు. చంద్రబాబు స్వయంగా మాట్లాడిన మాటలు బయటపడిన తర్వాత కూడా కేసు నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని అన్నారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి లాంటివాళ్లు చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేరని మాత్రమే చెబుతున్నారు తప్ప ఆయన ముద్దాయి కాదని అనడం లేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా ఆయన విచారణకు సిద్ధం కావాలని సవాలు చేశారు. ఇంతకుముందు కూడా పలు కేసుల విషయంలో కోర్టులకెళ్లి స్టే తెచ్చుకున్నారు తప్ప ఇప్పటివరకు ఒక్క విచారణను కూడా నేరుగా ఎదుర్కోలేదని వాసిరెడ్డి పద్మ చెప్పారు. -
చంద్రబాబు తప్పు ఒప్పుకొని దిగిపోవాలి: ఆర్కే
అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకొని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. ఆడియో టేపుల్లో చంద్రబాబు, వీడియో సాక్ష్యాలతో ఆయన మనుషులు కూడా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయారని ఆయన చెప్పారు. ఓటుకు కోట్లు కేసుపై పునర్విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన తర్వాత దీనిపై పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. కోర్టు బయట మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులోని సంభాషణలతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పలు సందర్భాల్లో మాట్లాడిన ఆడియో టేపులను తీసుకుని వాటికి దేశ విదేశాల్లోని ప్రఖ్యాత ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో పరీక్షలు చేయించానని ఆయన చెప్పారు. ఆయా ల్యాబ్‌లు ఇచ్చిన సర్టిఫికెట్లు తీసుకుని ఈనెల 8వ తేదీన ఏసీబీ కోర్టును ఆశ్రయించానన్నారు. దీనిపై రెండుమూడు సార్లు వాదనలు విన్న న్యాయమూర్తి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఈ కేసులో ముద్దాయిగా చేర్చారా లేదా అని తాము అడిగామన్నారు. అప్పట్లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలలో అవసరం లేకపోయినా కూడా తన అక్రమ సంపాదనతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆర్కే అన్నారు. ఈ విషయం బయటపడిన తర్వాత మొదట్లో తనకూ ఏసీబీ ఉందని, తనకూ హైదరాబాద్‌లో పోలీసులు ఉన్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బెదిరించారని, ఆ తర్వాత మాత్రం కేసు నుంచి బయట పడేందుకు తర్వాత కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి పదేళ్ల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉన్నా, ఈయన మాత్రం హడావుడిగా లేని రాజధానికి పారిపోయారని, ఉద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. ఇన్ని తప్పులు చేస్తున్నా పెద్ద మనిషిగా, ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు చట్టం మీద, న్యాయవ్యవస్థ మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే దిగిపోవాలి తప్ప అప్పీలుకు వెళ్లకూడదని చెప్పారు. ఆయన ఎక్కడకు వెళ్లినా కూడా ఈ కేసులో న్యాయం జరుగుతుందనే తాము ఆశిస్తున్నామన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిస్సిగ్గుగా దొరికిపోయిన చంద్రబాబును ఇన్నాళ్ల వరకు ముద్దాయిగా చేర్చలేదన్న విషయాన్ని తాము ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చామని ఈ కేసులో పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఇన్నాళ్లుగా సరైన విచారణ జరగలేదని ఆయన అన్నారు. చంద్రబాబు నూటికి నూరుపాళ్లు ముద్దాయి అని ప్రతి ఆత్మ ఘోషించినా, సంవత్సరం నాలుగు నెలల పాటు ఆయనను ముద్దాయిగా చేయలేకపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు ముద్దాయి అనడానికి వీలున్న ప్రతి అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చామని తెలిపారు. -
మళ్లీ తెరపైకి ఓటుకు కోట్లు కేసు
► పునర్విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశం ► సెప్టెంబర్ 29లోగా విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వులు ► పిటిషన్ దాఖలు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ► ఫోరెన్సిక్ నివేదికలను కోర్టు ముందుంచిన న్యాయవాది ► వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా కేసుపై పునర్విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పిటిషనర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. ఆర్కే దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో సరైన విచారణ జరగలేదని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది కోరారు. తిరిగి విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. ఆయన వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. (చదవండి: చంద్రబాబు తప్పు ఒప్పుకొని దిగిపోవాలి: ఆర్కే) దాదాపు ఏడాది కాలంగా ఈ కేసు ముందుకు సాగడంలేదు. అప్పట్లో స్టీఫెన్‌సన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులు అతికించినవా, వాస్తవమైనవా అనే విషయమై నివేదికను ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ ఇచ్చింది. అవి అసలైనవే తప్ప అతికించినవి కావని అప్పట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. దాంతోపాటు ఈ స్వరం చంద్రబాబు నాయుడిదేనని కూడా శాస్త్రీయంగా నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పలు సందర్భాలలో చంద్రబాబు మాట్లాడిన స్వర నమూనాలను, ఓటుకు కోట్లు కేసులో వినిపించిన సంభాషణలను అంతర్జాతీయంగా పేరొందిన ఒక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ ల్యాబ్ అందించిన నివేదికలో కూడా ఆ స్వరం చంద్రబాబుదేనని తేల్చారు. వాటి ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేశారు. -
సీబీఐ దర్యాప్తు ఎందుకు జరపడం లేదు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ విమర్శించారు. కృష్ణా, గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా కేసుల భయంతో చంద్రబాబు మాట్లాడడం లేదని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కేసుల విషయంలో సీబీఐ విచారణ జరుపుతున్నారని గుర్తు చేశారు. రుణమాఫీ కాకపోయినా చంద్రబాబు, లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ను విమర్శించడం తప్పా మహానాడులో టీడీపీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ప్రజలకు పనికొచ్చే అంశాలపై చర్చ జరగలేదన్నారు. ప్రజల మెప్పు పొందలేమనే కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు దొంగలు టీడీపీ నేతలేనని అన్నారు. అధికార నేతల స్వలాభం కోసం ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడితే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని వేణుగోపాల్ హెచ్చరించారు.