crude steel production
-
భారత్ క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 4 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ క్రూడ్ స్టీల్ (ద్రవ ఉక్కు ఘనీభవనం స్థితి. కడ్డీలు, ఫినిష్డ్, సెమీ ఫినిష్ట్ స్టీల్ ప్రొడక్టŠస్ పరిగణనలోకి తీసుకుంటారు) ఉత్పత్తి 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4 శాతం పెరిగి, 125.32 మెట్రిక్ టన్నులకు ఎగసింది. 2021– 22లో ఈ ఉత్పత్తి పరిమాణం 120.29 ఎంటీలు. వార్షిక ప్రాతిపదికన విభాగాల వారీగా చూస్తే.. ► ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి 6.77 శాతం పెరిగి 121.29 మెట్రిక్ టన్నులకు చేరింది. ► ఇందుల్లో ఒక్క దేశీయ వినియోగ స్టీల్ ఉత్ప త్తి 12.69 శాతం పెరిగి 105.75 ఎంటీల నుంచి 119.17 మెట్రిక్ టన్నులకు ఎగసింది. ఈ విభాగంలో భారీ ఉత్పత్తి పెరుగుదలకు మౌ లిక రంగం క్రియాశీలత మెరుగుదల కారణ. ► స్టీల్ ఎగుమతులు 50 శాతం పడిపోయి 13.49 మెట్రిక్ టన్నుల నుంచి 6.72 మెట్రిక్ టన్నులకు చేరాయి. దిగుమతులు 29 శాతం పెరిగి 4.67 మెట్రిక్ టన్నుల నుంచి 6.02 మెట్రిక్ టన్నులకు ఎగశాయి. పిగ్ ఐరన్ ( దుక్క ఇనుము) ఉత్పత్తి 6.53 శాతం తగ్గి 6.26 మెట్రిక్ టన్నుల నుంచి 5.85 మెట్రిక్ టన్నులకు క్షీణించింది. -
ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల
న్యూఢిల్లీ: దేశీయంగా ముడి ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల నమోదైంది. తాజాగా వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. గతనెల్లో మొత్తం ఉత్పత్తి 8.934 మిలియన్ టన్నులు (ఎంటీ)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని 9.192 ఎంటీలతో పోల్చితే 2.8 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో 3.4 శాతం తగ్గిన సంగతి తెలిసిందే కాగా, వరుసగా రెండు నెలల పాటు ఉత్పత్తిలో క్షీణత నమోదైంది. ఇక అంతర్జాతీయంగా కూడా గత నెల్లో ఉక్కు ఉత్పత్తి ఒక శాతం తగ్గింది. అయితే, ఈ పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా మాత్రం నవంబర్‌లో 4 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. ఆ దేశం గత నెల్లో 80.287 ఎంటీ ఉత్పత్తిని నమోదుచేసింది. అమెరికా ఉత్పత్తి 2.2 శాతం తగ్గి 7.233 ఎంటీగా ఉంది. -
ఉక్కు ఉత్పత్తిలో సత్తా చాటిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ : ఉక్కు ఉత్పాదనలో భారత్ అరుదైన ఘనత సాధించింది. ముడి స్టీల్ తయారీలో జపాన్ను పక్కకునెట్టిన భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిని చేపట్టే దేశంగా అవతరించిందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ తాజా నివేదిక వెల్లడించింది. 2018లో భారత్‌లో ముడి ఉక్కు ఉత్పత్తి 4.9 శాతం పెరిగి 106.5 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాది 101.5 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ఇదే సమయంలో 2018లో జపాన్ ముడి ఉక్కు ఉత్పత్తి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 0.3 శాతం పతనమై 104.3 మెట్రిక్ టన్నులకు తగ్గింది. స్టీల్ ఉత్పత్తిలో చైనా టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. 2018లో చైనాలో స్టీల్ ఉత్పత్తి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6.6 శాతం పెరిగి 928.3 మెట్రిక్ టన్నులకు ఎగబాకింది. ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో చైనా వాటా 2017లో 50.3 నుంచి 51.3 శాతానికి పెరిగిందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నివేదిక తెలిపింది. 2018లో 86.7 మెట్రిక్ టన్నుల ముడి ఉక్కును తయారుచేసిన అమెరికా ఈ జాబితాలో 4వ స్ధానంలో నిలిచింది. ఇక టాప్ టెన్ జాబితాలో వరుసగా దక్షిణ కొరియా, రష్యా, జర్మనీ, టర్కీ, బ్రెజిల్, ఇరాన్‌లకు చోటుదక్కింది. -
క్యూ1లో విశాఖ ఉక్కు ఉత్పత్తి 8% వృద్ధి
ఉక్కునగరం(విశాఖపట్నం): విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లిక్విడ్ స్టీల్, క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 8% వృద్ధిని సాధించింది. విద్యుత్ నియంత్రణ, పవర్ హాలీడే ఉన్నప్పటికీ ఉత్పత్తి, సాంకేతిక అంశాల్లో మంచి ప్రతిభ కనబరిచింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో బ్లాస్ట్‌ఫర్నేస్ ఉత్పాదకతలో 47%, ఇంధన వినియోగంలో 3%, ఇంధన పొదుపులో 2%, నీటి వినియోగంలో 5%, కార్మిక ఉత్పాదకతలో 1% గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే వృద్ధి సాధించింది. జూన్ 14న ప్రారంభించిన బ్లాస్ట్‌ఫర్నేస్ గ్యాస్‌తో నడిచే టాప్ రికవరీ టర్బైన్ ద్వారా 14 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌లో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన నీడో ప్రాజెక్ట్‌లో సింటర్మిషన్ ద్వారా విడుదలయ్యే వేడిమి నుంచి 20.6 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. మొదటి త్రైమాసికంలో రూ. 2661 కోట్ల టర్నోవర్‌ను, ఎగుమతుల్లో 7% వృద్ధిని సాధించడం విశేషం.