న్యూఢిల్లీ: భారత్ క్రూడ్ స్టీల్ (ద్రవ ఉక్కు ఘనీభవనం స్థితి. కడ్డీలు, ఫినిష్డ్, సెమీ ఫినిష్ట్ స్టీల్ ప్రొడక్టŠస్ పరిగణనలోకి తీసుకుంటారు) ఉత్పత్తి 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4 శాతం పెరిగి, 125.32 మెట్రిక్ టన్నులకు ఎగసింది. 2021– 22లో ఈ ఉత్పత్తి పరిమాణం 120.29 ఎంటీలు. వార్షిక ప్రాతిపదికన విభాగాల వారీగా చూస్తే..
► ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి 6.77 శాతం పెరిగి 121.29 మెట్రిక్ టన్నులకు చేరింది.
► ఇందుల్లో ఒక్క దేశీయ వినియోగ స్టీల్ ఉత్ప త్తి 12.69 శాతం పెరిగి 105.75 ఎంటీల నుంచి 119.17 మెట్రిక్ టన్నులకు ఎగసింది. ఈ విభాగంలో భారీ ఉత్పత్తి పెరుగుదలకు మౌ లిక రంగం క్రియాశీలత మెరుగుదల కారణ.
► స్టీల్ ఎగుమతులు 50 శాతం పడిపోయి 13.49 మెట్రిక్ టన్నుల నుంచి 6.72 మెట్రిక్ టన్నులకు చేరాయి. దిగుమతులు 29 శాతం పెరిగి 4.67 మెట్రిక్ టన్నుల నుంచి 6.02 మెట్రిక్ టన్నులకు ఎగశాయి. పిగ్ ఐరన్ ( దుక్క ఇనుము) ఉత్పత్తి 6.53 శాతం తగ్గి 6.26 మెట్రిక్ టన్నుల నుంచి 5.85 మెట్రిక్ టన్నులకు క్షీణించింది.
భారత్ క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 4 శాతం వృద్ధి
Published Mon, Apr 24 2023 3:59 AM | Last Updated on Mon, Apr 24 2023 3:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment