న్యూఢిల్లీ: దేశీయంగా ముడి ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల నమోదైంది. తాజాగా వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. గతనెల్లో మొత్తం ఉత్పత్తి 8.934 మిలియన్ టన్నులు (ఎంటీ)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని 9.192 ఎంటీలతో పోల్చితే 2.8 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో 3.4 శాతం తగ్గిన సంగతి తెలిసిందే కాగా, వరుసగా రెండు నెలల పాటు ఉత్పత్తిలో క్షీణత నమోదైంది. ఇక అంతర్జాతీయంగా కూడా గత నెల్లో ఉక్కు ఉత్పత్తి ఒక శాతం తగ్గింది. అయితే, ఈ పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా మాత్రం నవంబర్‌లో 4 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. ఆ దేశం గత నెల్లో 80.287 ఎంటీ ఉత్పత్తిని నమోదుచేసింది. అమెరికా ఉత్పత్తి 2.2 శాతం తగ్గి 7.233 ఎంటీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment