cruise tours
-
విశాఖ టు సింగపూర్
విశాఖ సిటీ: ప్రపంచ పర్యాటక పటంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు లభించేలా అంతర్జాతీయ క్రూయిజ్ పర్యాటకం మార్చిలో ప్రారంభమవుతుందని విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు వెల్లడించారు. విశాఖ పోర్టు ఆవిర్భవించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టు అతిథి గృహంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పోర్టు ప్రగతిని వివరించారు. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం ద్వారా విశాఖ ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరుకుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్‌కు క్రూయిజ్ నడిపేందుకు లిట్టోరల్ క్రూయిల్ లిమిటెడ్ సంస్థలో ఎంవోయు కుదుర్చుకున్నట్లు తెలిపారు. సుమారు రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్, శ్రీలంక, మాల్దీవులకు క్రూయిజ్ సర్విసులు నిర్వహించేందుకు లిట్టోరల్ సంస్థ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ నుంచి థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్‌లకు కూడా క్రూయిజ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. 80 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా లక్ష్యం పోర్టు గత ఆర్థిక సంవత్సరంలో 74 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ 31వ తేదీ నాటికి 60 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా..వచ్చే మార్చి నాటికి పోర్టు చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో 80 మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కేవలం ఆదాయార్జనపైనే కాకుండా..జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ.. ఆధునికీకరణ, యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తూ.. నాణ్యతపై దృష్టి పెట్టినట్లు వివరించారు. కార్బన్ రహిత పోర్టుగా.. విశాఖ పోర్టును కార్బన్ రహితంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దేశంలోనే కేవలం సోలార్ పవర్లో నిర్వహిస్తున్న ఏకైక పోర్టుగా గుర్తింపు పొందిందన్నారు. ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్‌ప్లాంట్‌తో విద్యుత్ అవసరాలలో స్వయం సంమృద్ధిని సాధించగా..మరో 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారీ స్థాయిలో 5.65 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధి ♦ శీఘ్ర సరకు రవాణా కోసం రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధిపై దృష్టి ♦ ప్రస్తుతం విశాఖ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా 43 శాతం, ♦ రైలు ద్వారా 26 శాతం, పైప్‌లైన్ ద్వారా 21 శాతం, ♦ కన్వేయర్ల ద్వారా 10 శాతం సరకు రవాణా ♦ రైలు ద్వారా 60 శాతం రవాణా చేయాలన్న లక్ష్యంతో విద్యుత్‌లైన్లతో రైలు మార్గం అభివృద్ధి ♦ ఆటంకం లేకుండా పోర్టు నుంచి రోడ్డు మార్గాల ద్వారా సరకు రవాణాకు రూ.501.65 కోట్లతో ప్రత్యేక రోడ్డు అభివృద్ధి ♦ కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ప్రస్తుతమున్న నాలుగు లైన్ల రోడ్డును 10 లైన్లకు విస్తరణ ♦ 20 శాతం సరకు రవాణాకు కోస్టల్ షిప్పింగ్‌కు చర్యలు 2030 నాటికి పూర్తి ల్యాండ్ లార్డ్ పోర్టుగా... ♦ వచ్చే ఐదేళ్లలో పీపీపీ టెర్మినల్స్ ద్వారానే మొత్తం సరకులో 75 శాతాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు ♦ 2030 చివరి నాటికి 100 శాతం కార్గో రవాణా పీపీపీ టెర్మినల్స్ ద్వారానే నిర్వహించాలని లక్ష్యంగా ♦ 2030 నాటికి విశాఖపట్నం పోర్టు పూర్తి ల్యాండ్ లార్జ్ పోర్టుగా మార్పు ♦ అసెట్ లైట్ మోడల్ విధానంలో పీపీపీ పద్ధతిలో మూడు ప్రాజెక్టులకు శ్రీకారం ♦ డబ్ల్యూ క్యూ 7, 8 బెర్తులు ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6 బెర్త్ యంత్రీకరణ పనులు ♦ మరో బెర్త్ ఈక్యూ 6 యంత్రీకరణ పనులను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు రంగం సిద్దం ♦ ఒకవైపు పోర్టు అభివృద్ధిపైనే కాకుండా కాలుష్య నియంత్రణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి ♦ ఇందులో భాగంగా రూ.35 కోట్లతో అల్లూరి సీతారామరాజు జంక్షన్ నుంచి మారియట్ హోటల్ వరకు రోడ్డు అభివృద్ధికి పోర్టు బోర్డు అంగీకారం. ♦ సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు -
క్రూయిజ్ విహారంలో భారతీయులే ముందు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి గతేడాది 14.4 లక్షల మంది సింగపూర్‌ను పర్యటించారు. 2017తో పోలిస్తే సంఖ్య పరంగా ఇది 13 శాతం అధికం. 2015 నుంచి పర్యాటకుల సంఖ్య ఒక మిలియన్ మార్కును దాటుతోందని సింగపూర్ టూరిజం బోర్డు భారత్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఆసియా డైరెక్టర్ జి.బి.శ్రీధర్ తెలిపారు. మంగళవారమిక్కడ జరిగిన సింగపూర్ టూరిజం బోర్డు రోడ్ షో సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పర్యాటకుల పరంగా చైనా, ఇండోనేíసియా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. కొన్నేళ్లపాటు ఇండియా తన ర్యాంకును కొనసాగిస్తుంది. ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి పర్యాటకుల సంఖ్య 12 శాతం వృద్ధి నమోదైతే, మెట్రోల నుంచి 8 శాతంగా ఉంది. ఇక క్రూయిజ్‌లో విహరించేవారిలో అత్యధికులు భారతీయులే. 2018లో 1.6 లక్షల మంది క్రూయిజ్‌లో ప్రయాణించారు. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం అధికం. 16 భారతీయ నగరాల నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో 10 దక్షిణాది నగరాలు కావడం విశేషం. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వీటిలో ఉన్నాయి’ అని వివరించారు. -
లాహిరి లాహిరి లాహిరిలో..
ఇప్పటి వరకు విమాన సర్వీసులు, రైలు, రోడ్డు మార్గాల్లో పర్యాటకులకు జాతీయ, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను అందిస్తోన్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తొలిసారి క్రూయిజ్ టూర్‌కు శ్రీకారం చుట్టింది. విలాసవంతమైన నౌకలో సముద్రయానం. భోజనం, వసతి, స్విమ్మింగ్‌పూల్, బార్, రెస్టారెంట్ వంటి సదుపాయాలతో విదేశాలను చుట్టివచ్చే అద్భుత అవకాశాన్ని కల్పించింది. పర్యాటక ప్రియుల మదిని దోచేలా రూపొందించిన ఈ టూర్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని కోసం ఇప్పటి నుంచే బుకింగ్ సదుపాయాన్ని కల్పించారు. మొత్తం 12 రాత్రులు, 13 ఉదయాల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుంది. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్ నుంచి ‘నార్వేజియన్ గేట్‌వే’నౌకలో బయలుదేరి వివిధ దేశాల్లో పర్యటిస్తూ తిరిగి కోపెన్‌హాగెన్‌కు చేరుకుంటారు. ఇందుకోసం నగరవాసులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి విమానంలో దుబాయ్ మీదుగా కోపెన్‌హాగెన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. ఇందుకోసం ఐఆర్సీటీసీ మొత్తం ఏర్పాట్లు చేస్తోంది. కోపెన్‌హాగెన్ నుంచి బయలుదేరి వెళ్లే క్రమంలో వచ్చే వివిధ దేశాలను సందర్శిస్తారు. ఆయా నగరాల్లో సైట్‌సీయింగ్ ఉంటుంది. కోపెన్‌హాగెన్ నుంచి బయలుదేరే నార్వేజియన్ గేట్‌వే జర్మనీ, పోలండ్, ఫిన్లాండ్, రష్యా, స్పెయిన్, స్వీడన్ల మీదుగా తిరిగి కోపెన్‌హాగెన్ చేరుకుంటుంది. జూన్ 24 నుంచి జూలై 7 వరకు కొనసాగే ఈ పర్యటన కోసం ఐఆర్సీటీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. – సాక్షి, హైదరాబాద్ పర్యటన ఇలా.. నార్వేజియన్ గేట్‌వే క్రూయిజ్ టూర్ ప్యాకేజీలోనే విమాన ప్రయాణం కూడా ఉంటుంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం (ఈకే 513)లో 24వ తేదీన ఢిల్లీ నుంచి దుబాయ్ చేరుకుంటారు. అదేరోజు అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ (ఈకే 151)లో బయలుదేరి మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో కోపెన్‌హాగెన్ చేరుకుంటారు. పర్యటన అనంతరం జూలై 5న (ఈకే 152) కోపెన్‌హాగెన్ నుంచి రాత్రికి దుబాయ్‌కి చేరుకొని అక్కడి నుంచి (ఈకే 510) జూలై 6 తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటారు. దీనికి అనుగుణంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణం ఉంటుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఐఆర్సీటీసీ అధికారులు పర్యవేక్షిస్తారు. అలాగే ఢిల్లీలో హోటల్లో ఉచిత బస సదుపాయం కూడా కల్పిస్తారు. ధరల వివరాలు.. ఫిబ్రవరి 28 వరకు బుకింగ్ చేసుకొనే వారికి ఒక్కరికి రూ. 4,83,630 చొప్పున, ఇద్దరికి కలిపి బుక్ చేసుకొంటే ఒక్కొక్కరికి రూ. 2,95,817 చొప్పున నార్వేజియన్ గేట్‌వే క్రూయిజ్ ప్యాకేజీ ఉంటుంది. ముగ్గురికి కలిపి బుక్ చేసుకొంటే ఒక్కొక్కరికి రూ. 2,63,634 చొప్పున ఉంటుంది. పిల్లలకు రూ. 2,43,516 చొప్పున చార్జీలు విధించారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 25న ఉదయం 5 గంటలకు కోపెన్‌హాగెన్ పోర్టు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బెర్లిన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోజు వరుసగా పోలండ్, ఫిన్లాండ్, రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్, స్వీడన్ దేశాల్లో పర్యటించి జూలై 4న తిరిగి కోపెన్‌హాగెన్ చేరుకుంటారు. స్విమ్మింగ్‌పూల్,రెస్టారెంట్, బార్.. నార్వేజియన్ గేట్‌వే నౌకలో మొత్తం 30 బాల్కనీలు ఉంటాయి. సువిశాలమైన సముద్రాన్ని వీక్షిస్తూ ప్రయాణం చేయవచ్చు. రెండు డైనింగ్ హాళ్లు, ఔట్‌డోర్ బఫెట్, స్విమ్మింగ్ పూల్, బార్, రెస్టారెంట్, కాఫీబార్, ఫిట్నెస్ సదుపాయం వంటివి ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్‌లో హాట్ టబ్స్ ఏర్పాటు చేస్తారు. ఇంటర్నెట్, వైఫై, స్పా, సెలూన్ సర్వీసులు, క్యాషినో, డైనింగ్ ఎంటర్టైన్మెంట్ వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. నచ్చిన సినిమాలు చూసే సౌకర్యం కూడా ఉంది. నౌకలోంచి ఆయా దేశాల్లోకి ప్రవేశించినప్పుడు రోడ్డు మార్గాల్లో సిటీ టూర్ ఏర్పాటు చేస్తారు. తిరిగి రాత్రికి నార్వేజియన్ గేట్‌వేకు చేరుకొని బస చేసేవిధంగా ఈ పర్యటనను రూపొందించినట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. -
ఇక్కడ మండలి కాక.. అక్కడ కెవ్వుకేక..!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల్లో టెన్షన్ తీవ్రమవుతోంది. అధిక ఓట్లు సాధించి విజయం దరిచేరేందుకు అభ్యర్థులు వ్యయప్రయాసలు పడుతుండగా.. నిర్ణయాన్ని వెల్లడించే ఓటర్లు మాత్రం విహారయాత్రల్లో మునిగితేలుతున్నారు. ఓటేసే వరకు సభ్యులు గాడితప్పకుండా ఉండేందుకు అభ్యర్థులు ఏకంగా క్యాంపులు ఏర్పాటుచేసి వారికి పూర్తిస్థాయిలో ఆహ్లాదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లు విహార యాత్రలు సాగిస్తూ.. విందు, వినోదాల్లో ఉబ్బితబ్బిపోతున్నారు. అక్కడి అనుభూతుల్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ స్నేహితులతో పంచుకుంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు ఎంపీటీసీలు మైసూర్ ప్యాలెస్‌ను సందర్శించారు. అనంతరం అక్కడ దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయగా.. క్షణాల్లో వైరల్ అయ్యాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా -
కొత్త పెళ్లికొడుకుల్లా మోదీ, బాబు, కేసీఆర్...
- విహార యాత్రపై సీపీఐ నేత నారాయణ సాక్షి, హైదరాబాద్: కొత్త పెళ్లి కొడుకుల్లా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ విహార యాత్రలు చేస్తున్నారని సీపీఐ నేత కె.నారాయణ ఎద్దేవా చేశారు. సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ప్రజా సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీని పెద్ద ఎత్తున నిర్భందాన్ని ప్రయోగించడం.. అరెస్ట్‌లు సాగించడాన్ని ఖండించారు. చలో అసెంబ్లీ సందర్భంగా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలుచేశారన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఈ నెల ఒకటి నుంచి 6వరకు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తమ నిరసనల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోతే గోడౌన్లలోని అక్రమ నిల్వలను బయటకు తీసుకొస్తామని చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. 22న ఏపీ రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. 8న చలో అసెంబ్లీ: హైదరాబాద్ పాత నగరంలో కూడా మెట్రోరైలు పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ 8న చలో అసెంబ్లీని నిర్వహిస్తున్నట్లు సీపీఐ నగర దక్షిణ జోన్ కమిటీ ప్రకటించింది. చలో అసెంబ్లీ పోస్టర్‌ను కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, ఈటి నర్సింహ, సీపీఎం కార్యదర్శి తమ్మినేని విడుదల చేశారు. -
బెస్ట్ నష్ట నివారణ చర్యలు
* కలెక్షన్లు లేని బస్సులను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం * మోనో ప్రయాణికులతో నెలకోసారి చర్చ * పాఠశాలల్లోనే పాస్‌ల పంపిణీకి ప్రయత్నం సాక్షి, ముంబై: బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు అధికారులు నడుం బిగించారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రవేశపెట్టాల్సిన పథకాలపై స్థాయి సమితిలో చర్చలు జరిపారు. ముఖ్యంగా కలెక్షన్లు లేని ఏసీ బస్సులను పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు, విహార యాత్రలకు అద్దెకు ఇవ్వాలని ప్రతిపాదించారు. గత కొంత కాలంగా బెస్ట్ నష్టాల్లో నడుస్తోంది. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో అనుకున్నంత మేర ఆదాయం రావడం లేదు. దీంతో కలెక్షన్లు లేని కొన్ని రూట్లలో బస్సులు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదాయంతోపాటు ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు అధికారుల చేపడుతున్నారు. ఇందుకోసం మెట్రో, మోనో రైలు ప్రయాణికులతో నెలకు ఒకసారి భేటీ కావాలని నిర్ణయించారు. వారిచ్చే సలహాలు, సూచనలను విని ఆ తరువాత బస్సు రాకపోకల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. మెట్రో, మోనో రైలు ప్రయాణికులు అధిక శాతం బెస్ట్ బస్సుల కోసం వేచిచూడడం లేదు. స్టేషన్ బయట అందులో బాటులో ఉన్న షేర్ ఆటోలు, ట్యాక్సీలలో వెళుతున్నారు. దీనికి బస్ చార్జీల పెంపు కారణంగా కనిపిస్తోంది. పెంచిన చార్జీల వల్ల బెస్ట్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య సగానికి తగ్గిపోగా.. లోకల్ రైళ్లలో ఏడాది కాలంలో మూడు కోట్లకు మందికిపైగా పెరిగిపోయారు. సీజన్ పాస్ చార్జీలు కూడా దాదాపు రెట్టింపు పెంచడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో పాఠశాల ప్రాంగణంలోకి వెళ్లి అక్కడే విద్యార్థులకు పాస్‌లు జారీచేయాలని నిర్ణయించారు. అందుకు 10 పాఠశాలల యాజమాన్యాలు సానుకూలంగా వ్యవహరించినట్లు బెస్ట్ జనరల్ మేనేజరు జగదీశ్ పాటిల్ చెప్పారు. వృథాగా పడి ఉన్న బెస్ట్ డిపో స్థలాలను లీజుకిచ్చే అంశంపై కూడా చర్చలు జరిపారు. అందులో హోటల్, టూరిస్టు ఏజంట్లకు, క్రూజ్ సఫారీ తదితర వ్యాపారాలకు అద్దెకు ఇవ్వాలని చర్చలు జరిపారు. -
స్మాల్ బ్రేక్ కావాలి గురూ!
నటననే వృత్తి చాలా సులభమనే అభిప్రాయం చాలా మందికి ఉంటోంది. దిగితే గాని లోతు తెలియదన్నట్టు అన్ని వృత్తుల్లోలాగానే ఇందులోనూ సాదక బాధకాలు ఎన్నో ఉంటాయన్న విషయం తక్కువ మందికే తెలుస్తుంది. నిత్యం స్టార్ట్, కెమెరా, యాక్షన్ అనే మాటలు వింటూ, ముఖాలు మాడే లైటింగ్‌లో నటిస్తూ టేక్ ఒన్, టేక్ టు అంటూ విసిగిపోకుండా నటించడం అంత ఆషామాషీ కాదు. ప్రముఖ తారలైతే బిజీ షెడ్యూల్‌తో ఎడతెరపి లేకుండా నటిచేస్తుంటారు. అలాంటి వారు మధ్యలో విశ్రాంతి తీసుకోవడం సహజం. అది అవసరం కూడా. అలాగే నటి తమన్న నెలరోజుల పాటు షూటింగ్‌లకు దూరంగా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారట. చాలామంది నటీనటులు వేసవి సమయాల్లో ఊటీ లాంటి శీతల ప్రాంతాల్లో విహార యాత్రలు చేస్తుంటారు. నటి తమన్న మాత్రం అక్టోబర్ నెలను విశ్రాంతి దినాలుగా ప్రకటించేశారు. ఈ మధ్య తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా గడిపిన తమన్నకు కుటుంబ సభ్యులను కూడా కలుసుకునే సమయం లేకపోయిందట. బంధుమిత్రుల శుభ కార్యాల్లోనూ పాల్గొనలేకపోయారట. దీంతో ఈ బ్యూటీ ఈ నెలంతా తన కుటుంబ సభ్యులతో గడిపేయాలనే నిర్ణయానికి వచ్చిందట. బంధువులను ఆహ్వానించి వారికి విందు ఏర్పాటు చేయడం, వాళ్ల ఇళ్లకు వెళ్లి గడపడం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనననున్నారట. అలాగే మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనల్లో మాత్రం నటిస్తారట. మళ్లీ నవంబర్లోనే సినిమా షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.