Cruisers
-
యూఎస్ మార్కెట్లకు కోవిడ్-19 ఫీవర్
కొద్ది రోజులుగా కోవిడ్-19 కేసులు తిరిగి రికార్డ్ స్థాయిలో పెరుగుతుండటంతో సోమవారం యూఎస్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీనికితోడు కరోనా వైరస్ కారణంగా నీరసించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీ(స్టిములస్)పై కాంగ్రెస్‌లో అనిశ్చితి కొనసాగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచింది. వెరసి సోమవారం యూఎస్ మార్కెట్లు గత నాలుగు వారాలలోనే అత్యధికంగా 2.3-1.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. డోజోన్స్ 650 పాయింట్లు(2.3 శాతం) క్షీణించి 27,685కు చేరగా.. ఎస్అండ్పీ 64 పాయింట్లు(1.9 శాతం) నష్టంతో 3,401 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 189 పాయింట్లు(1.65 శాతం) కోల్పోయి 11,359 వద్ద స్థిరపడింది. ఎన్నికల్లోగా.. వచ్చే నెల మొదట్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్యాకేజీకంటే ఇది అధికంకాగా.. కొన్ని రాష్ట్రాలు, వర్గాలకు పెలోసీ అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు ట్రంప్ గతంలో ఆరోపించారు. ఈ ప్యాకేజీపై రిపబ్లికన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ భారీ స్టిములస్కు తాను సిద్ధమేనంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆర్థిక మంత్రి స్టీల్ ముచిన్‌తో పెలోసీ నిర్వహిస్తున్న చర్చలు కొనసాగుతూనే ఉండటంతో సెంటిమెంటుకు దెబ్బతగిలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఎన్నికలలోగా ప్యాకేజీకి ఆమోదముద్ర లభించగలదని పెలోసీ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవల రోజువారీ కోవిడ్-19 కేసులు దాదాపు లక్షకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు వివరించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీలలో తిరిగి కోవిడ్-19 కేసులు ఉధృతంకావడంతో సోమవారం యూరోపియన్ మార్కెట్లు సైతం 2-3 శాతం మధ్య నష్టపోయాయి. నేలచూపులో.. ఈ వారంలో టెక్ దిగ్గజాలు, యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ తదితరాలు క్యూ3(జులై- సెప్టెంబర్) ఫలితాలు వెల్లడించనున్న సంగతి తెలిసిందే. కాగా.. సోమవారం ప్రధానంగా ట్రావెల్ సంబంధ రంగాలు నీరసించాయి. ఎయిర్‌లైన్ కౌంటర్లలో యునైటెడ్, అమెరికన్, డెల్టా, సౌత్‌వెస్ట్ 7-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. క్రూయిజర్ కంపెనీలలో రాయల్ కరిబియన్ 10 శాతం, కార్నికాల్ కార్ప్ 9 శాతం చొప్పున కుప్పకూలాయి. కోవిడ్-19 ప్రభావం అంచనాల కంటే అధికకాలం కొనసాగవచ్చని ప్రత్యర్థి కంపెనీ ఎస్ఏపీ తాజాగా పేర్కొనడంతో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ కార్ప్ 4 శాతం బోర్లా పడింది. రికవరీ ఆలస్యం కారణంగా మధ్యకాలానికి లాభాల అంచనాలను తొలగిస్తున్నట్లు ఎస్ఏపీ పేర్కొంది. ఇదేవిధంగా త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో హాస్బ్రో ఇంక్ 9.5 శాతం పడిపోయింది. అయితే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, వీడియో కమ్యూనికేషన్ సేవల కంపెనీ జూమ్, వీడియో గేమ్స్ సంస్థ యాక్టివిజన్ బిజార్డ్ స్వల్ప లాభాలతో నిలదొక్కుకోవడం గమనార్హం! -
యూఎస్ మార్కెట్లు అప్- క్రూయిజర్ షేర్ల స్పీడ్
దాదాపు మూడు వారాల తరువాత శుక్రవారం యూఎస్ మార్కెట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎగశాయి. డోజోన్స్ 359 పాయింట్లు(1.35%) పెరిగి 27,174 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 52 పాయింట్ల(1.6%) లాభంతో 3,298 వద్ద నిలిచింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 241 పాయింట్లు(2.3%) జంప్‌చేసి 10,914 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ఈ వారం నికరంగా డోజోన్స్ 1.8 శాతం నష్టపోగా.. ఎస్అండ్పీ 0.6 శాతం నీరసించింది. అయితే 4 వారాల నష్టాలకు చెక్ పెడుతూ నాస్డాక్ మాత్రం 1.1 శాతం పుంజుకుంది. ఇటీవల కరెక్షన్ బాటలో సాగుతున్న మార్కెట్లు వరుసగా నాలుగో వారం నష్టాలతో ముగిశాయి. తద్వారా 2019 ఆగస్ట్ తదుపరి అత్యధిక కాలం మార్కెట్లు వెనకడుగుతో నిలిచినట్లయ్యింది. ఆశావహ అంచనాలు వచ్చే వారం హౌస్ డెమక్రాట్లు ప్రతిపాదిస్తున్న 2.4 ట్రిలియన్ డాలర్ల ఉపశమన ప్యాకేజీపై వోటింగ్ చేపట్టనున్నారు. నిరుద్యోగులకు లబ్దిని పెంచడంతోపాటు.. నష్టాలకు లోనవుతున్న ఎయిర్‌లైన్స్‌కు ఆర్థిక మద్దతు అందించేందుకు ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు రిపబ్లికన్లు ప్రతిపాదించిన ప్యాకేజీకంటే అధికంకావడం విశేషం! దీంతో సెంటిమెంటు బలపడగా.. టెక్నాలజీ దిగ్గజాలలో షార్ట్ కవరింగ్ మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. క్రూయిజర్ దూకుడు వారాంతాన ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్ 3.8 శాతం లాభపడగా.. అమెజాన్ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్ 2.3 శాతం, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్ 2.1 శాతం చొప్పున ఎగశాయి. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 5 శాతం జంప్‌చేసింది. క్రూయిజర్ నిర్వాహక కంపెనీలు కార్నివాల్ 9.7 శాతం, నార్వేజియన్ క్రూయిజ్ లైన్ 13.7 శాతం, రాయల్ కరిబియన్ 7.7 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ నెలలో వీక్ మార్కెట్లకు దన్నునిస్తున్న ఫాంగ్ స్టాక్స్ సెప్టెంబర్‌లో వెనకడుగు వేస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ యాపిల్ 13 శాతం పతనంకాగా.. మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్(గూగుల్), నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఫేస్బుక్ సుమారు 8 శాతం చొప్పున క్షీణించాయి. దీంతో ఈ నెలలో మార్కెట్లు కరెక్షన్ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్ 4.4 శాతం, ఎస్అండ్పీ 5.8 శాతం చొప్పున పతనంకాగా.. నాస్డాక్ మరింత అధికంగా 7.3 శాతం తిరోగమించడం గమనార్హం! -
యుద్ధ నౌకలో విజ్ఞాన యాత్ర
నడిసంద్రంలో విన్యాసాల హోరు నావికాదళ సత్తా చాటేలా ప్రదర్శనలు విద్యార్థులకు విజ్ఞానం.. వినోదం ఘనంగా సముద్రంలో ఒక రోజు ఒకటి కాదు.. రెండు కాదు.. శత్రుభీకరమైన ఆరు యుద్ధనౌకలు.. వాటికి తోడుగా ఓ సబ్‌మెరైన్.. హెలికాప్టర్లు.. యుద్ధ విమానాలు.. అవి చేసిన విన్యాసాలు.. సమర సన్నద్ధత ప్రదర్శనలు.. రెస్క్యూ ఆపరేషన్లు.. వెరసి నడిసంద్రంలో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించారుు. వేలాది విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు విజ్ఞానం.. వినోదం అందించారుు. నేవీడే ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన డే ఎట్ సీ(సముద్రంలో ఒక రోజు) కార్యక్రమం గగుర్పాటు కలిగించింది. ప్రతినిధి, విశాఖపట్నం: యుద్ధ నౌకల బారులు.. ఆరుుల్ ట్యాంకర్ కమ్ వార్‌షిప్ ఐఎన్ఎస్ శక్తి నౌక, సబ్‌మెరైన్ సింధువీర్.. అదనంగా హైస్పీడ్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌లు టి 36, టి 37, టి38, టి39.. నడిసంద్రంలో వేగంగా వెళ్తుండగా.. గగనతలంలో రెండు యుద్ధ విమానాలు. మూడు సెర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్లు. మరో రెండు రెండు హాక్ ఫైటర్ ఎరుుర్క్రాఫ్ట్లు... ప్రదర్శించిన అద్భుతమైన విన్యాసాలకు నడిసంద్రమే వేదికై ంది. నగరంలోని వివిధ పాఠశాలలతోపాటు, కోరుకొండ సైనిక్ స్కూల్, భువనేశ్వర్‌లోని సైనిక్ స్కూళ్లకు చెందిన సుమారు రెండున్నర వేలమంది విద్యార్థులు, నగరంలోని సీనియర్ సిటిజన్లు, మీడియా ప్రతినిధులను నేవీ అధికారులు నౌకల్లో విశాఖ తీరం నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలోకి తీసుకువెళ్లారు. ఉదయం 9 గంటలకు మొదలైన ప్రయాణం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మధ్యలో సుమారు ఐదుగంటల పాటు ఏకబిగిన సాగిన విన్యాసాలు విద్యార్ధులు, చూపరులను సంద్రమాశ్చర్యాల్లో ముంచెత్తారుు. ►యుద్ధనౌకలు వరుసగా ఒకదాని వెంట ఒకటి.. కొంత దూరం తర్వాత ఐదు యుద్ధ నౌకలు పక్క పక్కనే ఒకే వేగంతో ప్రయాణించడం, ఎడమ వైపు సత్పుర.. కుడి వైపు శివాలిక్ .. మధ్యలో శక్తి యుద్ధనౌక స్థిరవేగంతో ప్రయాణిస్తూ ఒకదాని నుంచి మరొకటి డీజిల్ నింపుకోవడం, సత్పుర, శివాలిక్‌ల నుంచి కేవలం తాడు సాయంతో నావికులు శక్తి నౌకలోకి ప్రవేశించడం, పై నుంచి వేగంగా వచ్చిన హెలికాప్టర్ నుంచి ఓ వ్యక్తి సముద్రంలో ఉన్న హైస్పీడ్ బోటులోకి దిగడం.. వంటి అరుదైన విన్యాసాలు విద్యార్థులు, చూపరులను అబ్బురుపరిచారుు. నేవీ సత్తా, విపత్కర, యుద్ధ సమయాల్లో అది స్పందించే తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. ►విపత్తులు, యుద్ధాల సమయంలో నావికాదళం ఏవిధంగా స్పందిస్తుంది.. వేగవంతమైన మోటారు పడవలు(ఫాస్ట్ ఎటాక్ క్రాఫ్ట్‌లు ) సముద్రంలో ఎలా వెళ్తారుు, యుద్ధ నౌకలు ప్రయాణిస్తుండగానే వాటిలో ఇంధనాన్ని ఎలా నింపుకుంటారు, శత్రు సైనికులు, ఉగ్రవాదులపై యుద్ధనౌకల్లో నుంచి అత్యాధునిక మెషిన్గన్లతో దాడి జరిపే తీరు.. నౌకాదళ హెలికాప్టర్లు సముద్రంలో జలాంతర్గాముల్ని ఏ విధంగా గుర్తిస్తారుు, యుద్ధ నౌకల్లో నావికులు ఒకదాని నుంచి మరో నౌకలోకి తాడు సాయంతో ఎలా వెళ్తారు. సముద్రంలో చిక్కుకుపోరుున వారిని హెలికాప్టర్ల ద్వారా ఏవిధంగా రక్షిస్తారు.. జలాంతర్గాముల రాకపోకలు ఎలా ఉంటాయన్న అంశాలు ప్రదర్శించారు. యుద్ధ నౌకలివే.. సముద్రంలోకి తీసుకువెళ్లేందుకు, యుద్ధ విన్యాసాలు చూపించేందుకు ఐఎన్ఎస్ శక్తి, శివాలిక్, సత్పుర, రణ్విజయ్, సుకన్య, కోరా, కాట్మా, కుంజర్ యుద్ధ నౌకలను వినియోగించారు. వీటితో పాటు సింధువీర్ జలాంతర్గామి పాల్గొంది. చేతక్, కమావ్-28, సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ అండ్ రెస్క్యూ విధానాన్ని ప్రదర్శించారు. అనంతరం రెండు హాక్ ఫైటర్ (అడ్వాన్స జెట్ ట్రైనర్) ఎరుుర్క్రాఫ్ట్లు, రెండు యుద్ధ విమానాలు డార్నియర్, పి8ఐ విన్యాసాలను ప్రదర్శించారు. పి8ఐ విమానాన్ని ఇటీవలే అమెరికా నుంచి కొనుగోలు చేసి బహుళార్ధ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నట్టు ఫ్లీట్ కమాండర్ బి.దాస్ గుప్తా వెల్లడించారు . -
ఫ్లీట్ రివ్యూ అంటే
విశాఖపట్నం : దేశంలోని యుద్ధ నౌకల పాటవాన్ని నిర్ధేశిత ప్రాంతంలో సమీక్షించే కార్యక్రమమే ఫ్లీట్ రివ్యూ. దేశ సార్వభౌమత్వవానికి అది ప్రతీకగా నిలుస్తుంది. ఫ్లీట్లోనే కాకుండా దేశ ప్రజలల్లోనూ అత్మవిశ్వాసాన్ని నెలకొల్పుతుంది. ఆ దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచ దేశాలకు తేటతెల్లం చేయడం దీనిలో అంశమైంది. దేశాధ్యక్షుని గౌరవార్థం నిర్వహించే ఈ నౌకా ప్రదర్శనలో ఆయనే సమీక్ష చేస్తారు. ఆయా దేశాలతో సత్సంబంధాలు నెరుపుతున్న దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు ఫ్లీట్‌లో పాల్గొనడంతో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూగా మారింది. భారత్ సైతం విదేశాల్లో జరిగే ఫ్లీట్ రివ్యూల్లో పాల్గొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా పలు దేశాల్లోనూ భారత యుద్ధనౌకలు పాల్గొన్నాయి. తొలిసారిగా... ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పిఎఫ్ఆర్) తొలిసారిగా దేశాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ గౌరవార్దం 1953 అక్టోబర్ 19న ముంబయ్‌లో జరిగింది. అలాగే నాటి దేశాధ్యక్షులు రాధాకృష్ణన్, వివి గిరి, అహ్వాద్, జ్ఞాని జైల్‌సింగ్, ఆర్.వెంకటరామన్‌ల గౌరవార్దం ముంబయ్‌లో జరిగాయి. కె.ఆర్.నారాయణన్ దేశాధ్యక్షునిగా పదవీకాలంలో 2001 ఫిబ్రవరి 12న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను భారత్ విజయవంతంగా నిర్వహించింది. అనంతరం అబ్దుల్ కలాం హయాంలో 2006 ఫిబ్రవరి 13న తొలిసారిగా పీఎఫ్ఆర్ విశాఖ తీరంలోనే జరిగింది. ప్రతిభాపాటిల్ గౌరవార్థం 2011 డిసెంబర్ 20న ముంబయ్ వేదికగా ఫ్లీట్ రివ్యూ జరిగింది. ప్రస్తుత దేశాధ్యక్షుడు ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్థం విశాఖలో ఐఎఫ్ఆర్ జరగనుంది. ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు దాదాపు 70 దేశాల నౌకలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల యుద్ధనౌకలు ఇక్కడికి చేరుకున్నాయి. పదిసార్లు... స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం భారత్ సైతం పదిసార్లు ఫ్లీట్ రివ్యూ నిర్వహించింది. వాటిలో పదిహేనేళ్ళ క్రితం ముంబయ్ తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఇదే తొలిసారి భారత్ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం. 29 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. దేశాధ్యక్షుని పదవీకాలంలో ఓసారి మాత్రమే ఈ రివ్యూ జరుగుతుంది. అలా భారత్‌లో పదిసార్లు ప్రెసిడెంట్ రివ్యూగా నిర్వహించారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ తూర్పు తీరంలో నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. విశిష్ట గౌరవం విశాఖలో తొలిసారిగా జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(2006)లో రక్షణ మంత్రిగా ప్రణబ్‌ముఖర్జీ హాజరయ్యారు. విశాఖలోనే తొలిసారిగా జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(2016)కి నేడు ఆయన దేశాధ్యక్షుని హోదాలో హాజరుకానుండడం మరో విశేషం. ఇప్పటి వరకు ఫ్లీట్ రివ్యూల్లో ఇలాంటి గౌరవం ఇదే తొలిసారి. సమీక్షలో... ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూల్లో పలు యుద్ధ నౌకలు పాల్గొంటాయి. ఇందులో ఒక నౌకను ప్రెసిడెంట్ యాచ్‌గా పేర్కొంటారు. ఆ నౌకను అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే అన్ని దేశాల జెండాలతో అలంకరిస్తారు. గౌరవ సూచకంగా ఆ నౌక చుట్టూ వలయాకారంలో ఆయా దేశాల నౌకలు ఫార్మేషన్తో ముందుకు కదులుతారయి. లంగర్ వేసిన విదేశీ యుద్ధ నౌకలు పలు ఖండాలకు చెందిన దేశాల యుద్ధ నౌకలు విశాఖ తీరం వైపు కదులుతున్నాయి. కెనడా, యూఎస్ఏ, కొలంబియా, ఆంటిగ్వా, బ్రెజిల్, పెరూ, చిలీ, స్వీడన్, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, తునిషియా, సెనెగల్, సౌతాఫ్రికా, మెంజాబిక్, టాంజానియా, కెన్యా, సూడాన్, టర్కీ, ఈజిప్ట్, బెహ్రాన్, సౌదీఅరేబియా, ఓమన్, టుర్కుమెనిస్తాన్, ఇజ్రాయిల్, శ్రీలంక, మాల్దీవులు, మారిషన్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, ఆస్ట్రేలియా, వియత్నాం, రష్యా, సౌత్‌కొరియా, జపాన్, బ్రనయ్ తదితర దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు సముద్ర, గగనతలం విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. చివరిరోజు టాల్ షిప్స్ తెరచాపలతో సెయిల్ ఇన్ కంపెనీగా విశాఖ నుంచి చెన్నయ్ తీరంవైపు కదలనున్నాయి. ఫ్లీట్ రివ్యూలో ఇదో ప్రత్యేక ఆకర్షణ. భారత్‌లో 18వ శతాబ్దిలోనే భారత ఫ్లీట్ రివ్యూ 18వ శతాబ్దంలోనే జరిగినట్లు చరిత్ర చెబుతోంది. మరాటా నౌకాదళ శక్తిసామర్ద్యాల ప్రదర్శన మహారాజ్ శివాజీ ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటన్‌లో సెయిల్ ఫర్ వార్ సందర్భంగానూ, యూఎస్ఎలో గ్రేట్ వైట్ ఫ్లీట్ పేరిట తొలిసారిగా జరిగాయి.