CS Mahanthi
-
చివరి 5 గంటలు...సమైక్యాంధ్ర సీఎస్‌గా కృష్ణారావు
ఆదివారం రాత్రి 7 గంటలకు బాధ్యతలు స్వీకరణ నేడు ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా జె.వి.రాముడు నియామకం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బయ్యారపు ప్రసాదరావు హైదరాబాద్: రాష్ట్రం విడిపోవడానికి ఐదు గంటల ముందు సమైక్యాంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదివారం రాత్రి 7 గంటలకు బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని సీ బ్లాకులో పదవీ విరమణ చేయనున్న సీఎస్ మహంతి నుంచి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రానికి కేవలం ఐదు గంటల పాటు సీఎస్‌గా కొనసాగిరికార్డు సృష్టించినట్లైంది. ఒక రాష్ట్రానికి కేవలం ఐదు గంటల పాటు సీఎస్‌గా పనిచేసిన చరిత్ర ఇప్పటివరకూ ఎక్కడా లేదు. 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్.కృష్ణారావు సీసీఎల్ఏ కమిషనర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సమైక్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహంతి ఆదివారం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయటంతో.. కృష్ణారావుకు సమైక్యాంధ్రప్రదేశ్ సీఎస్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావును నియమిస్తూ సీఎస్ మహంతి ఆదివారమే మరో ఉత్తర్వును జారీ చేశారు. జూన్ 2వ తేదీ నుంచి ఐ.వై.ఆర్.కృష్ణారావు నియామకం అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన సీఎస్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కృష్ణారావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు నెలల కిందటే సీఎస్ కావాల్సింది... సీఎస్‌గా మహంతి పదవీ కాలం మూడు నెలల కిందటే ముగిసింది. అప్పుడే కృష్ణారావు సీఎస్ అవుతారని అందరూ భావించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పలనాపరమైన కొనసాగింపు కోసం కేంద్ర ప్రభుత్వం మహంతినే మరో నాలుగు నెలలు సీఎస్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడే కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహంతి ఈ నెలాఖరు వరకు సీఎస్‌గా కొనసాగేందుకు అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో నెల రోజుల ముందుగానే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. దీంతో కృష్ణారావుకు రాష్ట్రం విడిపోవటానికి ఐదు గంటల ముందు సమైక్యాంధ్రప్రదేశ్‌కు సీఎస్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా రాముడు రాష్ట్ర పోలీసు విభాగంలోని ఆపరేషన్స్ వింగ్ డీజీపీగా పని చేస్తున్న జాస్తి వెంకట రాముడును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 1981 బ్యాచ్‌కు చెందిన జె.వి.రాముడు ప్రస్తుతం ఆపరేషన్స్ డీజీపీ హోదాలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ నియామకం అన్నది ఆయా ప్రభుత్వాల సిఫారసు మేరకు యూపీఎస్సీ సిఫారసుల ఆధారంగా జరుగుతుంది. ఈ తంతు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్‌కు రాముడు తాత్కాలిక డీజీపీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో రాముడు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లతో పాటు పోలీసు విభాగంలో ఇతర కీలక పోస్టుల భర్తీపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీగా ఉన్న డాక్టర్ బయ్యారపు ప్రసాదరావును ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి టి.పి.దాస్‌ను ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డెరైక్టర్ జనరల్‌గా, ఆర్.పి.ఠాకూర్‌ను ఆ విభాగం అదనపు డెరైక్టర్ జనరల్‌గా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత డీజీపీ ప్రసాదరావుకు విచిత్రమైన అనుభవం ఎదురవుతోంది. సాధారణంగా డీజీపీగా పని చేస్తూ బదిలీ అయిన, పదవీ విరమణ పొందిన అధికారులు తమ బాధ్యతల్ని ఒక్కరికే అప్పగిస్తారు. కొత్తగా ఆ పోస్టులోకి వచ్చిన వారికి లేదా మరో డీజీ స్థాయి/అదనపు డీజీ స్థాయి వారికి అప్పగించి రిలీవ్ అవుతుంటారు. ప్రసాదరావు విషయం దీనికి పూర్తి భిన్నంగా ఉండనుంది. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి డీజీపీ కావడంతో ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తాత్కాలిక డీజీపీలుగా నియమితులైన జె.వి.రాముడు, అనురాగ్ శర్మలకు బాధ్యతలు అప్పగించనున్నారు. పోలీసు విభాగంలో హెచ్ఓడీలుగా (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్) వ్యవహరించే వారంతా ఈ రకంగానే బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఉంది. ఐదుగురు ఐపీఎస్‌ల డెప్యుటేషన్ పొడిగింపు రాష్ట్రంలో డెప్యుటేషన్‌పై పని చేస్తున్న ఐదుగురు ఐపీఎస్ అధికారుల డెప్యుటేషన్ కాలాన్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న జె.అజయ్‌కుమార్ (1997), డి.కల్పననాయక్ (1998), మహేందర్కుమార్రాథోడ్ (2001), ఎస్.గోపాల్‌రెడ్డి (1985), బి.బాలనాగదేవి (1995) డెప్యుటేషన్ కాలం ముగుస్తున్నప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. -
భవనాలు కేటాయిస్తూ జీవోలు జారీ
* కొద్దిసేపటికే నిలిపివేసిన సీఎస్ మహంతి * ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంతో పాటు రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలను కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 18 జీవోలను జారీ చేసింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో అధికారులు ఆ జీవోలను చూసేందుకు వీల్లేకుండా గోప్యం గా ఉంచారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలోనే జీవోలను నిలుపుదల చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించినట్లు అధికార వర్గాల సమాచారం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుండటం, ఇక్కడ కూడా రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నందున సీఎస్ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. సచివాలయంలోని ఏ,బీ,సీ,డీ బ్లాకులను గతంలో పేర్కొన్న విధంగానే తెలంగాణ ప్రభుత్వానికి, సౌత్ హెచ్, నార్త్ హెచ్, జె, కె, ఎల్ బ్లాకులను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయించడంతో పాటు ఏ అంతస్తులను ఏ శాఖలకు కేటాయించిందీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అలాగే రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సగం అంతస్తులను తెలంగాణ ప్రభుత్వానికి, మిగతా సగం అంతస్తులను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయించారు. -
సీఎస్ మహంతితో అనిల్ గోస్వామి భేటీ
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు జరుగుతున్న కసరత్తుపై అనిల్ గోస్వామి రెండోరోజు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ అయ్యారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డీజీపీ ప్రసాదరావు, ఇతర పోలీసు ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఉమ్మడి రాజధాని, శాంతి భద్రతలు, పోలీసుల పాత్రపై ఈ సందర్భంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. -
ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయి
మార్గదర్శకాల కమిటీ చైర్మన్ కమలనాథన్ ఉద్ఘాటన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనపై కేంద్ర హోంశాఖ సమీక్ష హాజరైన కమల్‌నాథన్, సీఎస్ మహంతి, రమేశ్, వెంకటేశం ‘స్థానికత’ ఏ ప్రాతిపదికపై తీసుకోవాలనే దానిపై మీమాంస మార్గదర్శకాల ఖరారుకు రెండు మూడు వారాల సమయం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీలో ఉద్యోగులకు ఆప్షన్లు తప్పనిసరిగా ఉంటాయని రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పా టైన కమిటీ చైర్మన్ కమలనాథన్ స్పష్టంచేశారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శక సూత్రాల రూపకల్పనపై కేంద్ర హోంశాఖ గురువారం ఢిల్లీలో సమీక్షించింది. ఈ సమీక్షకు కమలనాథన్తోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం సభ్యుడు పి.వెంకటేశం హాజరయ్యారు. భేటీ అనంతరం కమలనాథన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగుల పంపిణీ ఏ ప్రాతిపదికన ఉండాలి అనే మార్గదర్శక సూత్రాలు ఖరారు చేసేందుకు సమావేశమయ్యాం. ఇంకా ఖరారు కాలేదు. మరో రెండు మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. దాదాపు 52 వేల మంది ఉద్యోగులను పంపిణీ చేయాల్సి ఉంది. జూన్ 2కల్లా ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది...’’ అని చెప్పారు. ‘ఉద్యోగుల పంపిణీలో ఆప్షన్లు ఉంటాయా?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘తప్పనిసరిగా ఉంటాయి’ అని తెలి పారు. ‘ఈ విధివిధానాల ఖరారులో ఉద్యోగులతో చర్చలు జరుపుతారా?’ అని అడగ్గా.. ‘అధికారుల సంఘాలతో చర్చిస్తాం’ అని బదులిచ్చారు. ‘స్థానికత’ ప్రాతిపదికపై మల్లగుల్లాలు... ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రస్థాయి ఉద్యోగాలు 72 వేలు ఉండగా.. ఇందులో ఖాళీలు పోను ప్రస్తు తం 54 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిని.. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకుగల ప్రాతిపదికను, మార్గదర్శక సూత్రాలను ఖరారు చేయటంపై సమావేశంలో చర్చిం చారు. ఉద్యోగుల స్థానికత ఆధారంగా చేయాలా? ఉద్యోగ నియామకం సమయంలో ఉన్న అభ్యర్థి ప్రాంతాన్ని బట్టి విభజించాలా? స్థానికతకు ఏ ప్రాతిపదిక తీసుకోవాలి? ఏ ప్రాతిపదిక తీసుకుం టే ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? తదితర అంశాలపై చర్చించారు. అయితే.. ఉద్యోగ నియామకం సమయంలో ‘స్థానికత’కు ఉన్న నిర్వచనమే ఈ మార్గదర్శక సూత్రాల్లోనూ వర్తిస్తుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇదిలావుంటే.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సోమవారం (17వ తేదీ) హైదరాబాద్ వెళ్లనున్నారు. విభజన పనులకు సంబంధించి సమీక్ష జరుపనున్నారు. -
విభజన వేగం పెంచిన సీఎస్
-
కొత్త సీఎస్ ఎవరు ?
-
రేపటితో ముగియనున్న సీఎస్ పదవీ కాలం
-
సెక్రటేరియట్ లో ముగిసిన సీఎస్ భేటీ
-
వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సీఎస్ భేటీ
-
సీఎస్ మహంతీకి కాంగ్రెస్ పెద్దల ఫోన్
-
ఢిల్లీకి చీఫ్ సెక్రెటరీ మహంతి