రాష్ట్ర విభజనకు జరుగుతున్న కసరత్తుపై అనిల్ గోస్వామి రెండోరోజు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ అయ్యారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు జరుగుతున్న కసరత్తుపై అనిల్ గోస్వామి రెండోరోజు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ అయ్యారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డీజీపీ ప్రసాదరావు, ఇతర పోలీసు ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఉమ్మడి రాజధాని, శాంతి భద్రతలు, పోలీసుల పాత్రపై ఈ సందర్భంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.