cs rammohan rao
-
చెన్నైలో ఐటీ దాడులు : సీఎం అత్యవసర సమావేశం
-
చెన్నైలో ఐటీ దాడులు : సీఎం అత్యవసర సమావేశం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, ఆయన బంధువుల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖాధికారుల సోదాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మరో వైపు అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు, బంగారం దాచిన కేసులో పట్టుబడ్డ టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామ్మోహన్ రావు కొడుకుతో శేఖర్ రెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సీఎస్ రామ్మోహన్ రావు, ఆయన బంధువలు ఇళ్లపై జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో సీఎం అత్యవసర భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
గవర్నర్తో తమిళనాడు సీఎస్ భేటీ
చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన గురించి గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఆయన వివరించారు. గత పదిహేను రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలోనే ఉంటున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషయంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆందోళనలు బయలుదేరిన సమయంలో సీఎస్ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా వారి మధ్య జయ ఆరోగ్య పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ముఖ్యమంత్రి జయను ఆస్పత్రిలో పరామర్శించేందుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు జయ ఆరోగ్య పరిస్థితులు వివరించినట్లు సమాచారం.