చెన్నైలో ఐటీ దాడులు : సీఎం అత్యవసర సమావేశం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, ఆయన బంధువుల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖాధికారుల సోదాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
మరో వైపు అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు, బంగారం దాచిన కేసులో పట్టుబడ్డ టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామ్మోహన్ రావు కొడుకుతో శేఖర్ రెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సీఎస్ రామ్మోహన్ రావు, ఆయన బంధువలు ఇళ్లపై జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో సీఎం అత్యవసర భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.