Daily wager
-
పద్మశ్రీ మొగులయ్య దీనస్థితిపై కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్మనం మొగులయ్య రోజువారీ కూలీగా మారారు. హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Heart Breaking: Padma Shri Awardee Mogulaiah Now a Daily Wager.He says his monthly honorarium stopped, and although all respond positively, they do nothing.Mogulaiah was seen working at a construction site in Turkayamanjal near Hyderabad.Darshanam Mogulaiah was honoured… pic.twitter.com/Zru4If7h0x— Sudhakar Udumula (@sudhakarudumula) May 3, 2024 బీఆర్ఎస్ పాలనలో నెలకు 10,000 గౌరవ వేతనంతో జీవించారు మొగులయ్య. అయితే ప్రస్తుతం తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరూ ఏమీ చేయడం లేదని వాపోయారు. తన కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారని, తనతోపాటు కొడుకు మందుల కోసం నెలకు కనీసం రూ. 7,000 అవసరమవుతాయని చెప్పారు. అందుకే పొట్టకూటి కోసం కూలీపనులకు వెళ్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.'గత ప్రభుత్వం నాకు రూ. కోటి రూపాయలు గ్రాంట్‌గా ఉచ్చింది. ఆ డబ్బును నేను నా పిల్లల పెళ్లిళ్ల కోసం ఉపయోగించాను. తుర్కయంజాల్‌లో కొంత భూమిని కూడా కొన్నాను. ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను. అయితే సరిపడా డబ్బులు లేకు మధ్యలోనే ఆపేశాను. ఇక రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇప్పిటికీ పెండింగ్‌లోనే ఉంది. ' అని అన్నారు.కేటీఆర్ స్పందనతాజాగా మొగులయ్య దీనపరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. మొగులయ్య కుంటుంబాన్ని తను వ్యక్తిగతంగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. తన టీం సభ్యులు వెంటనే అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. Thanks Sucheta Ji for bringing this news to my attention I will personally take care of Sri Moguliah’s family. My team @KTRoffice will reach out to him immediately https://t.co/xV4NjXtik6— KTR (@KTRBRS) May 3, 2024 -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దినసరి కూలీ.. రూపాయి నాణేలతో..
గాంధీనగర్: డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దినసరి కూలీగా పనిచేసే ఒక యువకుడు బరిలోకి దిగుతున్నాడు. గాంధీ నగర్‌లోని ఓ మురికివాడలో నివసించే మహేంద్ర పాట్నీకి స్థానికులు మద్దతుగా నిలుస్తున్నారు. వీరి నుంచి ఇతడు రూ.10వేలు సేకరించాడు. ఈ డబ్బంతా రూపాయి నాణేల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి అతడు ఎన్నికల సంఘం వద్ద సెక్యూరిటీ డిపాజిట్ చేశాడు. దీంతో డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు. మహేంద్ర పాట్నీ గాంధీనగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఈ యువకుడు స్వతహాగా ఎన్నికల బరిలో దిగడానికి బలమైన కారణమే ఉంది. 2019లో ఓ హోటల్‌కు దారికోసం ఇతడు నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. 521 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో వారు గత్యంతరంలేక వేరేప్రాంతానికి తరలివెళ్లారు. కానీ అక్కడ విద్యుత్, నీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు లేవు. వీరిని పట్టించుకునే నాథుడు కూడా లేడు. దీంతో ఈ ప్రాంతంలో నివసించే వారంసా తమ ప్రతినిధిగా మహేంద్ర పాట్నీని నిలబెట్టారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకున్నా స్వతంత్రంగా బరిలోకి దింపుతున్నారు. 2010లోనూ మహెంద్ర పాట్నీ నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. మహాత్మా గాంధీకి అంకితం చేస్తూ ప్రభుత్వం నిర్మించిన దండీ కుటీర్ మ్యూజియం కోసం వీరి గుడిసెలను తొలగించారు. ఇప్పుడు మళ్లీ మరోమారు ఓ హోటల్‌కు దారికోసం వీరి కాలనీని కాళీ చేయించారు. దీంతో తమ సమస్యను పరిష్కరించునేందుకు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకుని మహేంద్ర పాట్నీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వద్దకు వస్తాయని, కానీ ఎన్నికల తర్వాత తమ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదని వీరు వాపోతున్నారు. అందుకే తామే స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. అయితే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటానని మహేంద్ర పాట్నీ చెబుతున్నాడు. తాము నివసించేందుకు శాశ్వతంగా ఒక స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నాడు. అంతేకాదు తమ దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తరచూ సీజ్ చేస్తున్నారని, తిరిగి వాటిని విడిచిపెట్టేందుకు రూ.2500-3000 తీసుకుంటున్నారని తెలిపాడు. ఇలా జరగకుండా ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 2, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న ప్రకటిస్తారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
రోజువారీ కూలీకి ఝలక్.. రూ. 37 లక్షలు ట్యాక్స్ కట్టాలంటూ నోటీసు!
పాట్నా: కూలీకి వెళ్తూ వచ్చే అరకొర డబ్బులతో బతుకు బండిని లాగుతోన్న వ్యక్తికి లక్షలు, కోట్లు అన్న మాట వినటమే గగనం. ఆదాయ పన్ను అంటే ఏంటో తెలిసే అవకాశం చాలా తక్కువ. అలాంటి వ్యక్తికి ఏకంగా రూ.37.5 లక్షలు ఆదాయ పన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపించింది. ఈ సంఘటన బిహార్‌లోని ఖజారియా జిల్లాలో జరిగింది. జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరిష్ యాదవ్ రోజువారీ కూలీ. రోజుకు రూ.500లు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. రూ.37.5 లక్షల పన్ను బకాయిలు ఉన్నాయని, వెంటనే చెల్లించాలంటూ ఇటీవలే ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందటంతో కంగుతిన్నాడు గిరిష్ యాదవ్. ఏం చేయాలో పాలుపోక.. పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ‘గిరిష్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఇది మోసానికి సంబంధించిన కేసుగా అర్ధమవుతోంది. ’ అని అలౌలి పోలీస్ స్టేషన్ ఎస్సై పూరేంద్ర కుమార్ తెలిపారు. బాధితుడి పాన్ నెంబర్‌పై జారీ అయిన నోటీసులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గతంలో గిరిష్ ఢిల్లీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వాడని, ఆ సమయంలో ఓ మధ్యవర్తి ద్వారా పాన్‌కార్డ్ కోసం ప్రయత్నించినట్లు చెప్పాడని వెల్లడించారు. ఆ తర్వాత ఆ మధ్యవర్తి కనిపించకుండా పోయినట్లు తెలిపాడన్నారు. గిరిష్‌కు వచ్చిన నోటీసులు రాజస్థాన్‌లోని ఓ కంపెనీకి సంబంధించినవిగా గుర్తించారు పోలీసులు. అయితే, తానెప్పుడూ రాజస్థాన్‌కు వెళ్లలేదని గిరిష్ వాపోయాడు. ఇదీ చదవండి: దళిత యువకుడిపై దాడి.. గ్రామ సర్పంచ్ అరెస్ట్.. వీడియో వైరల్! -
అధికారుల పైత్యం: రూ. కోటి పన్ను చెల్లించలేదంటూ దినసరి కూలీకి
చెన్నై: వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేతదారులను ఏం చేయలేని అధికారులు.. అసలు పన్నంటే ఏంటో తెలియని సామాన్యులపై ప్రతాపం చూపిస్తారు. వేల కోట్ల రూపాయలు పన్ను ఎగవేశారంటూ.. సామాన్యులకు నోటీసులు పంపి వారిని ఇబ్బందులకు గురి చేస్తారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. దినసరి కూలీగా పని చేసుకుంటున్న మహిళ ఏకంగా కోటి రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడిందంటూ ఐటీ అధికారులు ఆమె ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ మహిళ షాక్‌లో ఉండి పోయింది. ఆ తర్వాత విషయం అర్థం చేసుకుని.. తమ పరిస్థితి వివరించడంతో అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. కానీ ఈ విషయం ఊరంతా పాకడంతో పాపం సదరు మహిళను కూలీకి రావద్దోని ఆదేశించారు ఆమె పని చేసే షూ కంపెనీ అధికారులు. దాంతో అధికారుల తీరుపై మండి పడుతోంది సదరు మహిళ. ఆ వివరాలు.. తిరుపత్తూరు జిల్లాలోని ఆంబూర్ మెల్మిట్టలం గ్రామానికి చెందిన జి. క్రిష్ణవేణి(41) అనే మహిళ ఆ ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పని చేసుకుంటూ జీవిస్తుండేది. (చదవండి: తమిళనాడులో ఉగ్రవాదులు.. హై అలర్ట్) ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కొందరు ఐటీ అధికారులు క్రిష్ణవేణి ఇంటికి వచ్చారు. ఆమె కోటి రూపాయలు పన్ను ఎగవేతకు పాల్పడిందని తెలిపారు. అధికారుల మాటలు విన్న క్రిష్ణవేణితో పాటు గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. దినసరి కూలీ అంత భారీ మొత్తంలో ప్రభుత్వాన్ని మోసం చేయడం ఏంటని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. (చదవండి: మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’) అందుకు అధికారులు తమ రికార్డుల ప్రకారం క్రిష్ణవేణి చెన్నై తాంబ్రంలో స్క్రాప్ లోహాలను విక్రయించే గిడ్డంగికి యాజమానురాలని.. అంతేకాక ఓ లేదర్ కంపెనీని కూడా నడుపుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో క్రిష్ణవేణి కోటి రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడిందని ఆరోపించారు. ఈ మాటలు విన్న క్రిష్ణవేణి, ఆమె భర్త ఆశ్చర్యపోయారు. అసలు తాంబ్రం ఎక్కడ ఉంటుందో తమకు తెలియదన్నారు. అంతేకాక అనారోగ్య సమస్యల వల్ల ఒకటి రెండు సార్లు చెన్నై వెళ్లినట్లు తెలిపారు. తమకు ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలుసుకున్న అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక కొసమెరుపు ఏంటంటే అధికారులు ఇలా రావడంతో షూ ఫ్యాక్టరీ అధికారులు క్రిష్ణవేణి పనుల నుంచి తొలగించారు. దాంతో అధికారుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది క్రిష్ణవేణి. -
కూలీ కొడుకు.. కేవీ డైరెక్టర్
వారిది రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబం.. పనికోసం మహారాష్ట్ర నుంచి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. తల్లిదండ్రుల బాధలను కళ్లారాచూసిన కొడుకు... కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. అటువంటి ఓ ఆదర్శవంతమైన ఓ వ్యక్తి గురించి ఇవాళ తెలుసుకుందాం. భైంసా టౌన్ : సిరిమల సాంబన్నది మహారాష్ట్రలోని బుర్బుశి గ్రామం. తల్లి లక్ష్మీబాయి, తండ్రి దిగంబర్. ఇరువురూ వ్యవసాయ కూలీలే. వీరికి నలుగురు సంతానం. వారిలో ముగ్గురు కూతుళ్లు కాగా, సిరిమల సాంబన్న ఒక్కడే కొడుకు. బతుకుదెరువు కోసం పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే లక్ష్మిబాయి, దిగంబర్‌లు కుభీర్‌కు వలస వచ్చారు. ఇక్కడే పనులు చేసుకుంటూ పిల్లలను చదివించారు. సాంబన్న విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. పదో తరగతి వరకు కుభీర్‌లోని జిల్లాపరిషత్ పాఠశాలలో చదువుకున్న సాంబన్న భైంసా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశారు. అనంతరం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతుండగా, 1987లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొలువు సాధించారు. కుభీర్ మండలంలో మొట్టమొదటి పోస్టింగ్ వచ్చింది. అయితే ఎప్పటికైనా ఇంకా ఉన్నత కొలువు సాధించాలని భావించిన సాంబన్న కొద్దిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1988లో కేంద్రీయ విద్యాలయంలో టీజీటీగా ఎంపికయ్యారు. ఏడాదిపాటు రామగుండంలో విధులు నిర్వర్తించారు. మళ్లీ 1989లో నవోదయ విద్యాలయంలో పీజీటీగా ఉద్యోగం వచ్చింది. నిజాంసాగర్లోని నవోదయ విద్యాలయంలో విధులు నిర్వర్తించారు. ఆ తరువాత 1994లో ఒడిశాలోని భువనేశ్వర్‌కు పదోన్నతిపై వెళ్లారు. 2003లో పంజాబ్‌లో భటిండాలో ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం గ్వాలియర్‌లోని జోనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
రోజువారీ కార్మికులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం
పెద్ద నోట్ల రద్దు.. నల్లధనంపై యుద్ధంలా ప్రకటించిన ఈ నిర్ణయం దీర్ఘకాలికంగా ప్రయోజనం ఇస్తుందంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటించినా.... మరోవైపు చిన్న కార్మికులు చితికిపోయారు. నోట్ల రద్దు తర్వాత చేపట్టిన ఎన్నో అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అంతేకాక ప్రభుత్వం తాజాగా చేపట్టిన సొంత సర్వేలో కూడా ఈ విషయమే వెల్లడైంది. నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజువారీ కార్మికులకు ఉద్యోగాలు కల్పించడంలో తీవ్ర ప్రతికూలం ఏర్పడిందని, కాంట్రాక్ట్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రభుత్వ సొంత సర్వే ప్రకటించింది. అయితే సాధారణ ఉద్యోగాలు వృద్ధి చెందాయని లేబుర్ బ్యూరో నిర్వహించిన అధికారిక సర్వే తెలిపింది. 2017 జనవరి-మార్చి కాలంలో మొత్తం ఉద్యోగాల సృష్టి 1,85,000 ఉందని బ్యూరో ఐదవ క్వార్టర్లీ రిపోర్టు పేర్కొంది. తయారీ, నిర్మాణ, వాణిజ్యం, రవాణా, నివాసం, రెస్టారెంట్లు, ఐటీ, విద్య, ఆరోగ్యం వంటి ఎనిమిది రంగాల్లో లేబర్ బ్యూరో సర్వే చేపట్టింది. మొత్తం 81 శాతం ఉద్యోగాలు ఈ రంగాలే కల్పిస్తున్నాయి. అయితే జనవరి-మార్చి కాలంలో మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులు 26వేలకు తగ్గారని, ముందటి క్వార్టర్లో ఈ సంఖ్య 1,24,000గా ఉందని తెలిపింది. అదేవిధంగా రోజువారీ కూలీ అందుకునే వర్కర్లు 2016-17 క్వార్టర్లో 53వేలకు పడిపోయారని పేర్కొంది. ముందటి క్వార్టర్లో ఈ ఉద్యోగులు కూడా 1,52,000గా ఉన్నారు. రెగ్యులర్ జాబ్స్ మాత్రం 1,97,000కు పెరిగినట్టు వెల్లడైంది. అధికారిక రంగంలో ఫుల్‌టైమ్ వర్కర్లకు వేతనాలు చెక్‌లు లేదా బ్యాంకు అకౌంట్లకు చెల్లిస్తారని, కానీ కాంట్రాక్ట్, రోజువారీ కూలీలకు నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు వీరిపై తీవ్ర ప్రభావం చూపినట్టు ఐజీసీ ఇండియా సెంట్రల్ ప్రొగ్రామ్ దేశీయ డైరెక్టర్, గణాంకాల మాజీ అధికారి ప్రొనబ్ సేన్ తెలిపారు. కాంట్రాక్ట్ వర్కర్లలో తయారీ, వాణిజ్యం,ఐటీ రంగాల్లో ఉద్యోగాల సృష్టి తక్కువగా జరిగిందని, నిర్మాణం, రవాణా, విద్య, నివాసం రంగాల్లో ఉద్యోగాల కోత చూశామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగాల సృష్టి నెమ్మదించిందని చెప్పారు. -
రోజుకూలీ ఖాతాలో కోటి రూపాయలు!
లుథియానా: ఆదాయపన్ను శాఖ అధికారులు పంపిన నోటీసు చూసి అతడుగాడు నోరెళ్లబెట్టగాడు. ఐటీ నోటీసు అందుకున్న అతడు సాఫ్ట్ వేర్ ఉద్యోగో, ప్రభుత్వ ఉద్యోగో కాదు. రోజువారి కూలీ. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ కు చెందిన అతడికి రూ.40 లక్షల పన్ను కట్టాలని ఐటీ అధికారులు నోటీసు పంపడంతో అవాక్కయ్యాడు. అతడి బ్యాంకు ఖాతాలో కోటి రూపాయలున్నాయని, దానికి పన్ను కట్టాలని తాఖీదు పంపడంతో కంగుతిన్నాడు. నెలకు రూ. 8 వేల సంపాదనతో నెట్టుకొస్తున్న తనకు బ్యాంకు ఖాతాయే లేదని, తానెప్పుడు బ్యాంకులో డబ్బు జమ చేయలేదని అధికారులకు అతడు తెలిపాడు. ఎన్ను ఎగవేసేందుకు కొంతమంది అక్రమార్కులు షాడో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పేదల గుర్తింపు, నివాస పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు సాగిస్తున్నట్టు వెల్లడైంది. ఇలాంటి షాడో బ్యాంకు ఖాతాలు పంజాబ్ లో అధికమయ్యాయి. తీవ్రవాదులకు నిధులు, హవాలా సొమ్ము ఈ ఖాతాల ద్వారా పంపిణీ అయ్యే అవకాశముందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో హవాలా ఆపరేటర్లు, పన్ను ఎగవేతదారులు, బ్యాంకు అధికారులపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. బ్యాంకు అధికారులపై వచ్చిన ఫిర్యాదులను ఆర్ బీఐకి పంపిస్తోంది. -
కరెంట్ షాక్‌తో గ్రామపంచాయితి దినసరి కూలి మృతి
-
ఆ..కలి కాలం
(తోలేటి మహేశ్వరరెడ్డి): అది 2003.. చంద్రబాబు పాలనా కాలం. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు లేక భూములన్నీ బీడు పడ్డాయి. రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు పనుల్లేకుండా పోయాయి. పల్లెల్లో బతుకుదెరువు కష్టమైంది. మూటాముల్లె సర్దుకుని నగరాలకు వలస బాట పట్టారు. పల్లెలన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. ఇళ్ల వద్ద పిల్లలు, వృద్ధులు మాత్రమే మిగిలారు. కొన్ని గ్రామాల్లో శ్మశానవైరాగ్యం రాజ్యమేలింది. అయినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం కరువు ఉందని ఒప్పుకోవడానికి కూడా చంద్ర బాబు ఇష్టపడలేదు. కుటుంబ సభ్యులు వలస వెళ్లగా ఇళ్ల వద్ద మిగిలిన వృద్ధులు, పిల్లలు ఆకలి బాధతో అల్లాడిపోయారు. అక్కడక్కడ ఆకలి చావులూ మొదలయ్యాయి. కనీసం మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించి పిల్లల ఆకలి బాధలు తీర్చాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా చంద్రబాబు సర్కారు స్పందించలేదు. వారిది ‘పొలిటికల్ గిమ్మిక్కు’ అంటూ తేలిగ్గా తీసుకుంది. దీంతో పరిస్థితులు మరింత విషమంగా మారాయి. చలించిన ప్రతిపక్షాలు... జనం ఆకలితో చస్తుంటే చంద్రబాబు మాత్రం హైటెక్ జపం వీడలేదు. పైగా ఎక్కడా కరువు లేదంటూ తనను తాను సమర్ధించుకుంటూ వచ్చారు. ఆయన మొద్దునిద్ర వీడరని గుర్తించిన వామపక్షాలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు సొంతంగా కరువు సహాయక చర్యలకు ఉపక్రమించాయి. జనాన్ని ఆకలి బాధల నుంచి తాత్కాలికంగానైనా బయటపడేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా గంజి కేంద్రాలు నిర్వహించాయి. వీటిని ప్రారంభించినప్పుడు చంద్రబాబు.. ‘ఈ కాలంలో గంజి ఎవరు తాగుతారు’ అంటూ ఎద్దేవా చేశారు. అయితే.. గంజి కేంద్రాలకు జనం పోటెత్తారు. పిన్నలు, పెద్దలూ, వృద్ధులూ బారులు తీరారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాల్లో 200లకు పైగా కేంద్రాలు నెలల కొద్దీ కొనసాగాయంటే అప్పటి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ఒక్కో కేంద్రంలో రోజూ దాదాపు 300 మంది గంజి తాగేవారు. ఆ రెండు జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 300లకు పైగా కేంద్రాలను నిర్వహించారు. అప్పటి దయనీయ పరిస్థితులకు చలిం చిన జర్నలిస్టులు, విద్యార్థులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా తమవంతు సహకారాన్ని అందించారు. స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి... గంజి కేంద్రాల నిర్వహణకు ఆటంకం లేకుండా చూశారు. చివరకు టీడీపీవారు కూడా అక్కడక్కడ సహాయక చర్యలకు ఉపక్రమించినా చంద్రబాబు మాత్రం కనికరించ లేదు. జనం గంజి తాగితే... ‘తమ్ముళ్లు’ బియ్యం మెక్కారు! చంద్రబాబు హయాంలో కరువు కరాళ నృత్యం చేసి జనం ఆకలిచావులకు గురైతే...అదే సమయంలో తెలుగు తమ్ముళ్లు మాత్రం పండుగ చేసుకున్నారు. ప్రజల ఆహార భద్రత కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనికి ఆహార పథకం బియ్యాన్ని పందికొక్కుల్లా మెక్కారు. కేంద్రం పది విడతల్లో దాదాపు 40 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేసింది. ఇందులో దాదాపు 25 లక్షల టన్నుల బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు. పుణె, ముంబై, షోలాపూర్, గాంధీనగర్ వంటి నగరాలతో పాటు విదేశాలకు సైతం తరలించి ...సొమ్ము చేసుకున్నారు. దీనిని బట్టి పచ్చచొక్కాలు ‘పనికి ఆహార పథకం’ బియ్యాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేశాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.500 కోట్ల నగదు, రూ.800 కోట్ల విలువైన బియ్యం దుర్వినియోగమైనట్లు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం ప్రకటించింది. అందరూ ఉన్నా అనాథలా.. బగర్ గోవిందు(60)ది మహబూబ్‌నగర్ జిల్లా కిష్టాపురం. ఇతనికి ముగ్గురు కుమారులు. 2003లో తీవ్ర కరువు పరిస్థితులు తలెత్తడంతో ఉన్న ఊళ్లో ఉపాధి కరువైంది. దీంతో ముగ్గురూ వలస బాట పట్టారు. ముంబై, గుజరాత్ తదితర ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ఇంటి వద్ద గోవిందు ఒక్కడే ఉన్నాడు. సరైన తిండి లేక అనారోగ్యానికి గురయ్యాడు. మందులు కొనేందుకూ డబ్బు లేకుండా పోయింది. పరిస్థితి విషమించింది. ఆకలి తాళలేక, అనారోగ్యంతో పోరాడలేక.. 2003 ఏప్రిల్ 5న చనిపోయాడు. అందరూ ఉన్నా అనాథలా తనువు చాలించిన గోవిందులాంటి వారెందరో ఉన్నారు. -
చేనుకు చేవే, భవితకు తోవ!
1970-1980 దశకాల్లో సాగు కార్యకలాపాన్ని ఉధృతం చేసుకుని గ్రామీణ కూలీల ఆవశ్యకతను గుర్తించి, రోజువారీ కూలీని పెంచుకోవడంతోపాటు ఆహారధాన్యాల ధరలను, పేదరికాన్ని కొంతమేరకయినా తగ్గించుకోగలిగాం. కానీ ఈ పట్టుదల నిబద్ధతతో కొనసాగలేదు. 1990, 2000 దశకాల్లో వ్యవసాయ అభివృద్ధి తగ్గిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక, సేవారంగాల్లో జరిగిన అభివృద్ధితో 2012-13 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం వాటా క్రమంగా 13.7 శాతానికి పడిపోయింది. ఇది మంచి పరి ణామం కాదు. ఎలాగంటే మూడో వంతు భారతీయ కుటుం బాలు గ్రామీణ ఆదాయం మీదనే ఆధారపడి ఉన్నాయి. మొత్తం జనాభాలో 800 మిలియన్ల పేదలు సుమారుగా 70 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు.దేశంలో వృద్ధి చెందుతున్న ఆదాయాలతో పాటుగా పెరుగుతున్న జనాభా డిమాండ్లను తీర్చడం, వారి ఆహార భద్రత వంటి కీలకాం శాలన్నీ ధాన్యంతో పాటుగా పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల పెరుగుదల మీదనే ఆధారపడి ఉన్నాయి. కనుకనే ఉత్పాదకత, పోటీ, వైవిధ్యంతో పాటుగా సుస్థిర వ్యవసాయ రంగం వేగంగా ఆవిర్భవించవలసిన అవసరం ఉంది. వ్యవ సాయంలో భారతదేశం అనేక విధాలుగా అగ్రగామిగా ఉంది. పాలు, అపరాలు, మసాలా దినుసులు ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే పేరుగాంచింది. అత్యధిక పశుసంపదతో పాటుగా అత్యధిక భూమి గోధుమ, వరి, పత్తి పంటల కింద సాగులో ఉన్నది కూడా ఇక్కడే. భారతదేశం వరి, గోధుమ, పత్తి, చెరకు, చేపలు, గొర్రెలు, గొర్రె మాంసం, పండ్లు, కూరగాయలు, తేయాకు ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్నది. మన దేశంలో సాగులో ఉన్న సుమారు 195 మిలియన్ హెక్టార్లలో 63 శాతం వర్షాధారంగా ఉండగా 37 శాతం భూములు నీటి పారుదల సదుపాయం కలిగి ఉన్నాయి. అదనంగా సుమారు 65 మిలియన్ హెక్టార్ల భూమి అడవులతో విరాజిల్లుతూ ఉంది. భారతదేశ సమగ్రాభివృద్ధికి, గ్రామీణ పేదల సంక్షేమానికి వ్యవసాయ రంగం ఎదుర్కోవలసిన కొన్ని సవాళ్లు ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. ఆహార భద్రతకు అనుగుణంగా.... ఆహారధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించి, 1970 దశకంలో హరిత విప్లవంతో స్వయం సమృద్ధిని సాధించుకున్నాం. కరువు కాటకాల నుంచి బయటపడ్డాం. 1970-1980 దశకాల్లో సాగు కార్యకలాపాన్ని ఉధృతం చేసుకుని గ్రామీణ కూలీల ఆవశ్యకతను గుర్తించి, రోజువారీ కూలీని పెంచుకోవడంతో పాటు ఆహారధాన్యాల ధరలను, పేదరికాన్ని కొంతమేరకయినా తగ్గించుకోగలి గాం. కానీ ఈ పట్టుదలలో నిబద్ధత కరువైంది. 1990, 2000 దశకాల్లో వ్యవ సాయ అభివృద్ధి తగ్గిపోయింది. సగటున వృద్ధి 3.5 శాతం మాత్రమే నమోదు కాగా, ధాన్యం ఉత్పత్తుల్లో పెరుగుదల 1.4 శాతం మాత్రమే. ఈ తగ్గుదల ఆందోళన కలిగించేదే. భారతదేశ వరి ఉత్పత్తులు చైనాతో పోలిస్తే మూడు వంతుల్లో ఒకటిగాను, వియత్నాం, ఇండోనేసియాతో పోల్చుకుంటే సగంగాను ఉన్నాయి. ఈ విధమైన పోలికలతో అనేక వ్యవసాయ ఉత్పత్తుల్లో మనం వెనుక బడి ఉన్నాం. విధాన రూపకర్తలు రాబోయే రోజులకు అనుగుణంగా, అధిక కాలం ఉపయోగపడేలా విధాన నిర్ణయాలు చేయవలసి ఉంది. ఉత్పాదకత, అంతర్జాతీయ పోటీకి దీటుగా, వైవిధ్యంతో ఉండేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలి. పెరగవలసిన ఉత్పాదకత మన వ్యవసాయంలో నిజమైన అభివృద్ధి సాధించడానికి దేశంలో సాగులో ఉన్న ప్రతి ఎకరానికి ఉన్న ఉత్పాదకతను గణనీయంగా పెంచాలి. ఉత్పాదకత పెరగా లంటే నీటి లభ్యత ముఖ్యం. పట్టణాభివృద్ధి, పెరుగుతున్న పరిశ్రమల అవస రాలు వంటి వాస్తవికాంశాలను దృష్టిలో ఉంచుకుని నీటికి పోటీపడవలసిన ఆవశ్యకతను గుర్తించాలి. అలాగే వృథాను నివారిస్తూ లక్ష్యసాధన కోసం నడుం బిగించాలి. నీటి వనరులలో సేద్యానికి సింహ భాగం అవసరం. అయితే పరిశ్రమలు, పట్టణావసరాలు నీటికి పోటీపడటం ఇటీవల పెరుగుతున్నది. ముందు ముందు నీటితో ప్రజావసరాలు మరింత విస్తరించే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితులు ఎదురైతే వ్యవసాయానికి గడ్డు పరిస్థితులు తప్పవు. అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి వినియోగం ద్వారా అధిక ఫలసాయాన్ని పొందే విధానాలను అభివృద్ధి పరచి, అమలు పరచవలసిన అవసరాన్ని ఇప్పటి నుండే గమనించాలి. భూగర్భ జలాల దుర్వినియోగాన్ని అరికట్టడం ఇకనైనా ఒక ఉద్యమంలా సాగించాలి. జలాల దుర్వినియోగంతో రాబోయే రోజుల్లో తలెత్తే సమస్యలు, పర్యావరణ సంబంధిత విపత్తుల వంటి అంశాల మీద రైతులకు, ఇతర వినియోగదారులకు సరైన అవగాహన కలిగిం చాలి. నీటి పారుదలను ఆధునీకరణ, మురుగునీటి పారుదల సదుపాయాలు, పెట్టిన ఖర్చుకు సార్థకత, కచ్చితంగా, వేగంగా ఫలితాలను ఇవ్వగలిగే పద్ధతులకు మద్దతు, పెట్టుబడుల్లో సుస్థిరత సాధించే దిశగా అమల్లో ఉన్న ప్రక్రియలు, వాటి కొనసాగింపునకు తగినన్ని వనరులు కేటాయించుకోవడం వంటివి జల వినియోగంలో తక్షణమే ఆలోచించవలసిన ఇతర కీలక విధానాలు. జల రక్షణకు కొత్త దృష్టి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధిక మోతాదులో దుర్వినియోగపరచడంతో వాటి స్థాయి ప్రమాదకరంగా పడిపోతున్నది. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో సరైన మురుగు నీటి ఉపసంహ రణ లేనందున సాగు భూములు ఉప్పు నేలలుగా మారిపోతున్నాయి. అత్యధిక ప్రాంతాల ప్రజలకు జీవనాధారమైన వర్షాధారిత ప్రాంతాల్లో సాగు భూమి కోతకు గురికాకుండా చూడాలి. మితంగా కురిసే వర్షపు నీరు వృథా కాకుండా, నేల పీల్చుకునేలా వ్యవసాయ పద్ధతులను ఇంకొన్నిచోట్ల అన్నదాతలకు అందించగలగాలి. సమగ్ర వాటర్ షెడ్ నిర్వహణా కార్యక్ర మాల వంటి వాటి అమలు ద్వారా కమ్యూనిటీలు భూవినియోగ ప్రణా ళికలు రూపొందించేటట్టు రైతులను సంసిద్ధులను చేయాలి. మారుతున్న పర్యావరణ పరిస్థితులు, దానితో శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పులు, అధికంగా ఏర్పడుతున్న వరదలు, కరువు, అకాల వర్షాలు మున్ముందు పెరిగిపోగలిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాటర్ షెడ్ నిర్వహణా కార్యక్రమాలతో పాటుగా ఆటుపోట్లకు తట్టుకునే వంగడాలను, వ్యవసాయ పద్ధతులను, ప్రణాళికలను అభివృద్ధి పరచుకోవాలి. అందని రుణాలు రైతులకు గ్రామీణ రుణాలు అందని పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది మారాలి! విద్యుత్తు, నీటి పారుదల వంటి వాటితో పాటు ఇతర ఆహార సరఫరాల మీద సబ్సిడీలు తొలగించాలని యోచిస్తున్నారు. కానీ అంత కంటె ముందు రైతుకు తన పంటకు ధరలు నిర్ణయించడంలో తగినంత ప్రాధాన్యం ఇవ్వాలన్న సంగతి చూడాలి. ఈ అంశం గురించి పట్టించుకోనంత కాలం రైతుకు ఇస్తున్న అన్ని రకాల సబ్సిడీలను కొనసాగించడం అవసరమే. లేకపోతే ఆహార ఉత్పత్తులే సందిగ్ధంలో పడిపోతాయి. వ్యాపారస్తుడు ఎలాగైతే తన లాభాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయాలు చేస్తున్నాడో, సేద్యగాడు కూడా ఖర్చులన్నీ పరిగణనలోకి తీసుకుని వ్యవసాయోత్పత్తుల మీద లాభసాటిగా ధరలను నిర్ణయించుకునే స్థాయికి చేరుకోవాలి. పంటల ధరల నిర్ణయంలో రైతు పాత్రను నిర్లక్ష్యం చేయడానికి వీలులేని పరిస్థితులు నెలకొనాలి. మార్కెట్లపై నిరోధాలు కొనసాగుతున్నాయి. విత్తనాలు, రసాయనిక ఎరువుల వంటి కొన్ని ఉత్పాదకాల మీద నిరోధాలు తొలగిపోయాయి. దీనితో రైతులు గిట్టుబాటు ధరలు పొందలేక అనేక విపరీత పరిణామాలను ఎదుర్కొంటు న్నారు. ఆధునికంగా తీర్చిదిద్దిన శాస్త్రీయ మార్కెట్లకు దళారుల ప్రమేయం లేకుండా అన్నదాతకు ప్రవేశం కల్పించాలి. అది చూసి దశాబ్దాలుగా రైతును మోసాలకు గురిచేస్తున్న దళారులకు కనువిప్పు కలిగించే విధంగా ఇదంతా జరగాలి. ముఖ్యంగా రైతన్నను విద్యాధికుడిని చేయాలి. అప్పుడు మాత్రమే రైతన్న విషయావగాహన ద్వారా మోసాలను పసిగట్టగలడు. తన కష్టాలు కడతేరడానికి, ఆదాయం పెంచుకోవడానికి స్వయంగా లేక సంఘటితంగా పరిష్కార మార్గాలను కనుగొని ఫలితాలను పొందగలడు. - డా॥బలిజేపల్లి శరత్‌బాబు