dalit boy
-
అమ్మవారి పల్లకి ముట్టుకున్నందుకు..60 వేలు జరిమాన
మాలూరు: గ్రామాల్లో ఇప్పటికీ అస్పృశ్యత అనే రక్కసి వెంటాడుతోంది. ఇందుకు నిదర్శనమే ఈ ఉదంతం. దళిత బాలుడు అమ్మవారి పల్లకీని ముట్టుకున్నాడని గ్రామస్తులు అతని కుటుంబానికి రూ.60 వేల జరిమానా విధించారు. డబ్బు కట్టకపోతే అక్టోబర్ 1 లోగా గ్రామం విడిచి వెళ్లాలని హుకుం జారీచేశారు. ఈ అమానవీయ సంఘటన కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని ఉళ్లేరహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఉళ్లేరహళ్లి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న దళిత బాలుడు చేతన్ ఈ నెల 8వ తేదీన బూత్యమ్మ జాతరలో అమ్మవారి పల్లకీని తాకాడు. ఇది చూసి అగ్రవర్ణాల వారు బాలున్ని మందలించి కొట్టారు. అంతటితో ఆగకుండా పంచాయతీ పెట్టారు. బాలుడు ముట్టుకోవడం వల్ల మైలపడిందని, ఇందుకు శాంతి కార్యక్రమం చేయడానికి రూ.60 వేలు కట్టాలని బాలుని తల్లి శోభను ఆదేశించారు. పోలీసులకు తల్లి ఫిర్యాదు దీంతో భయపడిన శోభ సోమవారం మాస్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేట్టారు. పలు దళిత సంఘాలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు నారాయణస్వామి, రమే‹Ù, వెంకటేశప్ప, నారాయణస్వామి, కొట్టప్ప, అర్చకుడు మోహన్రావ్, చిన్నయ్యలతో పాటు మరికొందరిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. (చదవండి: విధి వంచితురాలు) -
పరువు హత్యకు మరో ప్రేమ జంట బలి
బస్తీ(ఉత్తరప్రదేశ్): పరువు హత్యకు మరో ప్రేమ జంట బలైంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని పదారియా చేట్‌సింగ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. వేరే మతం వ్యక్తిని ఇష్టపడిందని అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ జంటను హతమార్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజిబుల్లా వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే 18 ఏళ్ల దళిత టీనేజర్ అంకిత్.. ముజిబుల్లా కూతురు అమీనాను ప్రేమించాడు. ప్రేమ వ్యవహారం ఇష్టంలేని అమీనా తండ్రి ముజిబుల్లా కూతురిని వారించాడు. ఎంతకీ వినకపోవడంతో అంకిత్‌ను, అమీనాను హతమార్చారు. రుధౌలీ ప్రాంతంలోని చెరకు తోటలో అమీనాను పాతిపెట్టారు. అంకిత్ మృతదేహాన్ని గుర్తించిన పరాస్నాథ్ చౌదరి పోలీసులకు సమాచారమిచ్చారు. చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే.. వరుడు దుర్మరణం, వధువుకు తీవ్ర గాయాలు -
దళిత చిన్నారి మృతి వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
జైపూర్: నీళ్ల కుండను తాకాడని ఓ దళిత చిన్నారిని టీచర్ దండించడం.. ఆ దెబ్బలకు ఆ చిన్నారి మరణించడం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో, మీడియాలో విస్తృతంగా చర్చ కూడా నడిచింది. అయితే.. ఈ ఘటనపై శుక్రవారం షాకింగ్ రిపోర్ట్‌ను సమర్పించింది రాజస్థాన్ చైల్డ్ ప్యానెల్. అసలు ఈ వ్యవహారంలో దళిత కోణం ప్రస్తావనే లేదని తేల్చేసింది. జలోర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని.. భోజన సమయంలో మంచి నీళ్ల కుండ తాకాడంటూ అగ్రకులానికి చెందిన ఒక టీచర్ తీవ్రంగా కొట్టాడని, ఆ దెబ్బలకు ఆ చిన్నారి మరణించాడని, దళితుడు కావడంతోనే అతనిపై అలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడన్నది ఆ ఘటనపై మీడియాలో వచ్చిన కథనం. అయితే.. డ్రాయింగ్ బుక్ విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తనదాకా రావడంతో.. ఆ ఇద్దరు విద్యార్థులను టీచర్ విపరీతంగా కొట్టాడు. అందులో ఒక చిన్నారే బాధితుడు. కంటికి, చెవికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆ తొమ్మిదేళ చిన్నారికి చికిత్స అందించారు. ఆ సమయంలోనే మృతి చెందాడు. ఇదీ.. రాజస్థాన్ బాలల హక్కుల సంఘం.. రాజస్థాన్ ప్రభుత్వానికి, విద్యాశాఖకు ఇచ్చిన నివేదిక సారాంశం. ఈ మేరకు స్కూల్‌ను సందర్శించిన చైల్డ్ ప్యానెల్ సభ్యులు.. బాధిత చిన్నారి తోటి విద్యార్థులను, టీచర్లను ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాదు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జిల్లా పరిపాలనాధికారి అందించిన వివరాల ప్రకారం ఆ స్కూల్లో కుండనే లేదని, తాగు నీటి కోసం ఓ ట్యాంకర్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. బాధితుడి సోదరుల వాదన అయితే బాధితుడి సోదరులు ఇద్దరూ నరేష్ కుమార్, నాపారాంలు అదే స్కూల్లో చదువుతున్నారు. వాళ్లు మాత్రం తమ తమ్ముడు మధ్యాహ్న భోజన సమయంలో మంచి నీటి కుండ నుంచి నీళ్లు తీసుకున్నందుకే టీచర్ చితకబాదాడంటూ చెప్తున్నారు. వీళ్ల స్టేట్‌మెంట్‌నూ కూడా నివేదికలో జత చేసింది చైల్డ్ ప్యానెల్. అంతేకాదు.. ఒకవేళ స్కూల్ అనుమతుల్ని విద్యాశాఖ గనుక రద్దు చేస్తే పిల్లలను మరో స్కూల్లో అడ్మిషన్లకు అనుమతించాలంటూ సూచించింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీని తీరును విమర్శిస్తూ.. దళిత సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నాయి. బీజేపీ సైతం ఈ ఘటనను ఆధారంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. ఇదీ చదవండి: చిన్నారి మృతి కేసు.. అధికార కాంగ్రెస్‌లో ముసలం -
Rajasthan: కాంగ్రెస్ పార్టీలో ముసలం, ఎమ్మెల్యే రాజీనామా
జైపూర్: రాజస్థాన్‌లో దళిత బాలుడి హత్య అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ప్రతిపక్ష బీజేపీ నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా గెహ్లాట్ సర్కారు విమర్శలు ఎదుర్కొంటోంది. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని బారన్ - అత్రుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పనాచంద్ మేఘ్వాల్ తన రాజీనామాను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు పంపారు. కేసు విచారణలో పోలీసుల నాన్చుడు ధోరణికి వ్యతిరేకంగా రాజీనామా చేసినట్టు మేఘ్వాల్ వెల్లడించారు. అగ్రవర్ణాల కోసం ఉద్దేశించిన కుండలోని నీరు తాగినందుకు ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థిని చెయిల్ సింగ్ అనే టీచర్ చావ బాదాడు. బాధిత చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు వదిలాడు. రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా దళిత బాలుడి మృతిపై కాంగ్రెస్ పార్టీలో రాజకీయ డ్రామా మొదలైంది. మొదటి నుంచి అశోక్ గెహ్లాట్‌ను వ్యతిరేకిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం సురానా గ్రామానికి పయనమయ్యారు. బాలుడు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘దళిత బాలుడి మృతి దిగ్భ్రాంతికర దారుణ ఘటన. సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలను మనం అంతం చేయాలి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం మొక్కుబడిగా కాకుండా బాధిత కుటుంబానికి సత్వరమే పూర్తి న్యాయం చేయాల’ని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. పైలట్‌కు చెక్ పెట్టేలా.. జలోర్ జిల్లాకు సచిన్ పైలట్ వెళుతున్నారని తెలియగానే సీఎం గెహ్లాట్ అప్రమత్తమయ్యారు. పైలట్‌కు పొలిటికల్ మైలేజీ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో క్యాబినెట్లో సీనియర్ మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రాను హుటాహుటిన జలోర్‌కు పంపించారు. అంతేకాదు త్వరతగతిన దర్యాప్తు చేసి, బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీడియాకు తెలిపారు. బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం కూడా ప్రకటించారు. (క్లిక్: వాళ్ల కాళ్లు విరగొట్టండి.. నేను బెయిల్ ఇస్తా) బీజేపీ మండిపాటు దళిత బాలుడి హత్య సిగ్గుచేటని పేర్కొంటూ గెహ్లాట్ సర్కారుకు ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది. రాజస్థాన్‌లో దళితులకు న్యాయం జరిగేలా గెహ్లాట్‌ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఎప్పుడు ఆదేశిస్తారని పశ్నిస్తూ ట్వీట్ చేసింది. కాగా, దళిత బాలుడి మరణానికి కారణమైన టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై హత్యా నేరంతోపాటు ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. (క్లిక్: ప్రధాని వ్యాఖ్యలు.. బీజేపీని ఉద్దేశించినవే!) -
టీచర్ దెబ్బలకు విద్యార్థి మృతి.. సీఎం సంచలన వ్యాఖ్యలు
ఉదయపూర్: దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. తాజాగా రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దీంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడిని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటన జూలైన జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ఘటనపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు ప్రతీ రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయన్నారు. టీవీలో, పత్రికల్లో వీటిని మనం చూస్తూనే ఉంటామని చెప్పారు. బాలుడిని కొట్టడాన్ని తాను కూడా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన సీఎం.. ఇలాంటి ఘటన ఎక్కడ జరిగినా నేరమని అన్నారు. కానీ, ఇలాంటి ఘటనలను కూడా ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా చూడటం విచారకరమని గెహ్లాట్ ఆవేదన వ్యక్తపరిచారు. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని సీఎం తెలిపారు. బాలుడిని కొట్టిన టీచర్ చైల్ సింగ్(40)ను అరెస్ట్ చేసి సమగ్ర విచారణకు ఆదేశించినట్టు స్పష్టం చేశారు. ఇంతకంటే ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు వేరే పనిలేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రతీ విషయాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: స్వాతంత్ర్య వేడుకల వేళ సోనియా సీరియస్ -
‘ఆ కుర్రాడికి సీటు ఇవ్వకుంటే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే!’
Dalit Boy IIT Seat Case: విద్యార్హతలున్నవాళ్లకు అవకాశాలు దక్కడంలో అవాంతరాలు ఎదురైతే తాము చూస్తూ ఊరుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. యూపీకి చెందిన ఓ దళిత బాలుడికి సాంకేతిక కారణాలతో ఐఐటీలో సీటు దక్కకపోవడం, కింది న్యాయస్థానంలో పిటిషన్ తిరస్కరణకు గురికావడంపై విచారం వ్యక్తం చేసిన కోర్టు.. అతనికి సీటు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ బెంచ్ మార్క్ తీర్పుపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన 17 ఏళ్ల ప్రిన్స్ జైబీర్‌సింగ్.. 2021 ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో 25, 894వ ర్యాంక్(ఎస్సీ కేటగిరీలో 864) సాధించాడు. కౌన్సెలింగ్‌లో బాంబే ఐఐటీలో సీటు కోసం ఆప్షన్ పెట్టుకున్నాడు. ఆ కుటుంబం నుంచి ఉన్నత విద్యకు వెళ్తున్న మొదటి వ్యక్తి కూడా ఈ కుర్రాడే. దీంతో ఆ కుటుంబం సంబురాలు చేసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో సీటు పేమెంట్ రూ. 15వేలను చివరి నిమిషంలో చెల్లించాడతను. తీరా ఆ సమయానికి సాంకేతిక కారణాల వల్ల పేమెంట్ జరగకపోవడంతో అతనికి సీటు అలాట్ కాలేదు. ఈ సమస్యపై కౌన్సిలింగ్ జరిగిన ఖరగ్‌పూర్ ఐఐటీని వెంటనే ఆశ్రయించిన లాభం లేకపోయింది. బాంబే ఐఐటీ దీంతో ప్రిన్స్, బాంబే హైకోర్టు లో ప్లీ దాఖలు చేయగా.. కోర్టు అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోపన్న ఆధ్వర్యంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ అభ్యర్థన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సోమవారం ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జరిగింది సాంకేతిక తప్పిదం. విద్యార్థి తప్పేం లేదు. పైగా మంచి భవిష్యత్తు ఉన్న ఓ యువ దళిత విద్యార్థికి ఫీజు కారణంగా సీటు నిరాకరించడం బాధాకరం. ఒకవేళ అతనికి ఇక్కడ కూడా అతనికి న్యాయం జరగకపోతే.. న్యాయ్యాన్నే అపహాస్యం చేసిన వాళ్లం అవుతాం. తక్షణమే బాంబే ఐఐటీలో అతనికి సీటు కేటాయించాలి. మిగతా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా.. అవసరమైతే ఇతని కోసం ఓ సీటును సృష్టించండి. 48 గంటల్లో అందుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలి ’’ అని Joint Seat Allocation Authority (JOSAA)ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. మానవతా దృక్ఫథంతో ఒక్కోసారి న్యాయ పరిధిని దాటి ఆలోచించాల్సి వస్తుందని, ఈ కేసులోనూ విద్యార్థి కోసం తాము అదే కోణంలో తీర్పు ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ అంటే.. పూర్తి న్యాయం జరిగేలా చూడడం కోసం తమ విచక్షణాధికారాన్ని సుప్రీం కోర్టు ఉపయోగించి ఆదేశాలు జారీ చేయొచ్చు.. అవి పాటించి తీరాల్సిందే!(కొన్ని సందర్భాలు మినహాయించి). ఈ ఆర్టికల్‌ను తెరపైకి తెచ్చిన బెంచ్.. తక్షణమే ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఆల్లోకేషన్ ఆథారిటీని ఆదేశించింది. ఇక కౌన్సిలింగ్‌ల సమయంలో టెక్నికల్ సమస్యలతో ఎంతో మంది విద్యార్థులు మంచి మంచి అవకాశాలు కోల్పోతున్న సందర్భాలు చూస్తుంటాం. అలాంటిది ఇలాంటి తీర్పులు అర్హత ఉన్న కొందరికైనా న్యాయం అందేలా చూస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పుడు. -
రెండేళ్ల దళిత బాలుడు... ఆలయంలోకి ప్రవేశించాడని జరిమానా
కొప్పాల్: ఆధునిక యుగంలోనూ కుల వివక్ష యథాతథంగా కొనసాగుతోందనడానికి ఇది మరో నిదర్శనం. రెండేళ్ల దళిత బాలుడు ప్రవేశించడం వల్ల గ్రామంలోని హనుమాన్ ఆలయం మైలపడిందని, దాన్ని శుద్ధి చేయడం కోసమంటూ బాలుని కుటుంబానికి రూ.25వేల జరిమానా విధించారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో మియాపూర్ గ్రామంలో ఈ నెల 4వ తేదీన ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌చేశారు. మియాపూర్‌లో చెన్నదాసరి కులానికి చెందిన చంద్రశేఖర్‌కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ నెల 4న అతడి పుట్టినరోజు కావడంతో హనుమంతుడి ఆశీస్సుల కోసం గుడికి తీసుకెళ్లాడు. చంద్రశేఖర్‌తోపాటు కుటుంబ సభ్యులంతా గుడి బయటే ఉండిపోయారు. బాలుడు లోపలికి వెళ్లొచ్చాడు. ఇది గమనించిన ఆలయ పూజారులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. 11న పంచాయితీ పెట్టారు. హనుమంతుడి› ఆలయాన్ని శుద్ధి చేయడానికి జరిమానా కింద రూ.25,000 చెల్లించాలని బాలుని తండ్రిని ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ బాలచంద్ర సంగనాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో పోలీసుల సమక్షంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చెన్నదాసరితో సహా అన్ని కులాల ప్రజలు పాల్గొన్నారు. -
ఆ అమ్మాయితో మాట్లాడినందుకు గుండు గీయించి..
జైపూర్: దేశంలో కులవివక్ష ఏస్థాయిలో ఉందో చెప్పే ఉదంతం ఇది. ఎన్ని చట్టాలు, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కొందరు మనుషులు సాటి మనుషుల పట్ల మానవత్వాన్ని మరచి అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం సంఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడు అగ్రకులాల అమ్మాయితో మాట్లాడడాన్ని జీర్ణించుకోలేని కొందరు పెద్ద మనుషులు అతడికి గుండు కొట్టించారు. మెకానిక్ షాప్‌లో పనిచేసే రాహుల్ మేఘావాల్ అనే యువకుడు ఈ నెల 18న అతడికి తెలిసిన అగ్ర కులానికి చెందిన యువతితో మాట్లాడాడు. వీరిద్దరు ఓ కాఫీ హోటల్లో కలుసుకొని మాట్లాడుతుండగా గమనించిన అగ్ర వర్ణ కుల పెద్దలు, అమ్మాయి కుటుంబ సభ్యులు రాహుల్ ఇంటిపై దాడి చేశారు. అంతేగాక ఆ యువకుడికి గుండు గీయించి అవమానపరిచారు. అతనిపై, కుటుంబ సభ్యులపై విచక్షణ మరిచి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చదవండి: ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం -
దారుణం.. కాళ్లు చేతులు కట్టేసి
జైపూర్ : మైనర్ దళిత యువకుడిని కాళ్లు చేతుల కట్టేసి.. దారుణంగా చితకబాదుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఈ నెల 1న రాజస్తాన్‌లోని పాలీ జిల్లా ధనేరియా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదరు దళిత యువకుడు ఓ చిన్నారిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. దాంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆ దళిత యువకునిపై దాడికి దిగారు. అతని కాళ్లు చేతులు కట్టేసి.. కర్రలతో చితక బాదారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు దళిత యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. జువైనల్ హోమ్‌కు తరలించారు. దాంతో పాటు సదరు యువకుడి మీద దాడి చేసిన వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ వీడియోపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు సదరు యువకుడు చిన్నారిని ఏడిపించినందకు తన్నలు తిన్నాడని చెప్తుండగా.. మరి కొందరు ఆ దళిత యువకుడు హిందూ ఆలయంలోకి ప్రవేశించాడు. దాంతో ఆగ్రహించిన అగ్ర కులాల యువకులు అతని మీద దాడి చేసి దారుణంగా చితకబాదారని ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. చిన్నారిని ఏడిపించినందుకే సదరు యువకుడిపై దాడి చేశారని తెలిపారు. #BREAKING राजस्थान के जिला पाली गाॅव धनेरिया मे दलित नाबालिग लङके को इतनी बेरहमी से पीटा की मन विचलित हो उठा। इस लङके की गलती सिर्फ इतनी है कि यह गाँव के मन्दिर पर चढ़ गया था ! भगवा गमछा ङाले युवक नजर आ रहा है बताया जा रहा है कि वह भाजपा का कार्यकर्ता हैpic.twitter.com/4kT4olJA1y — The Dalit Voice (@ambedkariteIND) June 3, 2019 -
కాళ్లు మొక్కేదాకా వదల్లేదు
అహ్మదాబాద్: మరో హేయనీయమైన ఘటన వెలుగు చూసింది. గుజరాత్లో దళిత యువకుడిపై దాడి చేసిన కొందరు వ్యక్తులు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల ఫిర్యాదుతో వ్యవహారం మీడియాకు చేరింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... వీడియోలో ఉన్న యువకుడు తాను అగ్ర కులానికి చెందిన వాడిగా ప్రచారం చేసుకున్నాడు. అయితే అది అబద్ధం అని తేలటంతో కొందరు అతన్ని అడ్డగించి చితకబాదారు. కనికరించి వదిలేయాలని విజ్ఞప్తి చేసినా విడిచిపెట్టలేదు. ‘చంపుతాం’ అంటూ అతన్ని కిందపడేసి ఇష్టమొచ్చినట్లు తొక్కుతూ పిడిగుద్దులు గుప్పించారు. ‘బాపు.. క్షమించండి’ అంటూ వేడుకున్నా వారు వదల్లేదు. చివరాఖరికి కాళ్లు మొక్కి, క్షమాపణలు కోరటంతో వాళ్లు అతన్ని వదిలేశారు. మరో కథనం ప్రకారం... బాధితుడ్ని విఠలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడా? పోలీసులు కేసు నమోదు చేశారా? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం గుజరాత్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. -
గుజరాత్లో హేయనీయమైన ఘటన
-
బాలుడిపై పైశాచికం
న్యూఢిల్లీ: 14 ఏళ్ల దళిత బాలుడిని కొందరు బట్టలు ఊడదీసి, దుర్భాషలాడుతూ కొట్టడమే కాకుండా అతనిపై మూత్ర విసర్జన చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ సమీపంలోని పిల్ఖానా గ్రామంలో చోటుచేసుకుంది. దళితుల సమస్యలపై మాట్లాడేందుకు రాజ్యసభలో తనను అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ చీఫ్ మాయావతి తన సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాతి రోజే ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. 8 మంది బాలురు తన చేతులను కట్టేసి దుస్తులు తొలగించారని బాధిత బాలుడు ఆరోపించాడు. తనను వదిలిపెట్టమని ఎంతగా ప్రాధేయపడినా వారు కనికరించకుండా కొట్టారని, చివరకు తనపై మూత్ర విసర్జన చేసి విడిచిపెట్టారని గోడు చెప్పుకున్నాడు. తనను దుర్భాషలాడుతూ దళితుడినని పదేపదే హేళన చేశారని, వారిలో ఒకడు ఈ తతంగాన్ని అంతా వీడియో తీశాడని చెప్పాడు. నిందితులందరినీ అరెస్ట్ చేశామని అలీగఢ్ ఎస్పీ రాజేశ్ పాండే తెలిపారు. -
మధ్యప్రదేశ్‌లో గురువుల దారుణం..
భోపాల్: ప్రపంచమంతా అభివృద్ధి, ఆధునికత అంటూ పరుగులు పెడుతున్నా కొందరి మనస్తత్వాలు మారడం లేదు. వారిని పట్టుకున్న కులజాడ్యం వీడటం లేదు. ఏళ్లుగా పాతుకుపోయిన కులాల పిచ్చి మనిషిని గుర్తించకుండా చేస్తోంది. ఇలా నిరక్షరాస్యులు చేశారంటే లోకజ్ఞానం ఎక్కువగా లేదనుకోవచ్చు.. కానీ సాక్షాత్తు పాఠాలు చెప్పే గురువులే చేస్తే.. మధ్యప్రదేశ్‌లో ఇదే జరిగింది. దామోహ్‌లో దారుణం చోటుచేసుకుంది. మంచినీటికోసం స్కూళ్లో చేతిపంపు వద్దకు వెళ్లిన ఓ దళిత బాలుడిని అందుకు అనుమతించకపోవడంతో అతడు బావిలో పడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల బాలుడు దాహార్తితో స్కూళ్లోని చేతిపంపు వద్దకు వెళ్లాడు. అయితే, అక్కడ అతడిని మంచినీళ్లు తాగేందుకు టీచర్లు అనుమతించకపోవడంతో పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లాడు. నీళ్లు తాగే ప్రయత్నంలో అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపట్ల సీరియస్ గా స్పందించిన ఉన్నతాధికారులు ఆ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి విచారణ ఆదేశించారు. -
హర్యానాలో మరో దారుణం
-
హరియాణాలో మరో దారుణం
చండీఘడ్: హరియాణాలో దళిత కుటుంబంపై దాడి, ఇద్దరు చిన్నారుల హత్య మరవకముందే రాష్ట్రంలో మరో దళిత బాలుడి మరణం కలకలం రేపింది. పావురాలు దొంగిలించాడనే నెపంతో విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ మైనర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే గొహనా గ్రామానికి చెందిన గోవింద(14) పై ... యింట్లో పావురాలు ఎత్తుకెళ్లాడని పొరుగువారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ మరునాడు ఉదయానికి గోవింద శవమై తేలాడు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. కాగా బాలుడు పోలీస్ స్టేషన్ లో ఉరి వేసుకుని చనిపోయినట్లు కేసు నమోదు అయింది. అయితే పోలీసులే తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్నారని గోవింద కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని విడిచిపెట్టడానికి పదివేల రూపాయల లంచం తీసుకుని, తమ బిడ్డను అన్యాయంగా చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతుని బంధువులు నిరసన చేపట్టినా అధికారులెవ్వరూ స్పందించకపోవడంతో తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. స్థానిక రైల్వేస్టేషన్ పట్టాలపై సుమారు మూడుగంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్రం అంతరాయం కలిగింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సంబంధిత పోలీసు అధికారులపై హత్యానేరం కింద నమోదు చేశారు. మృతుని సోదరుని ఫిర్యాదుతో ఎస్ఐ, ఎఎస్ఐలు సుభాష్, అశోక్ లపై కేసు నమోదు చేశామని డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.