dalit chief minister
-
హామీలను విస్మరించిన కేసీఆర్
♦ దళిత ముఖ్యమంత్రి విషయంలో మోసం ♦ కేబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం సిగ్గుచేటు ♦ మూడెకరాల భూపంపిణీ ఏమైంది? ♦ మహాజన సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజాగాయకుడు గద్దర్ జనగామ: అమరుల త్యాగాల పునాదులపై సాధిం చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మాఫి యా రాజ్యమేలుతోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని మహా జన సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజాగాయకుడు గద్దర్ విమర్శించారు. జనగామలోని గాయత్రి గార్డెన్లో ఆదివారం జరిగిన మహాజన సమాజం జిల్లా సదస్సుకు గద్దర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కన్వీనర్ ఏదునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దున్నేవాడికే భూమి అన్న నినాదాన్ని నక్సలైట్ల నినాదమన్న సీఎం కేసీఆర్.. ఆయన ప్రకటించిన దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. దొరల రాజ్యంలో సామాజిక, ధామాశ ప్రకారం ప్రజలకు ప్రాతినిత్యం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలోని కేబినెట్లో కనీసం మహిళలకు ప్రాతినిత్యం లేకపోవడం సిగ్గు చేటన్నారు. అంబేద్కర్ అశించిన రాజ్యస్థాపన జరగాలంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమానత్వ హక్కులు రావాలని గద్దర్ పేర్కొన్నారు. దీని కోసం అన్ని వర్గాల ప్రజల్లో ఆలోచన రావాలని కోరారు. పారిశ్రామిక అభివృద్ధే కీలకం.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే జనగామ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని గద్దర్ అన్నారు. అంతే కాకుండా ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని, ఇందు కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోరాటాలతోనే సమాజంలో మార్పు జరుగుతుందని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఉద్యమాలు లేనిదే ప్రపంచంలో ఎక్కడా ఫలితాలు సాధించలేదన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు మహాజన సమాజ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటించి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరిస్తామన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగే వరకు మా పోరు ప్రజాపక్షం వైపు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలో ఎన్కౌంటర్లో అమరులైన కుటుంబాలను గద్దర్ సన్మానించారు. జిల్లా ఉద్యమకారులకు సన్మానం.. జనగామ జిల్లా సాధన కోసం ఉద్యమం చేసిన పోరాట యోధులను గద్దర్ ఆధ్వర్యంలో సన్యాసం చేశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, టీ జేఏసీ చైర్మెన్ ఆకుల సతీష్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మినారాయణ నాయక్, ఐఎంఏ సెంట్రల్ కమిటీ సభ్యులు డాక్టర్ రాజమౌళి, సేవ్ జనగామ ప్రతినిధి మంగళ్లపల్లి రాజు, ఓయూ జేఏసీ ఇన్చార్జి బాలలక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఉడుత రవి, బూడిద గోపి, ఇర్రి అహల్య, బొట్ల శ్రీనివాస్, కౌన్సిలర్ బొట్ల సుగుణలను ఘనంగా సత్కరించారు. పోరాటాల ద్వారానే ఏదైనా సాధించుకోవచ్చని నాటి తెలంగాణ.. నేటి జిల్లా సాధనే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మహాజన సమాజం నాయకులు శ్రీరాముల శ్రీనివాస్, బత్తుల సిద్ధేశ్వర్, ప్రభాకర్ యాదవ్, చుక్క కిషన్ ఉన్నారు. -
బిగుస్తున్న పిడికిలి
‘దళిత సీఎం’ నినాదంపై పట్టువీడని ఆ వర్గ నేతలు నేటి నుంచి దశలవారిగా జనజాగృతి కార్యక్రమాలు తొలుత బళ్లారిలో ప్రారంభం బెంగళూరు/బళ్లారి: ‘కర్ణాటకకు దళిత ముఖ్యమంత్రి’ విషయమై ఆ వర్గానికి చెందిన నాయకులు పట్టువీడటం లేదు. ఈ విషయమై ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆదేశాలు జారీ చేసినా ‘దళిత వర్గ నాయకులు’ మాత్రం వెనక్కు తగ్గక పోవడం గమనార్హం. దళిత వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న నినాదం వినిపిస్తోంది. దళిత వర్గానికి చెందిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ కూడా అడపాదడపా ‘నాకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి.’ అంటూ మీడియా ప్రకటనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల ముందు ఆ వర్గానికి చెందిన నాయకులు బెంగళూరులోని ఓ హోటల్లో సమావేశమై ఈనెల 23 లోపు దళిత సీఎం విషయమై ‘హై కమాండ్’ నిర్ణయం తీసుకోకుంటే జిల్లా స్థాయిలో జానజాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇది అటు విపక్షంలోనే కాక స్వపక్షంలోనూ విమర్శలకు దారి తీసింది. ఈ నేపధ్యంలో దళిత సీఎం పై ఎవరూ బహిరంగ వాఖ్యలు చేయకూడదని నిన్నటి రోజే (ఆదివారం) దిగ్విజయ్ సింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అయినా దిగ్విజయ్ సింగ్ హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయని దళిత వర్గానికి చెందిన నాయకులు బెంగళూరులోని ఓ హోటల్లో సోమవారం సమావేశమై జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన జనజాగృతి కార్యక్రమాల రూపురేఖల పై చర్చించారు. దశలవారిగా జిల్లా కేంద్రాల్లో ‘దళితసీఎం’ విషయమై జనజాగృతి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మొదటగా మంగళవారం బళ్లారిలో జనజాగృతి కార్యక్రమం నిర్వహించాలని దళిత నాయకులు భావిస్తున్నారు. బెంగళూరులో దళిత నాయకులు నిర్వహించిన సమీక్ష సమావేశం తర్వాత రాష్ట్ర దళిత సంఘర్షణ సమితి నాయకుడు ఎన్.మూర్తి మీడియాతో మాట్లాడుతూ... ‘కర్ణాటకలో దళిత కాంగ్రెస్ నాయకుడు సీఎం పీఠం మీద కుర్చొనే సమయం వచ్చింది. ఇందుకు హై కమాండ్ సహకరించకపోతే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌కు పట్టిన గతే కర్ణాటకలో రాబోయే ఎలెక్షన్లలో సైతం ఎదురవుతుంది’ అని పేర్కొన్నారు. దీంతో ‘దళిత ముఖ్యమంత్రి’ డిమాండ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బళ్లారి నగరంలోని దళిత నేతలతో రాష్ట్ర దళిత సంఘానికి చెందిన ప్రముఖ నేతలు మంగళవారం బళ్లారిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దళిత ముఖ్యమంత్రిని చేయాలని ఏర్పాటు చేసిన ఫోరంకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరాం నేతృత్వంలో బళ్లారిలో నగరంలోని బీడీఏఏ మైదానంలో నేడు( మంగళవారం) పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి తన గళం విప్పనున్నారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనంతరం దళిత ముఖ్యమంత్రిని చేయాలని సమావేశంలో నేతలు ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి పలువురు దళిత కులానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర దళిత సంఘం నేతలు శ్రీరాములు, వెంకటస్వామీలు తదితరులు పాల్గొంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా దళిత ముఖ్యమంత్రిని చేయాలని బళ్లారి నుంచి దళిత సంఘం నేతలు తీవ్ర పోరాటానికి తెరలేపే అవకాశం ఉందని చెప్పవచ్చు. -
దళిత సీఎం హామీ ఏమైంది?
జిన్నారం : తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన హామీ ఏమైందని, అరచేతిలో స్వర్గం చూపించే కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మవద్దని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. మండలంలోని బొల్లారం గ్రామంలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డికి మద్దతుగా శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి పొన్నాలతో పాటు మండలి విపక్ష నేత డీ శ్రీనివాస్‌లు హాజరయ్యారు. గ్రామానికి చెందిన అనిల్‌రెడ్డితో పాటు గ్రామ యువకులు పొన్నాల సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో పొన్నాల మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మూడేళ్లలో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తానని కేసీఆర్ తప్పుడు ప్రచారం చే స్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. డీ శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశ్రామికంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. కేవలం సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ప్రజలను మాటల గారడీతో మభ ్యపెడుతున్న కేసీఆర్‌కు బుద్ధి రావాలంటే ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ అభ్యర్థి సునితారెడ్డి మాట్లాడుతూ ఓటర్లు తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, పార్టీ రాష్ర్ట మహిళా అధ్యక్షురాలు లలిత, జెడ్పీటీసీ సభ్యుడు బాల్‌రెడ్డి, నాయకులు సురభి నాగేందర్‌గౌడ్, నిర్మల, మద్ది వీరారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది?
పటాన్చెరు/సంగారెడ్డి మున్సిపాలిటీ: ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేదొకటి.. చేసేదొకటి..మాట తప్పడంలో ఆయనను మించిన వారు మరెవరూ లేరు.. రాష్ట్రం రాక ముందు దళితుడిని సీఎం చేస్తానన్న ఆయన మాటలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి.. తెలంగాణను ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ యాడున్నడు’.. అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. పటాన్చెరు, సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన రుణమాఫీ, పెన్షన్ల పెంపు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో సునీతాలక్ష్మారెడ్డి విజయం సాధించేలా ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలను కోరారు. ఉప ఎన్నిక బరిలో నిలిపి సునీతను బలిపశువును చేశారంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అన్ని విధాలా సరైన వ్యక్తి కావడంతోనే అధిష్టానం ఆమెను గుర్తించి తమ అభ్యర్థిగా ఖరారు చేసిందన్నారు. ఓటమి భయం పట్టుకున్న నేతలు ఏం చేయాలో అర్థంకాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం తమ పార్టీ 1957నుంచి పోరాటం చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూపాయి ఆర్థిక సహాయం అందించలేదన్నారు. రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాలు ఇప్పటికీ అమలు కాలేద ని మండిపడ్డారు. భద్రాచలంలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతున్నా సీఎం ఎందుకు పట్టించుకోలేదని, అఖిల పక్షం వేసి ప్రధాని, రాష్ట్రపతి వద్దకు ఎందుకు వెళ్లలేదని సీఎంను ప్రశ్నించారు. ‘సోనియా పిలుపు సునీత గెలుపు తెలంగాణ మలుపు కావాలని’ నినదించారు. తెలంగాణ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు కేసీఆర్ ప్రజలను నమ్మించాడని, దీక్ష సమయంలో వైద్యులు పరీక్షించిన మెడికల్ నివేదికను బయట పెడితే ఏ పాటి దీక్ష చేశారో స్పష్టమవుతుందన్నారు. అంతకు ముందు సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలలే సునీతారెడ్డికి విజయం దక్కేలా చేస్తాయన్నారు. ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సునీతాలక్ష్మారెడ్డిని మచ్చలేని నాయకురాలన్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురిలో మిగతా ఇద్దరు తెలంగాణ గురించి ఏనాడు నోరెత్తలేదన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదన్నారు. రూ.ఐదు కోట్లతో టికెట్ కొని ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. ఆరు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కుప్పకూలుతుందని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మెదక్ ఎంపీ అభ్యర్థిని సునీతాలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. తనను గెలిపిస్తే జిల్లాలో అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, షబ్బీర్‌అలీ, రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దళిత సీఎం ప్రకటన పై రాద్దాంతం వద్దు : టీఆర్ఎస్
-
దళితుడినే CM చేస్తామన్న జైరాం
-
కాంగ్రెస్‌లో ‘దళిత సీఎం’ చిచ్చు
జైరాం వ్యాఖ్యలపై టీ కాంగ్ నేతల అసంతృప్తి సీఎం రేసులో ఉన్న బీసీ, అగ్రవర్ణాల నేతల అసహనం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామంటూ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోనే చిచ్చు రేపాయి. సీఎం పదవిపై గంపెడాశలు పెట్టుకున్నముఖ్య నేతలంతా జైరాం వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా బీసీ, అగ్రవర్ణాల నేతలు జైరాంపై అసహనంతో ఉన్నారు. అన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్‌కు కీలకమని, ఈ సమయంలో జైరాం ఓ వర్గానికే పెద్దపీట వేస్తామని చెప్పడం తొందరపాటు చర్యేనని అంటున్నారు. దీనివల్ల పార్టీ నేతల్లో చీలిక వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి ఎస్.జై పాల్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటి నేతలు సీఎం రేసులో ఉన్నారు. జైపాల్‌రెడ్డి మినహా మిగతా వారంతా తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్న వారే. సహజంగా పీసీసీ అధ్యక్షుడే ఎన్నికల తరువాత సీఎం రేసులో ముందుంటారు. ఈ తరుణంలో జైరాం దళిత సీఎం నినాదాన్ని ముందుకు తేవడంతో వారు ఖిన్నులయ్యారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. సీఎం సీటు కోసం వర్గాలుగా విడిపోయారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తాత్కాలికంగా వర్గ విభేదాలను పక్కనపెట్టి అంతా కలసికట్టుగా ఉన్నామనే సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘‘తెలంగాణ సాధనలో మేమే ముందున్నాం. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాం. రాళ్ల దాడులకు గురయ్యాం. ఒక దశలో నియోజకవర్గానికి వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొన్నాం. అయినా వెనుకడుగు వేయకుండా నాలుగేళ్లుగా కాంగ్రెస్ నేతలందరిలో మనోస్థైర్యం నింపేందుకు ప్రయత్నించాం. నిత్యం సభలు, సమావేశాలు పెట్టాం. ఇన్ని కష్టాలు, నష్టాలు అనుభవించిన మమ్మల్ని కాదనడం, ఎన్నికల తరుణంలో ఇలాంటి ప్రకటనలు చేయడం సమంజసం కాదు’’ అని దక్షిణ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీకి దూరమైన ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకే ‘దళితుడే సీఎం’ అనే నినాదాన్ని జైరాం ముందుకు తెచ్చారన్న వాదన కూడా ఉంది. అయితే ఆయన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లోని ఎస్సీ నేతల్లోనూ చీలికకు కారణమయ్యేలా ఉన్నాయని పీసీసీ ఎస్సీ విభాగం నేతలంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాబోయే సీఎం అని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తుండగా, సీఎం రేసులో తానూ ఉన్నానని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రకటించారు. మాజీమంత్రి గీతారెడ్డి, మరికొందరు నేతలు కూడా ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పడు ఇలాంటి నేతల మధ్య పోటీ తీవ్రమై, మరిన్ని చిక్కులు వస్తాయని ఆ నేతలు అంటున్నారు. -
తెలంగాణకు దళితుడే సీఎం: జైరాం రమేశ్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేస్తాం: జైరాం రమేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి అన్ని సెంటిమెంట్లను కాంగ్రెస్ ఖాతాలోనే వేసుకుంటాం సాక్షి, నిజామాబాద్/ న్యూస్‌లైన్, కరీంనగర్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ హామీ ఇచ్చారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానం మనస్సులో ఉందన్నారు. తెలంగాణకు కాబోయే సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రాహుల్‌గాంధీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజుకు అప్పగించారని చెప్పారు. జైరాం రమేశ్ సోమవారం నిజామాబాద్, కరీంనగర్లో విలేకరుల సమావేశాల్లో, నిజామాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీల వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే ఇక్కడ సమగ్రాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఇది టీ-20 మ్యాచ్ కాదని, సుదీర్ఘ ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, తెలంగాణను మరో జార్ఖండ్‌లా కానీయొద్దని అన్నారు. టీఆర్ఎస్ ఏర్పడిన 2001కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కోరిందని తెలిపారు. 2000లో బీజేపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఏర్పాటు ఏమైందని ఆ పార్టీ నేత ఎల్కే అద్వానీకి సోనియా లేఖ రాశారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో టీఆర్ఎస్ పాత్ర శూన్యమని అన్నారు. అన్ని సెంటిమెంట్లను కాంగ్రెస్ ఖాతాలోనే వేసుకుంటామని తెలిపారు. టీఆర్ఎస్తో పొత్తుపై అత్యున్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం సొంతంగా గెలిచేంత బలం ఉందంటున్నారని చెప్పారు. హైదరాబాద్ ఆదాయం పూర్తిగా తెలంగాణకే చెందుతుందని, ఇక్కడ ఎవరైనా ఉండవచ్చని తెలిపారు. 1959, 1979, 2002, 2009లలో వెలువడిన తీర్పులు, రాజ్యాంగంలోని ఆర్టికల్-3, 4 ప్రకారమే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. విభజనపై ఎవరు కోర్టుకు వెళ్లినా ఒరిగేదేమీ లేదన్నారు. సింగరేణిపై పూర్తి అధికారం తెలంగాణ రాష్ట్రానికే ఉంటుందని చెప్పారు. తెలంగాణలో నాలుగేళ్లలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటు నిర్మిస్తామని, ఇది గ్యాస్ ఆధారితమా, బొగ్గు ఆధారితమా అనేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి పదేళ్ల పాటు కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ర్టంలోనూ పరిశ్రమలకు పన్ను రాయితీ ఉంటుందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే పార్టీ తరపున అవకాశం ఇస్తామన్నారు. సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, అందువల్లే ఇన్ని చిక్కులు వచ్చాయని అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు చర్చకు వచ్చినప్పుడు బీజేపీ అగ్రనేతలు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలు భిన్నమైన ప్రకటనలు చేసి ద్వంద్వ విధానాన్ని ప్రదర్శించారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఈ నెల 19న తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను కలుస్తామని చెప్పారు. ఈనెల 18న సీమాంధ్ర, తెలంగాణ జేఏసీలతో భేటి అవుతామన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్ సీఎంగా ఉండగా చట్టం కూడా చేశారని తెలిపారు. అయితే, న్యాయపరమైన సమస్యలతో రిజ ర్వేషన్ నిలిచిపోయిందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, మాజీ మంత్రులు పి.సుదర్శన్ రెడ్డి, షబ్బీర్‌అలీ, మాజీ విప్ ఈరవత్రి అనిల్, ఎంపీలు మధుయాష్కీ, సురేశ్ షెట్కార్, పొన్నం ప్రభాకర్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ మారాడా! ‘అనంత వె ంకట్రామిరెడ్డి పార్టీ మారాడా..! అయితే ఓకే ఓకే’.. అంటూ జైరాం రమేశ్ విలేకరుల సమావేశంలో తడబడ్డాడు. మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డిలు పార్టీ మారడంపై స్పందిస్తూ.. ‘ కాంగ్రెస్‌లో సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. పదవులు, అధికారం కోసం పాకులాడే వారు వెళ్లారు’ అని అన్నారు. ఇదే సందర్భంగా పార్టీలో జనాకర్షణ, సత్తా ఉన్న రఘువీరారెడ్డి, మాణిక్యవరప్రసాద్, చింతా మోహన్, అనంత వెంకట్రామిరెడ్డిలాంటి నేతలున్నారని అన్నారు. పక్కనే ఉన్న డి.శ్రీనివాస్, ఎంపీలు పొన్నం ప్రభాకర్‌లు కలుగచేసుకుని ‘అనంత’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. దీంతో ‘ అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ మారారా... ఒకే ఒకే ’ అని అన్నారు. -
సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకే పాదయాత్ర
ఆలంపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకే కార్తీక్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని.. ప్రత్యేక రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖరేనని ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి అన్నారు. శనివారం కార్తీక్‌రెడ్డి తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపేందుకే కార్తీక్‌రెడ్డి పాదయాత్రను చేపట్టారని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి, మాజీ హోంమంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి, డా.ఎ.చంద్రశేఖర్‌లు తమ పదవులను త్యాగం చేసి ఉద్యమించారని గుర్తు చేశారు. ఇంద్రారెడ్డి ఆశయాల సాధనకు కార్తీక్‌రెడ్డి పూనుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. కార్తీక్‌రెడ్డి జిల్లాలో మంచి నాయకునిగా ఎదగేందుకు ప్రజలు ఆశీర్వదించాని ఆయన కోరారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు పాదయాత్ర పట్ల మతిభ్రమించిన వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. అధికారంలో ఉండి కూడా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన సోనియాగాంధీకి రుణపడి ఉండాలని పిలుపు నిచ్చారు. దాహం వేపసినప్పుడు గ్లాసు నీరు ఇస్తేనే కృతజ్ఞతలు తెలుపుతాం.. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియమ్మ కాళ్లు మొక్కినా తప్పులేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే 111జీఓను ఎత్తివేస్తామని అన్నారు. ఇక్కడి ప్రజల చిరకాల కోరిక వికారాబాద్ జిల్లా కేంద్రంగా ప్రకటించడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తెచ్చామో.. వికారాబాద్ జిల్లాను కూడా అలాగే తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్ నాయకులు కార్తీక్‌రెడ్డి, రంగారెడ్డి, చంద్రశేఖర్‌లను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. హఫీజ్, మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, జిల్లా లీగల్‌సెల్ మాజీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ైచె ర్మన్ రాంచంద్రారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య, సీనియర్ నాయకులు చెట్టెపు మల్లారెడ్డి, పోలీస్ రాంరెడ్డి, తరిగోపుల సంగమేశ్వర్, ఏనుగు మురళిధర్‌రెడ్డి, ఆర్.నర్సింలు, రవీందర్‌రెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశం గుప్తా, రవికాంత్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, నర్సింలు పాల్గొన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేస్తాం: కార్తీక్‌రెడ్డి వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేసేందుకు పాటుపడతానని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. కార్తీక్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం వికారాబాద్‌లో ప్రవేశించింది. ఈ సంద ర్భంగా యాత్ర కొత్రెపల్లి, శివారెడ్డిపేట, ఎన్నెపల్లి, సాకేత్‌నగర్ వికారాబాద్ రైల్వే బ్రిడ్జిల మీదుగా భారీగా పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు అమరులయ్యారని, వారి కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన తమ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీకి కృతజ్ఞత తెలిపేందుకే పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. పార్టీ అంగీకరిస్తే ఎంపీగా పోటీ చేస్తా పూడూరు: కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే ఎంపీగా పోటీ చేస్తానని కార్తీక్‌రెడ్డి స్పష్టంచేశారు. పాదయాత్ర సందర్భంగా శనివారం మండల పరిధిలోని ఎన్కెపల్లి హిట్స్ కళాశాలలో బస చేసిన కార్తీక్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నవ నిర్మాణం పేరుతో చేపట్టిన పాదయాత్ర కేవలం ప్రజల కోసమేనని రాజకీయ లబ్ధి కోసం కాదన్నారు. కొందరు గిట్టనివారు దీన్ని రాజకీయం చేయడాన్ని ఆయన కొట్టిపారేశారు. తెలంగాణ కోసం కలలు కన్న తన నాన్న ఇంద్రారెడ్డి ఆశయం నెరవేరిందని, ప్రజల ముఖంలో సంతోషాలను చూడాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టానన్నారు. అంతేకాకుండా ‘మా నాన్న ఎంపీని కావాలనుకునేవారు. ఆ కల నెరవేర్చేందుకు పార్టీ అంగీకరిస్తే చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నా’నన్నారు. పార్టీ టికెట్టు ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పటిష్టతకు కృషి చేస్తానని తెలియజేశారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి టి.రామ్మోన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సుభానయ్య,సురేందర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఎన్కెపల్లి సర్పంచ్ దయాకర్, షకీల్, అబ్బాస్‌ఖాన్ పాల్గొన్నారు.