damodaram sanjeevaiah
-
విద్యార్థినులకు ‘ప్రత్యేక’ సెలవు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్ఎల్యూ) విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ప్రకటించింది. కేవలం మెయిల్ ద్వారా ఈ ప్రత్యేక సెలవు తీసుకునే అవకాశం విద్యార్థినులకు కల్పించింది. ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నెలసరి సమయాల్లో మహిళల్లో వచ్చే కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.నెలసరి సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడంలేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్ సరి్టఫికెట్ సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సెలవు కోరుతూ యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజి్రస్టార్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దేశంలో 8 యూనివర్సిటీల్లో అమలు ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ విధానం అమల్లో ఉంది. రాయిపూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, ముంబై, ఔరంగాబాద్‌ల్లో ఉన్న మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీలు, భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ, జబల్పూర్లోని ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సార్, అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడిíÙయల్ అకాడమీల్లో ఈ వి«ధానం అమలవుతోంది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీ ఎనిమిదోది. -
చిరస్మరణీయుడు సంజీవయ్య
– నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య – నంద్యాల చెక్‌పోస్ట్‌లో సంజీవయ్య విగ్రహానికి ఘన నివాళి కర్నూలు సీక్యాంప్: మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని. మాల మహానాడు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల సంక్షేమానికి పాటుపడిన సంజీవయ్య రాష్ట్రంలో భూసంస్కరణలు తీసుకువచ్చిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. పేద దళితులు వ్యవసాయం చేసుకునేందుకు ఆయన భూ పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు యం.నాగరాజు, జిల్లా అధ్యక్షుడు మధు, నాయకులు గోపాల్, మద్దిలేటి,కోటి తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు గర్వకారణం దళిత కుటుంబంలో పుట్టిన దామోదరం సంజీవయ్య క్రమంగా జాతీయస్థాయికి ఎదిగిన గొప్ప నేత అని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా నంద్యాల చెక్‌పోస్ట్‌లోని సంజీవయ్య విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహా మనిషి సంజీవయ్య అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి మన కర్నూలు జిల్లా వాసి కావడం మనక గర్వకారణం అని పేర్కొన్నారు. ఆదర్శనీయులు దామోదరం దామోదరం సంజీవయ్య ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ అన్నారు. సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు, సహనంతో అనేక విజయాలు సొంతం చేసుకున్నారని చెప్పారు. అలాంటి వాటిని నేటి తరం ఆయుధాలుగా మలుచుకుని అభివృద్ధి చెందాలని కోరారు. -
రూ.40 కోట్లు పెరిగిన కృష్ణపట్నం వ్యయం
- పెరిగిన వ్యయానికి బోర్డు ఆమోదం - దిగుమతి కోల్‌పై సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం) ప్రాజెక్టు వ్యయం మరో రూ. 40 కోట్లు పెరిగింది. పెరిగిన వ్యయానికి మంగళవారం జరిగిన కృష్ణపట్నం పాలక మండలి సమావేశం ఆమోదం తెలిపింది. ఏపీ జెన్కో ఎండీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు. 1600 మెగావాట్లతో ఏర్పాటు చేసిన కృష్ణపట్నం ప్రాజెక్టు ప్రతిపాదిత వ్యయం రూ. 8,500 కోట్లు. ఆ తర్వాత దీన్ని రూ. వెయ్యి కోట్లకు పెంచారు. తాజా పెరుగుదలతో నిర్మాణ వ్యయం రూ. 9,500 కోట్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రాజెక్టు వ్యయం మెగావాట్‌కు 5.95 కోట్లకు చేరింది. పూర్తయ్యే నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ (సీఈఏ) నిబంధనల మేరకు మెగావాట్ రూ. 5.5 కోట్లే ఉండాల్సి ఉన్నా, దీనిపై సమగ్ర వివరాలతో సీఈఏను ఒప్పించాలని నిర్ణయించారు. కృష్ణపట్నం రెండో దశ వాణిజ్య ఉత్పత్తి తేదీ (సీవోడీ)పై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విదేశీ బొగ్గును ఢిల్లీకి చెందిన ఎంఎంటీసీ సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. కోల్ ఇండియా నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ఎంత ధరకు అందిస్తాడనే అంశాలపై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. మీ వాటా మీకిస్తాం... ప్రాజెక్టు వదిలేయండి ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్టు తెలిసింది. కృష్ణపట్నం విద్యుత్ వాటా అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో షెడ్యూల్ కూడా చేయడం లేదు. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి, కృష్ణపట్నం నిర్మాణ వ్యయంలో తెలంగాణ వాటా ఇస్తామని, ప్రాజెక్టును ఏపీ పరం చేయాలని ఏపీ జెన్కో ఎండీ సూచించినట్టు తెలిసింది. అయితే, దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చించాల్సి ఉందని తెలంగాణ అధికారులు అన్నట్టు సమాచారం. -
తెలంగాణ ఉద్యమ శిఖరం
ఆదర్శం: బాపూజీ 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించారు. జీవితాంతం తాడిత పీడిత ప్రజల పక్షాన్నే నిలిచారు. దేశభక్తిపూరిత వందేమాతర ఉద్యమం నుంచి, ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ ఉద్యమం వరకు ఆయన జీవితం ఉద్యమాలతోనే ముడివడి ఉంది. దురదృష్టవశాత్తూ తెలంగాణ కల సాకారమైన రోజు ఆయన మన మధ్య లేకుండా పోయారు. రావుల శంకర్, ఆసిఫాబాద్ బాపూజీ స్వస్థలం అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రస్తుత మహారాష్ట్రలోని రాజూర గ్రామం. 1915 సెప్టెంబర్ 27న ఆయన ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ సమీపంలోని వాంకిడిలోని మేనత్త ఇంట్లో జన్మించారు. అమ్మక్క, బాపూజీల చివరి సంతానం లక్ష్మణ్. ముగ్గురు సోదరులు, ఒక సోదరి. మూడేళ్ళకే తల్లి దూరమవ్వడంతో మేనత్త వద్దే పెరిగారు. ఐదేళ్ల వయసులో తండ్రితో పాటు రాజూర వెళ్లాడు. అక్కడే బడికి వెళ్లాడు. లక్ష్మణ్ తండ్రి రాజూరలో పోస్ట్‌మెన్‌గా పనిచేసేవారు. లక్ష్మణ్ బార్ ఎట్ లా చదివారు. మద్రాస్‌కు చెందిన డాక్టర్ శకుంతలా దేవిని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు. లక్ష్మణ్ హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో జైలుపాలయిన బడుగు బలహీనుల కేసులను ఎక్కువగా వాదించేవారు. న్యాయస్థానంలో చాకలి ఐలమ్మకు న్యాయం చేసేందుకు కృషిచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ హైదారాబాద్ సం స్థానం పౌర విమోచనోద్యమంలో 1938లో మొదటి సారి అరెస్టయ్యారు. 1941-42లో ఖద్దరు ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమయ్యారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆలుపెరుగని పోరాటం చేశారు. 1952 ఎన్నికల్లో ఆసిఫాబాద్ తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. 1957, 62, 67, 72ల్లో నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. మొత్తంమీద బాపూజీ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్‌గా, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అష్టకష్టాలు పెట్టినా నిబ్బరంగా ముందుకెళ్ళారు. నిలువ నీడ లేకుండా చేసినా అద్దె ఇంట్లోనే తలదాచుకుని, తెలంగాణ కోసం తలెత్తుకుని ఉద్యమించారు. పుట్టి పెరిగిన వాంకిడిలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమైన కొన్ని ఘట్టాలు హెదరాబాద్ సంస్థాన్‌ను విలీనం చేయాలనే ఉద్యమం కారణంగా 13 సార్లు అరెస్టు అయ్యారు. 1950లోనే హైదరాబాద్‌లో బీసీ సంఘాన్ని స్థాపించి, బీసీల అభివృద్ధికై అహర్నిశలు కృషి చేశారు. 1957-60 వరకు రాష్ట్ర క్యాబినేట్లో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 1960-62 వరకు దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో పలు కీలక శాఖలు నిర్వహించారు. 1967-69 వరకు కాసు అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి హాయంలో కార్మిక మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా పని చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో అప్పటి ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించింది. - కొండా లక్ష్మణ్ బాపూజీ