చిరస్మరణీయుడు సంజీవయ్య
చిరస్మరణీయుడు సంజీవయ్య
Published Tue, Feb 14 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM
– నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య
– నంద్యాల చెక్‌పోస్ట్‌లో సంజీవయ్య విగ్రహానికి ఘన నివాళి
కర్నూలు సీక్యాంప్: మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని. మాల మహానాడు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల సంక్షేమానికి పాటుపడిన సంజీవయ్య రాష్ట్రంలో భూసంస్కరణలు తీసుకువచ్చిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. పేద దళితులు వ్యవసాయం చేసుకునేందుకు ఆయన భూ పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు యం.నాగరాజు, జిల్లా అధ్యక్షుడు మధు, నాయకులు గోపాల్, మద్దిలేటి,కోటి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు గర్వకారణం
దళిత కుటుంబంలో పుట్టిన దామోదరం సంజీవయ్య క్రమంగా జాతీయస్థాయికి ఎదిగిన గొప్ప నేత అని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా నంద్యాల చెక్‌పోస్ట్‌లోని సంజీవయ్య విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహా మనిషి సంజీవయ్య అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి మన కర్నూలు జిల్లా వాసి కావడం మనక గర్వకారణం అని పేర్కొన్నారు.
ఆదర్శనీయులు దామోదరం
దామోదరం సంజీవయ్య ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ అన్నారు. సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు, సహనంతో అనేక విజయాలు సొంతం చేసుకున్నారని చెప్పారు. అలాంటి వాటిని నేటి తరం ఆయుధాలుగా మలుచుకుని అభివృద్ధి చెందాలని కోరారు.
Advertisement
Advertisement