Dance School
-
డ్యాన్స్ స్కూల్: కొవ్వు తగ్గిస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్లి..
సాక్షి, కంటోన్మెంట్: డ్యాన్స్ స్కూల్లో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిర్వాహకుడిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించిన వివరాల మేరకు తిరులమగిరి దుర్గావిహార్ కాలనీలో నివాసముండే బాలిక బోయిన్పల్లి మార్కెట్ సమీపంలోని అర్బన్ డ్యాన్స్ వరల్డ్‌లో మూడు నెలలుగా శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో సంబంధిత డ్యాన్స్ స్కూల్ నిర్వాహకుడు సుదర్శన్ బాలిక నడుము వద్ద కొవ్వును తగ్గిస్తానని, అందుకు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8గంటల సెషన్లో వర్కవుట్స్‌కు రావాల్సిందిగా సూచించాడు. దీంతో బాలిక గత నెల 26 నుంచి ఉదయం వేళలో వర్కవుట్స్‌కు వెళ్తోంది. తను ఇచ్చే శిక్షణకు సంబంధించి ఇన్‌స్ట్రాగామ్ రీల్ చేయాల్సి ఉంటుందని బాలికకు సూచించాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వర్కవుట్స్ సమయంలో డ్యాన్స్ స్కూల్‌కు వచి్చన బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మరుసటి రోజు బాలిక ఇంట్లో వాళ్లకు విషయం తెలుపగా డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: భర్త మందలింపు; టైలరింగ్ షాప్‌కు వెళ్తున్నానని చెప్పి.. -
డ్యాన్స్ స్కూల్‌కు వచ్చిన యువతులను..
సాక్క్షి, గచ్చిబౌలి(హైదరాబాద్): డ్యాన్స్ స్కూల్స్ పేరిట డబ్బు కాజేసి మోసాలకు పాల్పడి ఆపై యువతులను లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలో నివాసముండే విజయవాడకు చెందిన వి.చిరంజీవి(27) స్థానికంగా జుంబా డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తూ నగరంలో మరో రెండు డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నాడు. డ్యాన్స్‌కు వచ్చిన యువతులను మభ్యపెట్టి డ్యాన్స్ స్కూల్ పెడితే లాభాలు వస్తాయని నమ్మించాడు. ఈ క్రమంలో టీఎన్జీవోస్కు చెందిన యువతి రూ.9 లక్షలు, హైదర్షాకోట్కు చెందిన యువతి రూ.6 లక్షలు ఇచ్చారు. డ్యాన్స్ స్కూల్స్ పెట్టకపోగా వారిని లైంగికంగా వేధించాడు. దీంతో బాధితులిద్దరు ఈ నెల 4న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రణమ్య సూరీ నాట్య ప్రదర్శన
డల్లాస్ : ప్రముఖ నాట్య కళాకారిణి ప్రనమ్య సూరీ నాట్య ప్రదర్శన డూప్రీ థియోటర్లో ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్లో ఆదివారం జరిగింది. ‘‘లాస్య గతిక’’ అనే నాట్య రూపకాన్ని ఆమె ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఆమె తల్లి, గురువు డా. శ్రీలతా సూరీ హాజరయ్యారు. ప్రణమ్యా సూరి పలు ప్రతిష్టాత్మకమైన వేదికలమీద నాట్యప్రదర్శనలు ఇచ్చారు. వీటిలో నాట్యంజలి డాన్స్ ఫెస్టివల్ (చిదంబరం), దేవదాసి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ (భువనేశ్వర్,) కజురాహో ఫెస్టివల్, కోనార్క్ డాన్స్ ఫెస్టివల్, సుర్ సింగర్ సంసద్ & హరిదాస్ సమ్మెలన్ (ముంబై), వివిద ఐసీసీఆర్ కార్యక్రమాలు ప్రతిష్టాత్మక వేదికలలో ప్రదర్శించారు. ఢిల్లీ, కటక్, వైజాగ్, మంగ్లోర్, హైదరాబాద్, కుచిపుడి నృత్యోత్సవ్, నాడా నీరజనమ్ (తిరుమల) తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె పలు అవార్డులు అందుకున్నారు. నాట్య విశారద, శృంగార మణి, నలంద నృత్య నిపున, నాట్య సరధి, యువరత్న తదితర ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఈమె ఎకోస్ ఆఫ్ ఇండియా లాంటి పలు ఎన్జీఓ సంస్థలను స్థాపించడమే కాకుండా నృత్య ప్రదర్శన చేస్తు విరాళాలు సేకరిస్తున్నారు. -
కల నిజమవుతోంది
కలలు అందరూ కంటారు. అయితే కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. నటి పూర్ణ కూడా చిరకాల కలను ఇప్పుడు నెరవేర్చుకోబోతోందట. కేరళకు చెందిన ఈ బ్యూటీ బహుభాషా నటి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో విత్తగన్, జన్నల్ ఓరం, తగరారు తదితర చిత్రాల్లో నటించింది. తెలుగులోను పలు హిట్ చిత్రాల్లో నటించిన పూర్ణ స్వతహాగా మంచి డ్యాన్సర్. అలాంటి ఈమెకు ఒక డ్యాన్స్ స్కూల్ నెలకొల్పాలన్నది చిరకాల కోరిక. అది ఇప్పటికీ నెరవేరబోతోందన్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతోంది. దీని గురించి పూర్ణ తెలుపుతూ ఒక నృత్య పాఠశాల ప్రారంభించాలన్నది తాను చాలా కాలంగా పెంచి పోషిస్తున్న డ్రీమ్ అంది. దాన్నిప్పుడు నెలకొల్పడానికి తన తండ్రి సాయం చేస్తున్నారని చెప్పింది. తన సొంత ఊరు కేరళలోని కున్నూర్‌లో ఈ నృత్య పాఠశాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. తాను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నటినని పేర్కొంది. అయినా పలు రకాల నృత్యాల్లో శిక్షణ పొందడానికి తన కుటుంబం ప్రోత్సహించిందని చెప్పింది. తొలుత నృత్యానికే పరిమితమైన తాను ఆ తరువాత రియాలిటీ షోలకు అక్కడి నుంచి సినీ రంగ ప్రవేశం చేశానని తెలిపింది. పలు స్టేజీ ప్రదర్శనలు కూడా చేశానని చెప్పింది. ఇప్పటికీ స్టేజీ నాటకాలంటే ఆసక్తి అని తెలిపింది. ప్రస్తుతం తానీ స్థాయికి చేరడానికి తన తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహమే కారణంగా పేర్కొంది. తనకు డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండడంతో సినిమాల్లో పాటల సన్నివేశాల్లో చాలా సులభంగా నటించగలుగుతున్నానంది. అయితే సినిమా నృత్య దర్శకత్వం టోటల్లీ డిఫరెంట్ అని పూర్ణ అంటోంది. -
పద్మశ్రీ ఇలియానాపై పోలీసు కేసు
ఒడిసాలో తాను నడుపుతున్న డాన్సు స్కూలులో ఓ విద్యార్థితో దురుసుగా ప్రవర్తించినందుకు ఇలియానాపై పోలీసు కేసు నమోదైంది. ఇటలీలో పుట్టి, ఒడిసీ నృత్యం నేర్చుకుని.. అదే అంశంలో పద్మశ్రీ అవార్డు కూడా స్వీకరించిన ఇలియానా సిటారిస్టి బిందుసాగర్ ప్రాంతంలో డాన్సు స్కూలు నడిపిస్తున్నారు. తన పదేళ్ల కుమార్తె దివ్యరూప అక్కడ డాన్సు నేర్చుకుంటోందని, ఆమెపై ఇలియానా దురుసుగా ప్రవర్తించారని బాధితురాలి తండ్రి కమల కాంత దాస్ ఆదివారం నాడు భువనేశ్వర్‌లోని లింగరాజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం మంగళవారం రాత్రే ఆ కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. బాధితురాలి తండ్రి మాత్రం ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. మరోవైపు ఇలియానా కూడా తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమని అంటున్నారు. తాను ఆ పాపను కొట్టడం గానీ, తిట్టడం గానీ ఏమీ చేయలేదని చెబుతున్నారు. 'ఆర్ట్ విజన్ అకాడమీ' అనే తన డాన్సు స్కూల్లో 40 మందికి ఆమె డాన్సు నేర్పుతున్నారు. పోలీసులు మాత్రం ఆమెపై ఐపీసీ సెక్షన్లు 341, 323, బాలల చట్టంలోని సెక్షన్ 23 కింద కేసులు నమోదుచేశారు. బాలికకు వైద్య పరీక్షలు చేయించాము గానీ, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేనట్లు తెలిసిందని డీసీసీ నితిన్జీత్ సింగ్ తెలిపారు. -
పాహిమాం.. రాఘవేంద్ర
న్యూస్‌లైన్, మంత్రాలయం (కర్నూలు): జగద్గురుని మహా రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. భక్తజనుల శ్రీగురుని నామజపం.. వేదపండితులు వేదపఠనం.. మంగళవాయిద్యాల సుస్వరాగం.. కళాకారుల కోలాహలం మధ్య లోకగురువు మహారథంపై ఊరేగారు. రాఘవుని రథయాత్రతో వేదభూమి వైభవం చాటగా తుంగభద్రమ్మ పరవశించింది. రాఘవరాయుడి కీర్తిని భక్తజనం పొగడగా..కళాకారుని అందె చిందేసింది. రాఘవేంద్రుడి 342వ ఆరాధన సప్త రాత్రోత్సవాల్లో భాగంగా ఉత్తరాధన సందర్భంగా మహారథయాత్ర నిర్వహించారు. మఠం పీఠాధిపతి సుయతీంధ్రతీర్థులు, ఉత్తరాధికారి సుభుదేంద్రతీర్థులు ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులను మహారథంపై ఉంచి పూజలు, మహా మంగళాహారథులు ఇచ్చారు. భక్తులకు రాఘవేంద్రుడి మహిమలతో కూడిన చరితను వినిపించి మహారథయాత్రకు అంకురార్పన చేశారు. శ్రీమఠం ప్రాంగణం నుంచి ప్రధాన ముఖద్వారం మీదుగా రాఘవేంద్రుల సర్కిల్ వరకు అంగరంగా వైభవంగా రథయాత్ర సాగింది. సర్కిల్ మీదుగా మఠం ప్రాంగణం వరకు లాగి యాత్రకు ముగింపు పలికారు. నేడు సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన రాఘవేంద్రుల ఆరాధన సప్త రాత్సోవాల్లో సందర్భంగా శనివారం పూర్వపు పీఠాధిపతులు సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన నిర్వహిస్తారు. ఉభయపీఠాధిపతులు సుయతీంద్రతీర్థులు, సుభుదేంద్రతీర్థులు వారి పటాలకు విశిష్టపూజలు నిర్వహిస్తారు. యోగీంద్ర సభా ప్రాంగణంలో బెంగుళూరుకు చెందిన మదుసూధన్ నందగిరిచే దాసవాణి ఉంటుంది. బళ్లారికి చెందిన కళాక్షితి డ్యాన్స్ స్కూల్ బందంచే భరతనాట్య ప్రదర్శన నిర్వహిస్తారు.