
ప్రతీకాత్మక చిత్రం
సాక్క్షి, గచ్చిబౌలి(హైదరాబాద్): డ్యాన్స్ స్కూల్స్ పేరిట డబ్బు కాజేసి మోసాలకు పాల్పడి ఆపై యువతులను లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. గచ్చిబౌలి టీఎన్‌జీవోస్ కాలనీలో నివాసముండే విజయవాడకు చెందిన వి.చిరంజీవి(27) స్థానికంగా జుంబా డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తూ నగరంలో మరో రెండు డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నాడు.
డ్యాన్స్‌కు వచ్చిన యువతులను మభ్యపెట్టి డ్యాన్స్ స్కూల్ పెడితే లాభాలు వస్తాయని నమ్మించాడు. ఈ క్రమంలో టీఎన్‌జీవోస్‌కు చెందిన యువతి రూ.9 లక్షలు, హైదర్షాకోట్‌కు చెందిన యువతి రూ.6 లక్షలు ఇచ్చారు. డ్యాన్స్ స్కూల్స్ పెట్టకపోగా వారిని లైంగికంగా వేధించాడు. దీంతో బాధితులిద్దరు ఈ నెల 4న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment