danger warning
-
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చిం ది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 14,36,573 క్యూసెక్కుల వరద ప్రవాహంతో నీటి మట్టం 53.2 అడుగులకు చేరుకుంది. దాంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. (గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న భద్రాచలం వద్దకు గరిష్టంగా 27.02 లక్షల క్యూసెక్కుల వరద వచి్చనప్పుడు నీటి మట్టం 75.6 అడుగులుగా నమోదైంది). కూనవరం వద్ద శబరి ఉధృతి మరింత పెరిగింది. నీటి మట్టం 41.35 మీటర్ల (సముద్ర మట్టానికి)కు చేరుకోవడంతో కూనవరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారుపోలవరం ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 11,87,497 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో పోలవరం స్పిల్ వే ఎగువన నీటి మట్టం 33.5 మీటర్లకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,29,774 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 9,500 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 13,20,274 క్యూసెక్కులను 175 గేట్లు పూర్తిగా ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్య గోదావరి బేసిన్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదివారం కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అప్రమత్తం చేసింది. నీట మునిగిన రహదారులు » గోదావరికి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంతర్గత రహదారులు నీట మునిగాయి. » ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నుంచి బూర్గంపాడుకు వెళ్లే రహదారులు పలు చోట్ల వరద నీట మునిగి రాకపోకలు స్థంభించాయి. వెంకటాపురం నుంచి తిమ్మంపేట వెళ్లే రహదారి వరద నీటితో నిండిపోయింది. వరద పెరిగితే కుక్కునూరు నుంచి అశ్వారావుపేట వెళ్లే రహదారి సైతం నీట మునిగే అవకాశం ఉంది. పలు గ్రామాల్లో పంట చేలను ముంచెత్తింది. పలు గ్రామాల్లో ఇళ్లు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. » తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లపూడి, పెరవలి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో పంటలు నీట మునిగాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్పనపల్లి, ఎదురుబిడెం, కనకాయలంక కాజ్‌వేలపై వరద నీరు ప్రవహిస్తోంది. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. మలికిపురం, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. » పలు డ్రెయిన్ల నుంచి ముంపు నీరు అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల ద్వారా గౌతమి, వృద్ధ గౌతమీ, వైనతేయ, వశిష్ట గోదావరి నదీపాయల ద్వారా దిగాల్సి ఉంది. అయితే గోదావరి వరదతో స్లూయిజ్‌ల గేట్లు మూసుకుపోయాయి. దీంతో డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో 4,151 ఎకరాల్లో వరి పంట దెబ్బ తింది. ఈ నష్టం మరింత పెరగనుందని రైతులు వాపోతున్నారు.వరద నష్టం లేనిచోట మంత్రుల పర్యటనవేలేరుపాడు/తణుకు టౌన్: పెద్దవాగు ప్రవాహం వల్ల తమ ఇళ్లు కొట్టుకుపోయి సర్వస్వం కోల్పోయిన వరద బాధితుల గ్రామాల్లో పర్యటించాల్సిన నలుగురు రాష్ట్ర మంత్రులు ఏ నష్టం జరగని ప్రాంతాల్లో శనివారం పర్యటించడం పట్ల జనం విస్తుపోతున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని మేడేపల్లి, కమ్మరిగూడెం, అల్లూరినగర్, ఒంటిబండ, కోయమాధారం, రాళ్లపూడి, రామవరం, ఉదయ్‌నగర్, ఊటగుంపు, యిప్పలగుంపు, సొందే గొల్లగూడెం, వసంతవాడ, మద్దిగట్ల, పాత పూచిరాల తదితర గ్రామాల్లో ఈ నెల 18న పెద్దవాగు ఆనకట్ట తెగిపోవడంతో 12 గ్రామాల్లో 513 ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆయా గ్రామాల బాధితులు సర్వస్వం కోల్పోయారు. ఈ గ్రామాల్లో పర్యటించకుండా ఏ సమస్యలూ లేని కన్నాయిగుట్టను సందర్శించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొలుసు పార్థసారథి శనివారం ఆ ప్రాంతంలో పర్యటించారు. జల దిగ్బంధంలో ఉన్న తిర్లాపురం గ్రామానికి వెళ్లకుండానే కన్నాయిగుట్ట వద్ద గోదావరిని పరిశీలించి వెనుదిరిగారు. ఆ తర్వాత శివకాశీపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనం చేసి, వరదపై తూతూమంత్రంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తణుకు మండలం దువ్వలో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. -
భద్రాచలం వద్ద మహోగ్రంగానే..
సాక్షి, హైదరాబాద్/ భద్రాచలం/ గద్వాల రూరల్/ ధరూర్/ దోమలపెంట: రాష్ట్రవ్యాప్తంగా వానలు తెరిపినిచ్చినా.. ఇప్పటికే చేరిన నీటితో ఉప నదు లు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదా వరి మహోగ్ర రూపం కొనసాగుతోంది. శనివారం రాత్రి 10గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 16 లక్షల క్యూసెక్కులకు, నీటి మట్టం 56 అడుగులకు పెరిగింది. భారీగా వరద వస్తుండటంతో నీటి మ ట్టం మెల్లగా పెరుగుతూనే ఉంది. దీనితో అధికారు లు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నా రు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాల్లోనే ఉంచారు. మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత తదితరులు సహాయక చర్యలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. శనివారం మధ్యా హ్నం 2 గంటల వరకు కూడా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు భోజనం పెట్టకపోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్డీఓ మాధవి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు 3 గంటలకు భోజనం అందించారు. ఎగువ నుంచి తగ్గుతూ.. ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగిపోవడంతో.. ఎగువన గోదావరిలో వరద తగ్గు తోంది. శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 60వేల క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 2.95 లక్షలు, పార్వతి బ్యారేజీ వద్ద 3.01 లక్షలు, సరస్వతి బ్యారేజీ వద్ద 1.98 లక్షలు, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 10.80 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి శాంతించనుంది. భద్రాచలం నుంచి వెళ్తున్న భారీ వరద పోలవరం, ధవళేశ్వరం మీదుగా కడలిలోకి వెళ్లిపోతోంది. శ్రీశైలంలోకి 1.51 లక్షల క్యూసెక్కులు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్రలలోనూ వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కృష్ణాలో ఆల్మట్టిలోకి 1.30 లక్షల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్‌లోకి 88,228 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ ప్రాజెక్టుల్లో కాస్త నీటిని నిల్వ చేస్తూ, మిగతా దిగువకు వదులుతున్నారు. జూరాలకు శనివారం ఉద యం నుంచి సాయంత్రందాకా 2.20 లక్షల క్యూసె క్కుల వరదరాగా.. సాయంత్రానికి 1,35,900 క్యూసెక్కులకు తగ్గింది. ఇక్కడ గేట్లు, విద్యుత్ సరఫరా ద్వారా కలిపి 1,48,875 క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. దీనికి సుంకేశుల నుంచి 2,181 క్యూసెక్కులు కలిపి.. మొత్తం 1,51,056 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 61.79 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే మరో 157 టీఎంసీలు కావాలి. ఇక తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 69.23 టీఎంసీలకు పెరిగింది. -
పోటెత్తుతున్న గోదావరి.. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 14లక్షల 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి ప్రవహిస్తోంది. రాత్రికి 58 నుంచి 60 అడుగుల వరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. ఇప్పటివరకు 4,900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాలు వరదనీటిలో మునిగిపోయాయి. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. చదవండి: వానలు మిగిల్చిన విషాదం ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ సూచించారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌లకు కాల్ చేయాలి. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలి. జలాశయాల వద్దకు ప్రజలు రావద్దు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
వరద గోదారి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, దాని ఉప నదులు జలకళ సంతరించుకున్నాయి. ఎగు వన గోదావరిలోకి ప్రవాహాలు పెరుగుతుండగా.. కాళేశ్వరం దిగువన ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదులు, వాగుల నీటి చేరికతో నది ఉగ్రరూపం దాల్చుతోంది. మేడిగడ్డ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. దీనితో అధికారులు గురువారం మధ్యాహ్నమే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక్క గురువారం రాత్రి 8 గంటల సమయానికి 9,79,347 క్యూసెక్కుల ప్రవాహంతో వరద నీరు 44.1 అడుగులకు చేరింది. శుక్రవారం తెల్లవారు జాము సమయానికి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక అయిన 48 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రా లకు తరలిస్తున్నారు. ఇక ఎగువ గోదావరిలోనూ వరద పెరిగింది. మహారాష్ట్రలో, రాష్ట్రంలోని పరీ వాహక ప్రాంతంలో వానలతో శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి 59,165 క్యూసెక్కుల వరద చేరుతోంది. వచ్చిన వరద వచ్చినట్టుగానే.. ప్రాణహితలో వరద ఉధృతి పెరుగుతోంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోకి చేరుతున్న 5,37,140 క్యూసెక్కులను వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు దిగువన ఇంద్రావతి జలాలు తోడై సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీలోకి 8,76,940 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ మొత్తాన్నీ విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, కిన్నెరసాని సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు దాదాపు గరిష్ట మట్టానికి చేరగా.. తాలిపేరు 24 గేట్లు ఎత్తి 1,02,399 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వీటితోపాటు శబరి జలాలు కూడా కలసి గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. దీనితో కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం సబ్ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం భద్రాచలం రానున్నారు. వరద మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. పోలవరానికి పెరిగిన వరద భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి గోదా వరి ప్రవాహం పెరిగింది. గురువారం రాత్రి ఏడు గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 5,99,490 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 48 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నీటి మట్టం స్పిల్‌వే ఎగువన 31.88 మీటర్లు, దిగువన 23.3 మీటర్లుగా.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 32.55 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 22.73 మీటర్లుగా నమోదైంది. పోలవరం నుంచి నీరంతా ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ, మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత గోదావరి, దాని ఉప నదుల పరీవాహక ప్రాంతంలో గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గోదావరితోపాటు ఉప నదులు, వాగుల ప్రవాహాలతో ప్రభావం పడేచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా ఉప నదులకూజలకళ మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణా నది ఉప నదుల్లోనూ వరద ప్రారంభమైంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి 32,146 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి నిల్వ 32.24 టీఎంసీలకు చేరింది. ఆ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 97 టీఎంసీలు అవసరం. దీని దిగువన ఉన్న నారాయణ పూర్ డ్యామ్‌లోకి ఇంకా వరద మొదలవలేదు. ఇక కృష్ణా ఉపనది మలప్రభ నుంచి మలప్రభ ప్రాజెక్టులోకి 10,437 క్యూసెక్కులు, ఘటప్రభ ఉప నది నుంచి ఘటప్రభ ప్రాజెక్టులోకి 20,813 క్యూసెక్కులు వరద వస్తోంది. భద్ర నది నుంచి భద్ర రిజర్వాయర్‌లోకి 4,227 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి తుంగభద్ర డ్యామ్‌లోకి 9,536 క్యూసెక్కులు ప్రవాహాలు ఉన్నాయి. బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులోకి 12,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండితే ప్రధాన కృష్ణా నదిలోకి వరద మొదలుకానుంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. నెలాఖరు నాటికి ప్రధాన నదిలో ప్రవాహాలు పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు. కాగా, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో వానలతో కృష్ణా ఉప నది అయిన మూసీలో వరద ఉధృతి పెరిగింది. మూసీ ప్రాజెక్టులోకి 2,125 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి 1,800 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. -
గోదావరి.. ఉధృత ఝురి
పశ్చిమగోదావరి, నిడదవోలు/కొవ్వూరు : గోదావరి కాటన్ బ్యారేజీల వద్ద వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం కాస్త శాంతించిన గోదారమ్మ సోమవారం నుంచి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నా గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టాలు పెరుగుతున్నాయి. రెండో ప్రమాద హెచ్చరిక గోదావరి పరివాహక ప్రాంతాలైన కుంట, కొయిదా, పేరూరి, భధ్రాచలం ప్రాంతాలలో కురుస్తున్న భారీవర్షాలతో ప్రాణహిత, శబరి, పెనుగంగ, మంజీర ఉప నదుల నుంచి గోదావరి నదిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరగడంతో «ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ అధికారులు సోమవారం ఉదయం 11.30 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 13.10 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం రాత్రికి స్పల్పంగా తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు 14.30 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం హెడ్ వర్క్స్ అధికారులు మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి నీటి మట్టం 15.02 మీటర్లుగా నమోదైంది. కాటన్ బ్యారేజీల సామర్థ్యం మేరకు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం, మద్దూరులంక, బొబ్బర్లంకల వద్ద గోదావరి నదిపై ఉన్న కాటన్ బ్యారేజీల గేట్లను పూర్తిగా ఎత్తివేసి సోమవారం సాయంత్రం నాటికి 13.65 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో పెరుగుతున్న నీటిమట్టాలు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమవారం నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. కాళేశ్వరంలో 7.86 మీటర్లు, పేరూరు 12.00 మీటర్లు, దుమ్మగూడెం 12.07 మీటర్లు, భద్రాచలం 45.50 అడుగులు, కూనవరంలో 18.54 మీటర్లు, కుంటలో 13.10 మీటర్లు, రాజమండ్రి బ్రిడ్జి 17.87 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. విజ్జేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద «ఉదృతిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.జవహర్ సోమవారం పరిశీలించారు. వరద ముంపులో గోష్పాదక్షేత్రం కొవ్వూరులో గోష్పాద క్షేత్రం మళ్లీ వరద ముంపునకు గురైంది. ఆదివారం మధ్యాహ్నానికి వరద ముంపు నుంచి బయటపడినప్పటికీ మళ్లీ ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో సోమవారం ఉదయం రెండోసారి ముంపు బారిన పడింది. సుమారు మూడు అడుగుల మేరకు క్షేత్రంలో నీరు ప్రవహిస్తుంది. వరద ఉధృతి పెరగడంతో క్షేత్రంలోని ఆలయాలను మూసి వేశారు. భారీ వర్షాలతో మూతపడిన క్వారీలు భారీవర్షాల నేపథ్యంలో దేవరపల్లి, కొవ్వూరు మండలాల్లో ఉన్న సుమారు 132 క్వారీలు, 150 వరకు క్రషర్లు మూతపడ్డాయి. క్వారీల్లో వర్షపు నీరు చేరడంతో పాటు వాహనాల రాకపోకలకు అనువుగా లేకపోవడం తవ్వకాలు నిలిపివేశారు. -
వంశధారకు మొదటి ప్రమాద హెచ్చరిక
పాతపట్నం(శ్రీకాకుళం పాతపట్నం): గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా హీరమండలంలోని వంశధార నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.