Dark chocolates
-
నట్స్, డార్క్ చాక్లెట్స్, అరటి పండ్లు ఇష్టమా? డోపమైన్ అనే హార్మోన్‌ను విడుదల చేసి..
Health Tips In Telugu: ఒక్కోసారి కారణమేమీ లేకుండానే దిగులుగా అనిపిస్తుంది. విలువైన వస్తువులేవో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా చికాకు వేస్తుంటుంది.ఆ తర్వాత కాసేపటికి ఇష్టమైన వారెవరో కనిపిస్తేనో, ఏదైనా మంచి వార్తలు వింటేనో, ఏమయినా మంచి ఆహారం తింటేనో మూడ్ సరి అయిపోతుంది. ఇది మనసు చేసే మాయాజాలం. ఇదంతా జరగడానికి మన శరీరంలో ఉండే డోపమైన్ అనే హార్మోన్ విడుదలలో తేడాలు రావడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే అలా కారణం మాత్రమే చెప్పి ఊరుకోకుండా మంచి మూడ్‌లోకి తీసుకొచ్చే కొన్ని ఆహార పానీయాల గురించి కూడా చెప్పారు. వీటిని కేవలం మూడ్ బాగోలేనప్పుడే కాదు, రోజువారీ తీసుకుంటే ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు కదా.. ఇంతకూ అలాంటి ఆహార పానీయాలేమిటా అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వెళ్దాం... వీటితోబాటు ఆకుకూరలు, కాలీఫ్లవర్, బ్రోకలీ కూడా డోపమైన్ బూస్టర్‌గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు వీటిని కూడా ఆహారంలో చేర్చుకుంటే సరి. నట్స్ నట్స్‌లో అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అమైనో యాసిడ్‌కు డోపమైన్ విడుదలను పెంచే సామర్థ్యం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం... నట్స్‌లో టైరోసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ టైరోసిన్ విచ్ఛిన్నమైతే.. డోపమైన్‌గా తయారవుతుంది. వేరుశెనగలు, బాదం, గుమ్మడి గింజలు, నువ్వులలో టైరోసిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే ఉల్లాసంగా, ఆనందంగా ఉంటారు. కాఫీ సాధారణంగా చాలామందికి మూడ్ బాగోలేనప్పుడు లేదా తలనొప్పిగా అనిపించినప్పుడు మంచి ఫిల్టర్ కాఫీ తాగుతుంటారు. దాంతో శాడ్ మూడ్ కాస్తా తిరిగి హ్యాపీ మూడ్‌గా మారిపోతుంటుంది. ఒక పరిశోధన ప్రకారం రోజూ సుమారు బిలియన్ మందికి పైగా కాఫీ తాగుతుంటారు. రోజూ కాఫీ తాగేవారికి డిప్రెషన్ కూడా కాస్త దూరంలోనే ఉంటుందని కొన్ని సర్వేలలో తేలింది కాబట్టి నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే కాఫీ తాగే అలవాటున్నవారు దానిని కొనసాగించడం మంచిది. ఈసారెప్పుడైనా మూడ్ బాగోలేప్పుడు ఒక కప్పు కాఫీ తాగి చూస్తే సరి. కొబ్బరి పచ్చి కొబ్బరిలో మీడియం లెవెల్లో ట్రై గ్లిజరైడ్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని, మెదడుకు చైతన్యాన్ని ఇస్తాయి. కొబ్బరి పాలు, కొబ్బరితో చేసిన తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుంది. అందుకే కొబ్బరికి మూడ్ ఫుడ్ అనే పేరుంది. బెర్రీలు... సాధారణంగా పండ్లు, కూరగాయలు బాగా తీసుకునేవారి మానసిక ఆరోగ్యం బాగానే ఉంటుంది. వాటిలోనూ ప్రత్యేకించి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల బెర్రీలు తీసుకునే వారికి కుంగుబాటు, ఆందోళన ఆమడదూరంలో ఉంటాయి. బ్లూ బెర్రీలు అంటే నేరేడు పండ్ల వంటివి తీసుకోవడం వల్ల మూడ్ బాగుంటుంది. అవకాడో ఒకప్పుడు ఇది కాస్తంత ఖరీదైన ఆహారాల జాబితాలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ పండులో ఉండే మెత్తటి గుజ్జు అనేక రకాల పోషకాలకు నిలయం. దీనిలోని కొలీన్కు నాడీ వ్యవస్థను నియంత్రించడంతోపాటు మూడ్‌ను సంతోషంగా మార్చే లక్షణాలు ఉన్నాయి. ఒక సర్వే మేరకు అవకాడో తినే మహిళలలో ఆందోళన ఉండదట. వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ బి శరీరంలోని ఒత్తిడి స్థాయులను అదుపు చేస్తుంది. అందువల్ల వీలయినప్పుడలా అవకాడో తింటూ ఉండటం ఎంతో ప్రయోజనకరం. డార్క్ చాక్లెట్స్ ఇవి తినడానికి రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపే వాటిలో డార్క్ చాక్లెట్స్ ఎప్పుడూ ముందుంటాయి. వీటిలో ఉండే ఉండే ఫినైల్థైలమైన్ అనే రసాయనం డోపమైన్‌ను కొద్ది కొద్దిగా విడుదల చే స్తుంటుంది. అంతే కాదు, డార్క్ చాక్లెట్స్‌లో ఉండే కొన్ని రకాల రసాయనాల వల్ల ఎండార్ఫిన్ హార్మోన్, సెరోటోనిన్ అనే మోనోఅమైన్ న్యూరోట్రాన్స్మీటర్ విడుదలవుతాయి. వీటివల్ల మానసిక ఉల్లాసం, సంతోషం కలుగుతాయి. అరటిపండు అరటిపండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలో డోపమైన్, సెరోటోనిన్ న్యూరో టాన్స్మీటర్ల విడుదలకు ఉపకరిస్తుంది. మెదడు, శరీరం చురుగ్గా ఉండేలా చేయడానికి ఈ రసాయనాలు తోడ్పడడంతోపాటు మానసిక స్థితిని నియంత్రణలో ఉంచి.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అరటిపండ్లు రక్తంలోని షుగర్ నిల్వలను సైతం నియంత్రించగలవు. అలాగని షుగర్ ఉన్నవారు ఒకేసారి రెండు మూడు అరటిపళ్లు లాగించేయకూడదు. మూడ్ సరిగా లేదనిపిస్తే మాత్రం ఒక అరటిపండు తింటే సరి. డెయిరీ ఉత్పత్తులు ఒత్తిడిలో ఉన్నప్పుడు డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చీజ్, పాలు, పెరుగు తీసుకుంటే.. శరీరంలో హ్యాపీ లెవల్స్ పెరుగుతాయి. చీజ్‌లో టైరమైన్ ఉంటుంది, ఇది మానవ శరీరంలో డోపమైన్‌గా మారుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు పాలు, చీజ్, పెరుగు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు, పుల్లట్లు తిన్నా, పులి బొంగరాలు తిన్నా మంచిదే. కాకపోతే అవి సిద్ధంగా ఉండవు కాబట్టి వీలయినప్పుడల్లా తింటూ ఉంటే మంచిది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్నర్కు సంబంధించి Beauty Tips: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్.. ఇలా చేశారంటే -
నిద్ర సరిగ్గా పట్టట్లేదా? ఈ మినరల్ లోపిస్తే అంతే! నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు పాడై!
Health Tips In Telugu: మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎ, బి, సి, డి, ఈ, కె, బీకాంప్లెక్స్, బీట్వెల్వ్(బీ12) వంటి విటమిన్లు ఏవిధంగా అవసరమో, అదేవిధంగా క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా అవసరం. మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. మెగ్నీషియం లోపిస్తే ఈ అనారోగ్యాలు వస్తాయి..!! ►సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియం దేహానికి అందిస్తాయి. ►ఇలా ఎక్కువసార్లు మెగ్నీషియం కోసం కిడ్నీలపై ఆధారపడితే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా కిడ్నీలు కూడా పాడవుతాయి. ►శరీరంలో తగినంత మెగ్నీషియం లేనప్పుడు మనకు కొన్ని సూచనలు వస్తాయి. వాటిని గమనిస్తే ముందుగానే ఈ లోపం గురించి తెలుసుకొని నివారించవచ్చు. లక్షణాలు..( Magnesium Deficiency Symptoms) ►మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. ►వికారంగా ఉంటుంది. ►వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది. ►నీరసంగా ఉంటారు. ► హార్ట్ బీట్‌రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. ► కళ్ళు మసక బారిన ఎక్కువగా ఉంటుంది. ►కండరాలలో నొప్పి వస్తుంది. ►ఒత్తిడి పెరుగుతుంది. ►నిద్ర సరిగ్గా పట్టదు. ►అధిక రక్తపోటు వస్తుంది. ►ఆస్తమాతో బాధపడేవారు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. మెగ్నీషియం ఉండే ఆహార పదార్థాలు..!! (Magnesium Rich Foods) ►ఆకుకూరలలోనూ, అవకాడో, అరటి పండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. ►అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. ►బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో కూడా మెగ్నీషియం లభిస్తుంది. ►మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. ►డార్క్ చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. ►మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనారోగ్యానికి గురవుతారు. ►సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే..? ►మెగ్నీషియం ఎక్కువైనా కూడా ఇబ్బందులు తప్పవు. ► కడుపునొప్పి, డయేరియా వచ్చే అవకాశం ఉంది. ►మెగ్నీషియం ఎంత అవసరమో అంతే ఉండేలా చూసుకోవాలి. లోపించినా ప్రమాదమే; ఎక్కువైనా ప్రమాదమే కాబట్టి సమంగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: Vitamin D Deficiency: విటమిన్- డి.. ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! -
Health Tips: గుండె ఆరోగ్యం.. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే..
Best Diet For Heart Health And Weight Loss: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడటం, కొందరు ఆకస్మాత్తుగా మృత్యువాత పడటాన్నీ చూస్తున్నాం, వింటున్నాం. గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్నిరకాల ఆహారాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతాయి. కానీ కొన్ని మాత్రం గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ క్రమంలోనే గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో, దానిని ఎందుకు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఫైబర్ ఎక్కువగా ఉండాలి.. ►నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ►ఫైబర్ హైబీపీని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. ►ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.ఇవి ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. ►దీంతో శరీరంలో వాపులు తగ్గుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ►చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి కనుక వాటిని తరచూ తినడం వల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. వెజిటేరియన్లు ఎలా? ►ఇక వెజిటేరియన్లు నట్స్, సీడ్స్ తినడం ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ►బాదంపప్పు, వాల్నట్స్ వంటి వాటిని నిత్యం గుప్పెడు మోతాదులో తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ►వీటిల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ►నట్స్‌ను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు తగ్గించుకుంటేనే.. ►అధికంగా బరువు ఉండడం వల్ల కూడా గుండె వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీనివల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ►ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. ►చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ►అదే విధంగా కూరగాయలూ, పండ్లలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు.. ►సాల్మన్ ఫిష్, ట్యూనా, హెర్రింగ్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. ►వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే బెటరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ►ఓట్ మీల్ తింటే మంచిది. పీచు పదార్థం ఉండే ఈ ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ►జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే. ►స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, ఆ పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. చాక్లెట్లు కూడా.. ►డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరిగే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. ►అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం లేదు. అయితే వీటిని కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే.. ►విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్ళీ అతిగా పంచదార కలుపుకోకూడదు. ►సోయా పాలు, సోయా జున్ను (తోఫూ) తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. ►అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. సోయా ప్రొటీన్లు ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో.. ►బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదకరం కావు. ►పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది. ►టొమాటోలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. ఇందులోని విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ►గుప్పెడన్ని నట్స్ అంటే బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ►బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి. ►దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. ►దానిమ్మ పండు గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే అడ్డంకులు (ప్లాక్స్)నూ శుభ్రం చేస్తాయి. యాపిల్ పండ్లు కూడా. ►అవిశె గింజలలో (ఫ్లాక్ సీడ్స్) పీచు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటిని రోజుకు 20 గ్రాములు తింటే మేలు. చదవండి👉🏾Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! చదవండి👉🏾Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
మూడ్స్ బాగు చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నిపెంచే చాక్లెట్స్!
‘బార్’ కంటే ‘చాకోబార్’ మేలనీ... ‘ఆల్కహాల్’ ఆరోగ్యానికి చేటు కాగా... దానికి భిన్నంగా ‘చాకో’హాలికులు (పరిమితంగానే) కావడం హెల్త్‌కే కాదు... మంచి మూడ్స్‌కీ మంచిదంటున్నారు పరిశోధకులు. డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయనీ, వాటితో మంచి ఆరోగ్యం సమకూరుతుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తేలినా... ఇప్పుడు దక్షిణ–కొరియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తాజాగా మరెన్నో విషయాలు వెల్లడయ్యాయి. చాకోలెట్‌లో ఉండే పదార్థాలు మన జీర్ణవ్యవస్థలో నెలవై ఉండే... మనకు మేలు చేసే సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)పై చూపే ప్రభావం వల్ల మనం మరింత ఆరోగ్యకరంగా మారతామని అంశం వాళ్ల పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు... 85 శాతం డార్క్ చాక్లెట్ మోతాదులతో... ఒకింత తక్కువ పాళ్లలో చక్కెర కలిగి ఉన్న 30 గ్రాముల చాక్లెట్‌ను రోజూ మూడు సార్లు చొప్పున తీసుకుంటే... మనుషుల మూడ్స్ బోలెడంత బాగుపడి... మనుషులు చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారనీ, అది పూర్తి (ఓవర్ ఆల్) ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు. డార్క్ చాక్లెట్‌లోని ‘కోకో’లో ఫైబర్, ఐరన్‌తో పాటు ఫైటోకెమికల్స్ క్యాన్సర్లు, మతిమరపు (డిమెన్షియా), ఆర్థరైటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి అనేక సమస్యలను సమర్థంగా నివారిస్తాయనీ దక్షిణకొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీలోని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగం నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడయ్యాయి. ఇప్పటివరకూ సానుకూల భావోద్వేగాలకూ చాక్లెట్‌కు ఉన్న సంబంధాల గురించి పరిమితంగానే తెలిసినా... ఈ తాజా పరిశోధనలతో అవి మూడ్స్‌ను ఎంతగా ప్రభావితం చేస్తాయన్న సంగతులు మరింత విపులంగా తెలిశాయంటున్నారు పరిశోధకులు. కొంత పరిమిత మోతాదుల్లో రోజూ మూడుసార్లు చాక్లెట్స్ ఇస్తూ ఇందులో పాల్గొన్న అభ్యర్థుల ‘పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎఫెక్ట్ షెడ్యూల్’ (పీఏఎన్ఏఎస్)ను పరిశీలించి, వారి ఫీలింగ్స్‌ను తెలపాలంటూ నిర్వాహకులు కోరారు. అప్పుడు అభ్యర్థుల నుంచి వెల్లడైన అంశాలను చూసినప్పుడు ‘సైకలాజికల్ స్కేల్’పై సానుకూల అంశాలే అత్యధికంగా నమోదయ్యాయని, దాంతో మూడ్స్ ఎలివేషన్‌కు చాక్లెట్లు సమర్థంగా తోడ్పడతాయంటూ వెల్లడైంది. అంతేకాదు... ఇలా చాక్లెట్స్ తిన్నవారి మలపరీక్షలూ నిర్వహించారట. ఆ పరీక్షల విశ్లేషణలో తేలిన అంశాలేమిటంటే... వారి మలంలో ‘బ్లావుషియా’ అనే ప్రోబయాటిక్ బాక్టీరియా ఎక్కువ మోతాదులో ఉందనీ, ఈ తరహా బ్యాక్టీరియా కడుపు (గట్)లో ఉండటం వల్ల సంతోషంగా, ఆహ్లాదంగా ఉండే అవకాశాలూ పెరిగి మూడ్స్ మరింత బాగుంటాయాని వెల్లడైంది. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘‘ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ’’ అనే మెడికల్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. -
World Mental Health Day: డార్క్ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే..
ఆధునిక జీవనశైలి కారణంగా ఇటీవల కాలంలో మానసిక సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వెల్లువలో పడి మెదడుకు తగిన వ్యాయామం ఇవ్వడమే మరచిపోతున్నాం. ఐతే పోషకాహారం ద్వారా ఏ విధంగా మెదడు పనితీరును మెరుగుపరచుకోవచ్చో ఈ కింది అధ్యయనాల ద్వారా తెలుసుకుందాం.. చాక్లెట్స్ మీకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టమా.. ఐతే మీకో గుడ్ న్యూస్! చాక్లెట్స్ బ్రెయిన్ హెల్త్‌కు మేలు చేస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. కోకో బీన్స్‌లో ఫ్లేవనాల్ అని పిలువబడే కొన్ని చిన్న అణువులు ఉంటాయి. ఈ అణువులు మెదడు చురుకుదనాన్ని మెరుగుపరుస్తాయని 'సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురించిన నివేధిక తెలియజేస్తుంది. మామూలు చాక్లెట్లకంటే డార్క్ చాక్లెట్లలో ఫ్లావోనాయిడ్ కంటెంట్ అధికంగా ఉంటుందని, ఇవి మెదడు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడానికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ పండ్లు ఆరెంజ్ పండ్లలో కూడా ఫ్లావోనాయిడ్స్ అధికంగానే ఉంటాయి. రోజూ గ్లాస్ నారింజ రసం తీసుకోవడం వల్ల కాగ్నిటివ్ పనితీరు మెరుగుపడుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ నూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనాలు వెల్లడించాయి. టీ మన అలవాట్లలో ముఖ్యమైనది ప్రతి ఉదయం ఒక కప్పు టీ తాగడం. దీనిలో అల్లం, మిరియాలువంటి భిన్న పదార్థాలను జోడించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయనే విషయం తెలిసిందే! ఐతే అదనంగా మెదడు పనితీరుకు టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన మెదడు నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక అధ్యయనం వెల్లడించింది. తాగని వారితో పోల్చితే క్రమం తప్పకుండా టీ తాగేవారిలో ప్రయోజనాలు ఎక్కువగా కనిపించాయట. చేపలు గుండె ఆరోగ్యం నుంచి చర్మం, జుట్టు సమస్యల నివారణ వరకు చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎంతో ఉపయోగపడతాయి. చేపలను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెల్పింది. దీనిలోని విటమిన్-ఇతో పాటు, కొన్ని యాంటీఆక్సిడెంట్లు డైమెన్షియా (చిత్తవైకల్యం) ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఆకు కూరలు బ్రొకోలి, కాలె, పాలకూర వంటి ఆకుకూరలు కాగ్నిటివ్ డామేజ్ నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్ ఫర్ ఎక్స్పరిమెంటల్ బయోలజీ ప్రకారం ఆకుకూరల్లో విటమిన్ ‘కె’, బేటా కెరోటిన్, లూటిన్, ఫోలెట్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. శారీరక వ్యాయామాలు, యోగా, డిజిటల్ గాడ్జెస్ను తక్కువగా వాడటం వంటి అలవాట్లతోపాటు ఈ ఆహార అలవాట్లు కూడా పాటించడం వల్ల మీ మెంటల్ హెల్త్‌ను పదికాలాలపాటు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. -
డార్క్ చాకొలెట్లతో ఒత్తిడికి చెక్
లాస్ ఏంజెలిస్: వయసు మీదపడటం వల్ల తలెత్తే ఒత్తిడి, నాడీ సంబంధ సమస్యలకు డార్క్ చాకొలెట్లు మంచి ఔషధంగా పనిచేస్తాయని పరిశోధకులు గుర్తించారు. వీటిలోని ఎపికెటెచిన్(ఎపి) అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడుతో పాటు ఇతర నాడీ వ్యవస్థలపై ప్రభావం చూపడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడటంతో పాటు ఆందోళన స్థాయిలు తగ్గినట్లు వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలో కనుగొన్నారు. అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సలో డార్క్ చాకొలెట్లు కీలక పాత్ర పోషిస్తాయని నిర్ధారణకు వచ్చారు. వయసు మీద పడ్డ ఎలుకలకు ఎపికెటెచిన్ ఇచ్చి ఒత్తిడి, నాడిమండల వ్యవస్థల్లో మార్పుల్ని గమనించారు. వాటిలో జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు, ఆందోళన స్థాయిలు తగ్గినట్లు పరిశోధకులు గమనిం చారు. డార్క్ చాకొలెట్లు తినేవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండడానికి కారణాలపై ఈ పరిశోధనతో కొంత స్పష్టత వచ్చిందన్నారు.