Daughter-in-law murder
-
పెళ్లికి నిరాకరించిందని. మేనకోడలి హత్య!
యశవంతపుర: తనతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ మేనమామ తన అక్క కుమార్తెను హత్య చేసిన దారుణ ఘటన హావేరి జిల్లా హనగల్ తాలూకా బైచవళ్లిలో జరిగింది. దీప (21)ను మేనమామ మాలతేశ బార్కి (35) హత్య చేశారు. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... అక్క కూతురినే పెళ్లి చేసుకోవాలని బార్కి అక్కతో పాటు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. అయితే దీపకు మేనమామతో వివాహం ఇష్టం లేదు. కుటుంబ సభ్యుల బలవంతంతో ఏప్రిల్‌లో నిశ్చితార్థం చేసి పెళ్లి తేదీని కూడా నిర్ణయించారు. అయితే మేనమామ ప్రవర్తన దీపకు నచ్చలేదు. అప్పుడప్పుడు తాగి వచ్చి దీప పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో తాగుబోతును తాను పెళ్లి చేసుకోనంటూ దీప తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది. నిశ్చితార్థం తరువాత తనను పెళ్లి చేసుకోనంటూ చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మాలతేశ బార్కి.. ఆమెకు మాయమాటలు చెప్పి ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి విషం ఇచ్చి అనంతరం ఉరి వేశాడు. దీప కనిపించటంలేదని తల్లిదండ్రులు గాలిస్తుండగా అనుమానంతో మాలతేశ బార్కిని విచారించగా అసలు విషయం బయట పడింది. దీంతో హనగల్ పోలీసులు మాలతేశను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
కోడలిపై దుర్మార్గం: ఆడపిల్ల పుట్టబోతోందని తెలిసి.. పాలలో విషప్రయోగం
గుంటూరు: ఆడపిల్లకు జన్మనిస్తుందనే కారణంతో అత్తమామల విషప్రయోగంతో కోడలు వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు విడిచింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. మండలంలోని సుబ్బయ్యపాలేనికి గ్రామానికి చెందిన గాడిపర్తి వేణుతో బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన శ్రావణికి 2020లో వివాహమైంది. శ్రావణికి మొదటి కాన్పులో అమ్మాయి పుట్టింది. రెండోసారి గర్భం దాలి్చంది. భర్త, అత్తమామలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. రెండోసారి కూడా అమ్మాయి పుడుతుందని తెలుసుకున్నారు. ఇష్టం లేని అత్తమామలు ఆమెపై మజ్జిగ, పాలలో విషప్రయోగం చేశారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా శ్రావణి రక్తం, చిన్న పేగు ముక్కలతో వాంతి చేసుకుంది. ఈ పరిస్థితుల్లో నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. కోమాలోకి వెళ్లిన శ్రావణి పరిస్థితి విషమించటంతో విజయవాడలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమెకు అక్కడనే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. -
సేలంలో దారుణం
సేలం: సభ్యసమాజం సిగ్గుపడేలాంటి దారుణ సంఘటన సేలం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. తనతో సన్నిహితంగా లేదనే కోపంతో కోడలిని మామ దారుణంగా హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే సేలం జిల్లా మేట్టూరులో విద్యుత్ స్టేషన్ వెనుకవైపు తురయూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి పెరియస్వామి (58)కి భార్య ముత్తాయి, కుమారుడు వేల్మురుగన్, కుమార్తె మల్లి ఉన్నారు. వేల్‌మురుగన్‌కు వివాహమైంది. అతనికి భార్య అంబిక(24), కుమార్తె జ్యోతిమణి, కుమారుడు శంకర్ ఉన్నారు. ఒకే ఇంటిని రెండుగా విభజించి పెరియస్వామి దంపతులు ఒక భాగంలో, వేల్మురుగన్ కుటుంబంతో మరో భాగంలో నివశిస్తూ వస్తున్నారు. గత మూడు నెలల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలు అంబికపై పెరియస్వామి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆమె అందుకు అంగీకరించకుండా కేకలు పెట్టి గొడవకు దిగింది. దీంతో స్థానికులు గుమ్మికూడి గ్రామంలో పంచాయితీ పెట్టి పెరియస్వామిని గ్రామస్తులు, అతని కుమారుడు కలసి చితకబాదారు. అతడు తాను తెలియక తప్పు చేశానని, ఇకపై ఇటువంటి పనులు చేయనని ప్రాధేయపడడంతో వదిలి పెట్టారు. ఇలాఉండగా సోమవారం మధ్యాహ్నం పెరియస్వామి మళ్లీ అంబికపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె నిరాకరించడంతో ఆవేశం చెందిన పెరియస్వామి ఇనుప రాడ్‌తో అంబికపై దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అంబిక సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అక్కడి నుంచి పెరియస్వామి పరారయ్యాడు. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన అంబిక పిల్లలు తల్లి విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అంబిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
కడుపులో పగ దాచుకొని 8 ఏళ్లు వేచిచూశారు!
కోయంబత్తూరు: సంతోష్, సుమతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లు వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోయింది. సంతోష్ సుమతిని తొలిసారి కోయంబత్తూరులో కలిశాడు. అప్పుడు ఆమె పీజీ చదువుతోంది. కొంతకాలానికి వారి స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరైనా, తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు చదువుకున్న వారు కావడంతో ఎలాంటి మనస్పర్థలు లేకుండా వారి వైవాహిక జీవితం ముందుకుసాగింది. ఈ క్రమంలో సంతోష్ కు ఇటీవల బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం లభించింది. దీంతో అతను తన సొంతూరు నమ్మక్కల్ నుంచి హోసూర్ కు మకాం మార్చాడు. త్వరలోనే భార్య సుమతిని కూడా హోసూర్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. అయితే ఇంతలోనే ఇటు నమక్కల్‌లోని తన ఇంట్లో ఘోరం జరిగింది. సుమతి గొంతుకోసి దోపిడీ దొంగలు ఇంటిలో నుంచి బంగారం, నగలు ఎత్తుకుపోయారని సంతోష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కొడుకు కులాంతర వివాహాన్ని అంగీకరించి.. సుమతిని కొడలిగా ఒప్పుకున్నట్టు అతని తల్లిదండ్రులు పైకి నటించినప్పటికీ, వారు కడుపులో పగ దాచుకొని ఎనిమిదేళ్లు వేచి చూశారని, అదను రాగానే కొడలిపై దాడిచేసి ఆమె గొంతు కోసి చంపారు. దీనిని దోపిడీ దొంగలు కిరాతకంగా చిత్రించేందుకు ఆమె ఫోన్ ను, నగలను తామే తీసి దాచిపెట్టి.. పోలీసులకు కథలు అల్లి చెప్పారు. అయితే, పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ కేసులో మృతురాలు సుమతి అత్తమామలు పళనివేల్, మధేశ్వరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పరువు హత్య కేసు నమోదుచేసి.. సేలం జైలుకు తరలించారు. -
బండరాతితో కోడలి హత్య : కానిస్టేబుల్‌పై హత్యాయత్నం
ఆదిలాబాద్: కొడుకు మృతికి కోడలిని కారణంగా భావించి, అత్తమామలు ఆమెని బండరాతితో బాది హత్య చేశారు. విషయం తెలిసి ప్రశ్నించేందుకు వెళ్లిన హతురాలి తల్లి, పోలీస్ కానిస్టేబుల్‌పై ఆ అత్తమామలు కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఇచ్చోట మండలం గుండి గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఆ అత్తమామల దాడి నుంచి హతురాలి తల్లి, కానిస్టేబుల్ తప్పించుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు కేసు పూర్వాపరాలను దర్యాప్తు చేస్తున్నారు.