daughters death
-
కూతురి ఆత్మహత్యకు ఇప్పటికీ కారణం తెలియదు: నటి అన్నపూర్ణ
తెలుగు తెరపై నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో నటించి ప్రత్యేకత సాధించుకున్నారు నటి అన్నపూర్ణ. 'స్వర్గం నరకం' అనే సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయిన ఆమె అతి తక్కువ కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు వారందరికి సుపరిచితం అయ్యారు. దాదాపు 700 సినిమాల్లో నటించిన ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇటీవలె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఓ అమ్మాయిని దత్తత తీసుకొని అపురూపంగా పెంచుకున్నానని, అయితే ఆమె అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని తెలిసి షాక్‌కి గురయ్యానని తెలిపారు. 'అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నా కూతురు కీర్తిని సినిమాల్లోకి పంపించొద్దని అనుకున్నా.డాక్టర్ లేదా ఇంజనీర్ వంటి పెద్ద చదువులు చదివిద్దామని కలలు కన్నా. కానీ ఆమెకు చదువు అంతగా అబ్బలేదు. పదవ తరగతి అనంతరం మాకు తెలిసిన వాళ్లలో ఓ సంబంధం ఉంటే మాట్లాడాను. ఇద్దరికి నచ్చింది అన్న తర్వాతే పెళ్లి చేశాను. ఒక ఏడాదికి ఆమెకు పాప పుట్టింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఓ రోజు ఉదయాన్నే మా అల్లుడు ఫోన్ చేసి మీ కూతురు ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అసలు కీర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇప్పటికీ తెలియదు. నా కూతురికి కోపం ఎక్కువ. అందులోనూ మా ఇంట్లో గారాభంగా పెరిగింది. ఇంట్లో పనులు చేయడం రాదు తనకు. మెట్టినింటి వాళ్లు ఏమైనా అన్నారా లేదా భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అన్నది నాకు తెలియదు. ఆ విషయాల గురించి మా అమ్మాయి ఏనాడు నాకు చెప్పలేదు. క్షణికావేశంలో మరి అలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు. కానీ ఇప్పుడు ఈ లోకంలో లేదు' అంటూ గతాన్ని తలుచుకొని బాధపడింది. -
ఆ కుటుంబాన్ని వెంటాడిన మృత్యువు..
♦ తండ్రి దశదిన కర్మ కాకుండానే కూమార్తె దుర్మరణం ♦ శోకసద్రంలో కుటుంబం ♦ గ్రామంలో విషాదఛాయలు ఆ కుటుంబ పెద్దదిక్కును మృత్యువు మింగేసింది.. ఆసరా కోల్పోయి పుట్టెడు కష్టాల్లో మునిగిపోయింది.. అయినా సంప్రదాయాలకు విలువనిచ్చే గ్రామీణులు దశదిన కర్మకు బుధవారం ఏర్పాట్లు చేసుకున్నారు.. పనుల్లో భాగంగా సైకిల్ ఇంటికి వెళ్తున్న కుమార్తెను బస్సు రూపంలో మృతువు వేటాడింది. ఉంగుటూరు(గన్నవరం) : మండలంలోని ఆత్కూరు గ్రామానికి చెందిన ఆంతోని ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన దశదిన కర్మ బుధవారం పెట్టుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పనుల బాధ్యత పెద్ద కుమార్తె చూస్తోంది. అందులో భాగంగా మంగళవారం బ్యాంకు వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకొస్తోంది. అయితే స్కూల్ బస్సు రూపంలో మృతువు ఆమెను తీసుకెళ్లింది. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం సాయంత్రం ఆత్కూరు జెడ్పీ స్కూల్లో చదువుతున్న పఠాన్ ఆషాబీ స్కూలు నుంచి ఇంటికి వస్తోంది. ఆషాబీ సైకిల్‌పై, కె.ప్రవళిక వెనుక ఎక్కింది. జాతీయ రహదారి దాటుతుండగా అదే సమయంలో గన్నవరం వైపు వస్తున్న స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రవళిక (18)పై బస్సు టైర్ ఎక్కడంతో 108లో పిన్నమనేని వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ప్రవళిక మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టు నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆషాబీ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన బస్సును గ్రామస్తులు అడ్డుకున్నారు. తల్లి వాణి, కుటుంబ సభ్యులు శోకసద్రంలో మునిగారు. బాధిత కుటుంబాన్ని సర్పంచి కుర్రా సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్నేపల్లి సింహాచలం పరామర్శించి సానుభూతి తెలిపారు. ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
‘ప్రేమ’కు మరో ప్రాణం బలి
నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్: కూతురి మృతిని తట్టుకోలేక తండ్రి గుండె ఆగిన సంఘటన మండలంలోని తిర్మలాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కుంటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంబటి నారాయణరెడ్డి(70) తన కూతురు మంగమ్మ మృతి, అల్లుడు నర్సింహారెడ్డి పరిస్థితిని తట్టుకోలేక ఒక్కసారిగా కూప్పకూలినట్టు బంధువులు తెలిపారు. తుప్రాన్ మండలం యావపూర్‌కు చెందిన మంగమ్మ, నర్సింహారెడ్డి దంపతులు తమ కూతురు ప్రేమ విషయాన్ని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం విదితమే. ఈ సంఘటనలో మంగమ్మ మృతి చెందగా నర్సింహారెడ్డి ప్రాణాపాయస్థితిలో కొంపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న నారాయణరెడ్డి అదే రోజు తన కుటుంబ సభ్యులతో కలసి యావపూర్ వెళ్లారు. కూతు రు మంగమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే చికిత్స పొందుతున్న అల్లుడు నర్సింహారెడ్డి పరిస్థితిని చూసి తీవ్రంగా కలత చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా నారాయణరెడ్డికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. ఒక్కగానొక్క కూతురు కావడంతో మంగమ్మను చిన్నప్పటినుంచి నారాయణరెడ్డి గారాబంగా చూసుకునేవారని బంధువులు చెప్పారు. మంగమ్మకు సైతం ఒక్కగానొక్క కూతురు మాలశ్రీ. దీంతో మనవరాలిని సైతం చాలా ప్రేమగా చూసుకునే వారని తెలిపారు. మృతునికి భార్య సత్తమ్మ, కుమారులు గోపాల్‌రెడ్డి, కిష్టారెడ్డి, రాంరెడ్డి ఉన్నారు. మెరుగుపడిన నర్సింహారెడ్డి ఆరోగ్యం... తూప్రాన్: ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహారెడ్డి ఆరోగ్యం కాస్త మేరుగుపడినట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిచ్చార్జి చేయనున్నట్లు సమాచారం. అయితే కూతురు ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ స్థానిక ఎస్ఐ.నిరంజన్‌రెడ్డిని సంప్రదించగా కూతురు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. బంధువులు, గ్రామస్థులు మాత్రం స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 5