ఏంజెలీనా దర్శకత్వంలో బ్రాడ్పిట్
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ తన సహజీవన భాగస్వామి బ్రాడ్పిట్ ప్రధాన పాత్ర పోషించనున్న ‘బై ది సీ’ చిత్రానికి దర్శకత్వం వహించనుంది. ఈ చిత్రాన్ని బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ కలిసి నిర్మిస్తున్నారు. యూనివర్సల్ పిక్చర్స్ చైర్మన్ డోనా లాంగ్లీ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. డేవిడ్ ఏయెర్స్ దర్శకత్వంలోని ‘ఫ్యురీ’ షూటింగ్లో బ్రాడ్ పిట్ ప్రస్తుతం తలమునకలుగా ఉన్నందున, అది పూర్తయ్యాక ‘బై ది సీ’ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.