dayalasis unit
-
‘కుటుంబాల్లో పిట్టల్లా రాలిపోతున్న జనం’
సాక్షి, విజయవాడ : కిడ్నీ వ్యాధితో ఒక్కొక్క కుటుంబంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారుని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు అన్నారు. పశ్చిమ కృష్ణా మెట్ట ప్రాంతంలో 3 వేల మంది కిడ్నీ బాధితులు ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం బాబురావు మీడియాతో మాట్లాడుతూ.. గత రెండున్నర ఏళ్లలో దాదాపుగా103 మంది చనిపోయారని చెప్పారు. ‘25మందికిపైగా డయాలసిస్ చెయించుకోవాల్సి ఉండగా మందులకు కూడా డబ్బులు లేని పరిస్థతి. కిడ్నీ వ్యాధి మెట్ట ప్రాంతంలోని 15 మండలాలకు విస్తరించింది. పిల్లలతో సహా అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దాదాపు రూ. 60 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు’. అని ఆయన పేర్కొన్నారు. సీపీఎం నిర్వహించిన సర్వేలో 1284 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. ప్రభుత్వానికి దుబారా ఖర్చు పెట్టడంలో ఉన్నా శ్రద్ధ.. కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో లేదని ఆయన విమర్శలు గుప్పించారు. దాదాపుగా 1000మంది తమ సొంత భూములను అమ్ముకొని, అప్పులు చేసి కిడ్నీ వ్యాధి కోసం చికిత్స చేయించుకునే పరిస్థితి అని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో చెందుతున్న జిల్లాలో 15 మండల్లాలో కిడ్నీ వ్యాధితో ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కనిపించలేదా అని బాబురావు ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం స్పందించినా కూడా ఒక డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గంలో ఈ విధమైన పరిస్థితి ఉన్నా మంత్రి పట్టించుకోకపోవడం బాధాకరమని సీపీఎం నేత అన్నారు. పశ్చిమ కృష్ణాలో కిడ్నీ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం సమగ్ర సర్వే జరపాలి. అంతేకాక చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్ క్రేషియా ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు వారికి రూపాయి కూడా ఇవ్వలేదు.. వైద్య ఖర్చులకు సత్వర ఆర్ధిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కిడ్నీ బాధితులకు నెలకు రూ. 2500 రూపాయల పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూజివీడుతో పాటు తిరువూరు, మైలవరం, నందిగామలలో కూడా డయాలసిస్ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. వైద్యాశాఖ కూడా సీఎం దగ్గర ఉంది కాబట్టే చంద్రబాబు దీనిపై వెంటనే స్పందించాలి. ఈ నెల చివరిలోపు కృష్ణాజిల్లాలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే జూలైలో కిడ్నీ బాధితులతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం నేత బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
కేసీఆర్ కిట్లు ప్రచార ఆర్భాటమే
సత్తుపల్లిటౌన్ ఖమ్మం జిల్లా : కోట్లాది రూపాయలతో ప్రభుత్వం ప్రచార గొప్పలే తప్పా.. రాష్ట్రంలో కేసీఆర్ కిట్లు అందటం లేదని, సాక్షాత్తు మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన డయాలసీస్ కేంద్రానికి నాలుగు నెలలైనా సేవలకు దిక్కులేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. శుక్రవారం సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రిలోని డయాలసీస్ కేంద్రాన్ని పరిశీలించారు. డయాలసీస్ కేంద్రంలో ఏమీ లేకున్నా.. ఆర్భాటంగా ఇద్దరు మంత్రులు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఒకే కాంట్రాక్టర్‌కు 40 డయాలసీస్ కేంద్రాల నిర్వహణ అప్పగించటం వల్లే పనులు సాగటం లేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ కిట్లు కొరతపై డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్రావుకు ఫోన్ చేసి అడిగారు. అయితే సరఫరా కాలేకపోవటం వల్ల పంపిణీ చేయలేదని తెలిపారు. వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో కేసీఆర్ కిట్లు లేక 45 రోజులైంది.. జిల్లా మొత్తం పరిస్థితి ఇలాగే ఉంది.. ఇండెంట్ పెట్టినా సరఫరా చేయటం లేదని ఎ మ్మెల్యే సండ్ర తెలిపారు. సీజనల్ వ్యాధులకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్ డాక్టర్ వసుమతీదేవిని ఆదేశించారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మదన్‌సింగ్‌కు ఫోన్ చేసి సత్తుపల్లి ఆస్పత్రిని సందర్శించి సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఎమ్మెల్యే వెంట గొర్ల సంజీవరెడ్డి, కూసంపూడి రామారావు, కూసంపూడి మహేష్, తడికమళ్ల ప్రకాశరావు, ఎస్కె చాంద్‌పాషా, అద్దంకి అనిల్, కంభంపాటి మల్లికార్జున్, దూదిపాల రాంబాబు, చక్రవర్తి ఉన్నారు. -
మెదక్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
సాక్షి, మెదక్ : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ సంబంధిత రోగులకు వరంగా మారాయి. గతంలో డయాలసిస్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అపుడు దూరాభారంతో పాటు ఒక్కో సెట్టింగ్‌కు రూ.1500 నుంచి రూ.1900 చెల్లించాల్సివచ్చేంది. ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆ బాధలు తొలిగిపోయాయి. జిల్లా కేంద్రంలో గత ఏడాది డిసెంబర్లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆనందంతో అందరూ ఇక్కడే రక్త శుద్ధి చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఈ సేవలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కేంద్రంలో ఒకే సారి ఐదుగురికి రక్తశుద్ధి చేసేందుకు మిషన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కబెడ్ హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రత్యేకమైన వైద్యులు, సిబ్బంది ఉండటంతో రోగులకు ఇబ్బందులు తొలిగిపోవడంతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 35 మందికిపైగా డయాలసిస్ అవసరమయ్యే రోగులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. కిడ్నీలు సరిగా పనిచేయని పక్షంలో డయాసిస్(రక్తశుద్ధి) ప్రక్రియ అవసరం ఉంటుంది. ఈ రకమైన సమస్య ఉన్న వారు, మూత్రపిండాల మార్పిడి సమయంలో రక్తశుద్ధి (డయాలసిస్) తప్పనిసరి. గతంలో ఆరోగ్యశ్రీలో డయాలసిస్ సేవలు అందించినప్పటికీ హైదరాబాద్ వెళ్లడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో దూరభారంతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడేవారు. ఉచితంగా మందులు ఇవ్వాలి.. జిల్లాలోని 35 మంది రోగులకు గడిచిన ఆరు నెలల్లో 180 సార్లు డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేయించుకునే పేషెంట్ 4 గంటల నుంచి వ్యాధి తీవ్రతను బట్టి 8 గంటల వరకు బెడ్‌పై ఉండాల్సి వస్తోంది. వైద్యులు, సిబ్బంది మంచిగా సేవలు అందజేస్తున్నట్లు వారు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు చెబుతున్నారు. కరెంటు పోయిన సమయంలో వెంటనే జనరేటర్ పనిచేయకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చిన్నశంకరంపేటకు చెందిన ఓ రోగి తెలిపారు. డయాలసిస్ సెంటర్‌కు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని రోగులు కోరుతున్నారు. అలాగే ఉచితంగా మందులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత డయాలసిస్ మెదక్‌లో పొందే సౌకర్యం కల్పించడం హర్షనీయం. అయితే నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే మరింత సౌలభ్యంగా ఉంటుందని పలువురు రోగులు కోరుతున్నారు. నర్సాపూర్ ప్రాంతంలో 6మంది వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం డయాలసిస్ కోసం మెదక్‌కు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌కు కూడా వెళ్తున్నారు. అయితే నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని, తద్వారా అక్కడి రోగులకు సౌలభ్యంగా ఉంటుందని శివ్వంపేటకు చెందిన ఆనంద్‌రావు తెలిపారు. బతుకుపై ఆశ కలిగింది నేను 12 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాను. 2006లో కిడ్నీ మార్పిడి జరిగింది. తర్వాత అది విఫలమై రెండు కిడ్నీలూ చెడిపోయాయి. అప్పటినుంచి డయాలసిస్ కోసం లక్షల రూపాయాలు ఖర్చు పెట్టాను. డయాలసిస్ కోసం ప్రతివారం హైదరాబాద్ వెళ్లే వాడిని. ఇప్పటివరకు రూ.15 లక్షల వరకు ఖర్చుయ్యాయి. దీంతో ఎంత కాలం చేయించుకోను.. ఇక అనుకున్న సమయంలో మెదక్ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడు బతుకుపై ఆశ కలిగింది. దీంతో ఇక్కడే వారానికి రెండు సార్లు చేయించుకుంటున్నాను. దూరభారం తగ్గడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. –ఎర్రగొల్ల సత్యం, రామాయంపేట -
త్వరలో డయాలసిస్ యూనిట్
తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో రోగులకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా వైద్యశాలలో ఉన్న ఫిమేల్ మెడికల్ వార్డును ఖాళీ చేయించి రోగులను బుధవారం వివిధ వార్డుల్లోకి తరలించారు. ఆ వార్డును గురువారం డయాలసిస్ విభాగానికి అప్పగించనున్నారు. ఈ విభాగంతో తెనాలి, వేమూరు, మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాల పరిధిలోని అనేక వేల మంది పేద రోగులకు ఉపయోగకరంగా మారనుంది. జిల్లా వైద్యశాలలో డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ భావించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని తెనాలి, గూడూరు, మచిలీపట్నం వైద్యశాలల్లో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అందుకు అవసరమైన పరికరాలను కూడా పంపారు. గురువారం హైదరాబాద్ నుంచి వచ్చే డయాలసిస్ నిపుణులు వార్డును పరిశీలించి దానిలో పరికరాల ఏర్పాటు చేయనున్నారు. కొద్ది రోజుల్లో డయాలసిస్ విభాగం పేద ప్రజలను అందుబాటులోకి రానుంది. తెనాలి ఏరియా వైద్యశాలను 2000 సంవత్సరంలో జిల్లా వైద్యశాలగా అప్‌గ్రేడ్ చేశారు. 200 పడకల వైద్యశాలగా తీర్చిదిద్ది అధునాతన పరికరాలు, వసతులను ఏర్పాటు చేశారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ బ్యాంక్, నవజాత శిశుకేంద్రం, అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలు తదితర సేవలను అందుబాటులోకి తెచ్చారు. అధునాతన ఆపరేషన్ థియేటర్లను కూడా ఏర్పాటు చేసి పరికరాలను కూడా సమకూర్చారు. ఇటీవల వైద్యుల కొరత ఎక్కువగా ఉండడంతో పాలకులు, అధికారులు స్పందించి అన్ని రకాల వైద్య నిపుణులను బదిలీపై తీసుకువచ్చారు. దీంతో ప్రస్తుతం జిల్లా వైద్యశాలలో ప్రతి రోజూ 1000 మంది ఔట్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. ఇటీవల తక్కువ నెలలతో, తక్కువ బరువుతో జన్మించిన చిన్నారులకు అందించే ఆక్సిజన్ పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.