dci
-
జల రవాణాపై ఏపీతో చర్చలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ చెప్పారు. అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకూ న్యూఢిల్లీలో జరిగే గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్–2023కి అనుబంధంగా డీసీఐలో ఈ నెల 28న రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లను ఎండీ దివాకర్ పరిశీలించారు. డీసీఐ పురోగతికి తీసుకుంటున్న చర్యలు, సమ్మిట్‌కు సంబంధించిన విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. జలరవాణాపై సంప్రదింపులు ప్రస్తుతం జీడీపీ విలువలో 80 శాతం వరకూ మారి టైమ్ ట్రేడ్ జరుగుతోంది. డ్రెడ్జింగ్ చేయకుండా ఏ పోర్టు అభివృద్ధి జరగదు. అందుకే ప్రధాని కూడా దేశీయ జలమార్గాల (ఇన్లాండ్ వాటర్ వేస్)పై దృష్టి సారించారు. ప్రస్తుతం 110 నదులుండగా కేవలం 4 నదుల్లో జల రవాణాకు సంబంధించి డ్రెడ్జింగ్ పనుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పూడికతో నిండిపోయిన డ్యామ్‌లు, రిజర్వాయర్లలోనూ డ్రెడ్జ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం చిన్నచిన్న డ్రెడ్జర్లు అవసరం అవుతాయి. దీనిపైనా సమాలోచనలు చేస్తున్నాం. డ్రెడ్జ్ చేస్తే.. వాటర్ క్యాచ్మెంట్ ఏరియా పెరుగుతుందని ఇందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాం. ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరిపాం. ఏ ప్రభుత్వమైనా డ్యామ్‌లు, రిజర్వాయర్ల డ్రెడ్జింగ్ పనుల్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ అప్పగిస్తే కొత్త డ్రెడ్జర్లు తీసుకుంటాం. దేశంలో డ్రెడ్జింగ్ కోసం 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకూ డిమాండ్ ఉంది. కానీ.. డీసీఐలో ప్రస్తుతం 59 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న10 టీఎస్‌హెచ్ డ్రెడ్జర్లు, 6 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న 2 కట్టర్ సీఎస్ డ్రెడ్జర్లు, ఒక బీహెచ్వో డ్రెడ్జర్ ఉన్నాయి. 12 వేల టన్నుల హోపర్ కెపాసిటీ డ్రెడ్జర్ కోసం ఆర్డర్ చేశాం. 2025 డిసెంబర్ నాటికి ఇది రానుంది. రూ.12 వేల కోట్ల వరకూ ఎంవోయూలు 2021లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.14 వేల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నాం. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల వరకూ వస్తాయని భావి స్తున్నాం. ఇందుకోసం 28న డీసీఐలో నిర్వహించే రోడ్‌షోలో షిప్ బిల్డర్స్, షిప్ ఆపరేటర్స్,పోర్టులు, రెగ్యులేటరీస్, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తాం. ఏపీలో 4 పోర్టుల రాకతో అపార అవకాశాలు ఏపీ ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని చురుగ్గా నిర్వహిస్తోంది. కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలలో నిర్మిస్తున్న పోర్టుల ద్వారా అపారమైన అవకాశాలు కలగనున్నాయి. ఈ నాలుగు పోర్టుల్లో కనీసం 150 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మచిలీపట్నంలో పనులు చేపడుతున్నాం. మిగిలిన పోర్టుల్లోనూ పనుల కోసం మరిన్ని డ్రెడ్జర్లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. -
నిర్మాణ ప్లాన్స్‌లో డిజిటల్ ఇన్ఫ్రాను చేర్చాల్సిందే!
న్యూఢిల్లీ: భవంతుల నిర్మాణ ప్రణాళికల్లో నీరు, విద్యుత్, గ్యాస్ మొదలైన వాటికి సదుపాయాలు కల్పించినట్లుగానే డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రా (డీసీఐ)కి కూడా చోటు కల్పించాలని ప్రభుత్వానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ సూచించింది. డీసీఐ కల్పన, నిర్వహణ, అప్‌గ్రెడేషన్ తదితర అంశాలను కూడా తప్పనిసరిగా పొందుపర్చేలా చూడాలని సూచించింది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ చట్టం రెరాలో తగు నిబంధనలను చేర్చాలని పేర్కొంది. ‘డిజిటల్ కనెక్టివిటీకి సంబంధించి భవంతులకు రేటింగ్’ అంశంపై ప్రభుత్వానికి ఈ మేరకు ట్రాయ్ సిఫార్సులు చేసింది. అపార్ట్మెంట్లు లేదా రియల్టీ ప్రాజెక్టుల్లో ఏదో ఒక నిర్దిష్ట టెల్కో గుత్తాధిపత్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వైర్లెస్ పరికరాలను ఇన్స్టాల్ చేయడం టెలికం లేదా ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్సు హోల్డర్ బాధ్యతగా ఉంటుందని ట్రాయ్ తెలిపింది. బిల్డింగ్‌ల్లో డీసీఐ ప్రస్తుత ప్రమాణాలు, ప్రక్రియలను సమీక్షించే బాధ్యతను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)కు అప్పగించాలని పేర్కొంది. డిజిటల్ సేవల పటిష్టంపై త్వరలో చర్చాపత్రం దేశీయంగా డిజిటల్ సేవలను మరింత పటిష్టం చేసేందుకు, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకోదగిన చర్యలపై కూడా ట్రాయ్ దృష్టి సారిస్తోంది. డివైజ్‌లు, కనెక్టివిటీ, డిజిటల్ అక్షరాస్యతపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన చర్చాపత్రాన్ని రాబోయే నెలల్లో విడుదల చేయనున్నట్లు ఇండియా డిజిటల్ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా తెలిపారు. దేశవ్యాప్తంగా టెల్కోలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నప్పటికీ డివైజ్‌ల రేట్లు అధికంగా ఉన్నాయని సామాన్య ప్రజానీకం భావిస్తున్న నేపథ్యంలో వాఘేలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే 25 ఏళ్లలో దేశీయంగా డిజిటల్ వినియోగాన్ని వేగవంతం చేయాలంటే డిజిటల్ గవర్నెన్స్ మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీపై విధానాల రూపకల్పన వంటి ఎనిమిది కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని వాఘేలా చెప్పారు. ప్రజోపయోగకరమైన ఆధార్, యూపీఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ వ్యవస్థలతో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు మన దేశ పరిస్థితులకు ఉపయోగపడేలా వినూత్న డిజిటల్ ఆవిష్కరణలను రూపొందించాల్సిన అవసరం ఉందని వాఘేలా తెలిపారు. -
డీసీఐని ప్రైవేటీకరించం
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ రంగ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను (డీసీఐ) ప్రైవేటీకరించబోమని కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయానశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డీసీఐ నిర్వహణ బాధ్యతలను విశాఖపట్నం, పారదీప్, న్యూమంగుళూరు పోర్టులకు అప్పగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. దేశంలోని మేజర్ పోర్టుల చైర్మన్లతో రెండురోజుల సమీక్షా సమావేశం విశాఖలో జరిగింది. సమావేశానంతరం గడ్కరీ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ, ఆక్వా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను మరింత విస్తృతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సమీక్షలో నిర్ణయించామన్నారు. ‘‘కాండ్లా పోర్టులో రెండు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేస్తాం. ఇది అందుబాటులోకి వస్తే యూనిట్ విద్యుత్ రూ.11 నుంచి 2.40కి తగ్గుతుంది. కాండ్లా, ట్యుటికోరిన్, పారదీప్ పోర్టుల్లో ప్రయోగాత్మకంగా ఉప్పునీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్ ప్రాజెక్టును చేపడతాం. దీంతో లీటరు నీరు 3 పైసలకంటే తక్కువకే వస్తుంది. దీన్ని పట్టణ ప్రాంతాలకు సరఫరా చేస్తాం’’ అని వివరించారు. వాడ్రేవులో పోర్టుకు రడీ.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా వాడ్రేవులో కొత్తగా పోర్టు నిర్మించే యోచన ఉందని, ఇందుకు 3 వేల ఎకరాలు అవసరమవుతుందని గడ్కరీ చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబును స్థలం అడుగుతామని చెప్పారు. విశాఖ పోర్టు విస్తరణకున్న స్థల సమస్య దృష్ట్యా శాటిలైట్ పోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణా నదిలోనూ క్రూయిజ్‌ను ప్రవేశపెడతామని తెలిపారు. ముంబైలో రెండు, విశాఖలో ఒకటి సముద్రంలో తేలియాడే రెస్టారెంట్లను నిర్మిస్తామన్నారు. పోర్టులకు అనుబంధంగా ఎస్ఈజెడ్లు.. మేజర్ పోర్టులకు అనుబంధంగా సెజ్‌లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మంత్రి గడ్కరీ తెలిపారు. అలాగే ప్రతి మేజర్ పోర్టులో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర సహాయమంత్రులు మన్సుఖ్ ఎల్ మాండవీయ, రాధాకృష్ణన్, విశాఖ పోర్టు చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు పాల్గొన్నారు. -
డీసీఐని మూసివేసే ప్రసక్తే లేదు: గడ్కరీ
సాక్షి, విశాఖపట్నం: ప్రకాశం జిల్లా ఓడరేవుకు 3వేల ఎకరాలు కేటాయిస్తే పోర్టు నిర్మాణానికి మేము సిద్ధమని కేంద్ర షిప్పంగ్ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆమేరకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)విషయంలో ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. దీనికి సంబంధించిన కేంద్ర కార్యాలయం విశాఖలోనే ఉంటుందని, దానిని మూసివేసే ప్రసక్తే లేదని తెలిపారు. డీసీఐని బలోపేతం చేయడమే మా లక్ష్యమని, దీనికి సంబంధించి కెబినెట్ నోట్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. డీసీఐ సేవల్లో మరింత పోటీ పెంచి, మరికొన్ని ఉద్యోగాలు కల్పిస్తామని గడ్కరీ తెలిపారు. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖ పోర్టుకు అనుబంధంగా శాటిలైట్ పోర్టును ఏర్పాటు చేస్తామని గడ్కరీ చెప్పారు. ప్రధాన పోర్టుల నుంచి వ్యవసాయ, అక్వా ఉత్పత్తు ఎగుమతికి ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అన్నీ మేజర్ పోర్టులలో టూరిజం అభివృద్ధికి ఫ్లోటింగ్ హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాటర్‌వేస్ టూరిజం అభివృద్ధి చేయబోతున్నామని, ముంబై నుంచి గోవాకు టూరిజం క్రూయిజ్‌టు నడుపుతున్నామన్నారు. పోర్టుల ఆధునీకరణ, యాంత్రీకరణంగా గైడ్ చేసేందుకు మద్రాస్ ఐఐటీ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. మురుగు నీరు సముద్రంలో చేరకుండా సీవెజ్ ప్లాంట్ల నిర్మాణం అన్నీ పోర్టులకు తప్పనిసరి చేశామని పేర్కొన్నారు. -
విశాఖలో డీసీఐ ప్రైవేటీకరణపై ఆందోళనలు
-
కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఓ లేఖ రాశారు. లాభాల్లో నడుస్తున్న డీసీఐని ప్రైవేట్‌పరం చేయటం సరికాదని లేఖలో ఆయన గడ్కరీని కోరారు. డీసీఐని ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యోగ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని.. తక్షణం ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని విజయసాయిరెడ్డి లేఖలో కేంద్రాన్ని కోరారు. -
డీసీఐ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ సంఘీభావం
-
నాలుగు ఆటలూ హాలీవుడ్వే...
ఒకప్పుడు ‘డి.సి.ఐ’ (డిజిటల్ సినిమా ఇనీషియేటివ్)కు అనుగుణమైన సినిమా హాళ్ళలోనే హాలీవుడ్ ఫిల్మ్స్ రిలీజ్ చేసేవారు. ప్రపంచమంతటా థియేటర్లలో తమ సినిమా ప్రదర్శన ప్రమాణాలు ఒకేలా ఉండడం కోసం హాలీవుడ్ స్టూడియోలు కొన్ని మార్గదర్శకాలతో ‘డి.సి.ఐ’ టెక్నాలజీ అనే ప్రామాణిక విధానాన్ని రూపొందించాయి. దాన్నే అనుసరిస్తూ వచ్చాయి. అయితే, మన దేశంలో దాదాపు 9 వేల దాకా స్క్రీన్లుంటే, వాటిలో 1500 స్క్రీన్స్ మాత్రమే డి.సి.ఐ ప్రమాణాలకి అనుగుణమైనవి. దాంతో హాలీవుడ్ ఫిల్మ్స్‌ను ఒకేసారి వందల హాళ్ళలో రిలీజ్ చేయడం కుదిరేది కాదు. ఈ ఇబ్బందిని గమనించి, హాలీవుడ్ వ్యూహం మార్చుకుంది. తొలిసారిగా యూనివర్సల్ సంస్థ 2015లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’, ‘జురాసిక్ వరల్డ్’లను ‘నాన్-డి.సి.ఐ’ హాళ్ళలోనూ రిలీజ్ చేసింది. అలా ఒక్కసారి స్క్రీన్స సంఖ్య వందల్లో పెరగడంతో, రెండు సినిమాలూ మన దేశంలో రూ. 100 కోట్ల వసూళ్ళ మార్కు దాటేశాయి. ఇలా రెండు హాలీవుడ్ ఫిల్మ్స్ ఒకే ఏడాది మన దగ్గర 100 కోట్ల క్లబ్లో చేరడం అదే తొలిసారి! అలాగే, గతేడాది వచ్చిన ‘ది ఎవెంజర్స్- ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’, ‘మిషన్ ఇంపాజిబుల్ - రోగ్ నేషన్’, ‘టెర్మినేటర్ జెనిసిస్’లు కూడా ఇండియాలో టాప్ హాలీవుడ్ గ్రాసర్స్ అయ్యాయి. ‘డి.సి.ఐ’కి అతీతంగా ఎక్కువ స్క్రీన్సలో రిలీజ్ చేస్తే ఎంత భారీ వసూళ్ళు వస్తాయో హాలీవుడ్ స్టూడియోలకు తెలిసొచ్చింది. అందరూ ఇప్పుడు అదే దోవ పట్టారు.