ఒకప్పుడు ‘డి.సి.ఐ’ (డిజిటల్ సినిమా ఇనీషియేటివ్)కు అనుగుణమైన సినిమా హాళ్ళలోనే హాలీవుడ్ ఫిల్మ్స్ రిలీజ్ చేసేవారు. ప్రపంచమంతటా థియేటర్లలో తమ సినిమా ప్రదర్శన ప్రమాణాలు ఒకేలా ఉండడం కోసం హాలీవుడ్ స్టూడియోలు కొన్ని మార్గదర్శకాలతో ‘డి.సి.ఐ’ టెక్నాలజీ అనే ప్రామాణిక విధానాన్ని రూపొందించాయి. దాన్నే అనుసరిస్తూ వచ్చాయి.
అయితే, మన దేశంలో దాదాపు 9 వేల దాకా స్క్రీన్‌లుంటే, వాటిలో 1500 స్క్రీన్స్ మాత్రమే డి.సి.ఐ ప్రమాణాలకి అనుగుణమైనవి. దాంతో హాలీవుడ్ ఫిల్మ్స్‌ను ఒకేసారి వందల హాళ్ళలో రిలీజ్ చేయడం కుదిరేది కాదు. ఈ ఇబ్బందిని గమనించి, హాలీవుడ్ వ్యూహం మార్చుకుంది. తొలిసారిగా యూనివర్సల్ సంస్థ 2015లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’, ‘జురాసిక్ వరల్డ్’లను ‘నాన్-డి.సి.ఐ’ హాళ్ళలోనూ రిలీజ్ చేసింది.
అలా ఒక్కసారి స్క్రీన్‌స సంఖ్య వందల్లో పెరగడంతో, రెండు సినిమాలూ మన దేశంలో రూ. 100 కోట్ల వసూళ్ళ మార్కు దాటేశాయి. ఇలా రెండు హాలీవుడ్ ఫిల్మ్స్ ఒకే ఏడాది మన దగ్గర 100 కోట్ల క్లబ్‌లో చేరడం అదే తొలిసారి! అలాగే, గతేడాది వచ్చిన ‘ది ఎవెంజర్స్- ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’, ‘మిషన్ ఇంపాజిబుల్ - రోగ్ నేషన్’, ‘టెర్మినేటర్ జెనిసిస్’లు కూడా ఇండియాలో టాప్ హాలీవుడ్ గ్రాసర్స్ అయ్యాయి. ‘డి.సి.ఐ’కి అతీతంగా ఎక్కువ స్క్రీన్‌సలో రిలీజ్ చేస్తే ఎంత భారీ వసూళ్ళు వస్తాయో హాలీవుడ్ స్టూడియోలకు తెలిసొచ్చింది. అందరూ ఇప్పుడు అదే దోవ పట్టారు.
నాలుగు ఆటలూ హాలీవుడ్‌వే...
Published Thu, Apr 28 2016 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM
Advertisement
Advertisement