dead issue
-
'హట్సన్ కంపెనీ' లో విషాదం..! యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆందోళన..!!
సంగారెడ్డి: జహీరాబాద్ మండలం గోవింద్పూర్ వద్ద గల హట్సన్ కంపెనీలోని వాటర్ ట్యాంక్లో పడి గిరిజన యువ కుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. మొగుడంపల్లి మండలం మిర్జపల్లి తండాకు చెందిన హేమ్సింగ్కు ముగ్గురు కొడుకులు. చిన్నవాడైన దశరథ్(23) హట్సన్ కంపెనీలో వాటర్మెన్గా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 5.30 గంటలకు డ్యూటీకి వెళ్లాడు. సుమారు 7 గంటల ప్రాంతంలో కంపెనీలో ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయడానికి వెళ్లి కాలు జారి నీళ్లలో పడ్డాడు. ఈత రాకపోవడంతో అందులో మునిగి మృతి చెందాడు. దశరథ్ ఎంతకీ రాకపోవడంతో తోటి కార్మికులు వెళ్లి చూడగా ట్యాంక్లో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కంపెనీ వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా కంపెనీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గేటు వద్ద ఆందోళనకు దిగారు. చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్, జహీరాబాద్ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ నుంచి శవాన్ని బయటకు తీయించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మృతి చెందాడని, న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో వచ్చిన తరువాత మాట్లాడి తగిన న్యాయం చేస్తామని డీఎస్పీ రఘు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. జహీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చాపరాయి మృతులు గుర్తుకురాలేదా?
స్పీకర్ కోడెలకు ఎమ్మెల్యే వంతల సూటిప్రశ్న ప్రభుత్వ చర్యల వల్లే గిరిజనులకు ఈ దుస్థితి అని ఆగ్రహం రంపచోడవరం : ఏజెన్సీ పర్యటనకు వచ్చిన శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చాపరాయిలో జ్వరాలతో చనిపోయిన గిరిజన కుటుంబాలను ఆ గ్రామానికి వెళ్లి కనీసం పలకరించాలని అనిపించలేదా అని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక విలేకరులకు ఆమె ఈ మేరకు ఒక ప్రకటన అందజేశారు. జ్వరాలతో గిరిజనులు చనిపోతుంటే మూఢ నమ్మకాల వల్ల చనిపోయారని అంటారా అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వం గిరిజనుల విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు అందని దయనీయ పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం తీరు సరిగా లేదని ఆరోపించారు. ఏజెన్సీలో గిరిజనుల మరణాలు సీఎంకు కనిపించలేదా అని ప్రశ్నించారు. కనీసం సీఎం ఇప్పటి వరకు రంపచోవరం ఏజెన్సీకి రాలేదంటే మీ ప్రభుత్వం తీరు ఏ పరిస్థితిలో ఉందో అర్ధమవుతోందన్నారు. ప్రభుత్వం తీరును గిరిజనులు గమనిస్తున్నారని, వారు మూఢ నమ్మకాల్లో లేరని ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఉన్నారని తెలిపారు. గిరిజనులను చిన్న చూపు చూస్తే సహించేది లేదన్నారు. ఏజెన్సీలో వైద్య సేవలు అందక గిరిజనులు చనిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదన్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మందులు సరిగా అందుబాటులో లేవన్నారు. మీరు చేసే తప్పులకు గిరిజనులు బలవుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో తక్షణం వైద్య శిబిరాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. -
కాట్రావులపల్లిలో నిశబ్దపు ఛాయలు
ఏఓబీ ఎ¯ŒSకౌంటర్లో మావోయిస్టు కామేశ్వరి మృతిపై విషాదం భర్త శ్రీనివాసరావును గుర్తు తెచ్చుకుంటున్న గ్రామస్తులు జగ్గంపేట : ఆంధ్ర – ఒడిశా సరిహద్దులో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎ¯ŒSకౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులలో మండలంలోని కాట్రావులపల్లికి చెందిన దువ్వూరి కామేశ్వరి ఉండడడంతో ఆ గ్రామంలో నిశబ్దపు ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కుమారుడు దివంగత కామ్రేడ్ శ్రీనివాసరావుకు మృతురాలు కామేశ్వరి భార్యగా తెలియడంతో కాట్రావులపల్లి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు జ్ఞాపకాలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఏఓబీ ఎ¯ŒSకౌంటర్ నేపథ్యంలో తమ గ్రామం పేరు వెలుగులోకి రావడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోననే భయంతో గ్రామస్తులు మంగళవారం గడిపారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తారనే చర్చ సాగింది. ఆమె భర్త కుటుంబ సభ్యులు మాత్రం తమకేమీ సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. 2001లో అజ్ఞాతంలోకి.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన దువ్వూరి సుబ్బారావు గ్రామంలో ఉపాధ్యాయుడిగా మంచి గుర్తింపు పొందారు. కమ్యూనిస్టు భావజాలం గల ఆయనకు ఒక కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఉన్నారు. చిన్నతనం నుంచే చురుకుగా ఉంటే శ్రీనివాసరావు గ్రామంలో టె¯ŒS్త వరకు చదివి టాపర్గా నిలిచాడు. పెద్దాపురంలో ఇంటర్మీడియట్, కాకినాడలో ప్రభుత్వ ఐటీఐ విద్యనభ్యసించి ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగంలో చేరాడు. ఏలేశ్వరం, గోకవరం, రాజమహేంద్రవరం డిపోలలో పనిచేశారు. ఆయా డిపోలలో యూనియన్ల కోసం పనిచేసి 2001లో అజ్ఞాతంలోకి వెళ్లారు. 2011లో జరిగిన ఎ¯ŒSకౌంటర్లో శ్రీనివాసరావు మృతి చెందడంతో గ్రామంలో అతడి మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించారు. గ్రామంలో యువజన సంఘం ద్వారా చేపట్టిన పనులు ఆయనకు గుర్తింపునివ్వగా, మంచి ప్రసంగ కర్త అని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన దళాలలో ఉండగానే కామేశ్వరితో పరిచయం వివాహానికి దారి తీసి ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై ఆయన తండ్రి, కామేశ్వరి మామగారు దువ్వూరి సుబ్బారావు మాస్టారును ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘‘కుమారుడు శ్రీనివాసరావు 2001లో అజ్ఞాతంలోకి వెళ్లి పదేళ్ల తరువాత 2011లో జనవరి 9న ఎ¯ŒSకౌంటర్ అయ్యాడు. ఆయనకు శాస్రీ్తయంగా వివాహం జరగలేదు. కామేశ్వరి మీ కోడలని మృతదేహాన్ని తీసుకువెళ్లాలని సమాచారం వచ్చింది. అందుకు మేము సిద్ధంగా లేం’’ అని తెలిపారు.