Dead-march
-
'టామీ'కి అంతిమ యాత్ర
కర్నూలు, ఆళ్లగడ్డ: పట్టణానికి చెందిన ఆవుల భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉండే శునకం (టామీ) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. దానిపై ప్రేమతో ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ దృశ్యాన్ని పట్టణవాసులు ఆసక్తిగా తిలకించారు. -
అంతిమయాత్రలో.. ఆ నలుగురు
ఇద్దరి వల్ల ‘జన్మ’.. నలుగురి వల్ల ‘కర్మ’ సంపదలుంటేనే సమాజంలో గౌరవం లేనివారిని చూస్తే అగౌరవం.. అయిన వాళ్లందరూ ఉంటే ఆ బతుక్కు అర్థం అన్నీ ఉంటేనే జీవితానికి.. అందం ఆస్తిపాస్తులు, అష్టైశ్వర్యాలుంటేనే ‘బంధం’ ఏమీ లేదని, ఎవరూ లేరని ‘అనాథ’లుగా చూస్తాం ప్రాణమున్నంత వరకూ పలకరిస్తారు.. ప్రాణం వదిలినంక వెంట ఎవరూ రారు ఆమెకు అయిన వాళ్లెవరూ లేరు.. ఆదరించేవారు లేరు.. పెళ్లిలేదు..ఇల్లూ లేదు.. పాడె మోసే దిక్కూ లేక.. అనాథ శవం ఆ ‘నలుగురు’ కలిశారు.. అనంత లోకాలకు సాగనంపారు అనంతపురం / యాడికి: అనాథ శవానికి ఆ నలుగురే దిక్కయ్యారు. అయినవాళ్లు ఎవరూ తిరిగి చూడకపోవడంతో వారే ముందుండి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాల్లోకెళ్తే.. యాడికిలోని నాగులకట్టవీధికి చెందిన కొర్రపాటి వెంకటసుబ్బమ్మ (68) అవివాహిత. వృద్ధాప్య పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్న ఈమెకు సొంతిల్లు లేదు. అద్దె ఇంటిలోనే ఉండేది. అద్దె కట్టలేని పరిస్థితిలో ఉండటంతో ఇటీవలే ఇల్లు ఖాళీ చేయించారు. పది రోజుల నుంచి ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బస్టాప్‌లోనే ఆమె ఉంటోంది. సోమవారం ఉదయమంతా హుషారుగానే తిరిగిన ఈమె రాత్రి భోజనం చేసి పడుకుంది. రెండు రోజులుగా చలితీవ్రత విపరీతంగా పెరుగుతూ వస్తుండటంతో కొంత నలతగానే కనిపించేది. చలికి తట్టుకోలేకపోయిన వెంకటసుబ్బమ్మ రాత్రి నిద్రలోనే ప్రాణం విడిచింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆమెలో చలనం కనిపించలేదు. ఈగలు వాలుతుండటంతో ప్రయాణికులు, చుట్టుపక్కల వారు పలకరించినా ఆమె నుంచి స్పందన రాలేదు. నిశితంగా పరిశీలించగా ఆమె మృతి చెందినట్లు తెలుసుకున్నారు. ఈ విషయం దావానలంలా వ్యాపించింది. స్థానిక చింతవనం ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన తమ్ముడు నివాసం ఉంటున్నప్పటికీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. తిరునాంపల్లెలో చెల్లెలు కుమారుడికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు చివరకు పోలీసులకు విషయం చేరవేశారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, విలేకరులు పెద్దపప్పూరు మండలంలోని రామకోటిలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ పద్మనాభ భట్రాజ్కు సమాచారం అందించారు. భట్రాజ్ యాడికికి వచ్చి వృద్ధురాలి మృతదేహానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి, పూలలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం హెడ్‌కానిస్టేబుల్ డెన్నీ, గ్రామ తలారి సుబ్బరాయుడు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు అబ్దుల్ రజాక్‌లు మృతురాలిని ఆటోలోకి చేర్చారు. హిందూ శ్మశానవాటికలో వెంకటసుబ్బమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు. భట్రాజుకు కృతజ్ఞతలు ఆటో రవాణా ఖర్చుల కోసం డబ్బు ఇవ్వబోతే భట్రాజ్ సున్నితంగా తిరస్కరించాడు. తాను స్వంత ఖర్చులతో ఇప్పటి వరకు 150 అనాథల మృతదేహాలను శ్మశానాలకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించానన్నారు. అనాథలు ఎవరైనా మృతి చెందితే తన నంబరు 94900 70655కు తెలిపితే ఎంత దూరమైనా సరే వెళ్లి అంత్యక్రియలు నిర్వహించి వస్తానని తెలపగా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మృతురాలి వద్ద ఉన్న సంచిలో రూ.1600 నగదు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, వృద్ధాప్య పింఛన్ కార్డు మాత్రమే ఉందని పోలీసులు చెప్పారు. -
నేడు సినారె అంతిమయాత్ర
డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు పుప్పాలగూడ డాలర్హిల్స్లోని ఆయన స్వగృహం నుంచి షేక్‌పేట్ నాలా, మెహదీపట్నం, ఆబిడ్స్ మీదుగా తిలక్‌రోడ్డులోని తెలంగాణ సారస్వతపరిషత్తుకు ఆయన పార్థివ దేహాన్ని చేరుస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు కవులు, రచయితల సందర్శనార్ధం అక్కడ ఉంచుతారు. ఆ తర్వాత సారస్వతపరిషత్తు నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, మెహదీపట్నం, టోలీచౌకి, విస్పర్‌వ్యాలీ మీదుగా మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకుంటుంది. –సాక్షి, సిటీబ్యూరో -
చిన్నారి సాయిశ్రీకి కన్నీటి వీడ్కోలు
-
సాయిశ్రీకి కన్నీటి వీడ్కోలు
గాంధీనగర్ (విజయవాడ) : తండ్రి కర్కశత్వానికి, కబ్జాకోరుల దాష్టీకానికి బలైన చిన్నారి మాదంశెట్టి సాయిశ్రీ(13) అంతిమయాత్ర సోమవారం అశ్రునయనాల మధ్య సాగింది. ‘డాడీ... నన్ను బతికించు..’ అంటూ తండ్రిని వేడుకున్న సాయిశ్రీ సెల్ఫీ వీడియో మీడియాలో ప్రసారం కావడంతో అందరినీ కలచివేసింది. ఆ చిన్నారని కడసారి చూసేందుకు మహిళలు తరలివచ్చారు. సాయిశ్రీ భౌతికకాయం వద్ద ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు. దుర్గాపురంలోని సాయిశ్రీ ఇంటి నుంచి సాంబమూర్తిరోడ్డు వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ నుంచి వాహనంలో ఆమె భౌతికకాయాన్ని కృష్ణలంకలోని స్వర్గపురికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఇంటి సమీపంలో సాయిశ్రీ భౌతికకాయం ఉంచి కొద్దిసేపు నిరసన తెలిపారు. సుమశ్రీకి బాసట... సాయిశ్రీ తల్లి సుమశ్రీని పలువురు నాయకులు పరామర్శించారు. ఆమెను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. సాయిశ్రీకి నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఫణిరాజు, ఐద్వా నాయకులు కె.శ్రీదేవి, డివైఎఫ్ఐ నాయకుడు మాధవ్ తదితరులు ఉన్నారు. బొండా ఉమా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చిన్నారి సాయిశ్రీ మృతికి పరోక్షంగా కారకుడైన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సాయిశ్రీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దుర్గాపురంలోని ఆమె ఇంటికి వెళ్లిన రాజకీయ, ప్రజా సంఘాలు, మహిళ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాయిశ్రీ తండ్రి శివకుమార్, ఆయనకు సహకరించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటిని కబ్జా చేసి చిన్నారి మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగరంలో కబ్జాలు పెరిగిపోతున్నా, ఇక్కడే నివాసం ఉంటున్న సీఎం పట్టించుకోవడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 20 రోజులుగా ఎమ్మెల్యే బొండా ఎందుకు స్పందించలేదు ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరులు నా ఇల్లు కబ్జా చేశారు. అందువల్లే ఇల్లు అమ్మలేకపోయాను. పాపకు వైద్యం చేయించలేకపోయాను. 20 రోజులుగా నా గోడు వెళ్లబోసుకున్నా ఎమ్మెల్యే ఉమా స్పందించలేదు. న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనకు లేదా? పాప చనిపోయాక ఎందుకు స్పందించారు. మాదంశెట్టి శివకుమార్ బెంగళూరులో ఉన్నారని ఎమ్మెల్యే ఎలా చెబుతారు? శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మాట్లాడడం సరికాదు. శవరాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నిజంగా నాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు ఉంటే నన్ను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. నాకు జరిగిన అన్యాయంపై సీపీని కలుస్తా. బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి. – సుమశ్రీ, సాయిశ్రీ తల్లి -
సంగీతమా ఇక సెలవు
► బాలమురళీ కృష్ణ అంతిమయాత్ర ► అభిమానుల కన్నీటి వీడ్కోలు తమిళసినిమా: సంగీత గాన గంధర్వుడు బాల మురళీకృష్ణ శాశ్వత సెలవుకు సంగీత లోకం మూగపోరుుంది. అభిమానగణం తల్లడిల్లిపోరుుంది. గుండెలు పగిలేలా మౌనంగా ఏడ్చేసింది. ఇదంతా నాకేమిటని భావించిన సంగీత సరస్వతి అవిశ్రాంతంగా తనకు సేవలందిం చి, జీవితాన్నే అంకితం చేసిన సంగీ త సామ్రాట్ బాలమురళీకృష్ణను తనలో లీనం చేసుకుంది. ఆయన భౌతిక కాయానికి మాత్రమే బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగారుు. బాలమురళీకృష్ణ తుదిశ్వాస విడిచిన క్షణం నుంచి బుధవారం అంత్యక్రియల వరకూ ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు నివాళులర్పిస్తూనే ఉన్నారు. ఆయన కీర్తి ప్రతిష్టలను, విజయాలను, తమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అరుునా సంగీత సముద్రం లాంటి బాలమురళీకృష్ణ ప్రతిభ ఇంతని చెప్పడం ఎవరికి మాత్రం సాధ్యం? ఆయన సంగీత, గాన, కీర్తనలకు కొలమానం అసాధ్యం. అందుకే సంగీతం, ముఖ్యంగా కర్ణాటక సంగీతం కంటతడి పెట్టింది. సంగీతాభిమానుల తల్లడిల్లిపోయారు. పలువురు ప్రముఖ రాజకీయ, సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పించా రు. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, తమిళరాష్ట్రం తరఫున విద్యుత్‌శాఖ మంత్రి తంగమణి, అటవీశాఖ మంత్రి దిండుగల్ సి.శ్రీనివాసన్ మం గళవారం రాత్రి బాలమురళీకృష్ణ భౌ తికకాయానికి నివాళులర్పించారు. అ దే విధంగా బుధవారం ఉదయం నుం చే ప్రముఖులు అంజలి ఘటించడానికి తరలివచ్చారు. వారంతా సంగీత వి ద్వాంసుడు బాలమురళీకృష్ణతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భారతరత్న అవార్డుకు ఆయనే అలంకారం. కర్ణాటక సంగీతంలో ప్రపంచ ఖ్యాతి గడించిన గొప్ప సంగీత విద్వాం సుడు, భారతదేశానికి ఖ్యాతిని ఆర్జించిపెట్టిన గాన గంధర్వుడు బాలమురళీకృష్ట భౌతిక కాయానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అంత్యక్రియల లాంఛనాలను నిర్వహించాలని మ్యూజిక్ అకాడమీ ప్రతినిధి పప్పు వేణగోపాల్రావు, ఈలపాట శివప్రసాద్ డిమాండ్ చేశారు. అదే విధంగా ఆయన ఏంతో సంగీత సేవ చేసిన తమిళ రాష్ణ్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. ఇక సంగీతాన్ని భ్రస్టు పట్టిస్తున్న వారికి పద్మ అవార్డులు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం బాల మురళీకృష్ణ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడికి భారతరత్న అవార్డు పురస్కారాన్ని అందించకపోవడం బాధాకరం అన్నారు. నిజానికి భారతరత్న అవార్డును బాలమురళీ కృష్ణ ఎప్పుడో అధిగమించారని, ఆ యనకు ఆ బిరుదు అవసరం లేదని అన్నారు. అరుుతే భారతరత్న బిరుదు ను అందిస్తే ఆయన అభిమానులుగా తాము ఆనందిస్తామని పేర్కొన్నారు. 60 ఏళ్ల అనుబంధం: ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పీఎస్.నారాయణన్ నివాళులర్పిస్తూ బాలమురళీకృష్ణతో తన అనుబంధా న్ని గుర్తు చేసుకున్నారు.బాలమురళీ కృష్ణ ఎనిమిదేళ్ల వయసులో ఎలాంటి ప్రతిభను చాటుకున్నారో, 86 ఏళ్ల వ యసులోనూ అంతే ప్రతిభను కలిగి ఉన్నారన్నారు. అరుునా కొంచెం కూ డా గర్వం ప్రదర్శించని అత్యంత నిరాడంబురుడని కీర్తించారు. చివరి దశ లో ప్రశాంతంగా గడిపారు. అలాంటి బాలమురళీకృష్ణ మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటని పేర్కొన్నారు. కర్ణాటక సంగీతాన్ని పూర్తిగా మార్చేశారు : సంగీతానికి అంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా కర్ణాటక సంగీతాన్ని పూర్తిగా మార్చేసిన మహానుభావుడు బాలమురళీకృష్ణ అని కర్ణాటక సంగీత గాయని అరుణా సారుురామ్ వ్యాఖ్యానించారు. మూడు విధాలుగా పాడగల ప్రతిభావంతుడనీ, సంగీతం గ్లామర్‌ను చదివిన బాల మురళీ కృష్ణ లాంటి గొప్ప సంగీత విధ్వాంసుడిని ఈ లోకంలో మరొకరిని చూడలేమని అన్నారు. ఆయన్ని కలిసిన ప్రతి సారి సంగీతం గురించి కొత్త కొత్త విషయాలు చెప్పే వారని అరుణా సారుురామ్ అన్నారు. మనం చూసిన వాగ్గేయకారుడు: ఈ తరంలో మనం అందరం చూసిన వాగ్గేయకారుడు బాలమురళీ కృష్ణ అని ప్రముఖ సంగీత కళాకారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు. ఈ గాన గంధర్వుడితో తనది 36 ఏళ్ల అనుబంధం అని తెలిపారు. 1980లో బాల మురళీ కృష్ణ వద్ద శిష్యుడిగా చేరానని తెలిపారు. ఆయన వద్ద ఏడేళ్లు గురుకుల విద్యను అభ్యసించానన్నారు. శిష్యుడుగా కాకుండా కన్న కొడుకులా చూసుకున్నారు. తానిప్పుడీ స్థారుులో ఉన్నానంటే అందుకు కారణం తన గురువు బాల మురళీ కృష్ణే. ఆయనతో కలిసి పలు సంగీత కచ్చేరీలు చేశాను. నేను జీవించి ఉండగానే నా సంగీతాన్ని, పాటల్ని ప్రజలు వింటున్నారు. అలా నేను చాలా అదృష్టవంతుడ్ని అని బాలమురళీకృష్ణ అం టుండేవారని తెలిపారు. అలాంటి సం గీత సరస్వతీ పుత్రుడు ఈ లోకానికి మరొకరు రారని వ్యాఖ్యానించారు. కర్ణాక సంగీత సామ్రాట్: బాల మురళీ కృష్ణ కర్ణాటక సంగీత సామ్రాట్ అని కీర్తించారు ప్రముఖ సంగీత కళాకారుడు ఎల్లా వెంకటేశ్వర్లు. ఏడవ ఏట నుంచే తాను గురు సమానులు బాల మురళీ కృష్నకు సహకారిగా ఉంటున్నానని తెలిపారు.అలాంటి గొప్ప సం గీత విద్వాంసుడి మరణంతో సంగీత లోకం దుఖఃసాగరంలో మునిగి పోరుుందన్నారు. బాల మురళీ కృష్ణ సంగీత సేవకే పుట్టారన్నారు. అద్భుత ప్రతిభాశాలి. ఆయన తెలుగు వాడిగా పుట్టడమే మన అదృష్టం అన్నారు. సంగీతకళామూర్తి: బాలమురళీ కృష్ణ సంగీత కళామూర్తి అని సీనియర్ సంగీతదర్శకుడు ఎస్ఏ.రాజ్‌కుమార్ పేర్కొన్నారు. అట్లాంటి ఆయన భౌతి కంగా మన ముందు లేకపోరుునా ఆయన సంగీతం కలకాలం సజీవంగా ఉంటుందన్నారు. తమ మ్యూజిక్ సంఘానికి మూలస్తంభం లాంటి వారన్నారు. సంఘానికి ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. ఏమయ్యా నాతో పాడించవా అన్నారు: బాల మురళీ కృష్ణతో తనకు పెద్దగా పరిచయం లేదు గానీ, ఒక సారి మద్రాసు యూనివర్సిటీలో గాయకుడు ఎస్సీ.బాల సుబ్రహ్మణ్యం ఆయనికి పరిచయం చేశారని, అప్పుడు ఏమయ్యా వీళ్లందరితో పాడిస్తున్నావు నాతో పాడించవా? అని అడిగారని సీనియర్ నిర్మాత కె.మురారి అన్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి : ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు బాలమురళీకృష్ణ మృతి వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఒక ప్రకటనలో సంతాపం వెలిబుచ్చారు. బాలమురళీకృష్ణ చిన్నతనంలోనే అద్భుతమైన గానం చేసేవారని, దేశ విదేశాలలో వేలాది కచేరీలు నిర్వహిం చి ఖ్యాతిని గడించారన్నారు. సినీ పరి శ్రమలో కూడా విజయకేతనం ఎగురవేశారని గుర్తు చేశారు. తమిళ మహా నాడు సెమ్మొళి కోసం రూపొందించిన థీమ్ సాంగ్‌కు ఆయన తొలి బాణిని కట్టిన మేధావి అని పేర్కొన్నారు. 72 మేళ కర్త రాగాలను ఆలపించారు: తాను రచన చేసి బాణీలు సమకూర్చి న 72 మేళ కర్తరాగాలను బాలమురళీ కృష్ణ ఆలపించారని యువ సంగీత, గీత రచరుుత స్వర వీణాపాణి ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా నటుడు మనో, గాయనీ వాణి జయరామ్, సంగీతదర్శకుడు, గాయకుడు జి.ఆనంద్, రాము, గజల్స్ శ్రీనివాస్, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సీఎంకే రెడ్డి, ద్రవిడదేశం పార్టీ అధ్యక్షుడు వీ.కృష్ణారావు, ఆమ్ ఆద్మీ రాష్ట్ర కార్యదర్వి డీ.సురేశ్, సుధ, లలిత కళా వేదిక కార్యదర్శి మాధవి, ఉపాధ్యక్షుడు రామ్, మైలాపూర్ శాసన సభ్యుడు నటరాజ్, సీపీఐ నేత నల్లకన్ను, వైఎస్ ఆర్సీపీ సేవాదళ్ తమిళనాడు విభాగం ప్రధాన కార్యదర్శి కమలాపురం లక్ష్మి శ్రీదేవిరెడ్డి బాలమురళీ కృష్ణకు నివాళులందించారు. బుధవారం సాయంత్రం బాలమురళీ కృష్ణ భౌతిక కాయానికి స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగారుు. భారీ ఊరేగింపుగా సాగిన ఈ అంత్యక్రియలకు బంధువులు, సన్నిహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అశృనయనాలతో వీడ్కోలు పలికారు. కారణజన్ముడు బాలమురళీకృష్ణ : బాలమురళీకృష్ణ కారణ జన్ముడని సంగీత కళాకారుల ద్వయం ప్రియాసిస్టర్స్ పేర్కొన్నారు. ఆయన సంగీతం గురించి మాట్లాడే అర్హత తమకు లేదని, అరుుతే ఆయన స్ఫూర్తి మాత్రం తమపై ఉందని అన్నారు. బాలమురళీకృష్ణ వల్ల ప్రభావితం కాని సంగీత కళాకారులు లేరు అనడం అతిశయోక్తి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలమురళీకృష్ణ చేతుల మీదుగా సత్కారం అందుకునే అదృష్టం తమకు లభిం చిందని అన్నారు. సంగీత సరస్వతి పంపిన వ్యక్తి బాలమురళీకృష్ణ అని పేర్కొన్నారు. అలాంటి గొప్ప సంగీత విద్వాంసుడి కాలంలో తామూ ఉన్నందుకు ఆనందంగా ఉందని ప్రియాసిస్టర్స్ అన్నారు -ప్రియాసిస్టర్స్ -
విష్ణుమూర్తితో తెనాలికి జాతీయ స్థాయి కీర్తి
తెనాలి : విశిష్టమైన అవార్డుతో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తెనాలికి జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన యలవర్తి నాయుడమ్మ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ పి.విష్ణుమూర్తి హఠాన్మరణం తీరని లోటని పలువురు ప్రముఖులు తమ శ్రద్ధాంజలి సంతాపంలో పేర్కొన్నారు. గుండెపోటుతో మృతిచెందిన విష్ణుమూర్తి భౌతికకాయాన్ని శుక్రవారం వివిధ రంగాల ప్రముఖులు సందర్శించి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెనాలికి కీర్తిని తీసుకొచ్చిన అంశాల్లో నాయుడమ్మ ట్రస్ట్ ఒకటని, విష్ణుమూర్తి నిర్వహణ కారణంగానే ఆ గుర్తింపు లభించిందని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఒక నిష్కామకర్మగా రెండున్నర దశాబ్దాలుగా 23 మంది శాస్త్రవేత్తలను తెనాలికి రప్పించి, నాయుడమ్మను జనం గుండెల్లో బతికిస్తూనే ఉండటం అరుదైన విషయమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, గౌతమ్గ్రాండ్ హోటల్ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్, డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్, డాక్టర్ వి.శేషగిరిరావు, డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరప్రసాద్, రచయిత ఎండీ సౌజన్య, నాయుడమ్మ ట్రస్ట్ సభ్యులు సూరెడ్డి సూర్యమోహన్, రాచాబత్తుని శ్రీనివాసరావు, బలభద్రరావు, ప్రముఖ శిల్పి ఎ.రామకృష్ణ, సూర్యకుమారి, ప్రసాద్, ఆలపాటి వెంకట్రామయ్య, బూరెల దుర్గ, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, అక్కిదాసు కిరణ్, విజయవాడ ప్రముఖుడు ప్రభాకర్, విలేకరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు. ప్రముఖుల సంతాపం... తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, చిత్తూరు సీనియర్ సివిల్ జడ్జి వేల్పుల కృష్ణమూర్తి, నాయుడమ్మ మనుమరాలు అంజనా, దూరదర్శన్ రిటైర్డ్ డిప్యూటీ డెరైక్టర్ యార్లగడ్డ శైలజ ఫోనులో సంతాపాన్ని తెలియజేశారు. ఘనంగా అంతిమయాత్ర... మధ్యాహ్నం 3.45 గంటలకు అంతిమయాత్ర ప్రారంభించారు. రామలింగేశ్వరపేటలోని ఆయన నివాసం నుంచి సత్యనారాయణపార్కురోడ్ మీదుగా చినరావూరు శ్మశానస్థలికి చేరుకొంది. అక్కడ శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. 24వ నాయుడమ్మ ట్రస్ట్ అవార్డు సభ సన్నాహాల్లో ఉండగా అస్వస్థత.. యలవర్తి నాయుడమ్మ స్మారక ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ పి.విష్ణుమూర్తి (69) రామలింగేశ్వరపేట నివాస గృహంలో హఠాన్మరణం చెందారు. కొద్దిరోజులుగా అస్వస్థతతో ఉన్న విష్ణుమూర్తికి గురువారం రాత్రి గుండెపోటు రావటంతో కన్నుమూశారు. స్థానిక వీఎస్ఆర్ కాలేజిలో కామర్స్ అధ్యాపకుడిగా పనిచేశారు విష్ణుమూర్తి, యూఎన్ఐ వార్తాసంస్థకు తెనాలి ప్రతినిధిగా కొంతకాలం వ్యవహరించారు. జపాన్, భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల వ్యాప్తి లక్ష్యంతో భారత-జపాన్ మైత్రీసంఘం ఏర్పాటు చేసి పదేళ్లు నిర్విరామంగా పలు విభిన్న కార్యక్రమాలు జరిపారు. 1985లో కనిష్క విమాన ప్రమాదంలో తెనాలికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ దుర్మరణం చెందడం విష్ణుమూర్తిని కలచివేసింది. ఆయన స్ఫూర్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని భావితరాలకు అందించాలని నిర్ణయించుకొని నాయుడమ్మ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 23 మంది ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయస్థాయి శాస్త్రవేత్తలను తెనాలికి రప్పించి నాయుడమ్మ అవార్డుతో సత్కరిస్తూ వచ్చారు. 24వ అవార్డు సభకు సన్నాహాల్లో ఉండగా అస్వస్థతకు గురవడం ఆయన ప్రాణాలమీదికొచ్చింది. ఆయన వివాహం చేసుకోలేదు. సోదరులు, సోదరీమణులు, వారి కుటుంబసభ్యులు ఉన్నారు. -
అంతిమయాత్రలో ఉద్రిక్తత
{పగతి కళాశాలలోకి దూసుకెళ్లి విద్యార్థులు పూలకుండీలు, కిటికీ అద్దాలు, కారు ధ్వంసం అశ్రునయనాలతో హర్షవర్ధన్ అంత్యక్రియలు సుల్తాన్‌బజార్/ అఫ్జల్‌గంజ్ : సీనియర్ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌రావు అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినిని ర్యాగింగ్ చేయొద్దన్న పాపానికి హనుమాన్ టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో రాంకోఠికి చెందిన హర్షవర్ధన్‌పై సతీష్కోడ్కర్ అనే విద్యార్థి దాడి చేయడంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసింది. ఆదివారం ఉదయం ఉస్మానియాలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో మార్చురీ వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా... తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. కొద్ది సేపటి తర్వాత అంతమయాత్ర ప్రారంభమైంది. కళాశాలలోకి తోసుకెళ్లిన విద్యార్థులు... అంతిమయాత్రలో వందలాది మంది విద్యార్థులు, బంధువులు పాల్గొన్నారు. యాత్ర ప్రగతి మహావిద్యాలయ కళాశాల వద్దకు చేరుకోగానే విద్యార్థులు ఉద్విగ్నానికి లోనయ్యారు. హర్షవర్ధన్ అమర్హై... కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు కళాశాల ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. కనీసం హర్షవర్ధన్ మృతదేహాన్ని చూడటానికి కూడా కళాశాల యాజమాన్యం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న విద్యార్థులు కళాశాల గేట్లను తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులను పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో విద్యార్థులు కళాశాల కిటికీ అద్దాలతో పూలకుండీలు, అక్కడ పార్క్ చేసిన ఉన్న ఓ కారు అద్దాలను ధ్వంసం చేశారు. మృతదేహాన్ని కాలేజీ వద్ద ఉంచి కొద్దిసేపు నినాదాలు చేశారు. మృతుడి బంధువులు సముదాయించడంతో విద్యార్థులు ఆందోళన విరమించి అంతిమయాత్రను కొనసాగించారు. అనంతరం పురానాపూల్ శ్మశానవాటికలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. పలువురి పరామర్శ... హర్షవర్ధన్ కుటుంబ సభ్యులను అంతకు ముందు టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, టీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జి ప్రేమ్‌కుమార్‌దూత్, టీఆర్ఎస్ నాయకురాలు పడాల లలిత తదితరులు పరామర్శించారు. పోలీసుల అదుపులో నిందితుడు హర్షవర్ధన్‌పై దాడి చేసి అతడి మృతికి కారణమైన సీనియర్ విద్యార్థి సతీష్ కోడ్కర్ను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతడిని రహస్య ప్రాంతానికి తరలించి, అసలు హర్షవర్ధన్‌పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనేది తెలుసుకుంటున్నట్టు తెలిసింది. అయితే, సతీష్ అరెస్ట్‌ను సుల్తాన్‌బజార్ పోలీసులు ధ్రువీకరించలేదు. నిందితుడిని సోమవారం లేదా మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. -
అంతిమయాత్రలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌రావు అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినిని ర్యాగింగ్ చేయొద్దన్న పాపానికి హనుమాన్ టేకిడీలోని ప్రగతి మహా విద్యాలయ కళాశాలలో రాంకోఠికి చెందిన హర్షవర్ధన్‌పై సతీష్కోడ్కర్ అనే విద్యార్థి దాడి చేయడంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసింది. ఆదివారం ఉదయం ఉస్మానియాలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో మార్చురీ వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా... తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యం తమ య్యారు. కొద్ది సేపటి తర్వాత అంతమయాత్ర ప్రారంభమైంది. కళాశాలలోకి తోసుకెళ్లిన విద్యార్థులు... అంతిమయాత్రలో వందలాది మంది విద్యార్థులు, బంధువులు పాల్గొన్నారు. యాత్ర ప్రగతి మహావిద్యాలయ కళాశాల వద్దకు చేరుకోగానే విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు. హర్షవర్ధన్ అమర్హై... కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు కళాశాల ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. కనీసం హర్షవర్ధన్ మృతదేహాన్ని చూడటానికి కూడా కళాశాల యాజమాన్యం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న విద్యార్థులు కళాశాల గేట్లను తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులను పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో విద్యార్థులు కళాశాల కిటికీ అద్దాలతో పూలకుండీలు, అక్కడ పార్క్ చేసిన ఉన్న ఓ కారు అద్దాలను ధ్వంసం చేశారు. మృతదేహాన్ని కాలేజీ వద్ద ఉంచి కొద్దిసేపు నినాదాలు చేశారు. మృతుడి బంధువులు సముదాయించడంతో విద్యార్థులు ఆందోళన విరమించి అంతిమయాత్రను కొనసాగించారు. అనంతరం పురానాపూల్ శ్మశానవాటికలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. పలువురి సందర్శన... హర్షవర్ధన్ కుటుంబ సభ్యులను అంతకు ముందు టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, టీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జి ప్రేమ్‌కుమార్‌దూత్, టీఆర్ఎస్ నాయకురాలు పడాల లలిత తదితరులు పరామర్శించారు.