సంగీతమా ఇక సెలవు | Remembering M. Balamuralikrishna, Who Sang and Lived on His Own Terms | Sakshi
Sakshi News home page

సంగీతమా ఇక సెలవు

Published Thu, Nov 24 2016 4:07 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM

సంగీతమా ఇక సెలవు - Sakshi

సంగీతమా ఇక సెలవు

బాలమురళీ కృష్ణ అంతిమయాత్ర  
అభిమానుల కన్నీటి వీడ్కోలు

తమిళసినిమా: సంగీత గాన గంధర్వుడు బాల మురళీకృష్ణ శాశ్వత సెలవుకు సంగీత లోకం మూగపోరుుంది. అభిమానగణం తల్లడిల్లిపోరుుంది. గుండెలు పగిలేలా మౌనంగా ఏడ్చేసింది. ఇదంతా నాకేమిటని భావించిన సంగీత సరస్వతి అవిశ్రాంతంగా తనకు సేవలందిం చి, జీవితాన్నే అంకితం చేసిన సంగీ త సామ్రాట్ బాలమురళీకృష్ణను తనలో లీనం చేసుకుంది. ఆయన భౌతిక కాయానికి మాత్రమే బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగారుు.    
   
బాలమురళీకృష్ణ తుదిశ్వాస విడిచిన క్షణం నుంచి బుధవారం అంత్యక్రియల వరకూ ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు నివాళులర్పిస్తూనే ఉన్నారు. ఆయన కీర్తి ప్రతిష్టలను, విజయాలను, తమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అరుునా సంగీత సముద్రం లాంటి బాలమురళీకృష్ణ ప్రతిభ ఇంతని చెప్పడం ఎవరికి మాత్రం సాధ్యం? ఆయన సంగీత, గాన, కీర్తనలకు కొలమానం అసాధ్యం. అందుకే సంగీతం, ముఖ్యంగా కర్ణాటక సంగీతం కంటతడి పెట్టింది. సంగీతాభిమానుల తల్లడిల్లిపోయారు. పలువురు ప్రముఖ రాజకీయ, సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పించా రు. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, తమిళరాష్ట్రం తరఫున విద్యుత్‌శాఖ మంత్రి తంగమణి, అటవీశాఖ మంత్రి దిండుగల్ సి.శ్రీనివాసన్ మం గళవారం రాత్రి బాలమురళీకృష్ణ భౌ తికకాయానికి నివాళులర్పించారు. అ దే విధంగా బుధవారం ఉదయం నుం చే ప్రముఖులు అంజలి ఘటించడానికి తరలివచ్చారు. వారంతా సంగీత వి ద్వాంసుడు బాలమురళీకృష్ణతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

భారతరత్న అవార్డుకు ఆయనే అలంకారం. కర్ణాటక సంగీతంలో ప్రపంచ ఖ్యాతి గడించిన గొప్ప సంగీత విద్వాం సుడు, భారతదేశానికి ఖ్యాతిని ఆర్జించిపెట్టిన గాన గంధర్వుడు బాలమురళీకృష్ట భౌతిక కాయానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అంత్యక్రియల లాంఛనాలను నిర్వహించాలని మ్యూజిక్ అకాడమీ ప్రతినిధి పప్పు వేణగోపాల్‌రావు, ఈలపాట శివప్రసాద్ డిమాండ్ చేశారు. అదే విధంగా ఆయన ఏంతో సంగీత సేవ చేసిన తమిళ రాష్ణ్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. ఇక సంగీతాన్ని భ్రస్టు పట్టిస్తున్న వారికి పద్మ అవార్డులు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం బాల మురళీకృష్ణ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడికి భారతరత్న అవార్డు పురస్కారాన్ని అందించకపోవడం బాధాకరం అన్నారు. నిజానికి భారతరత్న అవార్డును బాలమురళీ కృష్ణ ఎప్పుడో అధిగమించారని, ఆ యనకు ఆ బిరుదు అవసరం లేదని అన్నారు. అరుుతే భారతరత్న బిరుదు ను అందిస్తే ఆయన అభిమానులుగా తాము ఆనందిస్తామని పేర్కొన్నారు.

60 ఏళ్ల అనుబంధం: ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పీఎస్.నారాయణన్ నివాళులర్పిస్తూ బాలమురళీకృష్ణతో తన అనుబంధా న్ని గుర్తు చేసుకున్నారు.బాలమురళీ కృష్ణ ఎనిమిదేళ్ల వయసులో ఎలాంటి ప్రతిభను చాటుకున్నారో, 86 ఏళ్ల వ యసులోనూ అంతే ప్రతిభను కలిగి ఉన్నారన్నారు. అరుునా కొంచెం కూ డా గర్వం ప్రదర్శించని అత్యంత నిరాడంబురుడని కీర్తించారు. చివరి దశ లో ప్రశాంతంగా గడిపారు. అలాంటి బాలమురళీకృష్ణ మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటని పేర్కొన్నారు.
 
కర్ణాటక సంగీతాన్ని పూర్తిగా మార్చేశారు : సంగీతానికి అంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా కర్ణాటక సంగీతాన్ని పూర్తిగా మార్చేసిన మహానుభావుడు బాలమురళీకృష్ణ అని కర్ణాటక సంగీత గాయని అరుణా సారుురామ్ వ్యాఖ్యానించారు. మూడు విధాలుగా పాడగల ప్రతిభావంతుడనీ, సంగీతం గ్లామర్‌ను చదివిన బాల మురళీ కృష్ణ లాంటి గొప్ప సంగీత విధ్వాంసుడిని ఈ లోకంలో మరొకరిని చూడలేమని అన్నారు. ఆయన్ని కలిసిన ప్రతి సారి సంగీతం గురించి కొత్త కొత్త విషయాలు చెప్పే వారని అరుణా సారుురామ్ అన్నారు.

మనం చూసిన వాగ్గేయకారుడు: ఈ తరంలో మనం అందరం చూసిన వాగ్గేయకారుడు బాలమురళీ కృష్ణ అని ప్రముఖ సంగీత కళాకారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు. ఈ గాన గంధర్వుడితో తనది 36 ఏళ్ల అనుబంధం అని తెలిపారు. 1980లో బాల మురళీ కృష్ణ వద్ద శిష్యుడిగా చేరానని తెలిపారు. ఆయన వద్ద ఏడేళ్లు గురుకుల విద్యను అభ్యసించానన్నారు. శిష్యుడుగా కాకుండా కన్న కొడుకులా చూసుకున్నారు. తానిప్పుడీ స్థారుులో ఉన్నానంటే అందుకు కారణం తన గురువు బాల మురళీ కృష్ణే. ఆయనతో కలిసి పలు సంగీత కచ్చేరీలు చేశాను. నేను జీవించి ఉండగానే నా సంగీతాన్ని, పాటల్ని ప్రజలు వింటున్నారు. అలా నేను చాలా అదృష్టవంతుడ్ని అని బాలమురళీకృష్ణ అం టుండేవారని తెలిపారు. అలాంటి సం గీత సరస్వతీ పుత్రుడు ఈ లోకానికి మరొకరు రారని వ్యాఖ్యానించారు.

కర్ణాక సంగీత సామ్రాట్: బాల మురళీ కృష్ణ కర్ణాటక సంగీత సామ్రాట్ అని కీర్తించారు ప్రముఖ సంగీత కళాకారుడు ఎల్లా వెంకటేశ్వర్లు. ఏడవ ఏట నుంచే తాను గురు సమానులు బాల మురళీ కృష్నకు సహకారిగా ఉంటున్నానని తెలిపారు.అలాంటి గొప్ప సం గీత విద్వాంసుడి మరణంతో సంగీత లోకం దుఖఃసాగరంలో మునిగి పోరుుందన్నారు. బాల మురళీ కృష్ణ సంగీత సేవకే పుట్టారన్నారు. అద్భుత ప్రతిభాశాలి. ఆయన తెలుగు వాడిగా పుట్టడమే మన అదృష్టం అన్నారు.

సంగీతకళామూర్తి: బాలమురళీ కృష్ణ సంగీత కళామూర్తి అని సీనియర్ సంగీతదర్శకుడు ఎస్‌ఏ.రాజ్‌కుమార్ పేర్కొన్నారు. అట్లాంటి ఆయన భౌతి కంగా మన ముందు లేకపోరుునా ఆయన సంగీతం కలకాలం సజీవంగా ఉంటుందన్నారు. తమ మ్యూజిక్ సంఘానికి మూలస్తంభం లాంటి వారన్నారు. సంఘానికి ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు.

ఏమయ్యా నాతో పాడించవా అన్నారు: బాల మురళీ కృష్ణతో తనకు పెద్దగా పరిచయం లేదు గానీ, ఒక సారి మద్రాసు యూనివర్సిటీలో గాయకుడు ఎస్‌సీ.బాల సుబ్రహ్మణ్యం ఆయనికి పరిచయం చేశారని, అప్పుడు ఏమయ్యా వీళ్లందరితో పాడిస్తున్నావు నాతో పాడించవా? అని అడిగారని సీనియర్ నిర్మాత కె.మురారి అన్నారు.

డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి :  ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు బాలమురళీకృష్ణ మృతి వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఒక ప్రకటనలో సంతాపం వెలిబుచ్చారు. బాలమురళీకృష్ణ చిన్నతనంలోనే అద్భుతమైన గానం చేసేవారని, దేశ విదేశాలలో వేలాది కచేరీలు నిర్వహిం చి ఖ్యాతిని గడించారన్నారు. సినీ పరి శ్రమలో కూడా విజయకేతనం ఎగురవేశారని గుర్తు చేశారు. తమిళ మహా నాడు సెమ్మొళి కోసం రూపొందించిన థీమ్ సాంగ్‌కు ఆయన తొలి బాణిని కట్టిన మేధావి అని పేర్కొన్నారు.

72 మేళ కర్త రాగాలను ఆలపించారు: తాను రచన చేసి బాణీలు సమకూర్చి న 72 మేళ కర్తరాగాలను బాలమురళీ కృష్ణ ఆలపించారని యువ సంగీత, గీత రచరుుత స్వర వీణాపాణి ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా నటుడు మనో, గాయనీ వాణి జయరామ్, సంగీతదర్శకుడు, గాయకుడు జి.ఆనంద్, రాము, గజల్స్ శ్రీనివాస్, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సీఎంకే రెడ్డి, ద్రవిడదేశం పార్టీ అధ్యక్షుడు వీ.కృష్ణారావు, ఆమ్ ఆద్మీ రాష్ట్ర కార్యదర్వి డీ.సురేశ్, సుధ, లలిత కళా వేదిక కార్యదర్శి మాధవి, ఉపాధ్యక్షుడు రామ్, మైలాపూర్ శాసన సభ్యుడు నటరాజ్, సీపీఐ నేత నల్లకన్ను, వైఎస్ ఆర్‌సీపీ సేవాదళ్ తమిళనాడు విభాగం ప్రధాన కార్యదర్శి కమలాపురం లక్ష్మి శ్రీదేవిరెడ్డి బాలమురళీ కృష్ణకు నివాళులందించారు. బుధవారం సాయంత్రం బాలమురళీ కృష్ణ భౌతిక కాయానికి స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగారుు. భారీ ఊరేగింపుగా సాగిన ఈ అంత్యక్రియలకు బంధువులు, సన్నిహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అశృనయనాలతో వీడ్కోలు పలికారు.
 
కారణజన్ముడు బాలమురళీకృష్ణ :    
బాలమురళీకృష్ణ కారణ జన్ముడని సంగీత కళాకారుల ద్వయం ప్రియాసిస్టర్స్ పేర్కొన్నారు. ఆయన సంగీతం గురించి మాట్లాడే అర్హత తమకు లేదని, అరుుతే ఆయన స్ఫూర్తి మాత్రం తమపై ఉందని అన్నారు. బాలమురళీకృష్ణ వల్ల ప్రభావితం కాని సంగీత కళాకారులు లేరు అనడం అతిశయోక్తి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలమురళీకృష్ణ చేతుల మీదుగా సత్కారం అందుకునే అదృష్టం తమకు లభిం చిందని అన్నారు. సంగీత సరస్వతి పంపిన వ్యక్తి బాలమురళీకృష్ణ అని పేర్కొన్నారు. అలాంటి గొప్ప సంగీత విద్వాంసుడి కాలంలో తామూ ఉన్నందుకు ఆనందంగా ఉందని ప్రియాసిస్టర్స్ అన్నారు -ప్రియాసిస్టర్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement