debashis mallik
-
పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు భారీ షాక్.. మళ్లీ పెరగనున్న ధరలు!
గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పు కనిపించడం లేదు అని సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఇది కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే అని సమాచారం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో భారీగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు డెలాయిట్ టచి తోమత్సు ఇండియా పేర్కొంది. "5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్రం రిటైల్ ధరలను పెంచలేదు" అని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్చి 10 తర్వాత అమ్మకపు ధరలో కొరతను పూడ్చడానికి కంపెనీలు లీటరుకు 8-9 రూపాయలు (11-12 సెంట్లు) ధరలను పెంచాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ఇండియన్ ఆయిల్ కార్ప్, భారత్ పెట్రోలియం కార్ప్, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ ధరలను పెంచలేదు అని వివరించారు. అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా కంపెనీలకు ధరలు సవరించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల కారణంగానే పెంచలేదు అని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత భారీగా ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన అందులో కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని ప్రజల మీద వేసే అవకాశం ఉన్నట్లు మిశ్రా తెలిపారు. ఇంధన ధరలు పెరగడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సెంట్రల్ బ్యాంకుకు ఇబ్బందేనని పేర్కొన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల మళ్లీ నిత్యవసర ధరలు పేరుగుతాయని, దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల భారతదేశ ఆర్థిక వృద్ధిని 0.3% నుండి 0.35%కు దెబ్బతీస్తుందని మిశ్రా తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధర 100 డాలర్లకు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడం కష్టం అని అన్నారు. (చదవండి: అమెజాన్ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీగా పెరగనున్న వేతనం!) -
వచ్చే ఏడాది ‘ఫండ్’నున్న పరిశ్రమ
ముంబై: వచ్చే ఏడాది మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) దేబాశిష్ మల్లిక్ చెప్పారు. అమెరికా, యూరప్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక రికవరీ వృద్ధి బాట పట్టడం, ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావం దీనికి కారణమని వివరించారు. అమెరికా, యూరప్, జపాన్ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్న సూచనలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయని, ఫలితంగా ఈ దేశాల కంపెనీలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడతాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే డెట్ పథకాల్లో నిధుల ప్రవాహం పెరుగుతుందని వివరించారు. ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు)లలో పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా మన దేశ వృద్ధి అవకాశాలు జోరుగా ఉంటాయని వివరించారు. మార్కెట్లు బాగుంటాయ్... ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అంచనాలు బాగా ఉన్నాయని, దీంతో మార్కెట్లు బావుంటాయని, మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు జోరందుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.7.01 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి రూ.8.9 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు దూరమయ్యారని పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోళ్లను 1,000 కోట్ల డాలర్లు తగ్గించాలన్న నిర్ణయం ప్రభావం స్వల్పమేనని ఆయన తేల్చారు. జూలైతో పోల్చితే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కరంట్ అకౌంట్లోటు కూడా మెరుగైన పరిస్థితిలోనే ఉందని, అందుకే ఫెడ్ నిర్ణయం ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని దేబాశిష్ వివరించారు.