Debt Distribution Dispute
-
‘సోనీ క్షమించు! నీకు ఏం చేయలేకపోయా’ కన్నీటితో భర్త
గుడిహత్నూర్ (బోథ్): ‘సోనీ.. నన్ను క్షమించు. నీకు, పిల్లలకు ఏం చేయలేక పోయాను. నువ్వు చాలా అమాయకురాలివి.. నీ సంతోషం కోసం ఎక్కడికి తీసుకెళ్లలేకపోయా.. బంగారం లాంటి నా పిల్లలను వీడి చనిపోతున్నా’ అంటూ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారి జక్కుల శ్రీనివాస్ (38) సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ‘అప్పులు, వడ్డీల మీద వడ్డీలు తీసుకుంటున్న వారిని దూషి స్తూ.. నా చావుతోనైనా వారికి కనువిప్పు కలగాలి’ అని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుడిహత్నూర్‌లో జరిగింది. ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్ కాలనీకి చెందిన జక్కుల శ్రీనివాస్ ఉస్మాస్ బిస్కెట్ ఏజెన్సీ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. వ్యాపారంతోపాటు తనకు తెలిసిన వారికి ఇతరుల దగ్గరి నుంచి అప్పులు ఇప్పించాడు. శ్రీనివాస్ పూచికత్తుగా ఉండి అప్పులు ఇప్పించడంతో అప్పు తీసుకున్నవారు సకాలంలో చెల్లించకపోవడంతో ఇచ్చినవారికి శ్రీనివాస్ వడ్డీలు కూడా చెల్లించాడు. ఇలా ఇతరుల అప్పులు చెల్లిస్తూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తన భార్య సోనిని జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌లో ఉండే అత్తవారింట్లో వదిలి పనిపై గుడిహత్నూర్ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. మాన్కాపూర్ శివారులో పత్తి చేను వద్ద పురుగుల మందుతో వెళ్లిన శ్రీనివాస్ ముందుగా సెల్ఫీ వీడియో తీశాడు. భార్య సోని, కూతురు లక్ష్మీభవాని, కొడుకు దుర్గాప్రసాద్‌ను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. (చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి) తీసుకున్న అప్పులు, ఇప్పించి అప్పులు వాటికి తాను నెలనెలా కడుతున్న వడ్డీలు మానవత్వం లేకుండా అప్పులు ఇచ్చినవారు వేధిస్తున్న తీరును చెప్పుకొచ్చాడు. తన చావుకు అప్పులు వారు, డీసీబీ బ్యాంకు సిబ్బంది వేధింపులే కారణమని తెలిపాడు. గత్యంతరం లేక తాను ఆత్మహత్య చేసుకుని తన కుటుంబానికి దూరమవుతున్నానని అన్నాడు. కాగా, సాయంత్రం అయినా శ్రీనివాస్ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు వాకబు చేస్తూ వెతికారు. గురువారం ఉదయం మాన్కాపూర్ శివారు పత్తి చేనులో శ్రీనివాస్ పురుగుల మందు తాగి విగత జీవిగా పడి ఉన్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే! -
రూ.4.91 లక్షల కోట్ల రుణ పంపిణీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు అక్టోబర్, నవంబర్లలో రూ.4.91 లక్షల కోట్ల రికార్డు స్థాయి రుణ పంపిణీలు జరిపాయి. వినియోగం పెంపు, ఆర్థిక వృద్ధి పునరుత్తేజం లక్ష్యంగా రుణ వృద్ధి మెరుగుపడాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు వెలువడ్డాయి. బ్యాంకులు వినియోగదారులను చేరుకోవాలని, వారి అవసరాలకు అనుగుణంగా తగిన అన్ని నిబంధనలూ అనుసరించి రుణ పంపిణీలు జరగాలనీ ఆరి్థకమంత్రి నిర్మలా సీతారామన్ సెపె్టంబర్లో బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఆరి్థకవృద్ధిలో ఇది కీలక అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు నెలల్లో బ్యాంకులు దేశ వ్యాప్తంగా 374 జిల్లాల్లో ప్రత్యేక రుణ మేళాలు నిర్వహించాయి. ప్రత్యేకించి రుణ పంపిణీల విషయంలో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, కార్పొరేట్లు, రిటైల్, వ్యవసాయ విభాగాలపై దృష్టిపెట్టాయి. రుణ పంపిణీలకు సంబంధించి నిబంధనల్లో ఏ మాత్రం రాజీ పడలేదని మంగళవారం గణాంకాల విడుదల సందర్భంగా ఆరి్థకమంత్రిత్వశాఖ పేర్కొంది. అక్టోబర్‌లో రూ.2.52 లక్షల కోట్లు, నవంబర్‌లో రూ.2.39 లక్షల కోట్ల రుణ పంపిణీలు జరిగినట్లు వివరించింది. రెండు నెలల్లో ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలకు రూ.72,985 కోట్లు, కార్పొరేట్లకు రూ.2.2 లక్షల కోట్ల రుణ పంపిణీలు జరిగినట్లు తెలిపింది. రూ.27,225 కోట్ల గృహ రుణాలు మంజూరు అయ్యాయి. వాహన రుణాల విలువ రూ.11,088 కోట్లుగా ఉంది. విద్యకు సంబంధించి ఈ మొత్తం రూ.1,111 కోట్లు. వ్యవసాయ రుణాలు రూ.78,374 కోట్లు. -
అక్టోబర్‌లో రుణాల పంపిణీ రూ.2.5 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో భాగంగా అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2.5 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. నిదానించిన ఆర్థిక వ్యవస్థకు, వినియోగానికి ప్రేరణనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు.. పీఎస్‌బీలు దసరా, దీపావళి పండుగల సమయంలో 374 జిల్లాల పరిధిలో రుణ మేళాలను నిర్వహించిన విషయం గమనార్హం. ‘‘ఈ సందర్భంగా పీఎస్‌బీలు రూ.2,52,589 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఇందులో రూ.1,05,599 కోట్లు నూతన టర్మ్ రుణాలు కాగా, రూ.46,800 కోట్లు మూలధన రుణాలు’’అని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) కూడా రూ.19,627 కోట్లను సమకూర్చాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, రుణ డిమాండ్లను అవి తీర్చే స్థితిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఎవరికి ఎంత మేర.. ♦ కార్పొరేట్లకు రూ.1.22 లక్షల కోట్ల రుణాలు ♦ వ్యవసాయ రుణాలు రూ.40,504 కోట్లు ♦ ఎంఎస్ఎంఈ రంగానికి రూ.37,210 కోట్లు ♦ గృహ రుణాలు రూ.12,166 కోట్లు ♦ వాహన రుణాలు రూ.7,058 కోట్లు ♦ ఎన్బీఎఫ్సీ రంగానికి రూ.19,627 కోట్లు -
చెరో సగం పంచుకున్నారు..!
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు.. అప్పుల పంపిణీ వివాదం ఒకవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాయి. విభజన చట్టాలన్నీ పక్కన పెట్టి నీకు సగం.. నాకు సగం అన్నట్లుగా టీఎస్ఈఆర్సీ, ఏపీఈఆర్సీ ఆస్తులను పంచేసుకున్నాయి. అంతటితో ఆగకుండా ఉమ్మడి ఖాతాలో ఉన్న రూ.12 కోట్ల డిపాజిట్లను చెరిసగం పంపిణీ చేసుకునేందుకు తెలంగాణ ఆర్థిక శాఖను అనుమతి కోరాయి. దీంతో ఈ నిర్వాకం బయటపడింది. ఏపీఈఆర్సీ నుంచి అందిన ఈ లేఖను చూసి ఆర్థిక శాఖ అధికారులు బిత్తరపోయారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలి. అందుకు భిన్నంగా ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆస్తులు పంచుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీఈఆర్సీ రెండుగా విడిపోయింది. కొత్తగా తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి ఏర్పడింది. విద్యుత్తు వివాదాలు తారాస్థాయికి చేరిన సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా వీటికి కమిషన్లను నియమించాయి. ప్రస్తుతం ఏపీఈఆర్సీకి జస్టిస్ భవానీప్రసాద్ చైర్మన్‌గా, టీఎస్ఈఆర్సీకి ఇస్మాయిల్ అలీఖాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరికి జ్యుడీషియల్ అధికారాలున్నాయి. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో ఉన్న ఏపీఈఆర్సీ కార్యాలయం విభజన అనంతరం.. చెరో ఫ్లోర్‌ను, చెరి సగం ఫర్నిచర్‌ను, ఉద్యోగులను పంచుకున్నాయి. వివాదాలు, విభేదాలేమీ లేకుండా సామరస్యపూర్వకంగా టీఎస్ఈఆర్సీ, ఏపీఈఆర్‌సీలు ఆస్తులు పంచుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ రాష్ట్ర పునర్విభజన చట్టం పూర్తిగా పక్కదారి పట్టింది. జనాభా ప్రకారం పంచుకుంటే ఆస్తుల్లోనూ.. అప్పుల్లోనూ తెలంగాణకు 42 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం వాటా రావాల్సి ఉంది. ఏపీఈఆర్సీకి అప్పుల భారం లేనందున కేవలం ఆస్తులను చెరి సమానంగా పంచుకున్నట్లు అర్థమవుతోంది. కానీ.. ఎవరి ఇష్టారాజ్యంగా వారు ఆస్తులను పంచుకుంటే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. చట్టాన్ని పక్కనబెట్టి రెండు రాష్ట్రాల ఈఆర్సీలు ఆస్తులు పంచుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీఈఆర్సీ ఖాతాలో ప్రస్తుతం రూ.12 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తాము సామరస్యంగా వీటిని చెరిసగం పంచుకున్నామని.. ఆమోదించాలని ఏపీఈఆర్సీ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఈ లెక్కన చెరో రూ.ఆరు కోట్లు పంపిణీ జరగాలి. విభజన చట్టంలోని జనాభా శాతం ప్రకారం పంపిణీ జరిగితే.. తెలంగాణకు రూ. 5.76 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 6.24 కోట్లు దక్కుతాయి. ఈ లెక్కన ఫిప్టీ.. ఫిప్టీ చొప్పున పంచుకుంటేనే తెలంగాణకు లాభమనిపిస్తోంది. కానీ.. ఆ మాత్రం దానికి ఆశ పడితే తెలంగాణ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పసిగట్టారు. ఏపీఈఆర్సీలో ఆస్తులను చెరిసగం పంచుకున్నారనే ఒక్క నిర్ణయాన్ని వేలెత్తి చూపించి.. వేలాది కోట్ల అప్పులను సైతం అదే పద్ధతిన పంచుకోవాలని ఏపీ ప్రభుత్వం తిరకాసు పెట్టే ప్రమాదం ఉందని అప్రమత్తమయ్యారు. ఏపీఈఆర్సీ పంపించిన ఫైలును తిప్పిపంపారు.