debts problems
-
బిల్లులు చెల్లిస్తారాలేక.. వాట్సప్ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్
కామారెడ్డి: సీఎం కేసీఆర్ సార్ గ్రామంలో అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలయ్యాను.. బిల్లులు చెల్లి స్తారా లేదా ఆత్మహత్య చేసుకొని చావమంటారా అంటూ బీఆర్ఎస్కు చెందిన ఉపసర్పంచ్ చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మండలంలోని బీబీపేటకు చెందిన సాయినాథ్ గత ఎన్నికల్లో 13వ వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి ఉమ్మడి మండలంలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టాడు. సుమారు రూ. 1.50 లక్షల వరకు నిధులు ప్రభు త్వం నుంచి రావాల్సి ఉందన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిన సాయినాథ్ వాట్సప్‌లో తన వాయిస్ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధు లు రావడం లేదని, ఎన్నికల కోడ్ వస్తే నిధులు వి డుదల కావని పేర్కొన్నారు. తన చావుతో అయినా జీపీ వ్యవస్థను ఆదుకోవాలంటు ఆదుకోవాలంటు వాట్సప్ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్ చేశాడు. దీంతో పోలీసులు సాయినాథ్ నంబర్ ట్రేస్చేసి హైదరాబా ద్లో పట్టుకొన్నారు. అతని మిత్రులకు గ్రామానికి తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
నిలువు దోపిడీ! కారు ధరలకు చేరువగా ఆటో రిక్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆటోరిక్షా ప్రస్తుత షోరూమ్ ధర రూ.2.20 లక్షలు. కానీ అది ఆటోడ్రైవర్ చేతికొచ్చేసరికి రూ.4.25 లక్షలకు చేరుతుంది. అంటే సాధారణ ధరపైన రూ.2 లక్షలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. వేల కొద్దీ ఆటో పర్మిట్లను తమ గుప్పెట్లో పెట్టుకొన్న ఫైనాన్షియర్లు నిరుపేద ఆటోడ్రైవర్లపై సాగిస్తున్న నిలువుదోపిడీ ఇది. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త ఆటో పరి్మట్లపైన ఆర్టీఏ ఆంక్షలు విధించింది. దీంతో పాత ఆటో రిక్షాల స్థానంలో మాత్రమే కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాలం చెల్లిన పాత ఆటోలను తుక్కుగా మార్చి ఆ పర్మిట్పైన కొత్త ఆటో కొనుగోలు చేయవచ్చు. సుమారు 80 వేలకు పైగా పరి్మట్లు ఫైనాన్షియర్ల చేతుల్లోనే ఉన్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకొని ఆటోలు కొనుగోలు చేసిన డ్రైవర్లు చివరకు ఆ అప్పులు చెల్లించలేకపోతున్నారు. దీంతో వారి నుంచి సదరు ఫైనాన్స్ సంస్థలు ఆటోలను జఫ్తు చేసుకొని ఆ పరి్మట్లను మరో డ్రైవర్‌కు కట్టబెడుతున్నాయి. ఇలా సుమారు 500 మంది చిన్న, పెద్ద ఫైనాన్షియర్లు, ఫైనాన్స్ సంస్థలు నగరంలోని లక్ష మందికిపైగా ఆటోడ్రైవర్లను తమకు శాశ్వత రుణగ్రస్తులుగా మార్చుకొని రూ.వందల కోట్ల మేర వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నిలిచిపోయిన కార్యకలాపాలు తాజాగా తిరిగి మొదలయ్యాయి. భారీగా పెరిగిన పర్మిట్ ధరలు... కోవిడ్ ఆంక్షలన్నీ తొలగిపోయి ఇంచుమించు సాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నగరానికి తిరిగి వలసలు మొదలయ్యాయి. అప్పట్లో కోవిడ్ కారణంగా అప్పులు చెల్లించలేక ఆటోరిక్షాలు, క్యాబ్‌లను ఫైనాన్స్ సంస్థలకు అప్పగించి సొంత ఊళ్లకు వెళ్లిన వేలాది మంది డ్రైవర్లు ఇప్పుడు తిరిగి ఉపాధి కోసం నగరానికి చేరుకుంటున్నారు. ఆటోల కోసం ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు పాత ఆటో పరి్మట్ల ధరలను అమాంతంగా పెంచేసి డ్రైవర్లకు కట్టబెడుతున్నారు. కోవిడ్‌కు ముందు కేవలం రూ.75 వేలు ఉన్న పాత ఆటో పరి్మట్‌ను ఇప్పుడు ఏకంగా రూ.1.75 లక్షలకు పెంచారు. నిజానికి పర్మిట్లకు ఎలాంటి ధర ఉండదు. నగరంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం లేకపోవడం వల్ల పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకొనేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇలాంటి పాత పర్మిట్లపైన కొత్త ఆటో కోసం మరో 2.20 లక్షలు చెల్లించవలసి వస్తుంది. అంటే ఒక ఆటో ధర ఏకంగా రూ.4 లక్షలకు చేరుతుంది. దీనికి మరి కొంత సర్వీసు చార్జీలను కలిపి ఫైనాన్స్ సంస్థలు రూ.4.25 లక్షలకు విక్రయిస్తున్నారు. ‘అప్పు చేసి ఆటోలు కొనుగోలు చేస్తున్న డ్రైవర్లు మరోసారి రుణగ్రస్తులుగా మారాల్సి వస్తుందని.’ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దోపిడీని ఆపేదెవరు... కొత్త పర్మిట్లపైన ఆంక్షలు విధించిన రవాణా శాఖ పాత పర్మిట్ ధరలను మాత్రం నియంత్రించడం లేదు. పర్మిట్ అంటే ఒక డ్రైవర్ ఆటో నడిపేందుకు ఇచ్చే అనుమతి పత్రం (ప్రొసీడింగ్స్). కానీ ఈ పత్రాలే ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థల ఈ నిలువు దోపిడీ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు, అన్ని ప్రభుత్వ విభాగాలకు తెలిసిందే. కానీ అది తమ పరిధిలోని అంశం కాదంటూ అందరూ చేతులెత్తేయడం గమనార్హం. అంతిమంగా నిరుపేద ఆటోడ్రైవర్ సమిధగా మారుతున్నాడు. (చదవండి: ఉచిత బియ్యం ఉఫ్! సాక్షాత్తు లబ్ధి దారులే అమ్ముకుంటున్నారు) -
వెంటాడిన అప్పులు... భయంతో తప్పుదోవలో వెళ్లి చివరికి...
బనశంకరి: ఐటీ ఉద్యోగం, దండిగా జీతం, కానీ షేర్ మార్కెట్లో ప్రవేశించి నష్టపోయాడు. చివరకు హత్య చేయడానికీ వెనుకాడలేదు. ఆన్లైన్ ట్రేడింగ్‌లో తలెత్తిన నష్టాలనుంచి గట్టెక్కడానికి ఇంటి యజమానురాలిని హత్యచేసి బంగారు నగలను దోచుకెళ్లిన టెక్కీని ఆదివారం బెంగళూరులోని చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులు అరెస్ట్‌చేశారు. దక్షిణ విభాగ డీసీపీ కృష్ణకాంత్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన వినాయకనగర మూడో క్రాస్‌లోని ఇంట్లో యశోదమ్మ (75) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. విచారించిన పోలీసులు జై కిషన్ అనే టెక్కీని అరెస్టు చేశారు. ముంచేసిన ఆన్లైన్ ట్రేడింగ్ దందా జైకిషన్ యశోదమ్మ ఇంట్లో పై అంతస్తులో బాడుగకు ఉండేవాడు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగి కాగా షేర్మార్కెట్లో పెట్టుబడులు, ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాడు. ఇటీవల తీవ్ర నష్టాలు రావడంతో చాలావరకు అప్పులు చేశాడు. యశోదమ్మ వద్ద కూడా రూ.6 లక్షలు వరకు అప్పు తీసుకున్నాడు. అప్పులవారి బాధలు అధికం కావడంతో యశోదమ్మ వద్ద ఉన్న బంగారు నగలను కొట్టేయడానికి పథకం పన్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి యశోదమ్మ ఇంట్లోకి చొరబడిన జైకిషన్ చాకుతో ఆమెను హత్య చేసి నగలు దోచుకుని వెళ్లిపోయాడు. అద్దెకు ఉంటున్న వ్యక్తులు మృతురాలి కుమారుడు రాజుకు సమాచారం అందించారు. అతడు చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 60 కత్తిపోట్లు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలంలో ఎలాంటి క్లూ దొరకలేదు. ఆరా తీయగా గతంలో యశోదమ్మతో టెక్కీ జైకిషన్ గొడవపడినట్లు తెలిసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 60 సార్లు కత్తితో పొడిచి చంపడం గమనార్హం. అయినా ఏమీ తెలియనట్లు నటించాడు. వృద్దురాలి అంత్యక్రియల్లో కూడా పాల్గొని పోలీసులకు పలు విషయాలు చెప్పాడు. దీంతో పోలీసులకు ఇతడిపై అనుమానం రాలేదు. కాగా అతడు దోచుకున్న నగలను కుదువ దుకాణంలో పెట్టి నగదు తీసుకున్నాడు. అప్పులు తీర్చడానికే హత్యచేసినట్లు చెప్పాడు. కేసు విచారణలో ఉందని డీసీపీ తెలిపారు. (చదవండి: రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టిన కారు) -
భర్త చేసిన అప్పులు.. భార్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి..
దొడ్డబళ్లాపురం: భర్త చేసిన అప్పులకు భార్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పోలీసులు అవమానించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. నెలమంగల పట్టణంలో నివసిస్తున్న అఖిల (35) భర్త మధుకుమార్ స్థానిక నివాసి చందన్ వద్ద రూ.1లక్ష అప్పు తీసుకున్నాడు. ఎన్నాళ్లయినా చెల్లించకపోవడంతో చందన్ తరచూ ఇంటి వద్దకు వచ్చి అఖిలను అవమానపరిచేలా మాట్లాడేవాడు. దీనికి తోడు శుక్రవారం పోలీసులను ఉసిగొల్పి స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించాడు. ఈ వేదనలు భరించలేక ఆమె డెత్ నోట్ వ్రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటనలో.. భూ వివాదం.. వ్యక్తి హత్య దొడ్డబళ్లాపురం: భూవివాదం నేపథ్యంలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన రామనగర తాలూకాలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న గంటప్ప (60) హత్యకు గురయ్యాడు. బానందూరు గ్రామానికి చెందిన గంటప్ప భైరవనదొడ్డి గ్రామం వద్ద బైక్ సర్వీస్ స్టేషన్ నడుపుతున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దుండగులు గుంపుగా వచ్చి గంటప్పను మారణాయుధాలతో హత్య చేసి పరాయ్యారు. భూ వివాదం కారణంగానే హత్య జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం
సాక్షి, పెనుమూరు(చిత్తూరు): ‘గత్యంతరం లేక ఐపీ పెట్టాం. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నా.. నా పరిస్థితి అర్థం చేసుకోండి. కోర్టులో నడుస్తున్న భూమి కేసు పరిష్కారం అయితే కానీ మా కష్టాలు తీరవు’ ఇది వ్యాపారి కోడూరు రంగయ్య శెట్టి మనువడు ప్రవీణ్‌కుమార్ ఐపీ బాధితులకు పెట్టిన వాట్సప్ మెసేజ్. పెనుమూరులో 60 ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేసిన రంగయ్య శెట్టి గత వారం దాదాపు 997 మందికి రూ.87.40 కోట్లు ఐపీ పెట్టి అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీనిపై రుణదాతలు పెనుమూరులో ఈ నెల 6న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డీఎస్పీ సుధాకరరెడ్డి, పాకాల సీఐ ఆశీర్వాదం బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. చదవండి: (‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’) ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 10 గంటలకు రంగయ్యశెట్టి మనుమడు ప్రవీణ్ రుణదాతలకు వాట్సప్ మెసేజ్ పెట్టారు. అందులో తన తండ్రి చేపట్టిన ట్రావెల్స్, వడ్డీ, గ్రానైట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నష్టపోయినట్లు చెప్పారు. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆరు నెలల క్రితం వరకూ నెలకు రూ. కోటి వడ్డీ కడుతూ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్లాట్లు, 70 ఎకరాల భూమి అమ్ముకున్నట్లు మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఇక గత్యంతరం లేక ఐపీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నానని, తన పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం తిరుపతిలోని భూమిపై కోర్టులో కేసు నడుస్తోందని, ఆ కేసు పరిష్కారం అయితే తమ కష్టాలు తీరుతాయన్నారు. ప్రస్తుతం తన సమస్యలు తీరేందుకు రెండు మార్గాలు మిగిలాయని, ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, రెండు తాను బతికినంత కాలం అప్పు తీర్చేందుకు శ్రమిస్తానంటూ మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రవీణ్ వాట్సాప్ చేసిన ఫోన్ స్విచాఫ్ వచ్చింది. పోలీసులు ఆ మెసేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. -
విల్లుపురంలో విషాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు మృతి
సాక్షి, చెన్నై: అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వలవనూరుకు చెందిన మోహన్ (32) వృత్తిరీత్యా చెన్నైలో టైలర్. భార్య విమలేశ్వరి (28), కుమార్తెలు విజయశ్రీ (8), రాజశ్రీ (7), కుమారుడు శివబాలన్ (5) ఉన్నారు. టైలరింగ్‌తో వచ్చే ఆదాయం చాలకపోవడంతో అప్పు చేసి సొంతూరులో వడ్రంగి మిల్లును ప్రారంభించాడు. సొంతిల్లు కూడా నిర్మించుకున్నాడు. కరోనా కారణంగా మిల్లు మూతపడడంతో వడ్డీలు పెరిగిపోయాయి. ఆదాయం కోసం ఆన్లైన్ జూదం ఆడి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో మానసిక ఒత్తికి గురయ్యాడు. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి గదిలో పడుకుని ఉన్న ముగ్గురు పిల్లలను తాడుతో ఉరివేసి హతమార్చాడు. ఆ తర్వాత భార్యభర్తలిద్దరూ ప్రాణాలు తీసుకున్నారు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబం ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..) -
రూ.లక్షల్లో టోకరా..
సాక్షి, భైంసా(ఆదిలాబాద్) : దాదాపు ఏడెనిమిదేళ్లుగా స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తూ అందరి వద్ద సుమారు రూ. 20 లక్షలపైన అప్పులు చేసి ఓ వ్యాపారి ఉడాయించినట్లు భైంసాలో పుకార్లు వ్యాపించాయి. భైంసా పట్టణంలోని బోయిగల్లి ప్రాంతంలో మిఠాయిల దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి గత కొంత కాలంగా అప్పుల వాళ్లకు డబ్బులు చెల్లించకుండా తిప్పుకుంటున్నాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా దుకాణానికి రావడం లేదని, రెండు రోజులుగా దుకాణం మూసి ఉండడంతో, దుకాణంలో పాలు పోసే వారు ఆదివారం దుకాణం వద్ద గుమిగూడారు. ఒక్కొక్కరికి రూ. లక్ష నుంచి రూ. 3లక్షల వరకు చెల్లించాల్సి ఉందని వారు వాపోయారు. అంతేకాకుండా సదరు వ్యాపారి తన చిన్న కుమారుడి సెల్‌ఫోన్‌కు అప్పుల బాధ తాళలేక చనిపోతున్నానంటూ మెసేజ్ పెట్టడంతో, అతని కుమారుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 1 న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. హోటల్లో గుమాస్తా నుంచి.. నేరడిగొండ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి కుటుంబం గత ఏడెమినిదేళ్ల క్రితం భైంసాకు వలస వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట్లో స్థానిక హోటల్లో స్వీట్లు చేసే పనికి కుదిరాడు. ఇక్కడి వారితో పరిచయాలు పెరగడంతో నాలుగేళ్ల క్రితం బోయిగల్లిలో సొంతంగా స్వీట్ దుకాణం ప్రారంభించాడు. కానిస్టేబుల్‌నూ వదల్లేదు.. దుకాణం నడిపే క్రమంలో తెలిసినవాళ్ల వద్ద అప్పులు చేయడం ప్రారంభించాడు. తన దుకాణంలో పనిచేసే మాస్టర్(వంటవాడు) వద్దే రూ. 3.5 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలుస్తోంది. తన యజమాని అడగడంతో వంటవాడు భార్య నగలు కుదువపెట్టి మరీ వ్యాపారికి అప్పు ఇచ్చినట్లుగా సమాచారం. దుకాణంలో పాత్రలు కడిగే మహిళ వద్ద రూ. 40 వేలు అప్పు తీసుకున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.ఇక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద, తెలిసిన వారి నుంచి దొరికిన చోటల్లా అప్పులు చేసినట్లు చెబుతున్నారు. భైంసా పట్టణానికి చెందిన ఓ కానిస్టేబుల్ వద్ద కూడా అప్పు చేసినట్లు స్థానికులు చెప్పారు. ఇక ఆయన దుకాణంలో పాలు పోసే వారు దాదాపు పదిమంది వరకు ఉన్నారు. వీరు ప్రతిరోజు 20 నుంచి 60 లీటర్ల వరకు పాలు పోసేవారని చెబుతున్నారు. పాలు పోస్తున్న తమకు మూడు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నాడని వారు పేర్కొన్నారు. వారం రోజులుగా దుకాణంలో సదరు వ్యక్తి కనిపించకపోవడం, ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని వాపోయారు. అదృశ్యం కేసు నమోదు.. మిఠాయిల దుకాణం నిర్వహించే సదరు వ్యాపారి అప్పుల బాధ తాళలేక వెళ్లిపోతున్నానంటూ ఈ నెల 1 న తన కొడుకు సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టాడని అతని కొడుకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఇటీవలే కూతురి పెళ్లి కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడని తెలిపాడు. ఇక తన కోసం వెతకవద్దని, దుకాణం నడిపి అప్పులు తీర్చాలంటూ వాయిస్ మెసెజ్ పెట్టినట్లు ఫిర్యాదులో కుమారుడు పేర్కొనడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. మూడునెలలుగా తిప్పుతున్నాడు నేను గత మూడేళ్లుగా స్థానిక బోయిగల్లిలో మిఠాయి దుకాణంలో పాలు పోస్తున్నాను. నమ్మకంగా డబ్బులు ఇచ్చేవాడు. అయితే మూడు నెలలుగా మాత్రం డబ్బుల కోసం తిప్పుకున్నాడు. కూతురి పెళ్లి చేశానని, త్వరలో చెల్లిస్తానని చెప్పేవాడు. ప్రతిరోజు 30 లీ పాలు పోసేవాడిని. మూడునెలల బకాయిలు రావాల్సి ఉంది. – రాజు, పాల వ్యాపారి, భైంసా నమ్మకంతో పోసేవాళ్లం మేం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు పోసేవాళ్లం. రోజుకు 30 లీటర్ల వరకు పాలు తీసుకునేవాడు. నమ్మకంగా డబ్బులు చెల్లించేవాడు. అయితే గత కొద్ది నెలలుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుకున్నాడు. రేపు, మాపు అంటూ తిప్పి పంపేవాడు. మా లాగే ఇంకా కొందరికి డబ్బులు ఇవ్వలేదని చెబుతున్నారు. – రాజేందర్, ప్రసాద్, భైంసా -
డీసీసీబీ కుంభకోణం విచారణలో కీలక మలుపు
సాక్షి, (పశ్చిమ గోదావరి) : ఇప్పటివరకూ సమన్వయంతో బ్యాంకు డబ్బులు స్వాహా చేసిన అధికారులు, డీసీసీబీ చైర్మన్ తాజాగా నిర్వహించిన ‘సమన్’వయ భేటీ చర్చనీయాంశమైంది. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణం విచారణకు అధికారులు శనివారం హాజరుకావాలంటూ ఉన్నతాధికారుల నుంచి సమన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులతో హడావుడిగా సమావేశమైన డీసీసీబీ చైర్మన్ ముత్యాలరత్నం స్వాహాకు కథ, దర్శకత్వం తానే అయినా.. ఎలాగైనా బయటపడతానని.. మీ సంగతి మాత్రం చూసుకోవాలంటూ ఓ ఉచిత సలహా పడేశారు. దీంతో అవాక్కవడం అధికారుల వంతైంది. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణంపై విచారణ సాగుతూనే ఉంది. ఫ్రిబవరిలో పాలకవర్గాన్ని రెండోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పుడే విచారణ కూడా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే డీసీసీబీ చైర్మన్ గత ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి విచారణ సాగకుండా చేశారు. ఇప్పుడు తాజాగా ఈనెల 17న అధికారులందరూ విచారణకు హాజరుకావాలని విచారణ కమిటీ సభ్యులు డెప్యూటీ రిజిస్ట్రార్ ఎం.అబ్దుల్ లతీఫ్ డీసీసీబీ అధికారులకు సమన్లు జారీ చేయడంతో వారిలో టెన్షన్ మొదలైంది. దీంతో డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం అధికారులను తన ఇంటికి పిలిచి సమావేశం పెట్టారు. తాను ఎలాగొలా బయటకు వస్తానని, మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే విచారణ ఆపుకునే యత్నాలు చేయాలని సూచించినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఈ నెల 27న జరగాల్సిన డీసీసీబీ బోర్డు సమావేశాన్ని 17వ తేదీకి మార్చారు. ప్రభుత్వం మారడంతో విచారణ ఆపుకునే అవకాశం లేదని, ఏం చేయాలోననే ఆందోళన అధికారుల్లోనూ, పాలకవర్గంలోనూ కనపడుతోంది. అసలేం జరిగిందంటే.. ఈ పాలకవర్గం హయాంలో డీసీసీబీలో సుమారు రూ.33.32 కోట్ల రుణం సెక్యూరిటీలు లేకుండా ఇచ్చి బ్యాంకు నష్టాలకు అధికారులు, ఉద్యోగులు కారణమయ్యారు. వీరిపై విచారణ చేపట్టాలని జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది ఖరీఫ్‌లో కస్టమ్ మిల్లింగ్ విధానంలో ధాన్యం ఆడించి పౌర సరఫరాల శాఖకు బియ్యం ఇచ్చే మిల్లర్లు సరైన సెక్యూర్టీలు లేకుండా యలమంచిలి బ్యాంకు నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. మిగిలిన బ్యాంకుల నుంచి మరో రూ.13 కోట్ల వరకూ అప్పులు పొందారు. యలమంచిలి బ్యాంకు ఇన్చార్జి మేనేజరు, మరి కొందరు ఉద్యోగులు మిల్లర్లు సరైన సెక్యూర్టీలు ఇవ్వకపోయినా రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చేశారు. కస్టమ్ మిల్లింగ్ విధానంలో ధాన్యాన్ని ఆడించి బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు సరఫరా చేయాల్సిన మిల్లర్లు వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మేసుకున్నారు. దీంతో గుట్టురట్టయింది. దీంతో మిల్లర్లపై చర్యలకు పౌర సరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి, సెక్యూర్టీగా పెట్టిన ఆస్తులను జప్తుకు యత్నించింది. మిల్లర్లు స్పందించకపోవడంతో పౌరసరఫరాల శాఖ రుణం ఇచ్చిన డీసీసీబీపై చర్యలకు ఉపక్రమించింది. సెక్యూర్టీల్లేకుండా రూ. 20 కోట్లు రుణం ఎలా ఇచ్చారని, వారి తరఫున సెక్యూర్టీ ఇచ్చి న బ్యాంకు బాధ్యత వహించాలని నోటీసులు జారీ చేసింది. విచారణకు షురూ.. దీంతో బ్యాంకు అధికారులు మిల్లర్ల నుంచి రుణం వసూలుకు యత్నించినా ఫలితం లేదు. దీంతో బాధ్యులైన బ్యాంకు మేనేజరు, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అప్పటి కలెక్టర్ కాటంనేని భాస్కర్ రాష్ట్ర సహకార శాఖకు, ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ డెప్యూటీ రిజిస్ట్రార్ స్థాయి అధికారిని విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో హడావిడిగా డీసీసీబీ బ్యాంకు ఏజీఎం ఒకరు యలమంచిలి వెళ్లి మిల్లర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుణం ఎగ్గొట్టి ఐపీ..! పాలకొల్లుకు చెందిన రైస్‌మిల్లర్ యలమంచిలి డీసీసీ బ్యాంకులో ఆస్తి తనఖా రిజిస్ట్రేషన్ చేయకుండా సుమారు రూ.11.90 కోట్లు రుణం పొందారు. దీన్ని ఎగ్గొట్టి ఐపీ దాఖలు చేసినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు హడావిడిగా పాలకొల్లు చాంబర్స్ కళాశాల సమీపంలోని పూలపల్లిలో ఎకరం రూ.2 కోట్లు విలువైన పంట పొలాన్ని హామీగా చూపి.. దాని విలువ రూ.8 కోట్లుగా చూపే యత్నం చేసినట్లు తెలిసింది. ఇరగవరం మండలానికి చెందిన ఇంకో రైతు రూ.6.90 కోట్లు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులే బ్యాంకు సొమ్మును చెల్లించిన విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రెండురోజుల క్రితం ఏజీఎం ఒకరు యలమంచిలి పోలీసులకు అప్పటి బ్యాంకు మేనేజర్, సిబ్బంది, రుణం తీసుకున్న సుందర రామిరెడ్డి అండ్ కోపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాల నుంచి బయటపడేందుకు సిబ్బంది చేసిన యత్నాలు సఫలం కాలేదు. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. -
ఉసురుతీసిన అప్పులు
అక్కన్నపేట(హుస్నాబాద్): జీవనోపాధి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన సంఘటన ధర్మారంలో విషాదాన్ని నింపింది. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన నాంపెల్లి ఆంజనేయులు(25) అనే యువకుడు వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తనకున్న ఎకరంన్నర వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్నాడు. రూ.3 లక్షలు అప్పులు చేసి బోరు వేయించాడు. అవి ఫెయిల్ కావడంతో మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. వర్షాలు సకాలంలో పడక పెట్టిన పెట్టుబడులు రాని దయనీయ పరిస్థితులతో కుంగిపోయాడు. జీవనం సాగించేందుకు మరో రూ.2లక్షలు అప్పులు చేసి రెండు ఆటోలను కొన్నాడు. సుమారుగా రూ.5లక్షల వరకు అప్పులయ్యాయి. ఆటోలకు గిరాకీ లేక చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో నిత్యం మనస్థాపంతో ఉండేవాడు. ఈ క్రమంలో చివరికి సోమవారం రాత్రి వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి తనవు చాలించాడని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు బోరుమంటున్నారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మణెమ్మ చెప్పారు. మృతిడికి భార్యతో పాటు కుమారుడు ఉన్నాడు. -
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
లక్సెట్టిపేట(మంచిర్యాల): అప్పుల బాధతో మండలంలోని ఊత్కూరు గ్రామానికి చెందిన రైతు కాసు పాపయ్య(55) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు స్థానిక ఎస్సై మదుసుధన్‌రావు తెలిపారు. పాపయ్య సుతారి పనితోపాటు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతుండేవాడు. తనకున్న ఎకరం పొలంతోపాటు మూడెకరాలు కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా సాగుచేస్తున్నాడు. రెండేళ్ల నుంచి పత్తి, వరి దిగుబడి తక్కువ రావడంతో సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు అప్పులయ్యాడు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక పిల్లల వివాహాలు ఎలా చేసేదని మనస్తాపానికి గురై గురువారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. భార్య సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
అన్నదాత బలవన్మరణం
తొండూరు : తొండూరు మండల పరిధిలోని బోడివారిపల్లె గ్రామానికి చెందిన మార్తల గురివిరెడ్డి(48) అనే రైతు అప్పుల బాధతో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురివిరెడ్డి వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య గుర్రమ్మ, కుమారుడు వెంకట్రామిరెడ్డి, తల్లి బాలమ్మలు ఉన్నారు. బోడివారిపల్లె గ్రామంలో తన తల్లి బాలమ్మ పేరుమీద 2.50ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో రెండేళ్ల క్రితం బోరు వేశాడు. అప్పట్లో బోర్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మోటారు కోసం దాదాపు రూ.2లక్షల దాకా అప్పు చేశాడు. ఏడాదైన తర్వాత ఉన్న బోరుబావిలో నీరు రాకపోవడంతో ఏడాది క్రితం మరోచోట బోరు వేశాడు. అందులో నీరు పుష్కలంగా పడటంతో మరింత అప్పు చేసి వ్యవసాయ పంటలు సాగు చేశాడు. సాగు చేసిన పంటలు అంతంత మాత్రంగా దిగుబడి రావడం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చేసిన అప్పుకు వడ్డీ కలుపుకుని దాదాపు రూ.6లక్షలకు చేరుకుంది. తల్లి బాలమ్మ, గురివిరెడ్డిలు కలిసి వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. అప్పులు రోజు రోజుకు పెరుగుతుండటంతో నిరాశకు గురయ్యాడు. దీంతో తన తల్లి బాలమ్మ పేరుతో 2014లో బ్యాంక్‌లో రూ.40వేల రుణం ఉండటంతో ఒకేసారి రూ.40వేలు రుణమాఫీ అయ్యింది. ఈ ఏడాది తిరిగి మల్లేల ఏపీజీబీలో 19180045480 అనే అకౌంట్ నెంబర్లో రూ.66వేలు పత్తి పంట సాగు కోసం తన తల్లి పేరు మీద అప్పు చేశాడు. ఐదేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక, అప్పులు తీర్చలేక అష్టకష్టాలు పడ్డాడు. రూ.6లక్షలకు చేరిన అప్పులు ఎలా తీర్చాలని ఆలోచిస్తూ.. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తారేమోనని మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి అందరూ కలిసి ఆరు బయట పడుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో వంకాయ పంట కోసం తెచ్చిన పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గురివిరెడ్డి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ బోడివారిపల్లెకు చెందిన రైతు గురివిరెడ్డి మృతదేహం పులివెందుల ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ గదిలో ఉండటంతో తొండూరు ఎస్ఐ వెంకటనాయుడు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశారు. విషయంతెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, సర్పంచ్ గురుమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, రాజశేఖరరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రామనాథరెడ్డి, జయరామిరెడ్డి తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఎవుసం యమపాశమై..
అల్గునూర్(మానకొండూర్) : భూమిని నమ్ముకున్న ఆ రైతుకు వ్యవసాయం కలిసిరాలేదు. దీంతో పగబట్టిన ప్ర కృతికి ప్రాణాలు ఫణంగా పెట్టాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో దిక్కుతోచక పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో బుధవారం జరిగింది. ఆధ్యాంతం విషాదం... గ్రామానికి చెందిన పాగాల మల్లారెడ్డి(58)కి భార్య అం జవ్వ, కుమారుడు కొండాల్‌రెడ్డి, కుమార్తె కోమల ఉన్నా రు. తనకు సాగుభూమి లేకున్నా 20 ఏళ్లుగా పలువురి భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదేళ్లక్రితం సిద్దిపేటకు చెందిన వ్యక్తితో కూతు రు వివాహం జరిపించాడు. పెళ్లయిన తర్వాత భర్త పెట్టే వేధింపులు భరించలేక ఏడాదికే కోమల ఆత్మహత్య చేసుకుంది. దీంతో మల్లారెడ్డి కుంగిపోయాడు. 20 ఎకరాలు కౌలుకు... క్రమంగా కోలుకున్న ఆయన ఏడాది తర్వాత మళ్లీ నాగ లి పట్టాడు. గ్రామానికి చెందిన పిన్నింటి నర్సింహారెడ్డికి చెందిన 20 ఎకరాల భూమి ఏడాదికి రూ.1.50 లక్షల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. కొడుకు కొండాల్‌రెడ్డి సహాయంతో సాగుచేస్తున్నాడు. మొదటి రెండేళ్లు అడపాదడపా కురిసిన వర్షాలకు దిగుబడి తక్కువగానే వచ్చి ంది. అయినా ఈ ఏడాదైనా కలిసిరాకుండా పోతుందా అన్న నమ్మకంతో రెండేళ్లుగా వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, కూరగాయల పంటలు సాగుచేశాడు. ఇందు కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున గడిచిన రెండేళ్లలో రూ.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పెరిగిన అప్పులు.. గతంలోనూ రూ.2 లక్షల అప్పులు ఉన్నాయి. వరుస కరువొచ్చినా.. భూ యజమానికి రూ.1.50 లక్షలు కౌలు డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితమే ఈ ఏడాది కౌలు డబ్బులు రూ.లక్ష చెల్లించాడు. మరో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు చేసిన అప్పులు వడ్డీతో సహా రూ.10లక్షలకు చేరడంతో మల్లారెడ్డి మనస్తాపం చెందాడు. పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి.. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి 7:30 గంటలకు వెళ్లాడు. 9 గంటలకు పొలంలో పడిపోయి ఉన్న మల్లారెడ్డిని రైతు మధుకర్ చూశాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అ ందించాడు. వారు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు గా విలపించారు. ఎస్సై నరేశ్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహంతో రాస్తారోకో మల్లారెడ్డి మృతదేహంతో తిమ్మాపూర్ మండలం అల్గునూర్ చౌరస్తాలో 45నిమిషాలపాటు గ్రామస్తులు, అఖిల పక్షం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మల్లారెడ్డికి 3 ఎకరాల భూమి, 10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎల్కపల్లి సంపత్, సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జి కేదారి, మొగిలిపాలెం ఉపసర్పంచ్ మోరపల్లి రమణారెడ్డి డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎల్ఎండీ ఎస్ఐ నరేశ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వారితో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కరీంనగర్ నుంచి స్పెషల్ఫోర్స్ను పిలిపించారు. కరీంనగర్ వన్‌టౌన్ సీఐ శ్రీనివాసరావు, తిమ్మాపూర్ సీఐ కరుణాకర్ శవాన్ని ఆంబులెన్స్‌లో గ్రామానికి తరలించి, నాయకులను ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రహదా రిని దిగ్భందించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ రాస్తారోకోలో పాల్గొన్న వారిపై తిమ్మాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
గోదావరిలోకి దూకి విద్యార్థి ఆత్మహత్య
ధర్మపురి : మంచం పట్టిన తండ్రి వైద్యానికి చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పిచ్చిన వారు ఇంటిఎదుట ఆందోళన చేయడంతో మనస్తాపం చెందిన యువకుడు గోదావరిలో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాయపట్నం గ్రామం లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోతరాజుల వెంకటేశ్– రాజవ్వ దంపతులకు కూతురు భవాని, కుమారుడు శ్రీకాంత్(20) ఉన్నారు. భవానికి 9 నెలల క్రితం వివాహమైంది. శ్రీకాంత్ ఈ ఏడాదే ఇంటర్ పూర్తి చేశాడు. కూలీపని చేస్తూ జీవించే కుటుంబంలో ఐదేళ్లక్రితం విషాదం నెల కొంది. ఇంటిపెద్ద వెంకటేశ్ పక్షవాతంతో మంచం పట్టా డు. అప్పటి నుంచి అప్పుచేసి వెంకటేశ్‌కు వైద్యమందించారు.ఇప్పటి వరకు సుమారు రూ. 3లక్షలు ఖర్చు చేశా రు. అయినా వెంకటేశ్ కోలుకోలేదు. భవాని వివాహనానికి మరో రూ.4 లక్షల అప్పులయ్యాయి. అప్పులు పెరిగిపోవడంతో ఇచ్చినవారు ఇంటిఎదుటకు వచ్చిన ఆందోళన చేయడం ప్రారంభించారు. దీంతో శ్రీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రాయపట్నం బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొ డుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై లక్ష్మినారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్షమించండి.. మీ అప్పు తీర్చలేను!
ఇల్లంతకుంట(కరీంనగర్): ‘మీ దగ్గర అవసరానికి అప్పు తెచ్చుకున్న. సమయానికి తీరుద్దామంటే నాకున్న ఒక్కటే ఆస్తి ఇల్లు. అది ఎవరూ కొంటలేరు. మీ అప్పు తీర్చలేకపోతున్న.. నన్ను క్షమించండి... ఇల్లు అమ్ముకుని మీ అప్పు తీసుకోండి’ అంటూ ఓ కౌలు రైతు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటకు చెందిన సామ మోహన్‌రెడ్డి(50) పంటల పెట్టుబడి, కుటుంబపోషణకు భారీగా అప్పు కావడంతో తనకున్న ఆరెకరాల భూమిని అమ్మేశాడు. కేవలం 5 గుంటల భూమి మాత్రమే మిగిలింది. ఇంకా రూ.8 లక్షల అప్పు ఉంది. మూడేళ్లుగా అదే గ్రామంలో 11 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కాలం కలిసిరాక..రుణ దాతల ఒత్తిడి తట్టుకోలేక ఉంటున్న ఇంటిని విక్రయానికిపెట్టాడు. ఎవరూ కొనకపోవడంతో ఇక ఆత్మహత్యే శరణ్యమని మంగళవారం వేకువజామున చేను వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. భర్త తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో భార్య జయ చేను వద్దకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడు. మోహన్‌రెడ్డికి భార్య జయ, కూతుళ్లు లావణ్య, స్రవంతి ఉన్నారు. ఎస్సై ఎల్లయ్యగౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్లో తెలంగాణ ప్రజలు బాగుండాలని, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ తీసుకురావాలంటూ రాశాడు. కిస్తీకి బైక్ విక్రయం.. మోహన్‌రెడ్డి తనకున్న ఐదుగుంటల స్థలంలో రెండు గుంటల్లో షెడ్ వేసి ఆవులు పెంచేందుకు బ్యాంకు రుణం తీసుకున్నాడు. ఆవులను కొనుగోలు చేసి కొన్ని రోజులు బాగానే నడిచాక, పాల ధర తగ్గడంతో ఒక్కోటి రూ.55 వేలకు కొనుగోలు చేసిన ఆవును రూ.35 వేలకే అమ్మేశాడు. రూ.లక్ష మేర నష్టపోయాడు. ఆవులు అమ్మిన విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు అప్పు తీర్చాలని పట్టుబట్టడంతో సోమవారం తన ద్విచక్రవాహనాన్ని అమ్మి బ్యాంకు నెలసరి వాయిదా కట్టాడు.