decentralise
-
చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్.. పన్నెండు వేల కోట్లు హాంఫట్!
డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి భారీ షాక్ తగిలింది. సరికొత్త ట్రేడింగ్‌గా ట్రెండ్ అవుతోన్న క్రిప్టోకరెన్సీ వ్యవస్థ కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్‌ను హ్యాకర్లు చేధించారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. 12 వేల కోట్లు పాలిగాన్ బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వేల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే పాలినెట్‌వర్క్ యాప్‌ను హ్యాక్ చేశారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పాలినెట్‌వర్క్ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్ టోకెన్లు, బినాన్స్ స్మార్ట్ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్ డాలర్ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్ కాయిన్లను స్వాహా చేశారు. మొత్తంగా 611 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని తస్కరించారు. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం. తిరిగి ఇచ్చేయండి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని క్రాక్ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్లకు డీఫై యాప్ అయిన పాలినెట్‌వర్క్ టీమ్ లేఖ రాసింది. ఇందులో హ్యాకింగ్‌లో దోచేసిన సొత్తును తిరిగి ఇచ్చేయ్సాలిందిగా విజ్ఞప్తి చేసింది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వ్యవస్థకు సంబంధించి మీరు కొట్టేసిన డబ్బు అతి పెద్దదని పేర్కొంది. ఇంత పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పిడన వారు తర్వాత పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మీరు కొట్టేసిన సొమ్మును తిరిగి వినియోంచుకోలేరని సూచించింది. డీఫై యాప్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. భిన్నాభిప్రాయాలు పాలినెట్‌వర్క్ హ్యాకింగ్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటువంటి ఆర్థిక నేరాలను అరికట్టేందుకే రూల్స్, రెగ్యులేషన్స్ ఏర్పాటు చేశారని, వాటని కాదని ముందుకు వెళితే ఇలాగే జరగుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు బ్లాక్ చైయిన్ టెక్నాలజీని క్రాక్ చేయడం అంత ఈజీ కాదని, హ్యాకర్ల మేథస్సు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇక హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీతో పెద్దగా ప్రయోజనం ఉండదని ఇంకొందరి అభిప్రాయంగా వ్యక్తమైంది. హ్యాక్ చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తే... హ్యాకర్లను శిక్షించకుండా ఉద్యోగం ఇవ్వాలన్న వారూ ఉన్నారు. Hope you will transfer assets to addresses below: ETH: 0x71Fb9dB587F6d47Ac8192Cd76110E05B8fd2142f BSC: 0xEEBb0c4a5017bEd8079B88F35528eF2c722b31fc Polygon: 0xA4b291Ed1220310d3120f515B5B7AccaecD66F17 pic.twitter.com/mKlBQU4a1B — Poly Network (@PolyNetwork2) August 11, 2021 -
క్రిప్టో కరెన్సీలో దిట్ట.. 13 ఏళ్ల మన భారతీయ బిడ్డ!
వర్చువల్ కరెన్సీ వ్యాపారంలో ఇండియాకు చెందిన గజేశ్నాయక్ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంకా పదో తరగతి పూర్తి చేయకముందే కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని పనితీరు మెచ్చి ప్రపంచ కుబేరులు అతని సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: గజేశ్ నాయక్, వయస్సు 13 ఏళ్లు, చదివేది 9వ తరగతి, నివసించేది గోవా. ఇవేమీ అతని ప్రత్యేకతలు కావు. కానీ అతను నెలకొల్పిన బిజినెస్ యాప్ ఆర్థిక కార్యకలాపాల విలువ అక్షరాల యాభై కోట్ల రూపాయలకు పైమాటే. పదో తరగతి కూడా పాస్ కాకుండానే గజేశ్ ఈ ఘనత సాధించాడు. ఇండియాలో మొగ్గదశలోనే ఉన్న క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాడు. కరోనా సంక్షోభంలో స్టార్టప్‌లు ఇబ్బందులు పడుతుంటే అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నాడు గజేశ్. చదువులో దిట్ట గోవా రాజధాని పనాజీలోని పీపుల్స్ హై స్కూల్ చెందిన గజేశ్ నాయక్ చిన్నప్పటి నుంచే చదువులో దిట్ట, గణితంలో మేటి. చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. అందువల్లే కరోనా కారణంగా పాఠశాలు మూత పడినప్పుడు, తన కంటే కింది తరగతి విద్యార్థుల కోసం స్టడీ కంటెంట్ రెడీ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాడు. పాఠశాలలు తెరుచుకోపోవడంతో న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేశాడు. సీ, సీ ప్లస్, జావా స్క్రిప్ట్, సోలిడిటీలలో ఆరితేరాడు. క్రిఫ్టోకరెన్సీపై ఫోకస్ గోవాలో 2018లో జరిగిన ఇంటర్నేషనల్ బ్లాక్ చెయిన్ సమావేశాల్లో గజేశ్ పాల్గొన్నాడు. అప్పటి నుంచే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఆర్టిపీషియల్ ఇంటిలిజెన్స్‌పై ఆసక్తి పెరిగింది. లాక్డౌన్ టైంలో నేర్చుకున్న కొత్త కోర్సులను తన ఆసక్తికి జత చేశాడు. కోడింగ్ రాయడం సుళువైంది. ఆ తర్వాత వర్చువల్ కరెన్సీ మార్కెటైన క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాడు. క్రిప్టో కరెన్సీపై అనుభవం ఉన్న నిపుణులతో చర్చలు జరిపాడు. అనంతరం తనే స్వంతంగా పాలీగజ్ పేరుతో కొత్త డీయాప్‌ను రూపొందించాడు. డీ సెంట్రలైజ్డ్ పాలిగాన్ బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై డీఫై ప్రోటోకాల్ ఆధారంగా గజేశ్ రూపొందించిన పాలిగజ్ డీయాప్ క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వ్యవహరాలను నిర్వహిస్తుంది. ఇందులో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిజినెస్‌ని ఎటువంటి చట్టపరమైన అనుమతులు, మధ్యవర్తులు, దళారులు లేకుండానే నిర్వహించవచ్చు. ఈ పద్దతిలో వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలపై ఏ ఒక్కరి పెత్తనం ఉండదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోటోకాల్‌లోనే అన్ని వ్యవహరాలు ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి. 7 మిలియన్ డాలర్లు పాలిగజ్లో డీయాప్పై ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే దీని నిర్వాహాణ సామర్థ్యం వన్ మిలియన్ డాలర్లకి చేరుకుంది. పాలిగజ్ యాప్ పనితీరు నచ్చడంతో ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబన్ ఆసక్తి చూపించారు. తాను పెట్టుబడులు పెట్టారు. దీంతో ఇప్పుడు పాలిగజ్ నిర్వాహణ సామర్థ్యం 7 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక 13 ఏళ్ల భారతీయ బాలుడు స్థాపించిన పాలిగజ్ యాప్ అమెరికన్లు సైతం ఆశ్చర్యపరిచే రీతిలో పెర్ఫ్మామ్ చేస్తోంది. డీఫై ప్రోటోకాల్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. -
౩వ రోజుకు చేరుకున్న వికేంద్రీకరణ మద్దతు దీక్షలు
-
వికేంద్రీకరణ సూత్రాన్ని బలంగా నమ్ముతాం
-
'ఏలూరులో హైకోర్టు.. రాజమండ్రిలో ఎయిమ్స్'
పాలకొల్లు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం రెండు జిల్లాలకే పరిమితమైపోవటం అనేక అనుమానాలకు తావిస్తున్నదని, సీఎం చంద్రబాబు నాయుడి అనునాయుల కోసమే ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో పనులు ప్రారంభిస్తున్నారని సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామజోగయ్య ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇంటికి వెళ్లక తప్పదని హెచ్చరించారు. శనివారం పాలకొల్లులో విలేకరులతో మాట్లాడిన చేగొండి పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఉభయగోదావరి జిల్లాలక ఎటువంటి ప్రయోజనం లేదన్న ఆయన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఏపీ హైకోర్టును, పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య పట్టణం రాజమండ్రిలో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని తద్వారా ఆయా జిల్లాల ప్రజను కొంతమేరకు సంతృప్తి పర్చవచ్చని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తప్పిదాలు మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి చుట్టుకుంటాయని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే మూల్యం చెల్లించక తప్పదన్నారు. అమరావతిని పరిపాలనా కేంద్రంగా మాత్రమే పరిమితం చేసి మిగిలిన జిల్లాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణ చేపట్టకుంటే ప్రజలను చైతన్యపర్చి ఉద్యమం చేపడతామని హరరామజోగయ్య హెచ్చరించారు.