decided
-
‘గిరి’ సీమల్లో ‘జుగా’ వెలుగులు
హన్మకొండ: అన్ని గిరిజన గ్రామాల్లో విద్యుత్ కాంతులు విరజిమ్మనున్నాయి. ప్రతీ ఇంటిని విద్యుదీకరించాలని కేంద్ర ప్రభుత్వం తాజగా నిర్ణయించింది. మెజారిటీ గిరిజన జనాభా ఉండి ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యానికి నోచుకోని గ్రామాల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రతీ ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అవసరమైన చోట నూతనంగా విద్యుత్ లైన్లు వేయడంతోపాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. అటవీ ప్రాంతంతోపాటు ఇతర కారణాలతో విద్యుత్ లైన్లు వేయలేని గ్రామాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో మెజారిటీ గిరిజన జనాభా కలిగిన 1,049 గ్రామాలు, తెలంగాణ సదరన్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీఎస్ఎల్) పరిధిలో 229 గ్రామాల్లోని గిరిజన ఇళ్లలో వెలుగులు నింపనున్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసింది. మెజారిటీ గిరిజన జనాభా ఉన్న 695 గ్రామాల్లోని 25,393 గృహాలకు, 732 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం రూ.144.42 కోట్ల వ్యయం అంచనాతో డీపీఆర్ రూపొందించగా.. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.దేశంలో 5 కోట్ల మందికి లబ్ధిగిరిజనులకు మెరుగైన సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు, గ్రామాల్లో కనీస వసతులు, సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధా న మంత్రి జన్‌జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ (పీఎం జుగా) అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 63 వేల గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 25 రకాల సహాయాలు అందుతాయి. 17 మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయి. సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో ఉన్న కీలకమైన అంతరాలను పూడ్చేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు.రూ.144.42 కోట్ల వ్యయంతో..ఇప్పటికే ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా జనసమూహాలకు దూరంగా ఉండి మౌలి క సదుపాయాలకు నోచుకోని కోలం, తొట్టి గిరిజనులు నివా సముండే ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని 257 అవా సాల్లో 3,345 గృహాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. అదే విధంగా దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి ద్వారా రూ.125కే విద్యుత్ పంపిణీ సంస్థ సొంతగా ఖర్చులు భరించి పేదలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. అయినా ఇప్పటి కీ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న మెజారిటీ గిరిజను లున్న గ్రామాలు, గృహాల కోసం కేంద్రం ‘పీఎం జుగా’ను తెచ్చింది.ఎన్పీడీసీఎల్ పరిధిలోని 15 జిల్లాల్లో జగిత్యా ల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యుత్ సౌకర్యం లేని గృహాలేమీ లేవు. మిగతా 13 జిల్లాల్లో 1,049 మెజారిటీ గిరిజన జనాభా కలిగిన గ్రామాలు ఉన్నట్లు గుర్తించా రు. ఇందులో 25,393 గృహాలు, 732 ప్రభు త్వ కార్యాలయాలు (మొత్తం 26,125) ఉన్నా యి. కాగా ఆన్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించే వీలున్న గ్రామాలు 24,753 ఉన్నా యి. వివిధ కారణాలవల్ల విద్యుత్ సౌకర్యం క ల్పించడం వీలుకాని 640 గ్రామాల్లో సోలార్ ద్వారా గృహాలను విద్యుదీకరించనున్నారు. ఈ గ్రామాలు, గృహాల కు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి రూ.144.42 కోట్ల వ్య యంతో 352 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్, 592 కి.మీ. సింగిల్ లైన్, 1,668 కి.మీ. ఎల్టీ లైన్ నిర్మించనున్నారు. 1,565 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు బిగించనున్నారు. ఈ స్కీమ్ అమలుకు కావాల్సిన ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుంది. -
తెలంగాణలో హైడ్రా బుల్డోజర్లకు కొన్నాళ్లు బ్రేక్. ఇప్పట్లో నిర్మాణాల కూల్చివేతలు వద్దని ప్రభుత్వ నిర్ణయం. అంతర్గత వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకోవడంపై హైడ్రా దృష్టి
-
విశాఖకు కృష్ణాబోర్డు
సాక్షి, అమరావతి: కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని సిద్ధం చేసింది. తక్షణమే హైదరాబాద్ నుంచి విశాఖకు కార్యాలయాన్ని తరలించాలని బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. కృష్ణా, గోదావరి నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రాకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను విభజన చట్టం ద్వారా కేంద్రం ఏర్పాటుచేసింది. కృష్ణాబోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోను, గోదావరి బోర్డు కార్యాలయం తెలంగాణలోను ఏర్పాటుచేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం రెండు బోర్డుల కార్యాలయాలు హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. 2020లో కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి ఆదేశించారు. కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అక్కడ భవనం, వసతులు కల్పిస్తే హైదరాబాద్ నుంచి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణాబోర్డు తెలిపింది. విశాఖపట్నంలో నార్త్‌కోస్ట్ సీఈ కార్యాలయం ప్రాంగణంలో నిర్మిం చిన భవనంలో ఒక అంతస్తును కృష్ణాబోర్డు కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించి, బోర్డుకు తెలిపింది. -
గడపగడపకూ టీకా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి కరోనా టీకాలు వేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే మొబైల్ వ్యాన్లతో పల్లెలు, బస్తీలకు చేరుకున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేయడంపై దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ కోసం ఎదురుచూడటం, గంటల తరబడి క్యూలో నిల్చోవడం వంటివేవీ లేకుండా.. ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన రోజున ఇంటివద్దకే వచ్చి టీకాలు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున లక్షన్నర వరకు వ్యాక్సిన్లు వేస్తుండగా.. గడపగడపకు వెళ్లే కార్యక్రమంతో ఇంతకు రెట్టింపు వేసేలా ప్రణాళిక రచించినట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.66 కోట్ల డోసుల టీకా వేశారు. ఇందులో 1.24 కోట్ల మందికి మొదటి డోస్ వేయగా.. 42.55 లక్షల రెండు డోసులూ పూర్తయ్యాయి. మొదటిడోసు వేసుకున్నవారిలో అత్యధికంగా 18–44 ఏళ్ల మధ్య వయసు వారు 61 లక్షల మంది ఉన్నారు. వీరిలో 8.72 లక్షల మంది రెండు డోసులూ తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలంటే ఈ ఏడాది చివరివరకు సమయం పడుతుందని గతంలో అంచనా వేశారు. కానీ అంతకన్నా ముందే టీకా వేయాలని తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. డోసుల లభ్యతను బట్టి.. టీకాల లభ్యతను బట్టి ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కోసారి అనుకున్నంతగా వ్యాక్సిన్లు రాష్ట్రానికి అందడం లేదు. అలాంటప్పుడు టీకా కార్యక్రమం సజావుగా సాగడం లేదు. గత నెలలో రెండో డోసు వారికి మాత్రమే టీకాలు వేశారు. లభ్యత పెరగడంతో ఈ నెలలో మొదటి డోసు వారికి కూడా ఇస్తున్నారు. కొత్త వ్యాక్సిన్లకు అనుమతి వస్తుండటం, టీకాల ఉత్పత్తి పెరుగుతుండటంతో.. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రముఖుల ఇళ్లకు వెళ్లి కరోనా టీకాలు వేస్తున్నారు. అదే తరహాలో సాధారణ ప్రజలకూ టీకాలు ఇంటిముందుకే రానున్నాయి. పీహెచ్సీ, బస్తీ దవాఖానాలు కేంద్రంగా.. రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ఉంది. పెద్ద మండలాల్లో రెండు వరకు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వీటిని కేంద్రంగా చేసుకొని వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. పీహెచ్‌సీల్లో ప్రతి బుధ, శనివారాల్లో సాధారణ వ్యాక్సినేషన్ల కార్యక్రమం జరుగుతుంటుంది. ఏఎన్ఎంలు ఈ రోజుల్లో పిల్లలు, గర్భిణులకు పలురకాల టీకాలు ఇస్తారు. ఇకముందు సాధారణ వ్యాక్సినేషన్‌తోపాటు కరోనా టీకాలు కూడా వేయాలని నిర్ణయించారు. రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాల కారణంగా వ్యాక్సినేషన్ మొదలుపెట్టిన కొత్తలో డాక్టర్, అంబులెన్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూశారు. అయితే వ్యాక్సిన్లతో రియాక్షన్ సమస్య దాదాపుగా లేనందున.. ఆ ఏర్పాట్లు అవసరం లేదని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కొందరికి ఒళ్లు నొప్పులు, జ్వరాలు వస్తుంటాయి. అందువల్ల పారాసిటమాల్ మాత్రలు అందజేయాలని నిర్ణయించారు. -
డిసెంబర్ చివరికల్లా అందరికీ టీకా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ ఈ ఏడాది చివరికల్లా కరోనా టీకాలు వేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడం ద్వారా మూడో వేవ్‌ను అడ్డుకోవచ్చని భావిస్తోంది. ఈ మేరకు త్వరలో టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయనున్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడినవారు 2.20 కోట్ల మంది ఉన్నారు. అందులో ఇప్పటివరకు 1.15 కోట్ల మందికి టీకాలు వేశారు. వీరిలో 38.21 లక్షల మందికి రెండో డోసు కూడా పూర్తయింది. మిగతా వారికి రెండో డోసు టీకాను.. అదనంగా 1.05 కోట్ల మందికి రెండు డోసుల టీకాలను వేయాల్సి ఉంది. మరోవైపు 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువారికి అక్టోబర్ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఈ వయసు వారు 45 లక్షల మందివరకు ఉంటారని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో 24.63 లక్షలు.. రంగారెడ్డిలో 15.53 లక్షలు రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 24.63 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అందులో 8.32 లక్షల మందికి రెండో డోస్ వేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 15.53 లక్షల మందికి టీకాలు (ఇందులో 4.85 లక్షల మందికి రెండో డోస్) వేశారు. అత్యంత తక్కువగా నారాయణపేట జిల్లాలో 59,873 మందికి (ఇందులో 16,364 మందికి రెండు డోసులు) టీకాలు వేశారు. ఇప్పటికే మొదటి డోస్ తీసుకున్నవారికి రెండో డోస్ వేసే ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని భావిస్తున్నారు. అయితే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య 84 రోజుల గడువు విధించడంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఏడాది చివరిదాకామూడోవేవ్ రాదు రాష్ట్రంలో ఈ ఏడాది చివరినాటికి 18 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ అందించేలా ప్రణాళిక రూపొందించాం. కేంద్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ నాటికి అందరికీ టీకా వేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది చివరివరకు మూడో వేవ్ వచ్చే అవకాశమే లేదు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం దాకా ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. ప్రస్తుతం రోజుకు 42 వేల కరోనా కేసులు నమోదైతే.. కేరళలో 22 వేలు, మహారాష్ట్రలో 10 వేలు ఉంటున్నాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి పది వేల కేసులే నమోదవుతున్నాయి. అంటే ఆ రెండు రాష్ట్రాలను మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాల్లో సాధారణ కేసులే నమోదవుతున్నాయి. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు. -
తెలంగాణ: ఆగస్టులో 15 కిలోల రేషన్ బియ్యం
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల ద్వారా ఆగస్టు నెలలో పదిహేను కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా, వివిధ కారణాలతో జూలైలో 5 కిలోలే పంపిణీ చేశారు. ఈ నెలలో జూలై కోటా కలుపుకొని 15 కిలోల బియ్యాన్ని పాత కార్డుదారులందరికీ పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 15 కిలోలు, కొత్తగా ఈ కార్డులు పొందిన వారికి ఒక్కొక్కరికి 10 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా ఇవ్వాలని పౌర సరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ శుక్రవారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటే అంత్యోదయ కార్డుదారులకు కుటుంబానికి కిలో చక్కెరను రూ.13.50కి, గోధుమలు జీహెచ్ఎంసీ పరిధిలో 3 కిలోలు, మునిసిపల్‌లో 2 కిలోలు, కార్పొరేషన్లో ఒక కిలో చొప్పున కిలో రూ.7కు ఇవ్వాలని ఆదేశించారు. -
‘హోదా’ ఇచ్చే వరకూ పోరాటం
జిల్లా సర్పంచుల సంఘం తీర్మానం గుంటూరు వెస్ట్ : విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు కేంద్రంపై ఉద్యమిస్తామని పలువురు సర్పంచులు స్పష్టం చేశారు. జిల్లా సర్పంచుల సంఘ సమావేశం సీతారామ్ నగర్ 2వ లైన్‌లోని కార్యాలయంలో శనివారం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి శ్రీనివాసరావు సమావేశానికి అధ్యక్షత వహించారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా పెదకాకాని సర్పంచ్ ఆళ్ల వీరరాఘవమ్మ కేక్‌ను కట్ చేశారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే కేటాయించడం(బదిలీ చేయడం)పై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈఓపీఆర్డీలు ఇష్టానుసారం వ్యవహరించకుండా ప్రతి విషయాన్ని సర్పంచ్‌కు తెలియజేయాలని తీర్మానించారు. -
ఎన్నికల్లో ముమ్మర ప్రచారం
-
బాబు సర్కారు పెంచిన కరెంటు చార్జీలు
-
డిజిటలైజేషన్‌కు 2 నెలల పొడిగింపు
-
మళ్లీ విద్యుత్ చార్జీల మోత!
-
తల్లిదండ్రులకు విషమిచ్చి మాజీ మావోయిస్టు ఆత్మహత్యాయత్నం
తండ్రి మృతి.. చావుబతుకుల మధ్య తల్ల్లీకుమారుడు ఎస్ఐబీ వేధింపులే కారణమని సూసైడ్ నోట్లో వెల్లడి హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : అజ్ఞాతం వీడి జనారణ్యంలో కలిసినా అతడిని పోలీసులు వదలలేదు. అరెస్టయిన ఓ మాజీ మావోయిస్టును స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) పోలీసులు వెంటాడి వేటాడారు. కుట్ర చేసి మావోయిస్టు అగ్రనేతలను హతమార్చాలని హింసించారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగిపోలేక, ఉద్యమానికి ద్రోహం చేయలేక అతడు తల్లిదండ్రులకు విషమిచ్చి తాను తాగాడు. చికిత్సపొందుతూ తండ్రి మృతి చెందగా, తల్లి, కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మండలంలోని మునిపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మునిపల్లికి చెందిన దార వీరయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు సారయ్య సీపీఐ(మావోయిస్ట్)తో గతంలో ప్రత్యక్ష, పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన పార్టీలో 1997 నుంచి 2004 వరకు పనిచేసి లొంగిపోయూడు. రెండేళ్లపాటు సారయ్య పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే 2006లో దేవన్నపేటకు చెందిన ఆవుల కట్టయ్యను మావోయిస్టులు హతమార్చారు. ఈ హత్య తర్వాత పోలీసుల వేధింపులు పెరగడం తో సారయ్య అజ్ఞాతంలోకి వెళ్లాడు. మళ్లీ 2009లో పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తు తం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు మళ్లీ మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడనే నెపంతో ఎస్ఐబీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. విచారణ సందర్భంగా వారు చిత్రహింసలకు గురిచేయడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. అనంతరం అతడిని వదిలేయడంతో రెండు రోజులక్రితం సారయ్య వైన్‌షాపులో మద్యం కొనుగోలు చేశాడు. అందులో క్రిమిసంహారక మందు కలిపాడు. నేరుగా ఇంటికి వెళ్లి గ్లాసులు తీసుకుని ముందుగా ఒక గ్లాస్లో మందు పోసి తండ్రికి, అ తర్వాత తల్లికి ఇచ్చాడు. అనంతరం తాను తాగాడు. కొద్దిసేపటికి ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చుట్టుపక్కలవారు గమనించి వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన సేవల కోసం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ తండ్రి వీరయ్య మృతిచెందగా, తల్లి, కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీకి ద్రోహం చేయలేక... ఆత్మహత్య లేఖలో దార సారయ్య వెల్లడి ఈనెల 7న ఎస్ఐబీ పోలీసులు సారయ్యను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఎస్ఐబీ ఐజీ, ఎస్ఐబీ ఎస్పీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సారయ్యను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. మావోయిస్ట్ నేతలు హరిభూషణ్, దామోదర్, ప్రభాకర్‌ను హతమార్చాలని బెదిరింపులకు గురిచేశారు. ముగ్గురు నేతలు నిన్ను బాగా నమ్ముతారు. విషం కలిపిన లడ్డూలు తీసుకెళ్లి వారికి తినిపించు. లేకుంటే నిన్ను కూడా గంటి ప్రసాద్, ఆకుల భూమయ్యలాగా చంపుతామని బెదిరించినట్లు సారయ్య రాసిన సూసైడ్ నోట్లో వివరించాడు. పోలీసుల చిత్రహింసలతో కాలికి బలమైన గాయమైనట్లు లేఖలో పేర్కొన్నాడు. చిత్రహింసలకు తట్టుకోలేక పార్టీకి ద్రోహం చేయలేక తల్లిదండ్రులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించినట్లు సారయ్య వివరించాడు. తమ చావుకు ఎస్ఐబీ పోలీసులే కారకులని అందులో పేర్కొన్నారు. -
సమైక్య గళం