decimation
-
10 నెలలు.. 1,142 ఎన్కౌంటర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గత మార్చిలో యోగి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 2018, జనవరి 31 వరకూ యూపీలో 1,142 ఎన్కౌంటర్లు జరిగినట్లు పోలీసులు ఓ నివేదిక విడుదల చేశారు. ఈ కాల్పుల్లో 34 మంది నేరస్తులు ప్రాణాలు కోల్పోగా, 265 మంది గాయపడ్డారు. గత 10 నెలల్లో 2,744 మంది హిస్టరీ షీటర్ల(నేర చరిత్ర ఉన్నవారు)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లలో నలుగురు పోలీస్ సిబ్బంది చనిపోగా, 247 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో నేరస్తులను ఏరివేయడానికి పోలీసులకు సీఎం యోగి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ‘ఆపరేషన్ క్లీన్’ పేరిట పరారీలో ఉన్న నేరస్తుల కోసం వేట మొదలైందన్నారు. ‘లొంగిపోండి లేదా రాష్ట్రం విడిచివెళ్లిపోండి’ అని నేరస్తులకు ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. మీరట్ జోన్లో పోలీసులు అత్యధికంగా 449 ఎన్కౌంటర్లు చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆగ్రా(210), బరేలీ(196), కాన్పూర్(91) జోన్లు నిలిచాయన్నారు. సీఎం యోగి నియోజకవర్గమైన గోరఖ్‌పూర్ జోన్లో(31) అతితక్కువ ఎన్కౌంటర్లు జరిగినట్లు వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్రంలో నేరాలను అరికట్టడానికి 167 మంది క్రిమినల్స్‌పై జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయడంతో పాటు రూ.150 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎన్కౌంటర్ ముసుగులో సామాన్య పౌరుల్ని పోలీసులు కాల్చిచంపడంపై యూపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నోయిడాలోని ఓ జిమ్ యాజమానితో పాటు మరో వ్యక్తిని పోలీసులు కాల్చిచంపడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) యూపీ ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు సైతం జారీచేసింది. ఈ ఎన్కౌంటర్లపై సరైన ప్రభుత్వ పర్యవేక్షణ లేకుంటే 1991 నాటి పిలిభిత్ నకిలీ ఎన్కౌంటర్ లాంటి ఘటనలు పునరావృతమవుతాయని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 1991లో ప్రైవేటు బస్సులో ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తున్న 10 మంది సిక్కుల్ని యూపీ పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లో కాల్చిచంపారు. వీరిందరూ పాకిస్తాన్ ప్రోద్బలం ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులని బుకాయించారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టు 2016లో 47 మంది పోలీస్ అధికారుల్ని దోషులుగా తేల్చింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌధరీ మాట్లాడు తూ.. ‘ప్రభుత్వం నేరాలను తగ్గించడంలో విఫలమై ఎన్కౌంటర్ల ముసుగులో తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటోంది’ అని అన్నారు. -
హింస రచన
-
'లొంగిపోనన్నాడు.. అందుకే చంపాం'
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఢాకా కేఫ్ మారణ హోమానికి కారణమైన కీలక సూత్రదారి లొంగిపోయేందుకు నిరాకరించడమే కాకుండా దాడులకు దిగడం వల్లే ప్రతిదాడులు చేసి హతమార్చామని ఢాకా బలగాలు తెలిపాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్‌పై గత నెలలో ఉగ్రవాదులు దాడి చేసి ఒక భారతీయురాలు, 16మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయారు. దీని సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌదురి(30)గా బంగ్లా భద్రతా బలగాలు గుర్తించాయి. ఇతడు బంగ్లాదేశ్ సంతతికి చెందిన కెనడా పౌరుడు. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అతనే ఢాకాలోని గుల్షన్ ప్రాంతానికి తీసుకొచ్చాడని.. మారణకాండ మొదలయ్యే కొద్ది సేపటి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. దీంతో అప్పటి నుంచి బలగాలు అతడికోసం గాలిస్తున్నాయి. ఢాకా శివార్లలోని నారాయణ్‌గంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో తమీమ్ ఉన్నట్టు సమాచారం అందడంతో ఆపరేషన్ చేపట్టారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను కార్నర్ చేసినప్పటికీ వారు లొగిపోకుండా కాల్పులకు తెగబడ్డారు. దీంతో సుమారు గంటపాటు జరిగిన కాల్పుల్లో ఎట్టకేలకు తమీమ్ చనిపోయాడు. -
ఢాకా దాడి సూత్రధారి హతం
మరో ఇద్దరు ఉగ్రవాదులనుమట్టుబెట్టిన బంగ్లా పోలీసులు ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్‌పై గత నెలలో జరిగిన ఉగ్ర దాడి సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌదురి(30)ని బంగ్లా భద్రతా బలగాలు శనివారం హతమార్చాయి. అతడితో పాటు ఇద్దరు అనుచరులు చనిపోయారు. జూలై 1న ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీపై ఉగ్ర దాడిలో ఒక భారతీయురాలు, 16 మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయారు. ఈ దాడికి సూత్రధారి బంగ్లాదేశ్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తమీమ్. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అతనే ఢాకాలోని గుల్షన్ ప్రాంతానికి తీసుకొచ్చాడని.. మారణకాండ మొదలయ్యే కొద్ది సేపటి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. భద్రతా బలగాల అదుపులో ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)కి చెందిన ఓ ఉగ్రవాది ఢాకా శివార్లలోని నారాయణ్‌గంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో తమీమ్ ఉన్నట్టు సమాచారం ఇవ్వడంతో ఆపరేషన్ చేపట్టినట్టు కౌంటర్ టైజమ్ యూనిట్ చీఫ్ మోనీరుల్ ఇస్లాం చెప్పారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో లోపలి నుంచి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురూ చనిపోయారు. ఈ ఆపరేషన్ సుమారు గంట పాటు సాగిందని వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి కొన్ని గ్రెనేడ్లు, ఓ పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, తమీమ్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారికి బంగ్లా పోలీసులు 20లక్షల బంగ్లా టాకాల రివార్డును ప్రకటించారు.