decoits
-
కర్నూలు నేషనల్ హైవేపై దారిదోపిడీ
సాక్షి, కర్నూలు: కంటైనర్ హైవేలపైకి చేరగానే వాళ్లూ హైవేపైకి దూసుకొస్తారు. రన్నింగ్ వెహికల్స్ లోనే తమ పని పూర్తి చేసుకొని జారుకుంటారు. ఉదయాన్నే వస్తువుల్ని డెలివరీ చేసేందుకు ఆ కంటైనర్ ఓపన్ చేసి చూస్తేగానీ చోరీ జరిగిన విషయం బయటపడదు. ఈ తరహా చోరీలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. కర్నూల్ నేషనల్ హైవేపై ఏ స్థాయిలో దారిదోపిడీలు జరుగుతాయో ఓ వాహనానికి అమర్చిన సీసీటీవీ సాక్షిగా బయటపడింది. యాక్షన్ మూవీలను తలదన్నే రియల్ యాక్టివిటీ ఇది. వాహనం రన్నింగ్‌లోనే ఉంది. ఓ గ్యాంగ్ బైక్‌పై వచ్చి కంటైనర్ వాహనాన్ని అందుకున్నాడు. ఓ తన గ్యాంగ్ కిందపడిపోవడంతో చోరీకి బ్రేక్ పడింది. దీంతో హైస్పీడ్‌లోనూ చిన్న టెక్నిక్‌తో కిందికి దిగేశాడు ఈ దొంగ. కర్నూల్ హైవేపై నిత్యం ఇలాంటి భారీ కంటైనర్స్ రకరకాల వస్తువులతో వెళ్తుంటాయి. ఇళ్లను టార్గెట్ చేస్తే పెద్దగా వర్కవుట్ అవ్వదని భావిస్తున్న దొంగలు.. హైవేలపై వెళ్లే వస్తువుల కంటైనర్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ చోరీలు కొరియర్ సర్వీసులకు పెద్ద ముప్పుగా మారాయి. డీటీడీసీ కొరియర్, వరల్డ్ ఫస్ట్ ఫ్లైట్ వంటి బ్రాండెడ్ కొరియర్ సర్వీసులకు దొంగల భయం నిద్ర లేకుండా చేస్తోంది. ఈ కొరియర్ సర్వీసుల్లో ఖరీదైన వస్తువులు వెళ్తుంటాయి. వాటిని ఇలాంటి గ్యాంగులు కొట్టేస్తున్నాయి. ఇటీవలే రెండు కంటైనర్లలో 50 లక్షల విలువ చేసే వస్తువుల్ని ఎత్తుకెళ్లిపోయారు. ఏ కంటైనర్ ఎక్కడికి వెళ్లుతుంది, ఏ వాహనలో ఎలక్ట్రానిక్ గూడ్స్ వెళ్తుంటాయో పక్కాగా రెక్కీ నిర్వహిస్తారు. ఒక అద్దె కంటైనర్‌ను తమ వెంట హైవై మీదకు తీసుకెళ్లి రిహార్సల్స్ చేస్తారు. వేగంగా వెళ్తున్నప్పుడు ఎలా కంటైనర్ తెరవాలి.. వస్తువుల్ని ఎలా కొట్టేసి జాగ్రత్తగా కిందికి దించాలి.. మళ్లీ ఎలా తప్పించుకోవాలని ప్రాక్టీస్ చేస్తారు. ఇదంతా రాత్రి వేళల్లో మాత్రమే జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే కడప నుండి హైదరాబాద్ వెళ్తున్న డీటీడీసీ కొరియర్ వాహనాన్ని మైదుకూరు వద్ద టీ త్రాగడానికి కాసేపు ఆపిన డ్రైవర్.. ఒంటి గంట సమయంలో కొరియర్ ఆఫీసుకు చేరుకొని డోర్ తీశాడు. అంతే.. వస్తువులు చోరీ అయ్యాయి. వరల్డ్ ఫస్ట్ ఫ్లైట్ కొరియర్ సర్వీస్ కంటైనర్‌కు కూడా ఇదే పరిస్థితి.. నంద్యాల కర్నూలు మధ్యలో ఉన్న తమ్మరాజు పల్లె వద్ద కంటైనర్‌పై అటాక్‌కు ప్రయత్నించారు. అయితే ప్రమాదం జరగడంతో ఈ చోరీకి బ్రేక్ పడింది. ఈ తతంగమంతా ఆ కంటైనర్‌కు అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు దాదాపు అన్ని కంటైనర్లకూ సీసీటీవీలు అమర్చి.. ఒక మనిషి అదేపనిగా పర్యవేక్షిస్తున్నారు. అయినా సరే కొందరు కేటుగాళ్లు ఆ సీసీ కెమెరాలను పగలగొట్టి చోరీలు చేస్తున్నారు. దీంతో హైవే దొంగల్ని పట్టుకోవడం.. వస్తువుల్ని తీసుకెళ్లే వాహనాలకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారింది. -
దోపిడీ దొంగల హల్చల్!
నిజాంసాగర్(జుక్కల్): వర్షాభావ పరిస్థితులు ఓ వైపు.. దోపిడీ దొంగల సంచారం మరో వైపు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాన్సువాడ సర్కిల్ పరిధిలో వరుస చోరీలు జరుగుతుండటంతో పోలీసులకు సవాలుగా మారింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లతో పాటు ఇంటి వెనుక భాగంలో ఉన్న కిటికీలను ధ్వంసం చేస్తూ దుండగులు చోరీలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న నిజాంసాగర్ మండలం గాలీపూర్, ముగ్థుంపూర్, నర్సింగ్‌రావ్‌పల్లి గ్రామాల్లో దొంగలు దోపిడీలు చేశారు. ఆ సంఘటనలు మరుక ముందే పిట్లం మండల కేంద్రంలో బంగారు దుకాణంలో భారీ చోరీ కావడంతో పోలీసులకు పెను సవాలుగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన చోరీలను పోలీసులు మామూలుగా తీసుకున్నారు. దొంగలను నివారించడంతో విఫలం చెందడంతో పట్టణాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు ముచ్చెమటలు పట్టించేలా చేస్తున్నారు. గాలీపూర్, మగ్థుంపూర్ గ్రామాల్లోని నాల్గు ఇళ్లల్లో చోరీలు, నర్సింగ్రావ్పల్లిలోని ఓ ఇంట్లో చోరీ జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పిట్లం మండల కేంద్రంలోని నగల దుకాణంలో రూ.30లక్షల నగలు చోరీకి గురవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దోపిడీ దొంగల కోసం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలతో పాటు పాత నేరస్థులపై నిఘా పెట్టారు. పిట్లంలోని నగల దుకాణంలో సైతం దొంగలు కిటికీలను ధ్వంసం చేసి చోరీ చేశారు. ఇలా వరుస చోరీలు ఒకే మాదిరిగా జరుగడంతో ఒకే ముఠాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామాల వైపు పోలీసుల నిఘా లేకపోవడం, రాత్రివేళ పెట్రోలింగ్ సైతం తగ్గడంతో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. -
చెలరేగిన దొంగలు
భీమవరం టౌన్: భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో సోమవారం వేకువజామున ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై కె.సుధాకరరెడ్డి కథనం ప్రకారం.. అరటిపళ్లు వ్యాపారం చేసుకునే నూకల వెంకట పెద్దిరాజు ఆదివారం రాత్రి ఇంటి ఐరన్ గ్రిల్స్‌కు ఉన్న తలుపు వేయకుండా గెడపెట్టి నిద్రించారు. వేకువజామున 3.30 గంటల సమయంలో అలికిడి రావడంతో మేలుకోగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు. పెద్దిరాజు లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది రూ.90 వేల నగదు, తొమ్మిది కాసుల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బాధితుడు పెద్దిరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొవ్వూరులో.. కొవ్వూరు : పట్టణంలో శ్రీనివాసపురం కాలనీలో బాతుల మల్లికార్జున ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈనెల 11న మల్లికార్జున ఇంటికి తాళాలు వేసి తన మామయ్యకు అనారోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. 14న పక్కింటి వాళ్లు ఫోన్ చేసి ఇంటి తాళాలు పగలకొట్టి ఉన్నాయని, బీరువాలో వస్తువులన్నీ బయటికి తీసినట్టు ఉన్నాయని చెప్పారు. దీంతో అతను సోమవారం వచ్చి బీరువాలోని 26గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. -

'రెండు రోజుల్లో దొంగలను పట్టుకుంటాం'
వనపర్తిరూరల్ (మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం మరికుంట సమీపంలో దారి దోపిడీకి పాల్పడ్డ దొంగలను రెండురోజుల్లో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. వివరాలు.. వనపర్తి మండలం రిజర్వు ఫారెస్టు కర్నూల్ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని దుండగులు అర్దరాత్రి అడ్డగించి దారి దోపిడీకి పాల్పడ్డారు. గురువారం అర్ధరాత్రి పెద్ద పెద్ద కర్ర మొద్దులను రోడ్డుకు అడ్డంగా ఉంచి దోపీడీ చేశారు. నాలుగు వాహనాలను ఆపి ట్రాక్టర్లపై వస్తున్న వారి నుంచి రూ. 3 వేలు దోచుకున్నట్లు తెలిసింది. బాధితులు సంఘటన స్థలం నుంచే 100కు ఫోన్ చేయగా వనపర్తి రూరల్ పోలీసులు అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దొంగలు వాహనదారులను బెదిరించి డబ్బులు తీసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డి శుక్రవారం ఉదయం దోపిడీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వరుసగా జరుగుతున్న దోపిడీలను వెంటనే అరికట్టాలని పోలీసులను కోరారు. రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ జోగుల చెన్నయ్య ఎమ్మెల్యే చిన్నారెడ్డికి హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాగే 2014 నవంబర్ 24న ఇదే ప్రాంతం వద్ద వాహనాలను ఆపి రూ.9500లు దోచుకెళ్లినట్టు సమాచారం.