ded course
-
దేశంలో విద్య వ్యాపారమైపోయింది
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్య పెద్ద వ్యాపారంగా మారిపోయిందని సోమవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్ష ‘డీసెట్’తో సంబంధం లేకుండా ‘స్పాట్ అడ్మిషన్’ పేరుతో డీఈడీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించడం ఏ మాత్రం సబబు కాదని తేల్చిచెప్పింది. ► స్పాట్ అడ్మిషన్ అంటేనే దొడ్డిదారిన ప్రవేశం కల్పించడమని, ఇందుకు ఏ చట్ట నిబంధనలు కూడా అంగీకరించవని స్పష్టం చేసింది. ► డీసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని, అసలు పరీక్షే రాయని వారికి ‘స్పాట్ అడ్మిషన్’ పేరుతో ఎలా ప్రవేశాలు ఇస్తారని డీఈడీ కాలేజీ యాజమాన్యాలను నిలదీసింది. ► 2018–19, 2019–20లకు ప్రభుత్వం అనుమతినివ్వనప్పుడు విద్యార్థులను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించింది. ► 2017–18 విద్యా సంవత్సరానికి అనుమతినిచ్చి నాటి ప్రభుత్వం తప్పు చేస్తే, మళ్లీ మళ్లీ ప్రభుత్వాన్ని అదే తప్పు చేయమంటారా అని నిలదీసింది. ఆ తప్పు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించమంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆదేశాలు తాము ఎప్పుడూ ఇవ్వలేమంది. ► స్పాట్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులపై కూడా సానుభూతి చూపలేమని తేల్చిచెప్పింది. అవసరమైతే వారి నుంచి వసూలు చేసిన ఫీజులను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ► సింగిల్ జడ్జి వద్ద డీఈడీ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ► 2018–19, 2019–20 సంవత్సరాలకు తమ కాలేజీల్లో ప్రవేశాలను ప్రభుత్వం ఆమోదించకపోవడాన్ని సవాల్ చేస్తూ డీఈడీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలను సింగిల్ జడ్జి జస్టిస్ రజనీ తోసిపుచ్చారు. దీనిపై డీఈడీ కాలేజీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయగా సోమవారం న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ► ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ విద్యార్థుల నుంచి ఈ డీఈడీ కాలేజీలు లక్షల రూపాయలు దోచేశాయన్నారు. -
దిక్కుతోచని స్థితిలో డీఎడ్ కాలేజీలు
ఒకప్పుడు డీఈడీ చదివేందుకు పిల్లలు పోటీ పడేవారు. డీసెట్‌లో ర్యాంకు వచ్చినా రాకపోయినా ఏదో కళాశాలల్లో చేరి కోర్సు పూర్తిచేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం డీఈడీ కళాశాలల్లో ప్రవేశం పొందాలంటే డీసెట్‌లో క్వాలిఫైడ్ మార్కులు రావాలని నిబంధన పెట్టింది. చాలా మంది విద్యార్థులు క్వాలిఫై కాకపోవడంతో సీట్లన్నీ మిగిలిపోయాయి. సాక్షి, కడప ఎడ్యుకేషన్: యువత చాలామంది ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. బీఈడీ చేసిన వారు స్కూల్ అసిస్టెంట్‌గా( 6 నుంచి 10వ తగరతి వరకు) డీఎడ్, టీటీసీ చేసిన వారు ఎస్జీటీ పోస్టులకు(1 నుంచి 5వ తరగతి వరకు) అర్హులు. ప్రస్తుతం ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు రెండేళ్ల డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్)( 1నుంచి 8వ తరగతి వరకు) కోర్సు తప్పని సరి చేసింది. ప్రభుత్వ డైట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో అవకాశం రాని వారు ప్రైవేటు డీఎడ్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కింద రూ.లక్షలు చెల్లించి డీఎడ్ కోర్సులో చేరేవారు. గత ఏడాది వరకు డీఎడ్ కోర్సుల్లో చేరాలంటే గగనం. ప్రస్తుత పరిస్థితి మారింది. బీఈడీ చేసిన అభ్యర్థులు సైతం ఎస్జీటీ పోస్టులకు అర్హులేనంటూ 2018 కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే విషయాన్ని జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీ) సైతం స్పష్టం చేసింది. ఫలితంగా డీఎడ్ కోర్సులకు ఆదరణ తగ్గింది. దీంతోపాటు డీసెట్‌లో క్వాలిఫై అయితేనే కళాశాలల్లో సీటు అని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా అడ్మిషన్లు పూర్తిగా పడిపోయాయి. ఫలితంగా జిల్లాలో 89 కళాశాలలకు కేవలం 13 కాలేజీల్లో విద్యార్థులు చేరారు. అది కూడా అరకొరే. ఫలితంగా పలు కళాశాలలు మూతపడే దిశగా అడుగులు పడుతున్నాయి. కౌన్సెలింగ్ ముగిసినా... డీఈడీ కళాశాలల్లో తుది కౌన్సెలింగ్ ముగిసినా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి ఇప్పటికి 3 వందల అడ్మిషన్లు మాత్రమే జరిగాయంటే పరిస్థితి ఉహించుకోవచ్చు. జిల్లాలో ఒక ప్రభుత్వ, 89 ప్రైవేటు డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ డైట్లో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియం కలుపుకుని ఒక్కో మీడియానికి 50 సీట్ల చొప్పున 150 సీట్లు ఉండగా కేవలం 130 మాత్రమే భర్తీ అయ్యాయి. 89 ప్రైవేటు కళాశాలలకుగాను 170 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వానికి సంబంధించిన 90 డీఈడీ కళాశాలలకు కలుపుకుని మొత్తంగా 6600 సీట్లు ఉండగా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి 1300 సీట్లకు కేవలం 9 సీట్లు, కన్వీనర్ కోటాకు సంబంధించి 5300 సీట్లకు కేవలం 170 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగతావి ఖాళీగా ఉండటంతో యాజమాన్యం లబోదిబోమంటున్నాయి.2018 తర్వాత బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హులేనని ప్రభుత్వం ప్రకటించడంతో డీఎడ్ కోర్సులకు మరింత గండంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో పదిశాతం సీట్లు కూడా భర్తీకాక డీఎడ్ కోర్సు అంపశయ్యపైకి చేరింది. జిల్లాలో కళాశాలల పరిస్థితి ఇలా... జిల్లాలో ఒక ప్రభుత్వ, 89 ప్రైవేటు డీఈడీ కళాశాలలు ఉన్నాయి.రాయచోటిలో ప్రభుత్వ డైట్ కళాశాల ఉంది. ఇక్కడ ప్రవేట్‌కు సంబంధించి 9 కాలేజీలు ఉండగా ఇందులో 6 మూతపడినట్లు తెలిసింది. మిగతా మూడింటిలో కేవలం ఐదుగురు విద్యార్థులు చేరినట్లు సమాచారం. కడపలో 19 కాలేజీలు ఉండగా కేవలం 4, బద్వేల్లో 5కు గాను మూడు, రాజంపేటలో 5కు గాను రెండు, రైల్వేకోడూరులో 5 కాలేజీలకు రెండు, పొద్దుటూరులో 13కు మూడు, పులివెందుల్లో మూడింటికి రెండు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నట్లు తెలిసింది. పరిస్థితి కష్టంగా ఉంది.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాల కాకుండా 89 డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 6 వేలకు పైగా సీట్లు ఉన్నాయి.ఇప్పటి వరకు కేవలం 3 వందలు మాత్రమే భర్తీ అయ్యాయి.మున్ముందు భర్తీ అయ్యే అవకాశం కనిపించడం లేదు.పరిస్థితి కష్టంగా ఉంది. – చంద్రయ్య, డైట్ ప్రిన్సిపాల్, రాయచోటి పర్యవేక్షిస్తాం... జిల్లాలోని డీఈడీ కళాశాలల స్థితిగతులపై పర్యవేక్షిస్తాం. ఏయే కళాశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి అనే విషయాల గురించి కూడా తెలుసుకుంటాం. ఉన్న విద్యార్థులకు బోధన ఎలా జరుగుతుందనే విషయాన్ని పరిశీలిస్తాం. నిబంధనలకు వ్యతిరేకండా ఉంటే చర్యలు తీసుకుంటాం. – మార్తాల వెంకటకృష్ణారెడ్డి, ఆర్జేడీ, పాఠశాల విద్య జిల్లాలో ప్రభుత్వ డైట్ కళాశాలలు: 1 ప్రైవేటు కళాశాలలు: 89 మొత్తం కేటాయించిన సీట్లు: 6600 2019లో భర్తీ అయిన సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో: 170 ప్రభుత్వ కళాశాలలో : 130 మేనేజ్మెంట్ కోటా: 09 కన్వీనర్ కోటా: 170 -
డీసెట్... అప్సెట్..!
కోర్సుపై విద్యార్థులకు తగ్గుతున్న ఆసక్తి - మూడు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ - ఇప్పటివరకు వచ్చినవి 18,550 దరఖాస్తులే - 2015లో నిర్వహించిన పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు 1.11 లక్షల మంది.. సాక్షి, హైదరాబాద్: డీఈడీ కోర్సుపై విద్యార్థుల ఆసక్తి తగ్గుతోంది. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రి యలో జాప్యం జరుగుతుండడం.. దానికితోడు డీసెట్ నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటం తదితర కారణాల వల్ల క్రమంగా ఈ కోర్సుకు ఆదరణ తగ్గుతోంది. గతేడాది డీసెట్ నిర్వహించకపోగా.. తాజాగా సెట్ నిర్వహణకు సర్కారు ఉపక్రమించింది. మరో మూడు రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుండగా ఇప్పటివరకు కేవలం 18,550 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. 2015 సంవత్సరంలో నిర్వహించిన డీసెట్ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,11,413 మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం దరఖాస్తు చేసినవారు అందులో 20 శాతం మంది కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 197 డీఈడీ కాలేజీలు ఉండగా.. అందులో 9,440 సీట్లు ఉన్నాయి. ఆ లెక్కన సీటుకు ఇద్దరు చొప్పున తాజాగా దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్లుగా నియామకాల్లేవ్..! ప్రాథమిక విద్యా బోధనలో కీలకమైన ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) ఉద్యోగాలకు డీఈడీ చేసిన అభ్యర్థులే అర్హులని తేల్చడంతో తొలుత ఇబ్బడిముబ్బడిగా డీఈడీ కోర్సు చేశారు. టెట్ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించారు. కాని ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. దానికి తోడు పాఠశాలల హేతుబద్ధీకరణపై విస్తృత ప్రచారం జరుగుతుండ టంతో క్రమంగా ఈ కోర్సుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలే జరగలేదు. ఫలితంగా డీఈడీ చేసే అభ్యర్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతూ వస్తోంది. మరో మూడు రోజుల్లో దరఖాస్తు ముగియనుంది. అయినప్పటికీ వీటి సంఖ్య అధిక స్థాయిలో మాత్రం పెరిగే అవకాశం లేదని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. -
పుస్తకాలే రాలేదు.. ఏం చదవాలి?
ఇన్ బాక్స్ ఆంధ్రప్రదేశ్‌లో డీఎడ్ మొదటి సంవ త్సరం చదువుతున్న వేలాదిమంది విద్యా ర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామని ప్రభు త్వం ఘనంగా చెబుతోంది. అయితే, వాస్త వానికి రాష్ర్ట ప్రభుత్వం అవలంబిస్తున్న అస్త వ్యస్త విద్యా విధానాల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి డీఎడ్ మొదటి ఏడాది (2015-16) తరగతులు ప్రారంభ మయ్యాయి. పాత సిలబస్‌తోనే అన్ని కళాశా లల్లో విద్యాబోధన చేపట్టారు. అయితే, ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ విద్యా సంవ త్సరం నుంచి కొత్త సిలబస్ అమలులోకి వస్తుందని ప్రకటించింది. కానీ, అందుకు తగిన ఏర్పాట్లు ఏమాత్రం చేపట్టలేదు. దీంతో అప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన విద్యా సంవత్సరానికి, సిలబస్ మార్పుతో విద్యార్థుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది. అసలు సిలబస్ ఏమిటో తెలియకపోవడంతో విద్యార్థులకు ఎలా బోధించాలో అర్థంకాక అధ్యాపకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మారిన సిలబస్‌తో కొత్త పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చి ఉంటే బాగుండేదని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎడ్ విద్యా విధానాన్ని నీరుకారుస్తున్నా రని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్న నేపథ్యంలో ప్రభుత్వం సత్వరం దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. వెంటనే మారిన సిల బస్తో డీఎడ్ మొదటి సంవత్సరం పుస్తకా లను తెలుగు అకాడమీ ముద్రించి విద్యార్థు లకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - బట్టా రామకృష్ణ దేవాంగ్, సౌత్ మోపూరు నెల్లూరు జిల్లా వెంటపడితే కానీ కదలని ఫైళ్లు! గత నెల చివరలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆఫీసులో ఫైళ్లు వాటంతట అవి కదలడం లేదు. ప్రత్యేక ఆసక్తితో వెంటబడిన వారి ఫైళ్లు మాత్రమే కదులు తున్నాయి, అధికారులు వాటినే తీసుకొస్తారు, నేను వాటిపైనే సంతకాలు పెడుతున్నా, వెంటబడని వారి ఫైళ్లు నా ముందుకు రావడం లేదు.. అంటూ స్వయంగా పేర్కొన్నారు. వెంటబడని వారి ఫైళ్లు రావడం లేదనడానికి మచ్చుకు ఒక ఉదాహరణ. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకేతర సిబ్బందికి ఉద్యోగ విరమణ సమయంలో ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోవడానికి సంబంధించిన ఫైలును (CCE's Bocs. Rc. No. 1251/Admn. 4-3/2008 dated 19-01-2009) గత ముఖ్యమంత్రులు పట్టించుకోక పోవడం వల్లనో, రాష్ట్ర విభజన కారణంగా మరుగున పడిందో లేక అటకెక్కిందో తెలియడం లేదు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో గత రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాము. వ్యక్తిగతంగా నేను 2014 జూన్ 6న, నవంబర్ 11న, 2015 సంవత్సరం ఫిబ్రవరి 28న, ఏప్రిల్ 24న, ఈ సంవత్సరం ఫిబ్రవరి 3న ఈ విషయమై రిజిస్టర్ పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రికి నేరుగా విజ్ఞాపనలు అందజేయడమైనది. కాని ఈనాటికీ పైన తెలిపిన ఫైలుకు మోక్షం కలగలేదని తెలుపడానికి చింతిస్తున్నాను. ఆ ఫైలు పరిష్కారానికి సీఎం చెప్పినట్లు నేను నిజంగా ఎవరివెంటా పడలేదు. దానికి అనుగుణంగా అధికారులూ స్పందించ లేదు. ముఖ్యమంత్రి వద్దకు ఈ ఫైలు వెళ్లిందీ లేనిదీ కూడా తెలియడంలేదు. నవ్యాంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్ష సంద ర్భంగా అయినా మా సమస్యను మానవతా దృక్పథంతో పట్టించుకుని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థి స్తున్నాము. - ఆశం సుధాకరరావు, విశ్రాంత పర్యవేక్షకులు గూడలి, నెల్లూరు జిల్లా