పుస్తకాలే రాలేదు.. ఏం చదవాలి? | readers opinion on social issues | Sakshi
Sakshi News home page

పుస్తకాలే రాలేదు.. ఏం చదవాలి?

Published Wed, Jun 8 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

readers opinion on social issues

ఇన్ బాక్స్
 
 
ఆంధ్రప్రదేశ్‌లో డీఎడ్ మొదటి సంవ త్సరం చదువుతున్న వేలాదిమంది విద్యా ర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామని ప్రభు త్వం ఘనంగా చెబుతోంది. అయితే, వాస్త వానికి రాష్ర్ట ప్రభుత్వం అవలంబిస్తున్న అస్త వ్యస్త విద్యా విధానాల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి డీఎడ్ మొదటి ఏడాది (2015-16) తరగతులు ప్రారంభ మయ్యాయి. పాత సిలబస్‌తోనే అన్ని కళాశా లల్లో విద్యాబోధన చేపట్టారు. అయితే, ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ విద్యా సంవ త్సరం నుంచి కొత్త సిలబస్ అమలులోకి వస్తుందని ప్రకటించింది.

కానీ, అందుకు తగిన ఏర్పాట్లు ఏమాత్రం చేపట్టలేదు. దీంతో అప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన విద్యా సంవత్సరానికి, సిలబస్ మార్పుతో విద్యార్థుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది. అసలు సిలబస్ ఏమిటో తెలియకపోవడంతో విద్యార్థులకు ఎలా బోధించాలో అర్థంకాక అధ్యాపకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మారిన సిలబస్‌తో కొత్త పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చి ఉంటే బాగుండేదని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎడ్ విద్యా విధానాన్ని నీరుకారుస్తున్నా రని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్న నేపథ్యంలో ప్రభుత్వం సత్వరం దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. వెంటనే మారిన సిల బస్‌తో డీఎడ్ మొదటి సంవత్సరం పుస్తకా లను తెలుగు అకాడమీ ముద్రించి విద్యార్థు లకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 - బట్టా రామకృష్ణ దేవాంగ్,  సౌత్ మోపూరు  నెల్లూరు జిల్లా
 
 వెంటపడితే కానీ కదలని ఫైళ్లు!
 గత నెల చివరలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆఫీసులో ఫైళ్లు వాటంతట అవి కదలడం లేదు. ప్రత్యేక ఆసక్తితో వెంటబడిన వారి ఫైళ్లు మాత్రమే కదులు తున్నాయి, అధికారులు వాటినే తీసుకొస్తారు, నేను వాటిపైనే సంతకాలు పెడుతున్నా, వెంటబడని వారి ఫైళ్లు నా ముందుకు రావడం లేదు.. అంటూ స్వయంగా పేర్కొన్నారు. వెంటబడని వారి ఫైళ్లు రావడం లేదనడానికి మచ్చుకు ఒక ఉదాహరణ.

ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకేతర సిబ్బందికి ఉద్యోగ విరమణ సమయంలో ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోవడానికి సంబంధించిన ఫైలును (CCE's Bocs. Rc. No. 1251/Admn. 4-3/2008 dated 19-01-2009) గత ముఖ్యమంత్రులు పట్టించుకోక పోవడం వల్లనో, రాష్ట్ర విభజన కారణంగా మరుగున పడిందో లేక అటకెక్కిందో తెలియడం లేదు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో గత రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాము. వ్యక్తిగతంగా నేను  2014 జూన్ 6న, నవంబర్ 11న, 2015 సంవత్సరం ఫిబ్రవరి 28న, ఏప్రిల్ 24న, ఈ సంవత్సరం ఫిబ్రవరి 3న ఈ విషయమై రిజిస్టర్ పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రికి నేరుగా విజ్ఞాపనలు అందజేయడమైనది.

కాని ఈనాటికీ పైన తెలిపిన ఫైలుకు మోక్షం కలగలేదని తెలుపడానికి చింతిస్తున్నాను. ఆ ఫైలు పరిష్కారానికి సీఎం చెప్పినట్లు నేను నిజంగా ఎవరివెంటా పడలేదు. దానికి అనుగుణంగా అధికారులూ స్పందించ లేదు. ముఖ్యమంత్రి వద్దకు ఈ ఫైలు వెళ్లిందీ లేనిదీ కూడా తెలియడంలేదు. నవ్యాంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్ష సంద ర్భంగా అయినా మా సమస్యను మానవతా దృక్పథంతో పట్టించుకుని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థి స్తున్నాము.
 - ఆశం సుధాకరరావు, విశ్రాంత పర్యవేక్షకులు గూడలి, నెల్లూరు జిల్లా
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement