Deepa kiran
-
కథ చెబుతాం.. ఊ కొడతారా..!
‘అనగనగా ఓ మహారాజు ఉన్నాడు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురూ వేటకువెళ్లి ఏడు చేపలు తెచ్చారు...’ ఇలా పిల్లలకు పాత కథలు మాత్రమే తప్ప కొత్త కథలు, కొత్తగా చెప్పడం రాని ఆధునిక తల్లిదండ్రులు.. కథలు నేర్పే స్టోరీ టెల్లర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. వీరు మాత్రమే కాదు పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ల నుంచి కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు చెప్పే కౌన్సిలర్స్ వరకూ అందరూ కథా కళ..లో నైపుణ్యం కోసం క్యూ కడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రధానంగా నగరంలో ఈ కళకు డిమాండ్ తీసుకురావడంతో తల్లిదండ్రులే మహారాజు పోషకులుగా కనిపిస్తున్నారు. పిల్లలకు కథలు చెప్పడం మానసిక వికాసానికి మార్గమని సైకాలజిస్ట్‌లు సూచిస్తుండడం ఈ పోకడకు ఆజ్యం పోస్తోంది. పిల్లలకు కథలు చెప్పడం కేవలం వినోదం కాదని, ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇది తప్పనిసరి అని చెబుతున్నారు స్టోరీ టెల్లర్ దీపాకిరణ్. కథలు చెప్పడం వల్ల పెద్దలు, పిల్లల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని అన్నారామె.ప్రయోజనాలెన్నో...సంభాషించడానికి మాత్రమే కాదు నేర్చుకోవడానికీ.. ఆలోచనల్లో పరిణితికీ భాష అవసరం. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్నారుల్లో భాషా పరిజ్ఞానం సంతరించుకోవడం ఆలస్యం కావడం సహజంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్నారులను ఆకట్టుకునేలా కథలు చెప్పడం నేర్చుకున్న పెద్దలు ఆ నైపుణ్యాన్ని పిల్లలకు అందిస్తారు. కథల ద్వారా సంస్కృతి గురించి నేర్పవచ్చు. అలాగే ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు అంటున్నారు నిపుణులు.మనవడికి కథలు చెబుతున్నా...కొన్ని రోజుల క్రితం నా పదేళ్ల మనవడు అమ్మమ్మా కథ చెప్పమని నన్ను అడగడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్ కాలంలో కూడా పెద్దల నోటి ద్వారా కథలు వినడానికి పిల్లలు ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది. స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యి కొత్త కొత్త కథలు, ఆకట్టుకునేలా చెప్పగలడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మనవడు/మనవరాళ్లతో అనుబంధం మరింత బలోపేతం చేసింది. – భారతి రామినేనిమెళకువలు నేర్చుకుంటే మేలెంతో..స్టోరీ టెల్లింగ్ సెషన్స్‌కి హాజరవడం వల్ల కథకు సంగీతాన్ని జత చేయడం, ముఖ కవళికలు, గొంతు పలికే తీరులో మార్పుచేర్పులు చూపడం.. వంటివి నేర్చుకుని నా మూడేళ్ల కొడుకుకి మంచి కథలు చెప్పగలుగుతున్నా. తనతో అనుబంధాన్ని మరింతగా ఆనందిస్తున్నా. – దాసన్నకళ అబ్బింది.. కథ వచ్చింది.. కథలు చెప్పడమే కదా ఎంత సేపు అనుకుంటాం కానీ.. ఈ ఆర్ట్‌ను నేర్చుకుంటే.. జీవితంలో ప్రతీ సందర్భాన్ని ఒక కథగా మలిచే సామర్థ్యం వస్తుంది. సంగీతాన్ని కలుపుతూ మా అబ్బాయికి కథ చెప్పడం, కథలోని క్యారెక్టర్స్ ఆవాహన చేసుకుని చెప్పడం వంటివి తనకి బాగా కనెక్ట్ అవుతోంది. తన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి బాగా ఉపకరిస్తోంది. విశేషం ఏమిటంటే తనే కథలు అల్లేసి నాకు చెబుతున్నాడు. – సుధారాణిప్రొఫెషనల్ లైఫ్‌లో ప్రజెంటేషన్స్కూ..ఓ ఐటీ కంపెనీలో పనిచేసే నాకు వృత్తి జీవితంలో స్టోరీ టెల్లింగ్ సామర్థ్యం ఉపకరించింది. ముఖ్యంగా పలు అంశాలపై ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి సహకరించాయి. నిజానికి నా సోదరి కూతుర్ని పెంచాల్సిన బాధ్యత వల్ల స్టోరీటెల్లింగ్ నేర్చుకోవాల్సి వచి్చంది. అలా నేర్చుకుని తనకు చెప్పిన కొన్ని కథలు తనని క్లాస్‌లో టాపర్‌గా మార్చాయి. మంచి హాబీస్‌ను అలవర్చాయి. తను ఎప్పుడైనా ఏడుపు ముఖం పెట్టిందంటే నేను అనగనగా అనగానే ముఖ కవళికలు మార్చేసి ఆసక్తిగా చూస్తుంది. కథలు చెప్పడం వల్ల నా కూతురికి కూడా చాలా మానసిక వికాసం వచ్చేలా చేయగలిగాను. చాలా ఇళ్లలో పిల్లల వల్ల ఎదురయ్యే అల్లరి చిల్లరి ఇబ్బందులెప్పుడూ నాకు ఎదురు కాలేదు. దానికి కారణం కథలే అని చెప్పగలను. అందరు పిల్లలూ వీడియోగేమ్స్‌లో బిజీగా ఉండే సమయంలో మా పిల్లలు నన్ను కథ చెప్పవా అని అడుగుతారు. – వసుధకథలతో అనుబంధాలు బలోపేతం..స్టోరీటెల్లింగ్ అనే కళలో నైపుణ్యం సాధించే విషయంలో టీచర్లతో పాటు అవ్వా, తాతలకు, తల్లిదండ్రులకు బాగా ఆసక్తి పెరిగి మా స్టోరీ సూత్ర సంస్థను సంప్రదిస్తున్నారు. కథలు చెప్పే కళలో నైపుణ్యం సాధించిన వారు ఇలా పిల్లలతో తమ మధ్య అనుబంధం బలపడిందని, అంతిమంగా అది తమ ఆరోగ్యానికి, ఆనందానికి సైతం ఉపకరిస్తోందని చెబుతున్నారు. – దీపాకిరణ్, స్టోరీ టెల్లర్ -
ఎవరీ దీపాకిరణ్
సాక్షి, హైదరాబాద్: భారత్ నుంచి తొలి ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్గా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో 2017లో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లింగ్ ఫెస్టివల్‌కి వెళ్లానని స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ తెలిపారు. ఆ సమయంలో నేను గమనించింది ఏమిటంటే ఇరాన్ ప్రభుత్వం కళలకు ఇస్తున్న ప్రాధాన్యం. భావి తరాలకు కళలను ఒక ఉపాధి మార్గంగా మలుస్తున్న తీరు. అంత చిన్న దేశంలో 1000 దాకా కనూన్ పేరిట ఆర్ట్ సెంటర్స్ ఉన్నాయి. అవి కూడా చాలా పెద్దవి, విశాలమైన స్థలంలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ వేదికగా స్టోరీ టెల్లర్స్, మ్యుజిషియన్స్, ఆర్టిస్ట్స్, సింగర్స్.. ఇలా ఏ కళలో రాణించాలనుకున్నా వారికి ప్రభుత్వమే శిక్షణ ఇస్తుంది. అంతేకాదు ఈ సెంటర్స్ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగాలు కూడా ఇస్తుంది. మ్యూజిక్, పాటలు, పప్పెట్రీ, థియేటర్, క్రాఫ్టస్ ఏవైనా నేర్చుకోవాలనుకునే చిన్నారులకు ఈ సెంటర్స్‌లో శిక్షణ పూర్తిగా ఉచితం. ఆర్ట్ సెంటర్స్ అనే ఆలోచన చాలా బాగా అనిపించింది. మన దగ్గర హరికథ, బుర్రకథ వంటి కళలు దాదాపు అంతరించిపోయాయి. ఇదే సమయంలో ఇప్పుడు చాలా మంది యువతీ యవకులు ఇరానియన్ స్టోరీ టెల్లింగ్‌ని కెరీర్‌గా తీసుకుంటున్నారు. ఆర్ట్ నేపథ్యంగా జరిగే కిస్సా గోయె యాన్యువల్ ఫెస్టివల్‌కి వచ్చామని చెబితే పెద్ద సూపర్స్టార్లా ట్రీట్ చేస్తారు. మన నగరంలో కూడా ఇలాంటి సెంటర్స్ ఏర్పాటైతే ఆర్ట్‌ని కెరీర్‌గా ఎంచుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సిటీ ఆర్ట్ క్యాపిటల్‌గా మారేందుకు కూడా అవకాశం ఉంటుంది. -
కథా టీచర్
అది టెహ్రాన్.. ఓ సాయంత్రం వేళ ఎంతో మంది విదేశీ ప్రముఖులు, కళాకారులు, స్టోరీ టెల్లర్స్ ఆసీనులై ఉన్నారు. ఇరాన్లో అత్యంతవైభవంగా నిర్వహించే ‘కనూన్’ ఉత్సవానికి వేదిక అది. కనూన్ అంటే విభిన్న సంస్కృతుల సమ్మేళనం. వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరో తరానికి సాగుతున్న వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రవాహమది. ఆ వేడుకలో భారత్ తరఫున హాజరైన మన హైదరాబాదీ స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ కథానృత్య ప్రదర్శనతో ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేసింది.భారతీయ సాంస్కృతిక జీవనాన్నిసమున్నతంగా ఆవిష్కరించింది. సాక్షి, సిటీబ్యూరో : రెండేళ్ల కిత్రం ఇరాన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘కనూన్’ వేడుకలో దీపాకిరణ్ ప్రదర్శించిన ‘మీరాబాయి నృత్య ప్రదర్శన’ అందర్నీ ఆకట్టుకుంది. తన గాత్రంతో, నృత్యంతో ఎంతో హృద్యంగా కథలు చెప్పే దీపాకిరణ్ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనానికి వారధిగా నిలిచారు. పిల్లలకు కథలు చెప్పేందుకు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చేందుకు ఏకంగా ‘స్టోరీ ఆర్ట్స్ ఫౌండేషన్’నే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 2,500 మందికి శిక్షణనిచ్చారు. త్వరలో వివిధ దేశాలకు చెందిన స్టోరీ టెల్లర్స్‌తో హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీపాకిరణ్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. కళాత్మకంగా విద్యాబోధన.. ‘పిల్లలకు చదువు చెప్పడం ఆర్టిస్టిక్‌గా ఉండాలి. వారిలో ని సృజనాత్మకతకు పదును పెట్టాలి. అకాడమిక్ అంశాలను కథలతో, కళారూపాలతో కలిపి బోధిస్తే ఇట్టే ఆకట్టుకుంటాయి. పిల్లలు ఒత్తిడి నుంచి దూరమవుతారు. అలాగే చిన్నప్పటి నుంచే ఉన్నతమైన నీతి, నైతిక విలువలను బోధించినట్లవుతుంది. ఈ లక్ష్యంతోనే ‘స్టోరీ ఆర్ట్స్ ఫౌండేషన్’ స్థాపించాను. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలోని టీచర్లకు స్టోరీ టెల్లింగ్ శిక్షణనిస్తున్నాం. ఇప్పటి వరకు 2500 మందికిపైగా ఉపాధ్యాయినులు చక్కటి స్టోరీ టెల్లర్స్గా మారారు. పిల్లలకు కథలు చెబుతున్నారు. విభిన్న కళారూపాలలో ఈ స్టోరీ టెల్లింగ్ ప్రక్రియ సాగుతోంది’ అంటూ ఫౌండేషన్ లక్ష్యాన్ని వివరించారు దీపాకిరణ్. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 11–14 వరకు నగరంలో ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాపును నిర్వహించనున్నారు. కథల సమాహారం.. వేలకొద్దీ కథలు, వందల కొద్దీ కళారూపాలు. ఏ కథ ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఎక్కడ పుట్టిందో తెలియదు. ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కానీ ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహిస్తున్నాయి. అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే మౌఖిక కథలు, జానపద కళాకారులు వివిధ కళారూపాల్లో చెప్పే పురాణేతిహాస ఘట్టాలు. ఇలా ఎన్నో రకాల కథలకు, కళారూపాలకు దీపాకిరణ్ నిలువెత్తు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. ఆటాపాటలతో కథలు చెబుతూ ఆకట్టుకుంటున్నారు. పెద్దలు చెప్పే కథలను మరింత ఆధునికీకరించి వాటికి ఉన్నత విలువలను జత చేసి పిల్లల హృదయాలను హత్తుకునేలా చెబుతున్నారు. ఒక చేతిలో చిరుతలు, మరో చేతిలో ఏక్తారా, కథనానికి అనుగుణమైన నృత్యం, డప్పుల దరువు ఎంతో అద్భుతంగా ఉంటాయి. -
స్టోరీ టెల్లర్స్
‘విజయవంతమైన వారు ఈ ప్రపంచానికి అక్కర్లేదు. కావల్సిందల్లా... శాంతికాముకులు, కథకులు, అన్నింటినీ ప్రేమించేవారు మాత్రమే’ అని చెప్పిన దలైలామా మాటలను నిజం చేస్తూ, సమాజ శ్రేయస్సును కోరుకునే కొందరు కథలు చెప్పడాన్నే తమ వృత్తిగా మార్చుకున్నారు. పిల్లలను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు, వారి భవితవ్యాన్ని సృజనాత్మకంగా మలచేందుకు కథలనే సాధనంగా మలచుకున్నారు. పిల్లలకు నచ్చేలా కథలకు రకరకాల అభినయాలను, పాటలను జోడించి, వాటికి కొత్త అర్థం కల్పిస్తున్నారు ఈ కథకులు. ఇలాంటి కథలు ఆదివారాల్లో సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్‌లో వినొచ్చు... ఆటపాటలతో... ఆట పాటలంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. అందుకే దీపాకిరణ్ ఆటపాటలతో కలిపి కథలు చెబుతారు. ఈ కథల ద్వారా చిన్నారులకు ఎన్నెన్నో విషయాలను ఆసక్తికరంగా బోధిస్తారామె. ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఎమ్మే చేసిన దీపాకిరణ్ కథలు చెప్పడాన్నే తన వృత్తిగా మలచుకున్నారు. ఇటీవల ఆమె హైదరాబాద్‌లో స్టోరీ ఆర్ట్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. మాటలతో పనిలేదు... వరంగల్‌కు చెందిన మధు ‘మైమ్ మధు’గా ప్రసిద్ధుడు. అంతర్జాతీయంగా ఎన్నెన్నో మైమ్ ప్రదర్శనలు ఇచ్చిన మధు, పిల్లలకు ఈ కళను నేర్పించడంపై ఎంతో ఆసక్తి చూపుతారు. ఆంగిక, అభినయాల ద్వారా భావ వ్యక్తీకరణ చేయగల మైమ్ ద్వారా నవరసాలు పలికించవచ్చని, దీని ద్వారా పిల్లలతోనే కథలు చెప్పించవచ్చని అంటారాయన. దీని ద్వారా పిల్లల్లోని సృజనాత్మకత ద్విగుణీకృతమవుతుందని కూడా ఆయన చెబుతారు. తేట తెలుగులో... ఆంత్రొపాలజీ, బయాలజీల్లో మాస్టర్స్ డిగ్రీలు చేసిన ఉమాగాయత్రి చల్లా, మాతృభాషాభిమానంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాతృభాషలో పిల్లలకు కథలు, పాటలు నేర్పేందుకు పది పుస్తకాలు ప్రచురించి, అందుబాటులోకి తెచ్చారు. చాలామంది పేరెంట్స్‌కు పిల్లలకు కథలు చెప్పడం రావడం లేదని గమనించి, పిల్లల కోసం కథా కాలక్షేపం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ద్వారా పిల్లలకు ఆమె సందేశాత్మక కథలు చెబుతున్నారు. పిల్లలకు సామాజిక, వ్యక్తిగత బాధ్యతలు నేర్పేందుకు కథలే తగిన సాధనమని చెబుతారామె. - ఓ మధు