స్టోరీ టెల్లర్స్ | Story tellers: Funnest and comedy mime show | Sakshi
Sakshi News home page

స్టోరీ టెల్లర్స్

Published Tue, Aug 12 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

స్టోరీ టెల్లర్స్

స్టోరీ టెల్లర్స్

‘విజయవంతమైన వారు ఈ ప్రపంచానికి అక్కర్లేదు. కావల్సిందల్లా... శాంతికాముకులు, కథకులు, అన్నింటినీ ప్రేమించేవారు మాత్రమే’ అని చెప్పిన దలైలామా మాటలను నిజం చేస్తూ, సమాజ శ్రేయస్సును కోరుకునే కొందరు కథలు చెప్పడాన్నే తమ వృత్తిగా మార్చుకున్నారు. పిల్లలను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు, వారి భవితవ్యాన్ని సృజనాత్మకంగా మలచేందుకు కథలనే సాధనంగా మలచుకున్నారు. పిల్లలకు నచ్చేలా కథలకు రకరకాల అభినయాలను, పాటలను జోడించి, వాటికి కొత్త అర్థం కల్పిస్తున్నారు ఈ కథకులు. ఇలాంటి కథలు ఆదివారాల్లో సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్‌లో వినొచ్చు...  
 
 ఆటపాటలతో...
 ఆట పాటలంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. అందుకే దీపాకిరణ్ ఆటపాటలతో కలిపి కథలు చెబుతారు. ఈ కథల ద్వారా చిన్నారులకు ఎన్నెన్నో విషయాలను ఆసక్తికరంగా బోధిస్తారామె. ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఎమ్మే చేసిన దీపాకిరణ్ కథలు చెప్పడాన్నే తన వృత్తిగా మలచుకున్నారు. ఇటీవల ఆమె హైదరాబాద్‌లో స్టోరీ ఆర్ట్ ఫెస్టివల్‌ను నిర్వహించారు.
 
 మాటలతో పనిలేదు...
వరంగల్‌కు చెందిన మధు ‘మైమ్ మధు’గా ప్రసిద్ధుడు. అంతర్జాతీయంగా ఎన్నెన్నో మైమ్ ప్రదర్శనలు ఇచ్చిన మధు, పిల్లలకు ఈ కళను నేర్పించడంపై ఎంతో ఆసక్తి చూపుతారు. ఆంగిక,  అభినయాల ద్వారా భావ వ్యక్తీకరణ చేయగల మైమ్ ద్వారా నవరసాలు పలికించవచ్చని, దీని ద్వారా పిల్లలతోనే కథలు చెప్పించవచ్చని అంటారాయన. దీని ద్వారా పిల్లల్లోని సృజనాత్మకత ద్విగుణీకృతమవుతుందని కూడా ఆయన చెబుతారు.
 
 తేట తెలుగులో...
 ఆంత్రొపాలజీ, బయాలజీల్లో మాస్టర్స్ డిగ్రీలు చేసిన ఉమాగాయత్రి చల్లా, మాతృభాషాభిమానంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాతృభాషలో పిల్లలకు కథలు, పాటలు నేర్పేందుకు పది పుస్తకాలు ప్రచురించి, అందుబాటులోకి తెచ్చారు. చాలామంది పేరెంట్స్‌కు పిల్లలకు కథలు చెప్పడం రావడం లేదని గమనించి, పిల్లల కోసం కథా కాలక్షేపం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ద్వారా పిల్లలకు ఆమె సందేశాత్మక కథలు చెబుతున్నారు. పిల్లలకు సామాజిక, వ్యక్తిగత బాధ్యతలు నేర్పేందుకు కథలే తగిన సాధనమని చెబుతారామె.
 - ఓ మధు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement