deepest
-
ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ప్రయోగశాల!
శాస్త్ర పరిశోధనలను లోతుగా సాగించడం సర్వసాధారణం. అలాగని వాటి కోసం ప్రయోగశాలలను లోతైన ప్రదేశాలలో భూగర్భంలో నిర్మించడం మాత్రం విడ్డూరమే! ఈ విడ్డూరం చైనాలోనిది. ప్రపంచంలోనే అత్యంత లోతైన లాబొరేటరీని చైనా నిర్మిస్తోంది. భూమికి ఏకంగా 2,400 మీటర్ల లోతైన చోట నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ప్రయోగశాలగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ‘డీప్ అండర్‌గ్రౌండ్ అండ్ అల్ట్రా లో రేడియేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఫెసిలిటీ’ పేరుతో సింఘువా యూనివర్సిటీ, యలాంగ్ రివర్ హైడ్రోపవర్ డెవలప్మెంట్ కంపెనీలు కలసి 2020 డిసెంబర్ నుంచి ఈ లాబొరేటరీ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాయి. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిన్‌పింగ్ పర్వతం దిగువన నిర్మానుష్య ప్రదేశంలో నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ గురించిన వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 120 ఒలింపిక్ స్విమింగ్ పూల్స్‌తో సమానమైన లోతులో నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ ఘన పరిమాణం 330,000 క్యూబిక్ మీటర్లు. చైనా నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ విస్తీర్ణం ఇటలీలోని గ్రాన్ సాసో నేషనల్ లాబొరేటరీ కంటే ఎక్కువే! ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ లాబొరేటరీగా గుర్తింపు పొందిన గ్రాన్ సాసో లాబొరేటరీ చైనా దెబ్బకు రెండో స్థానానికి చేరుకుంది. ఇంతకీ ఈ లోతైన భూగర్భ ప్రయోగశాలలో దేని గురించి అంత లోతైన పరిశోధనలు సాగిస్తారనుకుంటున్నారా? ఇక్కడ కృష్ణ పదార్థం (డార్క్ మేటర్) గురించి పరిశోధనలు సాగిస్తారట! అందువల్ల ఏమాత్రం సూర్యకిరణాలు సోకని రీతిలో, రేడియేషన్ ప్రభావం తాకని రీతిలో దీనిని నిర్మిస్తున్నారట!. -
ప్రపంచంలో అత్యంత లోతైన 5 సింక్‌హోల్స్.. భారీ భవనమే కాదు.. పెద్ద అడవి సైతం..
భూమి ఉపరితలం కింద ఉన్న రాళ్లు సహజంగా భూగర్భ జలాల్లో కరిగిపోయినప్పుడు సింక్ హోల్స్ ఏర్పడతాయి. ఇలా రాళ్ళు కరిగిపోతున్నప్పుడు, భూమి లోపల గుహలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గుహ పై భాగంలోని నేల బరువును తట్టుకోలేనప్పుడు, అది కూలిపోతుంది. అప్పుడు భారీ సింక్‌హోల్ ఏర్పడుతుంది. అయితే దానిలోనూ పర్యావరణ వ్యవస్థ అలానే ఉంటుంది. అలాంటి ఐదు లోతైన సింక్ హోల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జియా ఓఝాయీ టియాంకెంగ్, చైనా చైనాలోని ఫెంగ్జీ కౌంటీలో జియా ఓఝాయీ టియాంకెంగ్లో అతిపెద్ద సింక్‌హోల్ ఉంది. ఈ సింక్ హోల్‌కు పిట్ ఆఫ్ హెవెన్ అనే పేరు పెట్టారు. ఇది 662 మీటర్ల లోతుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన సింక్ హోల్గా గుర్తింపు పొందింది. బయూ కార్న్ సింక్‌హోల్, అమెరికా ఇది అమెరికాలోని లూసియానాలో ఉంది. 2012లో భూకంపాలు సంభవించిన సమయంలో ఇది బయటపడింది. భూగర్భంలోని ఉప్పు దిబ్బ కూలిపోవడంతో ఈ సింక్ హోల్ ఏర్పడింది. 2014 నాటికి ఇది 229 మీటర్ల లోతు కలిగివుంది. కాపర్ మైన్ సింక్‌హోల్, చిలీ 2020, జూలైలో చిలీలో ఒక సింక్ హోల్ బయటపడింది. ఇది 32 మీటర్ల చుట్టుకొలతతో 200 మీటర్ల లోతున ఉందని అంచనా. ఈ సింక్ హోల్ రాగి గనుల సమీపంలో ఏర్పడింది. మిస్టరీ సింక్ హోల్, చైనా 2022లో చైనా శాస్త్రవేత్తలు గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో 192 మీటర్ల లోతైన సింక్‌హోల్‌ను కనుగొన్నారు. ఇది 306 మీటర్ల లోతు, 150 మీటర్ల వెడల్పుతో ఉంది. అది ఎంత పెద్దదంటే దానిలోపల పెద్ద అడవి వ్యాపించింది. గ్రేట్ బ్లూ హోల్, అమెరికా గ్రేట్ బ్లూ హోల్ సముద్రంలో ఉంది. ఇది అమెరికాలోని బెలిజ్ తీరంలో ఉంది. ఇది 124 మీటర్ల లోతు కలిగివుంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన బెలిజ్ బారియర్ రీఫ్ రిజర్వ్ సిస్టమ్‌లో భాగంగా ఉంది. ఇది కూడా చదవండి: పాక్‌లోనూ పెద్ద నోట్ల రద్దు?.. ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉందా? -
బాగా.. డీ..ఈఈ..ప్గా ఈదండి!
ఈ స్విమ్మింగ్‌పూల్ చాలా లోతు గురూ..! ఈత.. కొందరికి ఎక్సర్సైజ్.. ఇంకొందరికి అడ్వెంచర్! మీరు రెండో కేటగిరీకి చెందిన వారైతే ఈ వార్త మీ కోసమే. ఫొటోలో కనిపిస్తున్నదే.. దీని పేరు ‘వై 40 ది డీప్ జాయ్’. ఇటలీలోని మోంటేగ్రొట్టోలో ఉండే హోటల్ మిలిపినీ టెర్మేలో ఉంటుంది ఇది. ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌గా దీనికి పేరుంది. ఎంత లోతు అంటారా? పేరులో ఉందిగా.. 40 అని అన్ని మీటర్లు! అడుగుల్లో చెప్పుకోవాలంటే దాదాపు 132 అడుగులన్నమాట! పై నుంచి చూస్తే సాధారణ స్విమ్మింగ్ పూల్ మాదిరిగా కనిపించినా.. లోతుకు వెళ్లే కొద్దీ దీంట్లోని అందాలు అటు థ్రిల్.. ఇటు ఆనందాన్ని ఇస్తాయి. ముందుగా చెప్పుకోవాల్సింది డైవ్ కొట్టడం గురించి. వై 40లో ఏకంగా 36 అడుగుల ఎత్తు నుంచి డైవ్ కొట్టే సౌకర్యముంది. అంతేకాకుండా స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్లను కూడా అనుభవించేందుకు దీంట్లో మూడు గుహల్లాంటి ఏర్పాట్లూ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి కానీ నాకు ఈత రాదే.. అంటున్నారా? నో ప్రాబ్లెమ్. మీలాంటి వారి కోసం ఇందులో ఓ సొరంగం లాంటి నిర్మాణముంది. పూర్తిగా పారదర్శకమైన గాజుతో కట్టిన ఈ సొరంగంలోకి నడిస్తే వై 40లో జరుగుతున్న అన్ని రకాల కార్యకలాపాలను చూసేయవచ్చు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ స్విమ్మింగ్ పూల్‌లో ఎప్పుడైనా దాదాపు 43 లక్షల లీటర్ల నీళ్లు ఉంటాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నీళ్లు క్లోరిన్ కంపు కొట్టవు. అంత లోతులో నీళ్లు మరీ చల్లగా ఉంటాయి అనుకోవద్దు. వై 40లో నీటి ఉష్ణోగ్రత రోజంతా 34 సెల్సియస్. డిగ్రీలు అంటే బయట వణికించే చలి ఉన్నా.. లోపల మాత్రం వెచ్చగానే ఉంటుందన్నమాట!