Delhi Budget
-
Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా(Delhi Chief Minister Rekha Gupta) మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖను కూడా సీఎం రేఖ గుప్తానే పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేఖా గుప్తా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను సమర్పించారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget) కంటే ఈ బడ్జెట్ 31.5 శాతం అధికం. ఈ బడ్జెట్లో ఢిల్లీ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఏఏ వరాలను అందించిందంటే..ఆరోగ్య బీమాఢిల్లీ ప్రజలకు ఇకపై రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందుతుందని ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రకటించారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కోసం బడ్జెట్లో రూ.5,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం పరిధిలోకి వచ్చే ఢిల్లీలోని ప్రతి మహిళకు ప్రతీనెల రూ. 2,500 ఆర్థిక సహాయం అందుతుందన్నారు.ఢిల్లీ బడ్జెట్లోని కీలక ప్రకటనలుమూలధన వ్యయం దాదాపు రెట్టింపు చేశారు. గత బడ్జెట్లో మూలధన వ్యయం రూ. 15 వేల కోట్లుగా ఉండగా, ఈ బడ్జెట్లో దానిని రూ. 28 వేల కోట్లకు పెంచారు.త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ యోజన అమలు.ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ జన ఆరోగ్య యోజనకు అదనంగా మరో రూ. ఐదు లక్షలు జత చేస్తుంది. అంటే రూ. 10 లక్షల కవర్ అందుతుంది. ఈ పథకానికి ₹2144 కోట్లు కేటాయించారు.మహిళా సమృద్ధి యోజనకు రూ.5,100 కోట్లు కేటాయింపు.ప్రసూతి వందన పథకానికి రూ.210 కోట్లు. నీరు, విద్యుత్, రోడ్లు అభివృద్ధికి ప్రణాళికలు.ఢిల్లీ రోడ్డు రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఎన్సీఆర్తో అనుసంధానం కోసం రూ.1,000 కోట్లు ఖర్చు.మహిళల భద్రత కోసం అదనంగా 50 వేల సీసీటీవీల ఏర్పాటు.జేజే కాలనీ అభివృద్ధికి రూ.696 కోట్లు కేటాయింపు.ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకానికి రూ.20 కోట్లు కేటాయింపు.100 చోట్ల అటల్ క్యాంటీన్లు ఏర్పాటు. ఇందుకోసం రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు.ఢిల్లీ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానంతో పాటు గిడ్డంగి విధానాన్ని అమలులోకి తీసుకురానుంది.సింగిల్ విండో వ్యవస్థ అమలు.పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి.వ్యాపారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణ.ఇది కూడా చదవండి: Bihar: ఆగని పోస్టర్ వార్.. సీఎం నితీష్ టార్గెట్ -
‘ప్లీజ్ మోదీజీ ఢిల్లీ బడ్జెట్ ఆపొద్దు’.. మోదీకి కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఢిల్లీ బడ్జెట్ విషయంలో రెండు వర్గాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా రాజకీయ పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. దయచేసి ఢిల్లీ బడ్జెట్‌ను ఆపవద్దని లేఖలో కోరారు. 75 ఏళ్ల స్వతంత్ర్య భారతదేశ చరిత్రలో రాష్ట్ర బడ్జెన్‌ను కేంద్రం అడ్డుకోవడం ఇదే తొలిసారి. ఢిల్లీ ప్రజల పట్ల మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారని ప్రశ్నించారు. బడ్జెట్‌ను ఆమోదించమని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీలో నేడు(మంగళవారం) బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్రం అడ్డుకోవడంతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. ‘ఈ రోజు నుంచి ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, టీచర్లకు జీతాలు అందవు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న గూండాయిజం’ అని ఆరోపించారు. కాగా బడ్జెట్లో ప్రకటనలకు అధిక కేటాయింపులు, మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ నిధులు కేటాయించడంపై ఆప్ ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. వీటికి సమాధానం చెబుతూ బడ్జెట్ ప్రతులను మళ్లీ పంపాలని మార్చి 17నే లేఖ రాసినట్లు పేర్కొంది. నాలుగు రోజులుగా సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం.. అయితే ప్రకటనలపై కేటాయింపులు పెంచలేదని, గతేడాది మాదిరిగానే ఉందని పేర్కొంది. మొత్తం రూ.78,800 కోట్ల బడ్జెట్లో మౌలిక సదుపాయాల కోసం 22,000 కోట్లు, ప్రకటనల కోసం రూ. 550 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. అయితే హోంశాఖ లేఖను ఢిల్లీ చీఫ్ సెక్రటరీ మూడు రోజులు దాచిపెట్టారని మనీష్ సిసోడియా అరెస్ట్ అనంతరం ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కైలాశ్ గెహ్లోత్ ఆరోపించారు. ఈ విషయం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలిసిందన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు తనకు బడ్జెట్ ప్రతిపాదన ఫైల్ అందిందని, రాత్రి 9 గంటలలకు హోం మంత్రిత్వ శాఖ ఆందోళనలకు స్పందించి ఫైల్‌ను తిరిగి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సమర్పించానని చెప్పారు. ఢిల్లీ బడ్జెట్‌ను ఆలస్యం చేయడంలో ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి పాత్రపై దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ బడ్జెట్ లెఫ్టినెంట్ గవర్నర్ వద్ద నిలిచిపోయింది. -
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన 'ఆప్' సర్కారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి రూ. 41,129 కోట్ల ఆర్థికబడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రణాళిక వ్యయం రూ.19,000 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.22,129 కోట్లుగా చూపించారు. దేశంలో తొలిసారిగా 'స్వరాజ్ బడ్జెట్' ప్రవేశపెట్టామని సిసోడియా పేర్కొన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్థిక బడ్జెట్ కావడం విశేషం. -
విదిలింపులే
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ కోసం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను లోక్‌సభ బుధవారం చర్చించి, ఆపై ఆమోదించింది. రాష్ట్రపతి పాలన కొనసాగుతుండంతో జైట్లీ గత నెల రూ. 36,776 కోట్ల వ్యయంతో కూడిన ఢిల్లీ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బుధవారం మధ్యాహ్నం లోక్‌సభ సభ్యులు దీనిపై చర్చించి ఆమోదించారు. ఢిల్లీకి చెందిన బీజేపీతోపాటు అన్ని పార్టీల ఎంపీలు ఈ చర్చలో పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు దీనిని ఎన్నికల బడ్జెట్‌గా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరపున దీపేందర్సింగ్హూడా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కేటాయింపులనే జైట్లీ చాలామటుకు తన బడ్జెట్లో తిరిగి ప్రతిపాదించారని ఆరోపించారు. విద్యుత్ చార్జీలను తగ్గించకపోవడాన్ని తప్పుబట్టారు. విద్యుత్‌పై 30 శాతం సబ్సిడీ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీజేపీ ...ఈ బడ్జెట్లో కేవలం రూ. 260 కోట్ల సబ్సిడీని కల్పించిందంటూ విమర్శించారు. అన్నశ్రీ యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఇచ్చే రూ. 600 పింఛన్‌ను కూడా ఉపసంహరించారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ గద్దె దిగినప్పటినుంచి అరాచకం నెలకొందని ఆయన ఆరోపించారు. ఢిల్లీవాసుల కలలను నిజం చేయనట్లయితే బీజేపీకి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ఆరోపణలపై న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షీ లేఖి స్పందిస్తూ హర్యానాకు చెందిన పార్లమెంట్ సభ్యుడితో బడ్జెట్‌పై చర్చ జరిపించాల్సిన గతి కాంగ్రెస్‌కు పట్టిందని ఎద్దేవా చేశారు. మహిళలకు భద్రత, విద్యుత్ సరఫరాను మెరుగుపరచడం, పేదలకు చవక ధరకు గృహాలను కేటాయించడంపై దృష్టి పెట్టిందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన భువనగిరి నియోజకవర్గ సభ్యుడు ఈ బడ్జెట్పైజరిగిన చర్చలో పాల్గొంటూ.... దేశ రాజధాని నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణించారు. అన్ని రాష్ట్రాల సంస్కృతిని ఢిల్లీలో ప్రతిబింబించేవిధంగా చేయడం కోసం ఇంటర్‌సెక్షన్లు, ఫ్లైఓవర్లపై విభిన్న రాష్ట్రాలకు చెందిన ప్రతీకలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కాగా అరుణ్‌జైట్లీ బడ్జెట్ కేటాయింపులను సమర్థించుకున్నారు. రెండు నగరాల కలయిక ఢిల్లీ అని ఆయన పేర్కొన్నారు. ఒకటి అత్యాధునిక సౌకర్యాలున్న ప్రపంచస్థాయి నరగం కాగా రెండోది కనీస సదుపాయాలు కూడా లేనిదని అన్నారు. రెండో ఢిల్లీలో నివసించే ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆయన చెప్పారు. వైద్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం దక్షిణ ఢిల్లీలో అత్యాధునిక ఆస్పత్రిని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు. 50 డయాలిసిస్ సెంటర్లను, 110 అంబులెన్స్‌లను కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు ఆయ న తెలిపారు. కొత్త గా 20 పాఠశాలల ఏర్పాటుతోపాటు బాలికల కోసం ఉన్నత పాఠశాలలను నెలకొల్పడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయన్నారు. అనధికార కాలనీలలో సౌకర్యాల కల్పన, నగరంలో సీవేజ్తోపాటు నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, యమునా నదిలో కాలుష్యం తొలగింపుపై తమ బడ్జెట్లో దృష్టి సారించామన్నారు. మెట్రోను విస్తరించడంతో పాటు కొత్తగా మరిన్ని లో ఫ్లోర్ బస్సులు, క్లస్టర్ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. -
విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ
పార్లమెంట్లో ఢిల్లీ బడ్జెట్ రాష్ర్టపతిపాలన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం ఉదయం లోక్‌సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.36,776 కోట్ల వ్యయంతో కూడిన ఈ బడ్జెట్లో కొత్తగా పన్ను ప్రతిపాదనలేమీ చేయలేదు. అదేవిధంగా కొత్త పథకాలను కూడా ప్రకటించలేదు. 400 యూనిట్ల్ల వరకు విద్యుత్‌ను వినియోగించేవారికి సబ్సిడీ ప్రకటించారు. ఢిల్లీ శాసనసభకు ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశముండడంతో ఆర్థిక మంత్రి పేదలపై ప్రధానంగా దృష్టి సారించారనే విమర్శలు వెల్లువెత్తాయి. సాక్షి, న్యూఢిల్లీ: రూ.36,776 కోట్ల ఖర్చుతో బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్థికమంత్రి రూ. 31,571 కోట్లు పన్నుల ద్వారా లభించే ఆదాయంగా రూ. 11,061 కోట్లు ఇతర వన రుల నుంచి లభించే ఆదాయంగా 699.71 కోట్లు, కేపిటల్ రెసీట్ల ద్వారా రూ. 3,672.09 కోట్లు కేంద్రం నుంచి లభిస్తాయని అంచనా వేశారు.కాగా బడ్జెట్ ప్రతిపాదనల పట్ల కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు తమ అభ్యంతరాలను తర్వాత వ్యక్తం చేయొచ్చని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పడంతో వారు శాంతించారు. తాను ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని, దానిపై తర్వాత చర్చ జరుగుతుందని జైట్లీ వివరించారు. పేదలపై దృష్టి పన్ను రాయితీల వంటి ప్రతిపాదనలతో సాధారణ బడ్జెట్లో మధ్యతరగతివారిపై వరాలు కురిపించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలోని పేదలపై ప్రధానంగా దృష్టి సారించారు. తక్కువ విద్యుత్‌ను వినియోగించేవారికి రూ. 260 కోట్ల రూపాయల సబ్సిడీ ప్రకటించడంతో పాటు బలహీనవర్గాల కోసం ఇళ ్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు. జేఎన్ఎన్యూఆర్ఎం కింద ప్రభుత్వం 54,064 ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ఇందులో 14, 844 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆర్థిక మంత్రి సభకు తెలి యజేశారు. మిగతా వాటి త్వరలో పూర్తిచేస్తామన్నా రు. కొత్తగా 20 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు ప్రతి విధానసభ నియోజక వర్గంలో బాలికల కోసం ప్రభుత్వ ఉన్నతపాఠశాలలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మూడు లక్షల 90 వేల మందికి వృద్ధాప్య పింఛన్లు లభిస్తున్నాయని, వాటిని నాలుగు లక్షల 30 వేలకు పెంచుతున్నట్లు జైట్లీ ప్రతిపాదించారు. ఇవికాకుండా ఇంకా నైట్‌షెల్టర్లు, జేజే క్లస్టర్లలో కమ్యూనిటీ టాయిలెట్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేశారు. మురుగుదొడ్లు లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడమేకాకుండా, మహిళల భద్రతకు ముప్పు ఉంటుందని, అందువల్ల జేజేక్లస్టర్లలో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం కోసం రూ. 35 కోట్లను కేటాయించనున్నట్టు తెలిపారు. గత బడ్జెట్కంటూ దాదాపు ఇది రెట్టింపుగా ఉంది. 50అధికార కాలనీలకు పైపులైన్ల ద్వారా నీరందిస్తామన్నారు. 95 అనధికార కాలనీలలో సీవేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు ఈ కాలనీలలో ప్రాథమిక సదుపాయాల కల్పన కోసం రూ.711 కోట్లు కేటాయించారు. కాగా అనధికార కాలనీల్లో 40 లక్షల మంది నివసిస్తున్నారు. తగ్గనున్న విద్యుత్ చార్జీల భారం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం పార్లమెం టులో ప్రవేశపెట్టిన ఢిల్లీ బడ్జెట్... తక్కువ విద్యుత్ ఉపయోగించేవారికి ఊరట ఇచ్చింది. నగరంలో విద్యుత్ చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో పేదలకు ఊరట కోసం రూ. 260 కోట్ల రూపాయల సబ్సిడీ ప్రకటించారు. 0 -200 యూనిట్ల వరకు యూని ట్‌కు రూ.1.20,. 201-400 యూనిట్ల వరకు 80పైసల సబ్సిడీని ప్రతిపాదించారు. దీనితో ఢిల్లీలో 0-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ 2.80 చొప్పున, 201-400 స్లాబ్వారు యూనిట్‌కు రూ.5.15 చొప్పున విద్యుత్ చార్జీలను చెల్లించాల్సిఉంటుంది. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చార్జీలను తొలగించడంతోపాటు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన సబ్సిడీ వల్ల 400 యూనిట్ల వరకు విద్యుత్ ఉపయోగించేవారికి మున్ముందు బిల్లులు తగ్గనున్నాయి. విద్య, వైద్యంపై పెద్దగా దృష్టిసారించని బడ్జెట్: అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నగరంలో విద్య, వైద్య సదుపాయాల కల్పనపై పెద్దగా దృష్టిసారించలేదనివిమర్శలను ఎదుర్కొంది. రోహిణిలో వైద్య కళాశాల, దక్షిణ ఢిల్లీలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు, 110 కొత్త అంబులెన్స్‌లను ప్రవేశెపెట్టడం, 50 డయాలిసిస్ సెంటర్ల ఏర్పాటుచేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఢిల్లీ జనాభాను బట్టి చూస్తే తక్కువేననే విమర్శలొచ్చాయి. వైద్య రంగం కోసం బడ్జెట్ రూ.2,724 కోట్లు కేటాయించింది. నగరంలో లైంగిక దాడులు నానాటికీ పెరుగుతున్నందున, బాధితుల కోసం ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వన్‌స్టాప్ క్రైసిస్ మేనేజ్మెంట్ సెంటర్లను ఏర్పాటుచేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది. మొదటగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, గురుతేజ్ బహదూర్ ఆసుపత్రి, సంజయ్‌గాంధీ మెమోరియల్ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటుచేస్తారని, మూడు నెలల్లో పనిచేయడం ప్రారంభిస్తాయని జైట్లీ ప్రకటించారు. ఈ సెంటర్లలో బాధితులకు వైద్య సహా యం తోపాటు చ ట్టపరమైన, మానసికపరమైన, సామాజికపరమైన కౌన్సెలింగ్ అందజేస్తారు. రోహిణిలో 100 సీట్ల వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో విద్యార్థులు చేరవచ్చని ఆర్థికమంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగంలో సరైన వైద్య సదుపాయాలు లేని దక్షిణ ఢిల్లీలో అత్యాధునిక మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు. మూత్ర పిండా లు పనిచేయని రోగుల కోసం 50 డయాలిసిస్ కేంద్రాలను కొత్తగా ప్రారంభిస్తారు. నగరంలో రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగి పోతున్న నేపథ్యంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 11 ‘ఐక్యాట్’ అంబులెన్సులను ప్రవేశపెడతారు. విద్యుత్ రంగానికి ప్రతిపాదనలు: తక్కువ విద్యుత్ వినియోగించే పేద వినియోగదారులకు రూ.260 కోట్ల సబ్సిడీని ప్రకటించడంతోపాటు ఇంధన రంగం కోసం రూ.670 కోట్ల ప్రణాళికా నిధులు కేటాయించారు. ట్రాన్స్మిషన్ వ్యవస్థను, డిస్ట్రిబ్యూషన నెట్‌వర్క్‌ను మెరుగపరచనున్నటు బడ్జెట్ల్ పేర్కొంది. ఢిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్ హర్షవిహార్లో ఏర్పాటుచేసిన 400 కేవీ సబ్‌స్టేషన్, పీరాఘడీలో ఏర్పాటుచేసిన 220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ సబ్స్టేషన్లు పనిచేయడం ప్రారంభిస్తాయని పేర్కొంది. పపన్కలాన్, రాజ్‌ఘాట్ పవర్‌హౌజ్, తుగ్లకాబాద్లలో 220 కేవీ జిఐఎస్ సబ్స్టేషన్ల నిర్మాణాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తారు. బవానాలోని 1,500 మెగావాట్ల గ్యాస్ టర్బైన్ స్టేషన్‌కు సరసమైన ధరకు గ్యాస్ సరఫరా అయ్యేవిధంగా చూస్తారు. ఎన్డీఎంసీ ప్రాంతాన్ని సోలార్ సిటీగా అభివృద్ధి చేస్తారు. రవాణా రంగం: రవాణా రంగం కోసం రూ.1702 కోట్లు కేటాయించారు. నగరవాసుల సౌకర్యార్థం కొత్తగా 1,380 లోఫ్లోర్ బస్సులను కొనుగోలు చేస్తారు. తెలిపింది. డీటీసీ బస్సుల్లో ఎలక్ట్రానిక్ టికెట్ యంత్రాలు, కార్డు రీడర్లను ప్రవేశపెడతారు. తద్వారా ఆటోమాటిక్‌గా చార్జీలను వసూలుచేసే వ్యవస్థను ప్రవేశపెడ్తారు. కొత్తగా 400 బస్సులతో క్లస్టర్ బస్సుల సంఖ్యను 1,600కు పెంచుతారు.ట్రాన్స్పోర్ట్ డిపో ప్రాంతీయ కార్యాలయాలను ఆధునీకరించి, పునరుద్ధరిస్తారు. ఐఎస్బీటీ సరాయ్కాలేఖాన్, ఐఎస్బీటీ ఆనంద్‌విహార్‌లో మౌలిక వసతులు తగినంత లేవని ఈ బడ్జెట్ పేర్కొంది. ఈ రెండు చోట్ల కొత్త ఐఎస్బీటీలను అభివృద్ధి చేస్తారు. రూ.533 కోట్ల ఖర్చుతో కూడిన బారాపులా రెండో దశ నిర్మా ణం ప్రస్తుతం కొనసాగుతుంది. మూడోదశలో దీనిని సరాయ్కాలేకాన్ నుంచి మయూర్ విహార్ వరకు పొడిగిస్తారు. నీటి సరఫరా రంగం: హర్యానాతో కొనసాగుతున్న నీటి వివాదాలను పరిష్కరించి మునాక్నుంచి హైదర్‌పూర్ వరకు సమాంతరంగా నిర్మించిన కాలువను వాడకంలోకి తెస్తారు. దీని వల్ల ద్వారకా, ఓఖ్లా, బవానా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు రోజుకు 80 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుంది. దీంతో దక్షిణ, పశ్చిమ, నైరుతి, వాయవ్య ఢిల్లీలో నివసించే 35 లక్షల మందికి నీటి సమస్య తీరుతుంది. 50 కోట్ల రూపాయల తొలి విడత కేటాయింపుతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రేణుకా డ్యామ్ నిర్మాణపని ప్రాధాన్యతాపరంగా ప్రారంభిస్తారు. రూ.2018 కోట్లతో చంద్రావల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను, రూ. 2243 కోట్లతో వజీరాబాద్ ప్లాంటును పూర్తిగా పునరుద్ధరించి ఆధునీకరిస్తారు. గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి కోసం రూ. 215 కోట్ల రూపాయలు కేటాయించారు. బడ్జెట్‌తో ఢిల్లీవాసులకు ఎంతో ఊరట లభించే అవకాశముందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ పేర్కొన్నారు. అయితే ఇది దశాదిశా లేని బడ్జెటని కాంగ్రెస్ విమర్శించింది. ముఖ్యాంశాలు రూ. 36,776 కోట్ల బడ్జెట్ కొత్త పన్నులు లేవు ప్రస్తుతమున్న పన్ను రేట్లను పెంచలేదు తక్కువ విద్యుత్‌ను వినియోగించేవారికోసం రూ. 260 కోట్ల సబ్సిడీ 0-200 యూనిట్ల వరకు రూ.1.20 సబ్సిడీ రోహిణీలో అత్యాధునిక వైద్య కళాశాల 110 కొత్త అంబులెన్స్‌లు వర్కింగ్ ఉమెన్ కోసం ఆరు కొత్త హాస్టళ్లు 1,380 కొత్త లోఫ్లోర్ బస్సులు కొత్తగా 20 పాఠశాలల ఏర్పాటు 4 లక్షల 30 వేల మందికి వృద్ధాప్య పింఛన్లు కొత్త నైట్‌షెల్టర్ల ఏర్పాటు నీటి కోసం ఏటీఎంలు పేదలకు ఇళ్లు, జేఎన్ఎన్యూఆర్ఎం కింద 58, 064 ఇళ్లను ఢిల్లీ సర్కారు నిర్మిస్తోంది. కొత్త స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ సెంటర్ ఏర్పాటు లైంగిక దాడి బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్ మానసిక వికలాంగుల కోసం మూడు కేంద్రాలు జేజేక్లస్టర్లలో కమ్యూనిటీ టాయిలెట్లు నాలుగు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు 50 అనధికార కాలనీల్లో నీటి సదుపాయం కోసం పైపులైన్ల నిర్మాణం 95 అనధికార కాలనీల్లో సీవేజ్ సిస్టం రెండు నీటిశుద్ధీకరణ కేంద్రాల ఏర్పాటు ఎన్నికల హామీలకు తిలోదకాలు: అరవింద్ సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ బడ్జెట్లో ఎన్నికల హామీలను బీజేపీ తిలోదకాలిచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 30 శాతం విద్యుత్ సబ్సిడీ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొందని, అయితే బడ్జెట్లో దానిని అమల్లోకి తీసుకురాలేదని విమర్శించారు. ధరల పెరుగుదలనుంచి ప్రజలకు ఊరట కల్పించడం కోసం బడ్జెట్లో ప్రతిపాదనలు చేయలేదంటూ ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా మెరుగుకోసం ఎలాంటి చర్యలు చేపడతారనే విషయాన్ని కూడా తెలియజేయలేదన్నారు. ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు నీరిందించేందుకు సంబంధించిన ప్రతిపాదనలేమీ లేవన్నారు. ద్వారకా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సంగతి పట్టించుకోకుండా కొత్తగా రెండు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. దేశ రాజధానివాసుల సమస్యలు బీజేపీ నాయకులకు అర్థం కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మాదిరిగానే ఉందని ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు మనీష్ సిసోడియా ఆరోపించారు. -
ఏమయ్యేనో?
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్, నీటి సరఫరాలను మెరుగుకు కేంద్ర బడ్జెట్ అనూహ్యంగా కేటాయింపులు చేసిన నేపథ్యంలో త్వరలో ఆర్థిక మంత్రి సమర్పించే ఢిల్లీ బడ్జెట్‌పై ఆశలు మొదలయ్యాయి. రాష్ట్రంలోప్రజలెన్నుకున్న ప్రభుత్వం లేనందువల్ల బడ్జెట్లో కొత్త పథకాలు, ప్రతిపాదనలు ప్రకటించకపోయ్టినప్పటికీ ప్రభుత్వ విభాగాలు తమ తమ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాయి. ప్రస్తుతం అమల్లోఉన్న ఆహారభద్రత పథకం కొనసాగింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే చక్కెరకు సబ్సిడీ. చౌక ధర దుకాణాలను కంప్యూటరీకరించే ప్రతిపాదననదు కేంద్రానికి పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నగరంలో విద్యుత్, నీటి సరఫరాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీకి కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు.200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించేవారికి సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదనను ఢిల్లీ సర్కారు కేంద్రానికి పంపింది. దీంతోపాటు అనధికార కాలనీల్లో అభివృద్ధి కార్యకలాపాలు, జుగ్గీ జోపిడీలలో నివసించేవారికి చౌక ధర ఇళ్ల కేటాయింపు అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటితోపాటు నగరంలో రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు సంబంధించి కూడా ప్రభుత్వం కేటాయింపులు చేయనుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఢిల్లీకి ప్రస్తుతం 11 వేల బస్సులు అవసరమవుతాయి. అయితే డీటీసీ వద్ద దాదాపు 5,500 బస్సులున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలుకు సంబంధించి ఈ బడ్జెట్ ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. ఢిల్లీ కోసం 1,150 బస్సులు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను ఢిల్లీ సర్కారు ఇప్పటికే కేంద్రానికి పంపింది. జెఎన్ఎన్యూఆర్ఎం కింద కేంద్రం ఈ నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. అయితే రూ. 584 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. దీంతో బడ్జెట్లో ఈ బస్సుల కొనుగోలు కోసం నిధులు కేటాయించవచ్చని ఆశిస్తున్నారు. శాససభ ఎన్నికల నాటి నుంచి అభివృద్ధి కార్యకలాపాలు ఆగిపోయిన నేపథ్యంలో ఇందుకుకూడా నిధులు కేటాయించొచ్చని ఆశిస్తున్నారు. పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనతో పాటు కొత్త పాఠశాలల ఏర్పాటు, ఆస్పత్రుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఢిల్లీ సర్కారు కేంద్రానికి పంపింది.