Delhi Congress
-
ఢిల్లీ కాంగ్రెస్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. పెద్ద పొరపాటు చేశానంటూ..!
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పార్టీకి షాక్ ఇస్తూ ఢిల్లీ ఉపాధ్యక్షుడు అలీ మెహది, పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పనితీరు నచ్చడం వల్లే వాళ్లు తాము ఆప్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని అలీ మెహది చెప్పారు. రాజధాని అభివృద్ధిలో తామూ భాగస్వాములవుతామన్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని పేర్కొన్నారు. పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు అలీ మెహది. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. తాను పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు చెబుతూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను రాహుల్ గాంధీ నమ్మకస్తుడినైన కార్మికుడిగా పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ముస్తఫాబాద్, బ్రిజ్‌పురి కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్‌లు సైతం తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. అర్ధరాత్రి 1.25 గంటలకు వీడియో పోస్ట్ చేశారు అలీ మెహది.. చేతులు జోడించి ‘నేను పెద్ద పొరపాటు చేశాను. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాను. నా తండ్రి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు. పలుమార్లు పార్టీ అధిష్ఠానానికి, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. తనతో వచ్చిన కౌన్సిలర్లు సైతం క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేయాలని కోరారు. వీడియో విడుదల చేసిన గంటన్నర తర్వాత మరో ట్వీట్ చేశారు అలీ మెహది. ‘బ్రిజ్‌పురి కౌన్సిలర్ నాజియా ఖాటూన్, ముస్తఫాబాద్ కౌన్సిలర్ సబిలా బేగం, 300 ఓట్ల మార్క్‌తో ఓడిపోయిన బ్లాక్ ప్రెసిడెంట్ అలీమ్ అన్సారీ ఇప్పటికీ రాహుల్ జీ, ప్రియాంక జీలకు నమ్మకమైన కార్మికులు. రాహుల్ గాంధీ జిందాబాద్.’ అని పేర్కొన్నారు. వీడియోలో కనిపించిన మరో ముగ్గురు సైతం ఆప్‌ను కలిశారు. श्री @RahulGandhi जी के जो सच्चे सिपाही होते हैं उन्हें कुछ समय के लिए दिग्भ्रमित किया जा सकता है लम्बे समय के लिए नहीं। शुक्रिया भाई @alimehdi_inc जी का जिन्होंने कुछ पल में ही गलती सुधार ली। आप कांग्रेस के जन्मजात सच्चे सिपाही हो, गलती इंसान से हो जाती है। @INCDelhi pic.twitter.com/UaqMUQGjMZ — Minnat Rahmani (@MRahmaniINC) December 10, 2022 ఇదీ చదవండి: Manneguda Young Woman Kidnap Case: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి -
కాంగ్రెస్ పార్టీ కీలక తీర్మానం
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తక్షణమే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలనీ కీలక తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఢిల్లీ కాంగ్రెస్ నేడు సాయంత్రం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ నియంతృత్వ పరిపాలను ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీ నాయకత్వమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఇదే సమయంలో మరో రెండు తీర్మానాలను కూడా ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చేశారు.(చదవండి: ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం) రైతు ఉద్యమంలో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున చోటు చేసుకున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు జగదీష్ టైట్లర్, రమేష్ కుమార్, కృష్ణ తీత్, నరేంద్ర నాథ్, యోగానంద్ శాస్త్రి కిరణ్ వాలియా హరూన్ సహా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలందరూ హాజరయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన ఓటమిని చవిచూసిన తర్వాత పార్టీ చీఫ్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని పార్టీ శ్రేణులు కోరుకున్నప్పటికీ తను నాయకత్వాన్ని చేపట్టలేదు. ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి తాత్కాలిక చీఫ్ గా ఆయన తల్లి సోనియా గాంధీ భాద్యతలు వహిస్తున్నారు. ఈ పదవిని ఎక్కువకాలం చేపట్టడానికి తనకు ఆసక్తి లేదని సోనియా గాంధీ గతంలో స్పష్టం చేశారు. -
రాహుల్ కోసం ఉరికి సిద్ధపడ్డ కార్యకర్త..!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్ గాంధీ వెనక్కితగ్గడం లేదు. ఆయనకు నచ్చజెప్పేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లోని పీసీసీ నేతలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా కూడా సమర్పించారు. ఇక ఢిల్లీ కాంగ్రెస్‌కు చెందిన ఓ కార్యకర్త మరో అడుగు ముందుకేశాడు. రాహుల్ మొండివైఖరికి నిరసనగా ఆత్మహత్యకు యత్నించాడు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట ఉన్న చెట్టెక్కి ఉరిపోసుకునేందుకు సిద్ధమయ్యాడు. రాహుల్ రాజీనామా అంశంపై కార్యకర్తలు, నేతలు ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. కార్యకర్త చెట్టు ఎక్కేందుకు యత్నించగా.. అక్కడున్నవారు అడ్డుకున్నారు. ధర్నా కార్యక్రమంలో ఢిల్లీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ లిలోథియా, ఏఐసీసీ కార్యదర్శి మహెందర్ జోషి, నసీబ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ నిరవధిక దీక్ష చేస్తున్నట్టు రాజేష్ తెలిపారు. కాగా తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఆ భేటీలో ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకునేందుకు ఒక్క శాతం అవకాశం కూడా లేదని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ చెప్పడం గమనార్హం. -
కాంగ్రెస్‌కు మరో నాయకుడి షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అర్వీందర్ సింగ్ లవ్లీ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో లవ్లీ ప్రముఖ నాయకుడు. షీలా దీక్షిత్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు. లవ్లీ బీజేపీలో చేరడం దురదృష్టకరమని షీలా అన్నారు. పార్టీలో పదవులు అనుభవించి వెళ్లే నాయకులను ఎవరు నమ్ముతారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌కు నాయకులతో సఖ్యతగా ఉంటూ వారిని కాపాడుకోవడం సాధ్యం కావడం లేదని, అందుకే పార్టీని వీడుతున్నారని షీలా అన్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో లవ్లీ అసంతృప్తి చెందారని సమాచారం. ఎంసీడీ టికెట్ల పంపణీలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు కాంగ్రెస్ నేతలను తనను బెదిరిస్తున్నారని ఇటీవల ఢిల్లీ మహిళ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలు రచన సచ్‌దేవా ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే వాలియా కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ అమృష్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ నెల 23న ఎంసీడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు తిరుగుబాటు చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. -
కాంగ్రెస్‌లో దుమారం: మహిళా నేత తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో దుమారం చెలరేగింది. ఢిల్లీ మహిళ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలు రచన సచ్‌దేవా పార్టీ సీనియర్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా, నెట్టా డిసౌజాలు తనను మానసికంగా వేధించి, బెదిరించారని రచన బాంబు పేల్చారు. త్వరలో జరిగే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు (ఎంసీడీ) టికెట్ల పంపణీలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు కాంగ్రెస్ నేతలను తనను బెదిరిస్తున్నారని వెల్లడించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్లో ఆమె ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎంసీడీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత ఏకే వాలియా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ల పంపిణీలో పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, అక్రమాలు జరిగాయంటూ అజయ్ మాకెన్‌కు ఆయన లేఖ రాశారు. టికెట్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ అమృష్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ నెల 23న ఎంసీడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు తిరుగుబాటు చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. -
రైతుల విషయంలో ఆప్ మొసలి కన్నీరు కారుస్తోంది
♦ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ♦ అకాల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం లేదా? ♦ ఆప్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు న్యూఢిల్లీ : అకాల వర్షాలతో రైతులు నష్టపోతే పట్టించుకోకుండా భూ సేకరణ బిల్లు విషయంలో చేపట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీ రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తోందని అజయ్ మాకెన్ విమర్శించారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఐదు కిలో మీటర్ల దూరంలోని రైతులను కలిసి సమస్యలు తెలుసుకోలేకపోయిన వారు, ఇప్పుడు ఆకస్మాత్తుగా మేల్కొని రైతుల తరఫున కేంద్రంతో పోరాడతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు తీవ్రంగా నష్టపోయారని మాకెన్ చెప్పారు. అయినా కూడా ఆప్ నుంచి ఒక్కరు కూడా రైతులను కలవడానికి గ్రామాలకు వెళ్లలేదని ఆరోపించారు. ఇప్పుడు రైతుల సంక్షేమమంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. పొరుగున ఉన్న హరియానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ సీఎంలు తమ రాష్ట్రాల్లోని బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ రాష్ట్రాల సీఎంలు కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని డిమాండ్ చేసినా కూడా సెక్రటేరియట్ నుంచి ఆప్ నేతలు ఒక్కరు కూడా బయటకు రాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా తమ నేతలంతా గ్రామల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశామని తెలపారు. అంతే కాకుండా రైతులకు ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశామని చెప్పారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోని ఆప్, ఇప్పుడు ర్యాలీ చేపట్టడం వింతగా ఉందన్నారు. ఆ పార్టీకి చెందిన వారు తమ ర్యాలీకి మద్దతు కోరేందుకు గ్రామాలకు వెళ్లాలనుకుంటే నిర్లక్ష్యం చేసినందుకు రైతులు రానివ్వరని చెప్పారు. రైతులకు ఆప్ గురించి పూర్తిగా అర్థమైందని, వారి తియ్యటి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ భూసేకరణ బిల్లుకి వ్యతిరేకంగా ఏప్రిల్ 22న జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్‌కు ర్యాలీ చేపట్టింది. -
బీజేపీకి ఆహ్వానం అప్రజాస్వామికం!
న్యూఢిల్లీ: ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటు అంశానికి సంబంధించి లెఫ్ట్ నెంట్ గవర్నర్ రాజ్ నివాస్ బీజేపీకి ఆహ్వానం పంపడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఢిల్లీలో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసినట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టడానికి రంగం సిద్దం చేసింది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనేది అప్రజాస్వామికం అని స్థానిక కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చావో-రేవో తేల్చుకుంటామని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆదివారం భారీ స్థాయిలో ఆందోళన చేపట్టడానికి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. తాము చేపట్టబోయే ర్యాలీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ముఖల్ వాస్నిక్, డీపీసీసీ అధ్యక్షుడు సింగ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి హరూన్ యూసఫ్ లు పాల్గొనున్నారు. అంతకుముందు శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈమేరకు వినతి పత్రం అందజేశారు. 'ఇది పార్టీ ఫిరాయింపులు, బేరసారాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని బహిరంగంగా ఆహ్వానించడమే’ అని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. కాగా, రహస్య బ్యాలెట్ ద్వారా సీఎంను ఎన్నుకోవచ్చన్న బీజేపీ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అది రాజ్యాంగానికి విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు చెప్పారన్నారు. ఫిబ్రవరిలో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఢిల్లీ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం తెలిసిందే. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం బేరసారాలకు దిగబోమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో తమదే పెద్ద పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు తమకే ఉందని, దీనికి మద్దతు కోసం ప్రయత్నించడం అనైతికం కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేలున్నారు. -
భవితవ్యమేమిటో?
షీలాదీక్షిత్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళ ప్రథమ పౌరురాలి పదవికి రాజీనామా చే సిన నేపథ్యంలో ఈ తరహా ఊహాగానాలు జోరందుకున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ పగ్గాలు షీలాకి అప్పగించాలంటూ ఇప్పటికే కొందరు నాయకులు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి విన్నవించారు. షీలా మద్దతుదారులు ఇదే ఆశిస్తున్నప్పటికీ... వ్యతిరేకులు మాత్రం ఆమె ఒంటెత్తు పోకడవల్లనే గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైందని వాదిస్తున్నారు. సాక్షి, న్యూఢిల్లీ:కేరళ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో షీలాదీక్షిత్ రాజకీయ భవితవ్యంపై ఊహా గానాలు మొదలయ్యాయి. ఇప్పుడే కాకపోయినప్పటికీ కొంతకాలం పోయిన తరువాతైనా షీలాదీక్షిత్ ఢిల్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారని అంటున్నారు. త్వరలో ఢిల్లీ విధానసభ ఎన్నికలు జరుగుతాయనే అంచనాల నేపథ్యంలో ఆమె పునరాగమనం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఢిల్లీ కాంగ్రెస్ పగ్గాలను షీలాదీక్షిత్ చేపట్టాలని ఆమె మద్దతుదారులు గట్టిగా కోరుతున్నారు. రాజధానిలో డీలాపడిన కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురాగలిగిన సామర్థ్యం షీలాదీక్షిత్‌కు మాత్రమే ఉందని వారంటున్నారు. ఈ విషయాన్ని మతీన్ అహ్మద్‌తో పాటు కొందరు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఇటీవల సోనియా గాంధీకికూడా విన్నవించారు. మరోవైపు షీలాదీక్షిత్ రాకను కూడా మరికొందరు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. షీలాదీక్షిత్ నేతృత్వంలో కాంగ్రె స్ ఘోర ఓటమి పాలు కావడంతోపాటు ఆమె కూడా పరాజయం పాలైన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు. నగరంలో కాంగ్రెస్ దుస్థితికి షీలాదీక్షిత్ ఒంటెత్తు పోకడే కారణమని, ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవడం అటుంచి రెండు గ్రూపులుగా విడిపోవడం ఖాయమని వారంటున్నారు. అయితే షీలాదీక్షిత్ మద్దతుదారులు మాత్రం గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయబోరని అందరినీ ఒక్కతాటికి తీసుకొచ్చి ముందుకు సాగుతారని అంటున్నారు.కాంగ్రెస్‌లో విబేధాల సంగతి ఏవిధంగా ఉన్నప్పటికీ ఒకవేల షీలాదీక్షిత్ కనుక మళ్లీ ఢిల్లీ రాజకీయాలలో చురుకైన పాత్ర చేపడితే దానిని బీజేపీ తేలిగ్గా తీసుకోబోదని, ఆమెపై కామన్వెల్త్ క్రీడ లకు సంబంధించిన ఆరోపణలు, ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో అవకతవకల ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లు తిరిగి తెరచుకోవడం ఖాయమని కొందరు అంటున్నారు. ఈ ఆరోపణల దర్యాప్తు నుంచి రక్షించడానికే అప్పట్లో షీలాదీక్షిత్‌కు గవర్నర్ పదవి కట్టబెట్టారని వారు వాదిస్తున్నారు. కానీ ఈ ఆరోపణలలో పస లేదని, ఈ ఆరోపణలపై దర్యాప్తుకు సిద్ధపడి నిజాయితీపరురాలనే ముద్రతో ప్రజల ముందుకు రావచ్చని సన్నిహితంగా ఉండే నేతలు కొందరు షీలాదీక్షిత్‌కు సలహా ఇస్తున్నారని అంటున్నారు. షీలాదీక్షిత్ కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితురాలు, ఆమె సామర్థ్యంపై కాంగ్రెస్ అధిష్టానానికి అపార నమ్మకం ఉంది. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా ఆమె స్థానం చెక్కుచెదరలేదు. ఇప్పుడు కూడా అధిష్టానం షీలాదీక్షిత్ ఆమెకు పెద్దపీట వేస్తుందని, అది జాతీయ స్థాయిలోనా లేక ఢిల్లీ స్థాయిలోనా అనే విషయం వేచి చూడాల్సిన విషయమని కొందరు అంటున్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీ దళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
క్రేజీవాల్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ శ్రేణులు
-
రాష్ట్రంలో ఆమ్ఆద్మీ పాగా
చెన్నై, సాక్షి ప్రతినిధి: వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఒక్క ఏడాది కూడా పూర్తి చేసుకోని ఆమ్ ఆద్మీ పార్టీ మట్టికరిపించింది. ఢిల్లీ కాంగ్రెస్ పీఠాన్ని కూల్చిన ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ సంచలనంగా మారారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూసినా ఢిల్లీ ఫలితాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి ప్రజలతో మమేకమైన కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరుసాగితే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ కొత్త పార్టీగా గట్టిపోటీనివ్వడం, కాంగ్రెస్‌ను మూడో స్థానంలోకి నెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలన్న ఆలోచనతో భాగంగా రాష్ట్రంలో ప్రయత్నాలు ప్రారంభమయ్యూయి. రెండురోజుల క్రితం ఢిల్లీ పెద్దల ఆదేశాలతో సమావేశమై 1300 మంది నాయకులను ఎంపిక చేసుకున్నారు. వీరిలో 600 మందిని పార్టీ పనుల నిమిత్తం వినియోగించుకుంటున్నారు. ఈ 1300 మంది బృందంలో 90 శాతం మంది 22-32 ఏళ్ల కుర్రకారు ఉన్నారు. వీరి నేతృత్వంలో చెన్నైలోని 120 కాలేజీల్లో విద్యార్థి సంఘాలు ఏర్పాటయ్యూరుు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలపై విద్యార్థి సంఘం నేత గణేష్ మాట్లాడుతూ, తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తమ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ఇందు కోసం విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులతోపాటూ 10 మంది 50 ఏళ్ల పైబడిన ఆటోడ్రైవర్లను, రిటైర్డు ఉద్యోగులను పూర్తిస్థాయిలో పార్టీకి పని చేసేలా ఎంపిక చేసుకున్నామని తెలిపారు. 15 కళాశాలలకు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటామని, ఈ ఎన్నిక సైతం కాలేజీ విద్యార్థులతోనే జరుపుతామని తెలిపారు. ప్రతి కాలేజీ నుంచి ఒక ప్రతినిధి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ నెల 28వ తేదీన వేలూరులో ప్రతినిధుల ఎంపిక కార్యక్రమాలను ప్రారంభిస్తామని, ఆ తరువాత నాగర్‌కోయిల్‌లో ఒకరోజు, చెన్నైలో రెండురోజుల పాటూ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేత సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల యువత ప్రభావితమైనందున విద్యార్థి సంఘాల ఏర్పాటుపై ముందుగా దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. 10 శాతం ఉన్న అనుభవజ్ఞులు, విద్యార్థి సంఘాలను మార్గనిర్దేశనం చేస్తారని తెలిపారు. -
జేపీ అగర్వాల్ రాజీనామా
న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరవైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు జేపీ అగర్వాల్ పదవికి రాజీనామా చేసినట్టు పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఎన్నికల ప్రచారంలో అగర్వాల్ సహకరించకపోవడం వల్లే పార్టీ ఓటమి పాలైందని కొందరు ఎమ్మెల్యేలు ఆరోపించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2008లో 43 అసెంబ్లీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో పార్టీ తనకు సహకరించలేదని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సైతం ఆరోపించడం తెలిసిందే.